Search
  • Follow NativePlanet
Share
» »పుష్కర్ లో బ్రహ్మ దేవాలయం తో పాటు వీటిని కూడా చూడండి

పుష్కర్ లో బ్రహ్మ దేవాలయం తో పాటు వీటిని కూడా చూడండి

పుష్కర్ లో చూడదగిన ప్రాంతాలకు సంబంధించిన కథనం

భారత్ లో అత్యంత పురాతనమైన నగరాల్లో పుష్కర్ కూడా ఒకటి. అతి అరుదైన దేవాలయాలు కలిగిన పుణ్యక్షేత్రం ఈ పుష్కర్. ఎడారి రాష్ట్రంగా పేరొందిన రాజస్థాన్ లోని ఈ పుష్కర్ లో చూడదగిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా కాకుండా ఆసియాలోనే అత్యంత ఆకర్షణీయమైన ఒంటెల సంత కూడా ఇక్కడే జరుగుతుంది.

ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి ఈ పుష్కర్ స్వర్గధామం. తమ పనితనం మొత్తం చూపించడానికి కెమరామెన్లకు ఇందుకు మించిన ప్రాంతం మరొక్కటి ఉండదు. ముఖ్యంగా ఒంటెల సంత సమయంలో భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయులు సైతం ఎక్కువ మంది ఫొటోగ్రాఫర్లు ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో పుష్కర్ లో చూడదగిన ప్రాంతాలకు సంబంధించిన కథనం.

పుష్కర్ సరస్సు

పుష్కర్ సరస్సు

P.C: You Tube

పుష్కర్ సరస్సు ఈ భూమండలం ఏర్పడటానికి ముందే ఇక్కడ ఉద్భవించిందని చెబుతారు. ఈ సరస్సు ఒడ్డునే మనకు అత్యంత ప్రచూర్యం పొందిన ఒంటెల మేళ జరుగుతుంది. ఈ మేళకు రాజస్థాన్ లోని అన్ని గ్రామాల వారు తమ పశు సంతతిని తీసుకువస్తారు. రాజస్థాన్ సంప్రదాయాలకు ఈ సంత అద్దం పడుతుంది. రాజస్థాన్ లోని పుష్కర్ లో జరిగే ఈ సంతలో ఒంటెల పరుగుపందెం నిర్వహిస్తారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి.

ఆధ్యాత్మికత పర్యాటకం

ఆధ్యాత్మికత పర్యాటకం

P.C: You Tube

పుష్కర్ లో పురాణ ప్రాధాన్యత కలిగిన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. భారత దేశంలో అత్యంత అరుదుగా కనిపించే దేవాలయాల్లో బ్రహ్మ దేవాలయం కూడా ఒకటి. అటు వంటి బ్రహ్మ దేవాలయం ఇక్కడ ఉంది. ఈ పుష్కర్ లో బ్రహ్మదేవాలయమే కాకుండా సావిత్రి దేవాలయం, సప్తేశ్వర్ దేవాలయం, పాప్ మోచి దేవాలయం తదితర ఎన్నో దేవాలయాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయాలు ఆధ్యాత్మికంగానే కాకుండా ఈ పట్టణానికి చారిత్రాత్మకతకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తాయి.

పష్కర్ ఘాట్

పష్కర్ ఘాట్

P.C: You Tube

పుష్కర్ లోని బ్రహ్మ దేవాలయానికి దగ్గరగా పుష్కర్ ఘాట్ ఉంటుంది. ఇక్కడ పవిత్ర స్నానం ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని చెబుతారు. దీనిని బ్రహ్మ ఘాట్ అని అంటారు. దీనితో పాటు వరాహ, దదీచి, సప్తరుషి వంటి ఎన్నో ఘాట్ లలో కూడా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. సాయంకాలం హారతులు ఇచ్చే సంప్రదాయం ఇటీవలే మొదలయ్యింది.

మీరా దేవాలయం

మీరా దేవాలయం

P.C: You Tube

శ్రీ క`ష్ణుడి పరమ భక్తుల్లో ఒకరైన మీరాభాయ్ జన్మించినది ఇక్కడే అని చెబుతారు. దాదాపు 400 ఏళ్లకు పూర్వం దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. దీనికి దగ్గర్లోనే దాదిమాత దేవాలయం, చర్బూజ దేవాలయం కూడా చూడదగినవి. అనేక యుద్దాలు ఈ దేవాలయం సమీపంలోనే జరిగాయి. అందువల్లే భారత దేశ చరిత్రలో ఈ దేవాలయానికి కూడా స్థానం ఉంది.

నాగపహర్

నాగపహర్

P.C: You Tube

పుష్కర్ ను ఆజ్మీర్ నుంచి విభజించే పర్వతానికే నాగపహర్ అని పేరు. ఈ పర్వతం ఎత్తు రోజురోజుకూ క్షీణిస్తోందని చెబుతారు. యుగాంతం సమయంలో ఈ పర్వత శిఖరం భూ మట్టానికి పడిపోతుందని ఇక్కడి వారి నమ్మకం. అదే విధంగా ఈ పర్వత శిఖరం అగస్త్య మహాముని నివాసస్థలంగా కూడా నాగపహర్ ను పేర్కొంటారు. సాయంత్రం సమయంలో ముఖ్యంగా పౌర్ణమి రాత్రుల్లో ఈ కొండ చాలా బాగా అందంగా కనిపిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X