Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటకలోని ఈ నదీమ తల్లుల గురించిన విషయాలన్నీ మీకు తెలుసా

కర్నాటకలోని ఈ నదీమ తల్లుల గురించిన విషయాలన్నీ మీకు తెలుసా

కర్నాటకలో ఉన్న ముఖ్యమైన నదుల గురించిన సమాచారం.

భారత దేశం నదీమ తల్లులకు జన్మస్థానం. ఈ పుణ్య దేశంలో ఎన్నో నదులు జన్మించి సముద్రంలో కలుస్తున్నాయి. ఇలా సముద్రం చేరే క్రమంలో తాము ప్రవహించే ప్రాంతంలోని ప్రజలకు అవసరమైన సాగు, తాగు నీటి అవసరాలను తీరుస్తూ ఆ ప్రాంతాలను సస్యస్యామలం చేస్తున్నాయి. ఇందుకు కర్నాటక కూడా అతీతం ఏమీ కాదు. దక్షిణ భారత దేశ రాష్ట్రాల్లో ముఖ్యమైన నదుల జన్మస్థానం ఈ కర్నాటకలోనే కావడం గమనార్హం. అంతేకాకుండా ఇక్కడ పుట్టిన కావేరి వంటి నదులు పొరుగు రాష్ట్రాలను కూడా సస్యస్యామలం చేస్తున్నాయి కావేరి నదే కాకుండా కాళి, భద్ర, గురుపుర, సౌపర్ణిక నదులు కూడా కర్నాటకలో పాటు పొరుగు రాష్ట్రాల్లోని నేలను కూడా తమ జలాలతో తడుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో ముఖ్యమైన నదుల క్లుప్త సమాచారం మీ కోసం...

కావేరి నదీ

కావేరి నదీ

P.C: You Tube

దక్షిణ భారత దేశంలో అత్యతం పొడవైన నదిగానే కాకుండా నీటి నిల్వలో కూడా కావేరి నదీ పెద్దది. కొడుగు జిల్లాలో జన్మించే కావేరి నది పశ్చిమ కనుమల గుండా ప్రయాణిస్తుంది. కేవలం కర్నాటకకే కాకుండా ఈ కావేరి నది తమిళనాడుకు కూడా సాగు, తాగు నీటిని అందిస్తుంది. ఈ నదీ తీరంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఎకో టూరిజానికి కూడా కావేరి నది చాలా ప్రాచూర్యం పొందింది. కావేరి నదీ జన్మస్థానం బెంగళూరు నుంచి 306 కిలోమీటర్లు

భద్రానది

భద్రానది

P.C: You Tube

పశ్చిమ కనుమల్లో పుట్టే ఈ నది దక్కన్ భూ భాగం గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది పై భాగంలో లక్కవల్లి వద్ద ఒక జలాశయాన్ని నిర్మించారు. ఈ నది కర్నాటకను దాటుకొంటూ వెళ్లి ఆంధ్రప్రదేశ్ లో క`ష్ణానదికి ఉపనదిగా మారి బంగాళాఖాతంలో కలుస్తుంది. బెంగళూరు నుంచి ఈ నది జన్మస్థానానికి 331 కిలోమీటర్ల దూరం.

కాళీ నది

కాళీ నది

P.C: You Tube

దాండేళి జిల్లాల్లో జన్మించే ఈ నది పై భాగంలో అనేక ఆనకట్టలు నిర్మించారు. దీని వల్ల కర్నాటకలోని చాలా ప్రాంతాలకు తాగు, సాగునీటి సరఫరా జరుగుతూ ఉంది. ఇది పశ్చిమ దిశగా ప్రవహిస్తూ అరబియా సముద్రంలో కలుస్తుంది. బెంగళూరు నుంచి 461 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నదీ తీరం వద్ద ప్రముఖ అభయారణ్యాలను కూడా చూడవచ్చు.

కబిని నది

కబిని నది

P.C: You Tube

దక్షిణ భారత దేశంలో కబిని ముఖ్యమైన నది. ఇది కేరళలోని వయనాడు జిల్లాల్లో జన్మించే కబిని తూర్పు దిశగా ప్రవహించి బంగాళా ఖాతంలో కలుస్తుంది. సర్గూరు పట్టణం వద్ద ఈ కబినీ నదికి పెద్ద ఆనకట్ట ఉంది. ఇక్కడకు దగ్గరగానే వన్యప్రాణీ సంరక్షణ కేంద్రం కూడా ఉంది. బెంగళూరు నుంచి వారాంతాల్లో ఎక్కువ మంది ఇక్కడకు వస్తుంటారు.

సౌపర్ణికా నది

సౌపర్ణికా నది

P.C: You Tube

కర్నాటకలోని ప్రముఖ నదుల్లో సౌపర్ణికా నది కూడా ఒకటి. కుందాపురలో పుట్టి అరేబియా సముద్రంలో కలిసే ఈ సౌపర్ణిక నది పురాణ ప్రాధన్యత కలిగినది. ఈ నదిలో ఒక్కసారి స్నానం చేస్తే అనేక చర్మరోగాలు నయం అవుతాయని చెబుతారు. బెంగళూరు నుంచి 416 కిలోమీటర్ల దూరంలో ఈ నదీ జన్మస్థానం ఉంది.

గురుపుర నది

గురుపుర నది

P.C: You Tube

గురుపుర నది మరొక పేరు ఫల్గుణి. పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. మంగళూరుకు దగ్గరగా ఉన్న గురుపురలో ఈ నది జన్మించడం వల్ల ఈ నదికి గురుపుర నది అని పేరు. బెంగళూరు నుంచి 345 కిలోమీటర్ల దూరంలో ఈ నది ఉంది.

తుంగభద్రా నది

తుంగభద్రా నది

P.C: You Tube

తుంగభద్రానది దక్షిణ భారత దేశంలోని ప్రముఖ నదుల్లో ఒకటి. శివమొగ్గా జిల్లా కూడలియల్లి భద్రానదిలో ఈ నది కలుస్తుంది. అటు పై ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు వద్ద క`ష్ణానదిలో కలిసిపోతుంది. ఈ నది పొడవు 610 కిలోమీటర్లు. నదీ తీరం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హంపి ఈ నది ఒడ్డునే ఉంది. బెంగళూరు నుంచి 293 కిలోమీటర్ల దూరంలో ఈ నది జన్మస్థానం ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X