Search
  • Follow NativePlanet
Share
» »కేరళలో అచ్చెరువొందించే వన్యప్రాణి పర్యాటక ప్రదేశాలు

కేరళలో అచ్చెరువొందించే వన్యప్రాణి పర్యాటక ప్రదేశాలు

కేరళలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన కథనం.

By Gayatri Devupalli

వన్యప్రాణుల సందర్శన నిమిత్తం చేసే పర్యటనలు, మన ఉత్తమ ప్రయాణ అనుభవాల్లో ఖచ్చితంగా ముందు స్థానంలో నిలుస్తాయి. దేవుని సొంత దేశం అయిన కేరళ, సహజ వనరులకు మరియు వన్యప్రాణి సంపదకు ఆలవాలం అనడంలో అతిశయోక్తి లేదు. కేరళలో వన్యప్రాణుల ఉనికిని మీరు ఆస్వాదించడానికి, తప్పక సందర్శించవలసిన ఉత్తమమైన ప్రదేశాలలో కొన్నిటిని గురించి మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాము.

కేరళలో ఉన్న అనేక పర్యాటక ప్రదేశాలలో, జాతీయ ఉద్యానవనాలు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలు ప్రధాన ఆకర్షణలు. ఈ అటవీ ప్రాంతాల్లోని ప్రకృతి రమణీయత, యాత్రికుని ప్రకృతిలో మమేకం చేయడమే కాక, వన్యప్రాణులను వాటి సహజ ఆవాసాలలో చూసే అవకాశం కల్పిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మనం కూడా ఆ ప్రదేశాలను చుట్టి వచ్చేద్దాం!

పెరియార్ నేషనల్ పార్క్:

పెరియార్ నేషనల్ పార్క్:

P.C: You Tube

పెరియార్ నేషనల్ పార్క్ యొక్క సుందరమైన ప్రకృతి దృశ్యాలు, మనకు కన్నుల పండుగనే చెప్పాలి. ఇది ప్రధానంగా పులులు మరియు ఏనుగుల రిజర్వ్ గా ప్రసిద్ధి చెందింది. ఈ ఉద్యానవనంలో మూడు రకాల పర్యావరణ వ్యవస్థల మేలు కలయికను చూడవచ్చు. అవి తేమగా ఉండే ఆకురాల్చే అడవులు, గడ్డిభూములు మరియు సతత హరిత ఉష్ణమండల అడవులు. తేక్కాడిలో పొడచూపే వృక్షజాల మరియు జంతుజాల వైవిధ్యంను ఎట్టి పరిస్థితుల్లోనూ చూసి తీరాల్సిందే!

ఎరవికులం నేషనల్ పార్క్:

ఎరవికులం నేషనల్ పార్క్:

P.C: You Tube

ఎరావికులం నేషనల్ పార్క్ కేరళలో స్థాపించబడిన మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం. మున్నార్ లో ఉన్న ఈ సుందరమైన ప్రదేశం, ఐదు ఇతర వన్యప్రాణుల అభయారణ్యాలతో పాటుగా, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇది మనుగడలో ఉన్న అతిపెద్ద నీలగిరి తహర్ జనాభాకు ప్రసిద్ధి చెందింది. అనముడి శిఖరం కూడా జాతీయ పార్కులో భాగమే!

 సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్:

సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్:

P.C: You Tube

సైలెంట్ వ్యాలీ నిశ్శబ్దంగా మరియు నర్మగర్భితంగా ఉంటుంది. ఇది భారతదేశంలోని ఉత్తమ ఉష్ణమండల వర్షపు అడవులలో, సైలెంట్ వ్యాలీ ఒకటి. ప్రకృతి వరప్రసాదమైన ఈ అడవి అనేక వన్యప్రాణులకు ఆవాసంగా ఉంది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, కేరళలో స్పృశింపబడని సహజమైన ప్రాంతాలలో ఒకటి.

చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం:

చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం:

P.C: You Tube

మరయూర్ మరియు దేవికుళం పరిసరాలలో చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. దీని చుట్టుపక్కలనే ఇందిరా గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం మరియు కొడైకెనాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నాయి. కేరళలోని ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా పేరుగాంచిన చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం, పశ్చిమ కనుమల సౌందర్యానికి మరియు జంతుజాల వైవిధ్యానికి నెలవు.

పరాంబికులం వన్యప్రాణుల అభయారణ్యం:

పరాంబికులం వన్యప్రాణుల అభయారణ్యం:

P.C: You Tube

పాలక్కాడ్ లోని ప్రధాన వన్యప్రాణి ఆకర్షణలలో, పరాంబికులం వన్యప్రాణుల అభయారణ్యం మరియు పరాంబికులం టైగర్ రిజర్వ్ ప్రధానమైనవి. అనైమలై కొండలు మరియు నెల్లియంపతి కొండల ప్రకృతి రమణీయ శోభ, ఈ జాతీయ పార్కుకి మరింత వన్నెలద్దాయి.

పెప్పర వన్యప్రాణుల అభయారణ్యం

పెప్పర వన్యప్రాణుల అభయారణ్యం

P.C: You Tube

పెప్పర డ్యాం సమీపంలో ఉన్న పెప్పర వన్యప్రాణుల అభయారణ్యం, తిరువనంతపురంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఈ ప్రదేశంలోని అధిక వన్యప్రాణి సాంద్రత కారణంగా 1983 లో దీనిని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. ఇక్కడ కూడా మీరు ఒకే చోట సతత హరిత ఉష్ణమండల వృక్షాలు, కొండ లోయ చిత్తడి వృక్షాలు, మొదలైనవి వంటి పర్యావరణ వ్యవస్థలను చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X