Search
  • Follow NativePlanet
Share
» »2000 చిలుకమ్మలు ఒకే చోట...గిన్నీస్ బుక్ కు ఎక్కేనంట

2000 చిలుకమ్మలు ఒకే చోట...గిన్నీస్ బుక్ కు ఎక్కేనంట

మనం చిన్నప్పుడు ఉదయం లేచిన వెంటనే పక్షుల కిలకిల రావాలను వినసొంపుగా మన చెవులను తాకేవి. ఆ ధ్వనుల సవ్వడులు మనసుకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తూ ఆ రోజు చేయాల్సిన పనులను మరింత ఆసక్తితో చేసేలా మార్చేవి. అయితే ఆధునిక కోసం అంటూ అందుబాటులో ఉన్న సదరు పక్షులకు ఆవాసమైన చెట్లనంతటిని మనం కొట్టేస్తున్నాం.

దీంతో పక్షులకు నిలువ నీడలేకుండా పోతోంది. ఇక వాటికి కావాల్సిన గింజలు కూడా మన పట్టణాల్లో దొరకడం లేదు. దీంతో వాటి సంతతి రోజురోజుకూ పడిపోతోంది. దీంతో ఇప్పుడిప్పుడే పక్షి ప్రేమికులు ఉద్యమాలు లేవనెత్తుతున్నారు. చెట్లను కొట్టకుండా అడ్డుకొంటున్నారు. మరికొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొన్ని పక్షులను దత్తత తీసుకొని వాటిని పెంచుతున్నారు. అయితే అవి కూడా పదుల సంఖ్యలో మాత్రమే ఉంటున్నాయి.

ఇందుకు భిన్నంగా ఒకే చోట దాదాపు 2వేల చిలుకలకు రక్షణ కల్పించే ప్రాంతం ఒకటుంది. ఇన్ని వేల సంఖ్యలో చిలుకలు ఒకే చోట ఉండటంతో గిన్నీస్ బుక్ వారు కూడా ఆ ప్రాంతానికి తమ పుస్తకంలో చోటు కల్పించారు. అంతేకాకుండా ఆ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం....

2000 చిలుకమ్మలు ఒకే చోట

2000 చిలుకమ్మలు ఒకే చోట

P.C: You Tube

గిన్నీసు బుక్ లో చోటు సంపాదించుకున్న 2వేల చిలుకలు ఉన్న ప్రాంతాన్ని శుకవనం అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ శుకవనంలో రంగురంగుల చిలుకలు చేసే ధ్వనులు వినసొంపుగా ఉంటాయి. ఈ శుకవనం మరెక్కడో కాదు కర్నాటకలోనే.

2000 చిలుకమ్మలు ఒకే చోట

2000 చిలుకమ్మలు ఒకే చోట

P.C: You Tube

రాచనగరిగా పేరుగాంచిన మైసూరులోనే ఈ అరుదైన వనం ఉంది. మైసూరులోని చాముండి బెట్ట, ప్యాలెస్, నంజనగూడు తదితర పర్యాటక స్థలాలతో పాటు ఈ శుకవనం కూడా ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుతోంది.

2000 చిలుకమ్మలు ఒకే చోట

2000 చిలుకమ్మలు ఒకే చోట

P.C: You Tube

ఈ శుకవనంలో వివిధ కారాణాల వల్ల గాయపడిన చిలుకలను ఇక్కడకు తీసుకువచ్చి సంరక్షిస్తుంటారు. ఈ శుకవనం అవధూత దత్తపీఠంలో ప్రశాంత వాతావరణంలో ఉంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ పక్షిగలను దేశ విదేశాల నుంచి సేకరించి ఇక్కడ వాటికి ఆవాసం కల్పిస్తున్నారు.

2000 చిలుకమ్మలు ఒకే చోట

2000 చిలుకమ్మలు ఒకే చోట

P.C: You Tube

అంతేకాకుండా గాయపడిన పక్షులకు ఆయనే స్వయంగా చికిత్స కూడా చేస్తున్నారు. ఈ విధంగా ఆయన అటు ధార్మిక వేత్తగానే కాకుండా పక్షి ప్రేమికుడిగా కూడా మన్నలను అందుకొంటున్నారు.

2000 చిలుకమ్మలు ఒకే చోట

2000 చిలుకమ్మలు ఒకే చోట

P.C: You Tube

సాధారణంగా రెండు చిలుకలు కొమ్ము పై కూర్చొని ఊసులు చెప్పుకొంటూ ఉంటే చూడటానికి ఎంత అందంగా ఉంటుందో కదా? మరి అలాంటిది కొన్ని వేల పక్షులు ఒకే చోట చూడటం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

2000 చిలుకమ్మలు ఒకే చోట

2000 చిలుకమ్మలు ఒకే చోట

P.C: You Tube

ఆ ద`ష్యాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఇక ఈ శుకవనంలో వివిధ రంగులు, జాతులకు చెందిన దాదాపు 2వేల చిలుకలను మనం చూడవచ్చు. వీటి నిర్వహణకు స్వామీజీతో పాటు కర్నాటక పర్యాటక శాఖ కూడా క`షి చేస్తోంది.

2000 చిలుకమ్మలు ఒకే చోట

2000 చిలుకమ్మలు ఒకే చోట

P.C: You Tube

అయితే ఎక్కువ శాతం గణపతి సచ్చిదానంద దత్త పీఠం ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఇన్ని పక్షులు అది కూడా చిలుకలు ఇక్కడ ఉండటం అరుదైన విషయం అందువల్లే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు ఈ శుకవనానికి తమ బుక్కులో స్థానం కల్పించారు.

2000 చిలుకమ్మలు ఒకే చోట

2000 చిలుకమ్మలు ఒకే చోట

P.C: You Tube

ఇది కర్నాటకకు గర్వ కారణం కూడా. వివిధ రకాల పక్షుల జాతులు నాశనమవుతున్న సమయంలో ఈ విధంగా చిలుక జాతిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమే కదా? దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఈ శుకవనం ఉంది.

2000 చిలుకమ్మలు ఒకే చోట

2000 చిలుకమ్మలు ఒకే చోట

P.C: You Tube

100 అడుల ఎత్తులో నెట్ కూడా ఉంది. అందువల్ల ఇక్కడి పక్షులు సహజ ఆవాసంలో ఉన్నట్లు భావిస్తాయే తప్పిస్తే ఒక పంజరంలో ఉన్నట్లు భావించవని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 482 జాతులకు చెందిన 2వేల చిలుకలను మనం ఇక్కడ చూడవచ్చు.

2000 చిలుకమ్మలు ఒకే చోట

2000 చిలుకమ్మలు ఒకే చోట

P.C: You Tube

దీంతో ప్రపంచంలో అతి ఎక్కువ జాతుల చిలుకలను కలిగి ఉన్న ప్రదేశంగా శుకవనానికి పేరు వచ్చింది. ఈ చిలుకల సంరక్షణ కోసం వైద్యులతో సహా మొత్తం 80 మంది సిబ్బందిని కేటాయించారు. అనుక్షణం వారి పర్యవేక్షణ ఉంటుంది.

2000 చిలుకమ్మలు ఒకే చోట

2000 చిలుకమ్మలు ఒకే చోట

P.C: You Tube

అవధూత దత్త పీఠ ఆశ్రమంలోని ఈ శుకవనంలో ప్రవేశానికి ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన రోజులతో పోలిస్తే వీకెండ్ సమయంలో ఈ శుకవనానికి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

2000 చిలుకమ్మలు ఒకే చోట

2000 చిలుకమ్మలు ఒకే చోట

P.C: You Tube

మైసూరు నగరం నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ శుకవనం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మైసూరుకు రైలు, బస్సు సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X