Search
  • Follow NativePlanet
Share
» »ఆంజనేయ స్వామిని వెలేసిన ఊరు !

ఆంజనేయ స్వామిని వెలేసిన ఊరు !

ఆ ఊరిలో ఎవరికీ ఆంజనేయుడని, హనుమంతుడని, మారుతి అని పేర్లు కూడా పెట్టరు కూడా. ఒకేవేళ పొరపాటున పలికితే ఇక అంతే సంగతులు ..! భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయుని ఆలయాలు దర్శనం ఇస్తాయి.

By Venkatakarunasri

ఆ ఊరిలో ఎవరికీ ఆంజనేయుడని, హనుమంతుడని, మారుతి అని పేర్లు కూడా పెట్టరు కూడా. ఒకేవేళ పొరపాటున పలికితే ఇక అంతే సంగతులు ..!

భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయుని ఆలయాలు దర్శనం ఇస్తాయి. సాధారణంగా దుష్టశక్తుల బారి నుండి కాపాడటానికి ... బలం చేకూర్చటానికి ఆంజనేయుడిని పూజిస్తాము కానీ ఇక్కడ ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో హనుమంతుడిని పూజించారు సరికదా ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు.

ఎక్కడ ఉంది?

ఎక్కడ ఉంది?

ఆ ఊరి పేరు ద్రోణగిరి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో కలదు. దేశ రాజధాని ఢిల్లీ నుండి 400 కిలోమీటర్ల దూరంలో, 6 గ్రామాల సమూహంతో ఏర్పడ్డదే ద్రోణగిరి.

చిత్ర కృప : Gautam Dhar

దునగిరి దేవి

దునగిరి దేవి

దీనికి గల ఇతర పేర్లు దునగిరి, దూణగిరి. ఈ గ్రామం సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తున కుమవొన్ పర్వత శ్రేణులలో కలదు. ద్రోణగిరి లో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠం కలదు. గుడిలో కొలువైన దేవతను 'దునగిరి దేవి' గా కొలుస్తారు.

చిత్ర కృప : Manfred Sommer

ద్రోణగిరి

ద్రోణగిరి

ద్రోణగిరి లో ఆంజనేయ స్వామి ని పూజించరు .. ద్వేషిస్తారు. ఏం ? అంత పాపం ఈ ఊరికి ఆంజనేయస్వామి ఏమి చేసాడనేగా మీ సందేశం అయితే ఇది చదవండి ..

చిత్ర కృప : Jay Tandale

పురాణాల్లో ద్రోణగిరి

పురాణాల్లో ద్రోణగిరి

పాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఈ ప్రదేశంలోని కొండ పై తపస్సు చేశాడు కనుకనే ద్రోణగిరి అన్న పేరొచ్చిందని స్థానికులు చెబుతారు. పాండవులు వనవాస సమయంలో కొద్దీ రోజుల పాటు ఇక్కడ గడిపినట్లు మహాభారతంలో పేర్కొన్నారు. దున గిరి దేవి ని మహామయ హరిప్రియ గా అభివర్ణిస్తారు. ఈ శక్తి పీఠానికి గల మరో పేరు 'ఉగ్ర పీఠ'.

చిత్ర కృప : Gautam

రామాయణ కాలం

రామాయణ కాలం

రామాయణ కాలం అంటే త్రేతాయుగం అని. రాముడు - రావణాసురుడు మధ్య యుద్ధం జరిగే సమయంలో లక్షణుడు స్పృహ తప్పి కింద పడిపోతాడు గుర్తుందా ? అప్పుడు ఆంజనేయస్వామి ఎక్కడో హిమాలయాల పర్వతాల వద్ద ఉన్న సంజీవని పర్వతం తీసుకొని వచ్చి లక్షణుడిని మూర్ఛ నుండి తప్పిస్తాడు అవునా ?

చిత్ర కృప : Gautam Dhar

సంజీవని పర్వతం

సంజీవని పర్వతం

ఆ సంజీవని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట. తాము ఎంతగానో పూజించే ఆ కొండను ఆంజనేయస్వామి తీసుకెళ్ళేసరికి ఇక్కడున్నవారికి కోపం కట్టలు తెగిందట. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి పూజలు చేయటం మానేశారు.

చిత్ర కృప : Manfred Sommer

దునగిరి లేదా ద్రోణ గిరి ఎలా చేరుకోవాలి ?

దునగిరి లేదా ద్రోణ గిరి ఎలా చేరుకోవాలి ?

బస్సు మార్గం

డెహ్రాడూన్ (412 KM), నైనిటాల్ (71 KM), అల్మోరా (100 KM) రాణిఖేత్ (50 KM), ద్వారాహత్ (14 KM), ఢిల్లీ (400 KM) తదితర ప్రాంతాల నుండి ల నుండి దునగిరి గ్రామానికి ప్రభుత్వ / ప్రవేట్ వాహనాలు కలవు.

రైలు మార్గం

రైలు మార్గం

కథోడ్గం రైల్వే స్టేషన్, అల్మోరాకు 90 కిలోమీటర్ల దూరంలో కలదు. జమ్మూ తావీ, శ్రీనగర్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుండి స్టేషన్ కు రైళ్లు వస్తుంటాయి. స్టేషన్ బయట క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని ప్రయాణించవచ్చు.

విమానాశ్రయం

విమానాశ్రయం

ఉధం సింగ్ నగర్ లోని పంటనగర్ ఎయిర్ పోర్ట్ దునగిరి కి సమీపాన, అల్మోరా కు 127 KM ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం ఢిల్లీ నుండి నేరుగా కనెక్ట్ చేయబడింది. న్యూ ఢిల్లీ నుండి కేవలం గంట ప్రయాణం లో పంటనగర్ ఎయిర్ పోర్ట్ చేరుకోవచ్చు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి దున గిరి చేరుకోవచ్చు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X