Search
  • Follow NativePlanet
Share
» »తాజ్ మహాల్ కు ధీటుగా అలరారుతున్న అపురూప నిర్మాణం ‘దిల్ వారా’ శిల్పలావణ్యం అదరహో..

తాజ్ మహాల్ కు ధీటుగా అలరారుతున్న అపురూప నిర్మాణం ‘దిల్ వారా’ శిల్పలావణ్యం అదరహో..

పర్యాటకులకు రాజస్థాన్ పర్యటన ఒక స్వర్గధామం. రాచరికపు ఠీవిని కళ్ళముందుంచే కోటలు, కనువిందు చేసే అద్భుత నిర్మాణాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. మార్బల్ నిర్మాణాలు ఎక్కువగా కనబడుతాయి. మహోన్నతమైన కోటల్లో పాలరాతితో అద్భుతంగా మలిచిన ప్యాలెస్ లు కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి. ఇక మౌంట్ అబూ గురించి చెప్పాలంటే అక్కడ ఉన్న ఆలయాలు మొత్తం పూర్తిగా పాలరాతి నిర్మాణాలే. పునాది నుండి ఆలయ శిఖరం వరకూ మరో రాయి ఎక్కడ కనిపించింది.

మౌంట్ అబూలో అత్యంత ప్రసిద్ది చెందిన ఆలయం దిల్ వారా జైన ఆలయం. ఇది 5 ఆలయాల సమూహం. దేనికదే ప్రత్యేకమైన శిల్ప నైపుణ్యంతో అలరారుతుంటాయి. మన దేశంలోని చారిత్రకంగా పాలరాతి శిల్పశైలిలో అద్భుత నిర్మాణాల్లో తాజ్ మహాల్ అనుకుంటాం. కానీ అందుకు ధీటుగా అలరారుతున్న అపురూప నిర్మాణం 'దిల్ వారా'. ఇది 5 జైన మందిరాల సముదాయం అయినప్పటికీ కులమతలాకు అతీతంగా ప్రపంచ కళా సౌందర్యాన్ని కాంక్షించే వారందరికీ ఆహ్లాదం కలిగిస్తోంది. రాజస్థాన్ అంటే ఎడారి ఇసుక తెన్నులే కాదు, అలనాటి పాలరాతి శిల్పకళా సంపద విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం...

రాజస్తాన్ రాష్ట్రంలో మౌంట్ అబూలో

రాజస్తాన్ రాష్ట్రంలో మౌంట్ అబూలో

రాజస్తాన్ రాష్ట్రంలో మౌంట్ అబూ పాలరాతి అందాలతో సమ్మోహనంగా కనబడుతుంది ‘దిల్ వారా'జైనమందిర సముదాయం. ఇది పర్యాటక ప్రదేశంగా బాగా ప్రసిద్ది చెందినది. దిల్ వారా లోపల ప్రధాన మందిరం వసారాలోకి ప్రవేశించగానే ఒక్క సారిగా అక్కడున్న శిల్పకళా సృజనను చూసి విస్మయం చెందుతారు.

PC: Pratyk321

మాటలలో వర్ణించలేని అనుభూతిని

మాటలలో వర్ణించలేని అనుభూతిని

మాటలలో వర్ణించలేని అనుభూతిని, ఎవరైనా ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే. అక్కడి శిల్పకళా చాతుర్యానికి వొళ్లంతా కళ్లు చేసుకొని చూసినా సమయం సరిపోదంటే నమ్మండి. అక్కడున్న శిల్పాలను, వాటి నిర్మాణ సౌందర్యాన్ని చూసి అసంకల్పితంగానే ఔరా..అని ఎవ్వరైనా ప్రశంసించకుండా ఉండలేరు.

Photo Courtesy: Malaiya

ప్రతి రెండు స్థంభాల మధ్యన పాలరాతి తోరణాలు

ప్రతి రెండు స్థంభాల మధ్యన పాలరాతి తోరణాలు

ప్రతి రెండు స్థంభాల మధ్యన పాలరాతి తోరణాలను ఎంతో రమణీయంగా మలిచారు. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైన డిజైన్లతో తయారుచేశారు. ఈ పాలరాతి తోరణాలు చూస్తే చాలు, కళాకారులు ప్రతిభను పొగడడానికి పదాలు దొరకవంటే నమ్మండి! ఒకటి రెండు కొదు, కొన్ని వందల సంఖ్యలో అలాంటి శిల్పాలున్నాయి.

Photo Courtesy: Archibald Adams

ఈ దిల్ వారా పై కప్పు నిండా

ఈ దిల్ వారా పై కప్పు నిండా

ఈ దిల్ వారా పై కప్పు నిండా, వసారాకున్న స్తంభాలకు, ప్రధాన పీఠం చుట్టూ ఎన్నెన్నో శిల్పాలున్నాయి. ప్రధాన మందిరం. మందిర పీటం మాత్రమే కాదు దాని చుట్టూ కొన్ని అడుగుల దూరంలో మూడు వైపులా ఉన్న పెద్ద వసారలకు కొన్ని వందల స్థంభాలున్నాయి.

Photo Courtesy: Surohit

 ఒకదానికొకటి సరిపోల్చడం

ఒకదానికొకటి సరిపోల్చడం

ఈ స్థంభాలకు, ఆ వసారలాకు ఉన్న పై కప్పులు కూడా శిల్పాలతోనే మలిచారు. ఒకదానికొకటి సరిపోల్చడం కూడా చాలా కష్టం. అంత అద్భుతంగా ప్రతి శిల్పకళ కనబడుతుంది.ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఇంతటి అద్భుత శిల్పలావణ్యం కలిగిన ప్రదేశాన్ని చూస్తూ మరో లోకంలోకి వెళ్లిపోతారనడంలో అతిశయోక్తి ఏమాత్రం ఉండదు.

PC: Akshat patni

దిగంబర జైనమతాన్ని ప్రతిబింబిచే ఆలయం

దిగంబర జైనమతాన్ని ప్రతిబింబిచే ఆలయం

మౌంటు అబులో ఒక బాగంగా అనిపిస్తుంది. ఇది దిగంబర జైనమతాన్ని ప్రతిబింబిచే ఆలయం. శ్వేతాంబర జైనులు ఇక్కడికి రోజూ వచ్చి దర్శనాలు, పూజలు చేసుకుంటారు. పన్నెండు వందల మీటర్ల ఎత్తు కొండలపై ఇంత పెద్ద ఆలయాల నిర్మానికి పాలరాయి ఎలా వచ్చిందా అని చూట్టూ చూస్తే అంత పెద్ద కొండల్లో ఏ వైపునా కనిపించదు. కానీ, గుడినిర్మాణానికి అయ్యేంత పాలరాయిని ఏనుగుల మీద కొండ మీదకు రవాణా చేశారు.

PC: 1850s

పాలరాయితో చెక్కిన శిల్పాలను కనుక గమనిస్తే

పాలరాయితో చెక్కిన శిల్పాలను కనుక గమనిస్తే

పాలరాయితో చెక్కిన శిల్పాలను కనుక గమనిస్తే నిజంగా రాయితోనే చెక్కారా లేదా మైనం బొమ్మలు చేసి రాతి స్తంభానికి అమర్చారా అనే సందేహం కలుగుతుంది. తామర పువ్వుల రెక్కలు నిజమైన పూల రెక్కలు ఉండేట్లు కోమలంగా ఉంటాయి. పువ్వు రెక్కలో ఉన్న ఈనెలు కూడా పాలరాయిలో స్పష్టంగా కనిపిస్తాయి.

PC: Photo:Rakhee

నాట్యగత్తెలను చాలా ప్రత్యేకంగా చూస్తే తప్పా

నాట్యగత్తెలను చాలా ప్రత్యేకంగా చూస్తే తప్పా

స్తంభాలపై ఉన్న శిల్పాలన్నీ కూడా ఒకే విధంగా కనబడుతాయి. కానీ, స్థంభాలపై ఉన్న నాట్యగత్తెలను చాలా ప్రత్యేకంగా చూస్తే తప్పా, ఏ రెండు శిల్పాలు ఒక ఆకృతిలో దేనికది విభిన్న శైలిలో కనబడుతాయి. జైన హిందూ ధార్మిక సాహిత్యంలోని అంశాలను గోడలమీద, పైకప్పుకి ఉంటాయి.

PCPhoto: Rakhee

పైకప్పులు అత్యంత అద్భుతం

పైకప్పులు అత్యంత అద్భుతం

దిల్ వారాలోని ఆలయంలోని గోడలు, స్థంబాలు, గర్భగుడిలోని విగ్రహాల కంటే పైకప్పులు అత్యంత అద్భుతంగా కనబడుతాయి. ఈ శిల్పసౌందర్యాన్ని మాటల్లో వర్ణింపలేని విధంగా ఉంటుంది.

Photo:Rakhee

దిల్ వారా జైన దేవాలయం ఐదుమందిరాల సమూహమే కానీ

దిల్ వారా జైన దేవాలయం ఐదుమందిరాల సమూహమే కానీ

దిల్ వారా జైన దేవాలయం ఐదుమందిరాల సమూహమే కానీ, ప్రధాన ఆలయాలు నాలుగే. ముందుగా 4 ఆలయాలకే ప్రణాళిక సిద్దం చేసి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మిగిలిపోయిన పాలరాయితో దిమ్మెలు, శిల్పాలు చెక్కినప్పుడు రాలిపడిన పాలరాతిపొడితో నిర్మించినది 5వ ఆలయం.

PC: Ayush Jain

దిల్ వారా పర్యటకు వెళ్ళినప్పుడు

దిల్ వారా పర్యటకు వెళ్ళినప్పుడు

దిల్ వారా పర్యటకు వెళ్ళినప్పుడు మొదటి కనిపించే ఆలయం కూడా ఐదవదే. నాలుగు ఆలయాల నిర్మాణం పూర్తి అయిన తర్వాత కొద్ది రోజులు అక్కడే ఉండి ఆటవిడుపుగా నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి కూలి తీసుకోలదట. ప్రేమతో నిర్మించబడిన ఆలయం కాబట్టి దానికి దిల్ వారా అని పేరు పెట్టారు. అది అలాగే బాగా పాపులర్ అయింది.

Photo Courtesy: Pratyk321

జైనమత తీర్థంకరులను పూజింపడానికి ఈ మందిరాలను నిర్మించారు

జైనమత తీర్థంకరులను పూజింపడానికి ఈ మందిరాలను నిర్మించారు

జైనమత తీర్థంకరులను పూజింపడానికి ఈ మందిరాలను నిర్మించారు. ఇవి మొత్తం ఐదు మందిరాలా సమూహం.ఇంత పెద్ద ఆలయాలను కట్టడానికి ఎన్నాళ్లు పట్టిందో అని ఆశ్చర్యపోకండి, వీటిని దశలవారీగా క్రీ.శ.11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకూ దాదాపు 200ఏళ్ళు నిర్మించారు. ఈ ఐదు మందిరాల్లో లునావాసహి, విమలవాసహి'అనేవి అత్యంత రమణీయంగా కనబడుతాయి.

Photo Courtesy: Ingo Mehling

 మొదటి మందిరాన్ని పార్శ్వనాథ మందిరం అని

మొదటి మందిరాన్ని పార్శ్వనాథ మందిరం అని

వీటిలో మొదటి మందిరాన్ని పార్శ్వనాథ మందిరం అని, 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథునికి, రెండో మందిరం, విమలవాసహి'ని తొలి తీర్థంకురుడు రిషభనాథునికి, మూడో మందిరం లునావాసహిని'ని 22వ తీర్థంకరుడు నేమినాథునికి, నాలుగోదైన పిథల్వార్' మందిరాన్నిరిషభనాథునికి, ఐదోది ‘మహావీర్ స్వామి మందర్ 'ను 24వ తీర్థంకరుడైన ‘వర్థమాన మహావీరునికి' అంకితం చేయబడినది.

ఈ ఐదు మందిరాల్లో ఆయా తీర్థంకరుల విగ్రహాలు

ఈ ఐదు మందిరాల్లో ఆయా తీర్థంకరుల విగ్రహాలు

ఈ ఐదు మందిరాల్లో ఆయా తీర్థంకరుల విగ్రహాలు నిర్మితం చేయబడ్డాయి. దిల్ వారా జైన మందిర సముదాయంలో 360జైన విగ్రాలు, 72 తీర్థంకరుల విగ్రహాలున్నాయి.

PC: Photo:Nathan Hughes Hamilton

చాలా మంది పర్యాటకలు

చాలా మంది పర్యాటకలు

చాలా మంది పర్యాటకలు మౌంట్ అబూ అనగానే సమ్మర్లో వెళ్లాల్సిన ప్రదేశం అనుకుంటారు. కానీ ఇక్కడ వింటర్ ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు. రాజస్థాన్‌ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలుంటాయి.

PC:Utsav pal

ఈ వేడుకల్లో రాజస్తాన్

ఈ వేడుకల్లో రాజస్తాన్

ఈ వేడుకల్లో రాజస్తాన్ సంప్రదాయ దుస్తుల్లో, మేవాడ్ సంప్రదాయ నాట్యాలను ప్రదర్శిస్తారు.ఒంటె పందాలు, ఫోక్‌ డ్యాన్స్‌లు ఆకట్టుకుంటాయి. ఇది ట్రెక్కింగ్ కి కూడా మంచి ప్రదేశం. ఇంకా రాక్ క్లైంబిగ్, మౌంటైయిన్ బైకింగ్ చేయవచ్చు. చిన్న పిల్లలతో కలిసి వెళ్ళే వాళ్లు వాక్స్ మ్యూజియం, బర్డ్ సాంక్చురీలను తప్పకుండా చూడాలి.

PC: CorrectKnowledge

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X