Search
  • Follow NativePlanet
Share
» »డైనోసార్స్ (రాక్షస బల్లుల)కు అడ్డా ఈ ప్రదేశం, ఎక్కడ ఉందో తెలుసా?

డైనోసార్స్ (రాక్షస బల్లుల)కు అడ్డా ఈ ప్రదేశం, ఎక్కడ ఉందో తెలుసా?

డైనోసార్‌ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కువగా హాలీవుడ్ చిత్రాల్లో చూస్తుంటాం! డైనోసార్‌ అన్నది గ్రీకు భాషా పదం. దీనర్థం రాక్షసబల్లి అని. 1676లో రిచర్డ్‌ ప్లాట్‌ తొలిసారి వీటి అవశేషాలను ఇంగ్లాండ్‌లో

డైనోసార్‌ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కువగా హాలీవుడ్ చిత్రాల్లో చూస్తుంటాం! డైనోసార్ల నేపథ్యంలో స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తెరకెక్కించిన 'జురాసిక్‌ పార్క్‌' సిరీస్‌ చిత్రాలను ఇప్పటికీ మర్చిపోలేం.డైనోసార్‌ అన్నది గ్రీకు భాషా పదం. దీనర్థం రాక్షసబల్లి అని. 1676లో రిచర్డ్‌ ప్లాట్‌ తొలిసారి వీటి అవశేషాలను ఇంగ్లాండ్‌లో కనుగొన్నాడు. కానీ వీటికి పేరు పెట్టింది మాత్రం 1842లోనే. పాలియన్టాలజిస్ట్‌ (అంతరించిన జీవుల పరిశోధకుడు) రిచర్డ్‌ వేవెల్‌ ఈ జీవుల భారీ ఆకారాన్ని చూసి డైనోసారస్‌ అన్న పేరు పెట్టాడు. అంతేకాదు. వాటిలో అనేక జాతులు ఉంటాయి. భూమ్మీద రాక్షస బల్లులు దాదాపు 25 కోట్ల సంవత్సరాల కిందట పుట్టాయి. ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం వరకూ హాయిగా జీవించాయి. డైనాసార్లు మన దేశంలో కూడా జీవించాయి అనడానికి నిదర్శనంగా వాటి శిలాజాలా ద్వారా తెలిసింది. మరి ఈ శిలాజాలు ఎక్కడ దొరికాయి..ఎక్కడ పొందుపరిచారు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మన దేశంలో డైనోసార్ల శిలాజాలా ఓపెన్ మ్యూజియం ఎక్కడ ఉందో తెలుసా

మన దేశంలో డైనోసార్ల శిలాజాలా ఓపెన్ మ్యూజియం ఎక్కడ ఉందో తెలుసా

గుజరాత్ లోని మహిసాగర్ జిల్లాలో బాలానిసోర్ సమీపంలోని రాయ్ యోలి గ్రామంలో ఉంది. ఇటువంటి మ్యూజియం భారత్ లో మొదటిది కాగా..ప్రపంచంలోనే మూడవది. స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీకి చిహ్నంగా నిలిచిన సర్ధార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం తర్వాత ఈ మ్యూజియం గుజరాత్ కు చిహ్నంగా నిలుస్తుంది. ఈ మ్యూజియం గుజరాత్ రాష్ట్రానికి మరో కలికితురాయి.

PC: FabSubeject

ఈ మ్యూజియం ఆల్ట్రామోడ్రన్ టెక్నాలజీతో

ఈ మ్యూజియం ఆల్ట్రామోడ్రన్ టెక్నాలజీతో

ఈ మ్యూజియం ఆల్ట్రామోడ్రన్ టెక్నాలజీ, త్రీడి ప్రొజెక్షన్, వర్చువల్ రియాలిటీతో ఈ మ్యూజియంలో ప్రదర్శనలుంటాయి. డైనోసార్ల జీవిత పరిణామక్రమంతో పాటు వాటి భారీ బొమ్మలను కూడా మ్యూజియంలో ఉంచారు. 25వేల చద రపు అడుగుల విస్తీర్ణంలో దిద్దుకున్న మ్యూజియం బేస్‌మెంట్‌ లో మొత్తం 10 గ్యాలరీలున్నాయి. దాదాపు 65 మిలియన్ ఏళ్ళ నాటి రాక్షస బల్లుల చరిత్రను ఇక్కడ చూడవచ్చు. మహిసాగర్ జిల్లాలో గతంలో డైనోసార్ శిలాజాలు, వాటి గుడ్లు దొరికాయి. డైనోసార్లలో వివిధ రకాల జాతులన్నీ జురాసిక్‌ కాలంలోనే పుట్టాయి. డైనోసార్‌ ఒకసారికి 20 నుంచి 30 గుడ్లు పెడుతుందని పరిశోధనల్లో తేలింది.

మ్యూజియంకు జాతీయస్థా యిలో ప్రాచుర్యం కల్పించే దిశలో

మ్యూజియంకు జాతీయస్థా యిలో ప్రాచుర్యం కల్పించే దిశలో

మ్యూజియంకు జాతీయస్థా యిలో ప్రాచుర్యం కల్పించే దిశలో గుజరాత్‌ పర్యాటక శాఖ అ ధికారులు వివిధ రకాల ప్రకటలను చేస్తూ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. విద్యార్ధులకు, శాస్త్రవేత్తలకు సమాచార సంగ్రహణిగా ఈ మ్యూజియం ఉపకరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

PC: FabSubeject

1980 ల్లో ఓ యాదృచ్ఛిక సంఘటన

1980 ల్లో ఓ యాదృచ్ఛిక సంఘటన

1980 ల్లో ఓ యాదృచ్ఛిక సంఘటన జరిగింది. ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ఈ ప్రాంతంలో జియోలాజిస్ట్‌లు సాధారణ తవ్వకాలు చేస్తుంటే ఓ అద్భుతం ఆ మట్టి పొరల్లో బయటపడింది. గుడ్లు, ఎముకల శిలాజాలు కనిపించాయి. వాటి గురించి పరిశోధన చేస్తే ఈ చిన్ని గ్రామం లక్షల సంవత్సరాల క్రితం రాకాసి బల్లులకు అడ్డా అనే విషయం తెలిసి నోరెళ్లబెట్టారు పరిశోధకులు.

PC: Abduribnmeraj

 ప్రపంచంలోనే డైనోసార్లు సంచరించిన ప్రధాన ప్రాంతాల్లో బాలసినోర్‌

ప్రపంచంలోనే డైనోసార్లు సంచరించిన ప్రధాన ప్రాంతాల్లో బాలసినోర్‌

ప్రపంచంలోనే డైనోసార్లు సంచరించిన ప్రధాన ప్రాంతాల్లో బాలసినోర్‌ మూడోవది. ఎక్కడెక్కడి నుంచో రాకాసి బల్లులు గుడ్లు పెట్టడానికి ఇక్కడకు తరలి వచ్చేవట. నదుల ప్రవాహం, అవి మోసుకు వచ్చే తేలికపాటి మట్టి రేణువులతో బాలాసినోర్‌ చుట్టుపక్కల నేల గుడ్లు పొదగటానికి, రక్షణకు అనుకూలంగా ఉండేదట. అందుకే కాబోలు ఒకటో రెండో కాదు టైరానోసారస్‌, మెగాలోసారస్‌, టిటానోసారస్‌ వంటి ఏడు రకాల డైనోసార్లు ఈ మట్టి పైనే తిరుగాడాయి.

PC: FabSubeject

డైనోసార్ల గుడ్లను సైతం తినే అరుదైన సర్ప జాతి సానాజే ఇండికస్‌

డైనోసార్ల గుడ్లను సైతం తినే అరుదైన సర్ప జాతి సానాజే ఇండికస్‌

డైనోసార్ల గుడ్లను సైతం తినే అరుదైన సర్ప జాతి సానాజే ఇండికస్‌ శిలాజాలు కూడా ఇక్కడ బయల్పడ్డాయి. ఇది శాస్త్ర ప్రపంచాన్ని కుదిపేసింది. డైనోసార్ల కన్నా ముందటి వేరే భారీ జీవుల అరుదైన శిలాజాలిక్కడివే. దాదాపు వంద మిలియన్‌ సంవత్సరాల వరకు ఈ ప్రాంతం అరుదైన డైనోసార్‌లకు ఆవాసంగా విరాజిల్లింది. డైనోసార్లలో వివిధ రకాల జాతులన్నీ జురాసిక్‌ కాలంలోనే పుట్టాయి. డైనోసార్‌ ఒకసారికి 20 నుంచి 30 గుడ్లు పెడుతుందని పరిశోధనల్లో తేలింది.

దాదాపు 1000 వరకు డైనోసార్ల గుడ్ల శిలాజాలు ఇక్కడ లభించాయట.

దాదాపు 1000 వరకు డైనోసార్ల గుడ్ల శిలాజాలు ఇక్కడ లభించాయట.

దాదాపు 1000 వరకు డైనోసార్ల గుడ్ల శిలాజాలు ఇక్కడ లభించాయట. అందుకే బాలసినోర్‌ను శిలాజ వనంగా కూడా పిలుస్తారు. ఈ ఫాజిల్స్‌ను జాగ్రత్తగా సేకరించి మ్యూజియంలో భద్రపరిచారు. అయితే ఇది డైనోసర్లు తిరిగాడిన సహజసిద్దమైన వనం కాదు, మానవ నిర్మితమైన పార్క్. డైనోసార్ల ప్రాంతం అని చూడగానే అర్థ్ధం కావటానికి, అనుభూతి చెందటానికేమో ఓ పెద్ద డైనోసార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ. నోరు తెరిచి గాండ్రిస్తున్నట్లు ఉన్న డైనోసార్‌ పక్కన ఫోటోలు దిగటానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.

టిటానరస్ అనే డైనోసార్ ల అవశేషాలు కనిపించడంతో

టిటానరస్ అనే డైనోసార్ ల అవశేషాలు కనిపించడంతో

టిటానరస్ అనే డైనోసార్ ల అవశేషాలు కనిపించడంతో వీటికి బలం చేకూరుతోంది. అరేబియా సముద్రం, నర్మద నదీ పరివాహక ప్రాంతంలో వందల సంఖ్యలో రాకాసి బల్లుల గుడ్లు, ఎముకలు, వెన్నెపూస, కడుపులో భాగాలు, తల ఇలా... ఎన్నో అవశేషాలు బయటపడ్డాయి.

ఓ రాయి మీద పొడవాటి వెన్నుముక అచ్చు, గుడ్డు శిలాజాన్ని

ఓ రాయి మీద పొడవాటి వెన్నుముక అచ్చు, గుడ్డు శిలాజాన్ని

ఓ రాయి మీద పొడవాటి వెన్నుముక అచ్చు, గుడ్డు శిలాజాన్ని రాతి నుంచి తీసివేయగా మిగిలిన గుడ్డు ఆకారపు గుంటలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. రెండు డైనోసార్లు పక్క పక్కనే పడి సమాధి అయిన ఆనవాళ్ళు ఉన్నాయి. 65 మిలియన్‌ ఏండ్ల క్రితం అరేబియా సముద్రం నుంచి వచ్చిన భీకర వరదలు, అగ్నిపర్వత పేలుళ్ళతో ఈ జాతి పూర్తిగా అంతరించిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను

ప్రాచీన కాలంలో డైనోసార్‌లో గుజరాత్‌లో నివాసం చేవన్న ఆసక్తికరమైన కథలను చెప్పే డైనోసార్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌, మ్యూజియంను గాంధీనగర్‌ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని బాలసిశోర్‌ జిల్లాలోని రయోలి గ్రామంలో ఉన్న ఈ మ్యూజియంను ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. 60లక్షల సంవత్సరాల పురాతన పరంపర సంరక్షించేందుకు ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X