Search
  • Follow NativePlanet
Share
» »అతీత శక్తులున్న ఈ విభిన్న శివలింగాలను దర్శనం చేసుకొన్నారా

అతీత శక్తులున్న ఈ విభిన్న శివలింగాలను దర్శనం చేసుకొన్నారా

భారత దేశంలో విభిన్న రూపాల్లో ఉన్న శివలింగాలకు సంబంధించిన కథనం.

భారత దేశ సంస్కతి సంప్రదాయంలో దైవ పూజ ఒక భాగం. కొందరు విష్ణువును ఆరాదిస్తే మరికొందరు శివుడిని తమ కులదైవంగా పూజిస్తారు. సాధారణంగా విష్ణువు ప్రతి ఆలయంలో మానవ రూపంలో మనకు కనిపిస్తాడు. అయితే పరమశివుడు మాత్రం చాలా వరకూ శివలింగం రూపంలోనే దర్శనిస్తాడు. కొన్ని చోట్ల ఆ శివలింగం కూడా విభిన్న ఆకారాల్లో ఉంటుంది. అటువంటి విభిన్న రూపాల్లో ఉన్న శివలింగానికి అతీత శక్తులు ఉన్నట్లు భావిస్తారు. కొన్ని ప్రత్యేక పర్వదినాలు, లేదా సమయాల్లో ఆ శివలింగానికి పూజలు చేసేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత దేశంలో వివిధ ప్రాతాల్లో విభిన్న రూపాల్లో ఉన్న శివలింగాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

నాలుగు నెలలు మాత్రమే భూమి పై కనిపించే విచిత్ర దేవాలయంలో స్వర్గానికి మెట్లునాలుగు నెలలు మాత్రమే భూమి పై కనిపించే విచిత్ర దేవాలయంలో స్వర్గానికి మెట్లు

అమర్నాథ్ దేవాలయం

అమర్నాథ్ దేవాలయం

P.C: You Tube

అమర్నాథ్ దేవాలయం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇదొక గుహాలయం. ఏడాదిలో నిర్థిష్ట సమయంలో మాత్రమే ఇక్కడ శివలింగాన్ని చూడటానికి వీలవుతుంది. ఇక ఇక్కడ శివలింగం మంచు ద్వారా ఏర్పడుతుంది. ఇక్కడే పరమ శివుడు పార్వతీ దేవికి స`ష్టి రహస్యం చెప్పాడని చెబుతారు.

సూర్యాస్తమయం తర్వాత మీరు ఇక్కడ ఉంటే ఏమౌతారో తెలుసాసూర్యాస్తమయం తర్వాత మీరు ఇక్కడ ఉంటే ఏమౌతారో తెలుసా

చాప రూపంలో ఉన్న శివలింగాలు

చాప రూపంలో ఉన్న శివలింగాలు

P.C: You Tube

కర్నాటకలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన హంపిలో కూడా ఒక విచిత్ర రూపంలో శివలింగాలు ఉంటాయి. తుంగభద్ర నదీ తీరంలోని ఒక బండ పై చాప రూపంలో 108 చిన్న శివలింగాలు ఒక దాని పై మరొకటి ఉన్నాయి. ఇన్ని శివలింగాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయన్న విషయం పై స్పష్టమైన సమాచారం లేదు.

వినాయకుడు కాదు వినాయకి ఉన్న దేవాలయం చూశారా?వినాయకుడు కాదు వినాయకి ఉన్న దేవాలయం చూశారా?

ఓమోహ్ శివలింగం

ఓమోహ్ శివలింగం

P.C: You Tube

జమ్ముకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని వెరినాగ్ అనే ప్రాంతంలో ఉన్న ఒమోహ్ దేవాలయంలో ఒక విభిన్న శివలింగాన్ని చూడవచ్చు. రాతి, లోహం కలగలిసిన ఈ శివలింగాన్ని మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయని చెబుతారు. ఈ శివలింగాన్ని పూజిస్తే కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని చెబుతారు.

హోయ్సళేశ్వర దేవాలయం

హోయ్సళేశ్వర దేవాలయం

P.C: You Tube

హాసన జిల్లాలోని హోయ్సళేశ్వర దేవాలయం అత్యంత ప్రాచీనమైన దేవాలయం. ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగం స్వయంభువుగా పేర్కొంటారు. అతి ప్రాచీనమైన ఈ శివలింగానికి ఒక్క రోజు తప్పకుండా దూప, దీప నైవేద్యాలు జరుగుతూ ఉండటం విశేషం. ఈ శివలింగాన్ని సందర్శిస్తే త్వరగా వివాహమవుతుందని చెబుతారు.

కోటి లింగాలు

కోటి లింగాలు

P.C: You Tube

అక్షరాల కోటి లింగాలు ఉన్న పుణ్యక్షేత్రం కర్నాటకలోని కోలారు జిల్లాలో ఉంది. ప్రపంచంలో ఒకే చోట కోటి శివలింగాలు ఉన్న క్షేత్రం మరొకటి లేదు. ఇక్కడ మనం పెద్ద ఆకారంలో ఉన్న శివలింగాన్ని కూడా చూడవచ్చు.

హంపి లోని బడవి శివలింగం

హంపి లోని బడవి శివలింగం

P.C: You Tube

ప్రముఖ పుణ్యక్షేత్రమైన హంపిలో ఈ బడవి శివలింగం ఉంది. ఎల్లప్పుడూ ఈ శివలింగం నీటిలోనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడ నుంచి వస్తోందన్న విషయం పై ఎన్ని పరిశోధనలు చేసినా ఫలితం మాత్రం తేలడం లేదు. హంపికి వెళ్లిన వారు తప్పక ఈ శివలింగాన్ని సందర్శిస్తూ ఉంటారు.

నదిలో శివలింగం

నదిలో శివలింగం

P.C: You Tube

మధ్యప్రదేశ్ లోని మహేశ్వరలో ప్రవహించే నర్మదా నది లో ఈ శివలింగం ఉంది. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడిని కూడా చూడవచ్చు. ప్రక`తిలో స్త్రీ, పురుషులు సమానమన్న రీతిలో ఈ శివలింగం ఉంటుంది.

భోజేశ్వర దేవాలయం

భోజేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం కూడా మధ్య ప్రదేశ్ లోనే ఉంది. భోజేశ్వర గ్రామంలో ఉన్నటువంటి ఈ శివలింగం ఎత్తు దాదాపు ఏడున్నర అడుగులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ దేవాలయాన్ని నిత్యం వేల మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు.

ముఖలింగం

ముఖలింగం

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలం శ్రీ ముఖ లింగం గ్రామంలో ఈ ముఖ లింగం ఉంది. మనిషి ముఖాన్ని పోలి ఉండటం ఈ శివలింగం ప్రత్యేకత. ఈ లింగం వల్లే ఈ ప్రాంతానికి ముఖలింగమనే పేరు వచ్చినట్లు చెబుతారు.

కేదారేశ్వర దేవాలయం

కేదారేశ్వర దేవాలయం

P.C: You Tube

మహారాష్ట్రలోని హరిశ్చంద్రఘడ్ లో ఉన్న కేదారేశ్వర దేవాలయం అత్యంత మహిమాన్విత దేవాలయం అని చెబుతారు. ఇది కూడా ఒక గుహాలయం. యుగాంతం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని ముందుగానే ఈ దేవాలయం కొన్ని చర్యల ద్వారా సూచిస్తుందని చెబుతారు.

భూసందేశ్వర దేవాలయం

భూసందేశ్వర దేవాలయం

P.C: You Tube

ఒడిషా లోని బాలాసోర్ జిల్లాలో భూగరై అనే గ్రామంలో ఈ భూ సందేశ్వర అనే దేవాలయం ఉంది. ఇక్కడ అత్యంత పెద్దదైన శివలింగాన్ని మనం చూడవచ్చు. ఒడిషాలోనే ఇంతటి బ`హదాకారంలో శివలింగం లేదని చెబుతారు. ఇది స్వయంభువు.

జంబుకేశ్వర దేవాలయం

జంబుకేశ్వర దేవాలయం

P.C: You Tube

తమిళనాడులోని జంబుకేశ్వర దేవాలయంలో ఉన్న శివలింగాన్ని జంబుకేశ్వర శివలింగం అని అంటారు. ఈ శివలింగాన్ని కుబేర లింగం అని కూడా పిలుస్తారు. ఈ శివలింగం నుంచి ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఇది పంచ భూత లింగాల్లో ఒక లింగం.

భీమేశ్వర దేవాలయం

భీమేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని సామర్ల కోట పట్టణంలో ఉంది. ఈ దేవాలయాన్ని కుమారరామ భీమేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివలింగం దాదాపు 14 అడుగుల ఎత్తు ఉంటుంది.

బ`హదీశ్వర దేవాలయం

బ`హదీశ్వర దేవాలయం

P.C: You Tube

తమిళనాడులోని బ`హదీశ్వర దేవాలయం అత్యంత ప్రాచీన, ప్రాచూర్యం చెందిన దేవాలయం. ఈ దేవాలయంలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇక్కడ ఉన్న శివలింగం కూడా బ`హదాకారంలో ఉంటుంది. ఒకే శిలతో ఈ శివలింగాన్ని తీర్చి దిద్దడం విశేషం.

గుడిమల్లం

గుడిమల్లం

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని ఓ చిన్న గ్రామం పేరు గుడిమల్లం. ఇక్కడ శివలింగం మానవుడి పురుషాంగాన్ని పోలి ఉండటం విశేషం. ఇక్కడ శివుడిని పరశురామేశ్వరుడిగా పూజిస్తారు. ఈ లింగం సుమారు ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X