Search
  • Follow NativePlanet
Share
» »నారసింహుడిని అష్టదిగ్బంధనం చేసిన హనుమంతుడు ఇక్కడే, సందర్శనతో

నారసింహుడిని అష్టదిగ్బంధనం చేసిన హనుమంతుడు ఇక్కడే, సందర్శనతో

కరీంనగర్ కు దగ్గరగా ఉన్న ధర్మపురి పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మపురి అనేక అద్భుతాలకు నిలయం. ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన దైవమైన నరసింహుడిని క్షేత్రపాలకుడైన ఆజనేయుడు అష్టదిగ్భందన చేసి ఉంటాడు. అందువల్లే ఈ క్షేత్రం భూత, ప్రేత, పిశాచాల నుంచి బాధింపబడే వారికి ఉపశమనం కలిగిస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఈ కారణం వల్లే ఈ క్షేత్ర సందర్శనకు సుదూర ప్రాంతం నుంచి కూడా వేలాది మంది భక్తులు నిత్యం వస్తుంటారు. ఇక ఇదే దేవాలయంలో అరుదుగా కనిపించే బ్రహ్మదేవుడికీ, దాదాపు కనిపించని యమధర్మరాజుకీ కూడా ఉపాలయాలు ఉన్నాయి.

అదే విధంగా ఈ ధర్మపురి పుణ్యక్షేత్రంలోని తీర్థాల్లో పుణ్య స్నానాలు చేయడానికి భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనాలు...

క్షేత్రపాలకుడు ఆంజనేయుడు

క్షేత్రపాలకుడు ఆంజనేయుడు

P.C: You Tube

పూర్వం ధర్మవర్మ అనే మహారాజు ఈ ధర్మపురి క్షేత్రంలో ఆ నరసింహుడి గురించి తపస్సు చేస్తాడు. రాజు తపస్సుకు మెచ్చిన లక్ష్మీనారసింహుడు ఆ ధర్మవర్మ కోరిక మేరకు లక్ష్మీ సమేతుడై యోగ నరసింహుడి రూపంలో ఈ ధర్మపురిలో కొలువై ఉన్నాడు. ఈ ధర్మపురి పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి.

అష్టదిగ్భందనం

అష్టదిగ్భందనం

P.C: You Tube

మూలవిరాట్టును అష్టదిగ్భందనం చేస్తూ ఎనిమిది వైపులా ఎనిమిది ఆంజనేయ విగ్రహాలను మనం చూడవచ్చు. ఇటువంటి నిర్మాణం మనకు ఏ పుణ్యక్షేత్రంలో కూడా కనిపించదు. ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల భూత, ప్రేత, పిశాచాల బారిన పడకుండా ఉండవచ్చునని భక్తులు నమ్ముతారు.

శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం

శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం

P.C: You Tube

అందువల్లే నిత్యం ఈ క్షేత్రాన్ని వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. శ్రీరామ చంద్రుడు వనవాస సమయంలో ఈ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడని చెబుతారు. శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు.

హరిహర క్షేత్రం

హరిహర క్షేత్రం

P.C: You Tube

రాముడు ప్రతిష్టించిన లింగం కాబట్టి ఈ ధర్మపురిలోని శివుడిని రామలింగేశ్వరుడిగా కొలుస్తాం. ఇది సైతక శిల్పం కావడం విశేషం. దీంతో ఈ ధర్మపురి హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మదేవుడు ఇక్కడ తన బ్రహ్మదండముతో భూమిని తవ్వి ఒక గుండాన్ని (తీర్థాన్ని) ఏర్పరుస్తాడు.

త్రిమూర్తుల క్షేత్రం

త్రిమూర్తుల క్షేత్రం

P.C: You Tube

అటు పై అందులో స్నానం చేసి నరసింహుడిని దర్శించుకొని ఆయన్ను ఆరాధిస్తాడు. అటు పై ఇక్కడే కొలువుండిపోతాడు. అందువల్లే ఇక్కడ బ్రహ్మ ఉపాలయాలన్ని కూడా చూడవచ్చు. అందువల్ల దీనిని త్రిమూర్తుల క్షేత్రం అని కూడా అంటారు.

యమధర్మరాజు

యమధర్మరాజు

P.C: You Tube

రోజు పాపులను చూసిచూసి వారికి శిక్షలు వేసిన యమధర్మరాజుకు కూడా పాపం అంటుకొంటుంది. దీంతో విసుగు చెందిన యమధర్మరాజు నారదుడి సూచన మేరకు ఇక్కడి గోదావరిలో స్నానం చేసి నరసింహుడిని పూజిస్తాడు.

నరసింహుడి అభయం

నరసింహుడి అభయం

P.C: You Tube

దీంతో యమధర్మరాజుకు దర్శనభాగ్యం కల్పించిన నారసింహుడు ఇక పై ఎటువంటి పాపాత్ముడిని నీవు శిక్షించిన నీకు ఎటువంటి పాపం అంటుకోదని వరమిస్తాడు. అంతే కాకుండా తన క్షేత్రంలో యమధర్మరాజుకు కూడా స్థానం కల్పిస్తాడు.

అప మృత్యుదోషం

అప మృత్యుదోషం

P.C: You Tube

అందువల్లే ఈ ధర్మపురి క్షేత్రంలో మనం యమధర్మరాజు ఉపాలయాన్ని కూడా చూడవచ్చు. ఇక యముడి ఉపాలయం దగ్గరగా ఉన్న గండ దీపంలో నూనె సమర్పించిన వారికి అప మృత్యుదోషం ఉండదని, మృత్యు భయం ఉండదని ప్రతీతి.

యమకుండం

యమకుండం

P.C: You Tube

యమధర్మరాజు స్నానం చేసిన ప్రదేశానికి యమకుండమని పేరు. ఇక తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం కోసం మూడు పిడికిళ్ల ఇసుకతో సత్యవతి అనే మహిళ నిర్మించిన ఇసుక స్తంభం కూడా మనం చూడవచ్చు.

వందల ఏళ్లనాటి ఇసుక స్తంభం

వందల ఏళ్లనాటి ఇసుక స్తంభం

P.C: You Tube

ఇది వందల ఏళ్ల పూర్వం నాటిదని చెబుతారు. ఆ సత్యవతి స్నానం చేసిన కుండాన్ని సత్యవతీ కుండంగా చెబుతారు. దంపతులు సరిగంగ స్నానాలు చేసి నరసింహుడిని దర్శిస్తే అత్యంత ఫలప్రదమని స్థానికుల నమ్మకం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X