Search
  • Follow NativePlanet
Share
» »రోజూ సముద్రంలో మునిగి తేలే శివలింగం...ప్రజలే పూజారులు

రోజూ సముద్రంలో మునిగి తేలే శివలింగం...ప్రజలే పూజారులు

దేశంలో ఒక్కొక్క శివక్షేత్రానికి ఒక్కొక్క కథ. ఆ కోవకు చెందినదే స్తంభేశ్వరాలయం. ఈ దేవాలయం ప్రతి రోజూ సముద్రపు నీటిలో మునిగి తిరిగి తేలుతూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishore

భారత దేశంలో దేవాలయాలకు కొదువు లేదు. అయితే కొన్ని దేవాలయాలయాలకు సంబంధించిన విషయాలు మాత్రం అశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన వివరాలు వందల ఏళ్లు దాటినా నిగూడ రహస్యాలుగానే ఉండిపోతున్నాయి. అటు వంటి కోవకు చెందినదే గుజరాత్ లోని అరేబియా సముద్రంలో అవును మీరు చదివినది కరెక్టే.... సముద్ర ఒడ్డున కాదు సముద్రంలో ఉన్న స్థంభేశ్వరనాథ దేవాలయం. ఇది ప్రతి రోజూ సముద్రంలో పూర్తిగా మునిగి పోయి తేలుతుంటుంది. పాండవులు ప్రతిష్టించినట్లు చెప్పుకునే ఇందులోని లింగానికి పూజలను ప్రజలే నిర్వహిస్తారు. దేవాలయంలో పూజారులు ఉండరు. ఇక పదేళ్లలోపు పిల్లలను ఈ దేవాలయంలోకి అనుమతించరు. ఇందుకు సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

1. అరేబియా సముద్రంలో సాహసయాత్రే....

1. అరేబియా సముద్రంలో సాహసయాత్రే....

Image source

అరేబియా సముద్రంలో ఉన్న ఈ దేవాలయం సందర్శన ఒక రకంగా సాహస యాత్రగా చెప్పవచ్చు. స్థానిక వాతావరణ పరిస్థితులు కొంచెం అదుపు తప్పినా భక్తులు ప్రాణాలు కోల్పోక తప్పదు. అందువల్లే ఈ శివక్షేత్రంలోకి వెళ్లి ఆ పరమశివుడిని దర్శించుకోవడానికి 70 ఏళ్లు పై బడిన వారికి 10 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి ఉండదు.

2. అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే

2. అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే

Image source

సముద్రఅలల తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో మాత్రమే ఈ దేవాలయంలోని పరమశివుడిని సందర్శించడానికి అనుమతి లభిస్తుంది. ఇందు కోసం ఒడ్డున ఉన్న దేవాలయానికి చెందిన ఆశ్రమ నిర్వాహకులు భక్తులకు అలల తీవ్రత ఏఏ సమయంలో తక్కువగా ఉంటాయో సూచించే చీటీలను అందజేస్తారు.

3. కేవలం ధ్వజస్థంభం మాత్రమే

3. కేవలం ధ్వజస్థంభం మాత్రమే

Image source

అలల తీవ్రత వాతావరణం పై ఆధారపడి ఉండటం వల్ల ఏ రోజుకారోజు చీటీలోని సమయం మారుతూ ఉంటుంది. దూరం నుంచి కేవలం ఆలయం ధ్వజస్థంభం మాత్రమే కనిపిస్తుంది. తీరం నుంచి దేవాలయం వరకూ కట్టిన తాడును పట్టకుకుని దేవాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.

4. భక్తులే పూజారులు

4. భక్తులే పూజారులు

Image source

ఆలయంలో పూజారులు ఎవరూ ఉండరు. భక్తులే అక్కడ ఉన్న శివలింగానికి నేరుగా పూజలు చేస్తారు. తీసుకువెళ్లిన పూలను శివ లింగం పై పెట్టి చీటీలో సూచించిన సమయం లోపు ఒడ్డును చేరుకుంటారు.

5. ఒడ్డుకు చేరే పూలు

5. ఒడ్డుకు చేరే పూలు

Image source

అలల తాకిడికి భక్తులు లింగం పై పెట్టిన పూలు ఒడ్డుకు వచ్చిన తర్వాత వాటిని ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకువెళుతారు. ఈ పూలను ఇంటిలో ఉంచుకుంటే అన్నీ శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.

6. ఒక రోజు మొత్తం

6. ఒక రోజు మొత్తం

Image source

ఈ ఆలయం మునిగి పోవడం, తిరిగి పైకి తేలడం వంటి రెండు ఘట్టాలను చూడటానికి ఒక రోజు మొత్తం ఈ సముద్రపు ఒడ్డున గడపాల్సి ఉంటుంది. ఈ దేవాలయంలో శిల్పకళ సంపద పెద్దగా ఉండదు. అయితే వందల ఏళ్లుగా సముద్రపు నీటిలో మునిగి, తేలుతూ ఉన్నా ఆలయం చెక్కు చెదరక పోవడం ఇక్కడ గమనార్హం.

7. ప్రాణాలు కోల్పోక తప్పదు

7. ప్రాణాలు కోల్పోక తప్పదు

Image source

సాధారణంగా మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది. సాయంత్రం 6.30 గంటల్లోపు ఒడ్డును చేరుకోవాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ప్రాణాలు కోల్పోక తప్పదు.

8. పౌర్ణమి రోజున

8. పౌర్ణమి రోజున

Image source

పౌర్ణమి రోజున ఇక్కడి లింగం ఒక ద్విగుణీక`తమైన కాంతితో మెరుస్తుందని చెబుతారు. పున్నమి రోజున ఈ దేవాలయ దర్శనం కొంత రిస్కుతో కూడుకున్నది అయినా చాలా మంది అదే రోజు ఈ దేవాలయ దర్శనం కోసం వస్తుంటారు.

9. కుమారస్వామిచే ప్రతిష్టించబడినది

9. కుమారస్వామిచే ప్రతిష్టించబడినది

Image source

శివభక్తుడైన తారకాసురడనే రాక్షసుడిని వధించిన తర్వాత కుమారస్వామి ఈ లింగాన్ని ఇక్కడ స్థాపించి పూజించాడని స్కంధపురాణం వివరిస్తుంది. ఈ శివలింగ దర్శనం ద్వారా సకల పాపాలు తొలిగి పోతాయని భక్తులు నమ్ముతుంటారు.

10. మారో కథనం

10. మారో కథనం

Image source

మరో కథనం ప్రకారం కురుక్షేత్రం తర్వాత అన్నదమ్ములను చంపిన పాపం నుంచి విముక్తి పొందడానికి పాండవులు ఇక్కడ ఐదు లింగాలను ప్రతిష్టించి పూజించారని అయితే అవి ఎప్పుడో ఒకసారి మాత్రమే దర్శనమిస్తాయని చెబుతారు.

11. గుజరాత్ లో...

11. గుజరాత్ లో...

Image source

గుజరాత్ లోని అహ్మదాబాద్ కు దగ్గర్లోని భవ్ నగర్ కు సమీపంలో ఉన్న కవికాంబోయి గ్రామానికి అత్యంత సమీపంలో అరేబియా సముద్రంలో ఈ దేవాలయం ఉంటుంది. సముద్రపు ఒడ్డు నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీర్ల దూరంలో కాలి నడకన వెలితే ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు.

12. ఎలా చేరుకోవాలి...

12. ఎలా చేరుకోవాలి...

Image source

వడోదరకు దాదాపు 52 కిలోమీటర్ల దూరంలో కవి కాంబోయి ఉంటుంది. ఇక్కడకు బస్సు సౌకర్యం ఉన్నా కూడా ట్యాక్సీ ద్వారా ప్రయాణం ఉత్తమం. ఇక బెంగళూరు నుంచి అహ్మదాబాద్ లేదా వడోదరాకు రైలులో వెళ్లి అక్కడి నుంచి కవి కాంబోయి వద్దకు ట్యాక్సీ ద్వారా వెళ్లడం ఉత్తమం. అదే విధంగా హైదారాబాద్ నుంచి కూడా అహ్మదాబాద్, వడోదరాకు రైలు సదుపాయం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X