Search
  • Follow NativePlanet
Share
» »ఈ క్షుద్రశక్తులకు నిలయమైన ఆలయంలో రాత్రి పూట ఏమి జరుగుతుందో తెలుసా

ఈ క్షుద్రశక్తులకు నిలయమైన ఆలయంలో రాత్రి పూట ఏమి జరుగుతుందో తెలుసా

దుద్దెడ స్వయం భూ లింగేశ్వర స్వామి దేవాలయం గురించి కథనం.

భారత దేశంలో చాలా దేవాలయాల్లోని గర్భగుడిలో దేవతామూర్తులను రాజులు, లేదా పండితులు, లేదా సాధారణ ప్రజలు ప్రతిష్టిస్తారు. అటు పై ఇటువంటి దేవతా మూర్తులకు పూజలు జరుగుతాయి. అయితే కొన్ని దేవాలయాల్లో మాత్రం భగవంతుడు అర్చక రూపంలో వెలుస్తాడు. ఇటువంటి ఆలయాల్లోని దేవతామూర్తికి అనేక శక్తులు ఉంటాయని ప్రజలు తరతరాలుగా నమ్ముతుంటారు. అటువంటి ఓ క్షేత్ర వివరాలు మీ కోసం...

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా, కొండపాక మండలం, దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు వెలిశాడు. ఇక్కడి విగ్రహం పురాణ కాలం కంటే ముందు నుంచే ఉందని నమ్ముతారు.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
అనాదిగా ఇక్కడి దేవతామూర్తిని కొలుచేవారు. అయితే క్షేత్ర కథనం ప్రకారం ఈ మూర్తికి ఆలయ నిర్మాణం మాత్రం సుమారు క్రీస్తుశకం 9 నుంచి 12 శతాబ్దాల మధ్య కాలంలో జరిగిందని చెబుతారు.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ఆ కాలంలో ఈ దుద్దెడ గ్రామం సకల సంపదతో తులతూగుతూ ఉండేది. కళ్యాణి చాళుక్యుల హయాంలో ఈ గ్రామం సర్వతోముఖంగా అభివ`ద్ది చెందిందని నమ్ముతారు.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ఆ కాలంలోనే ఇక్కడ దేవాలయ నిర్మాణం జరిగింది. ఆకాలం నాటి సప్త మాతృకల విగ్రహాలను మనం ఇప్పటికీ ఈ దేవాలయంలో చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడి లభించిన శాసనంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
అటు పై కాకతీయుల కాలంలో ఆలయ ప్రాకారం, గోపుర పున:నిర్మాణం జరిగాయి. అందువల్లే ఇక్కడ కాయతీయ, చోళు వాస్తుశైలి మనకు కనిపిస్తుంది. శిల్పాలు చాలా రమణీయంగా ఉంటాయి.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ముఖ్యంగా ఆలయ ప్రవేశ ద్వారం రెండు మండపాలుగా ఉంటుంది. ఇక ఆలయ ప్రహరీ గోడ మొత్తం పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించారు. అంత పెద్ద బండరాళ్లను ఎలా వినియోగించారో తెలియడం లేదు.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించిన ఈ దేవాలయంలోని దేవతలను సందర్శించడంతో కష్టాలన్నీ తొలిగిపోతాయని చెబుతారు. అందుకే ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ఇక గర్భగుడి ముందు 16 ఏక శిలా స్తంభాలతో నిర్మించబడిన కళ్యాణ మంటపం ఉంది. ఈ గర్భగుడికి, కళ్యాణ మంటపానికి మధ్య అందమైన నందీశ్వరుడు ప్రతిష్టింపబడ్డాడు.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
మన దేశంలో దక్షిణాభిముఖంగా ఉన్న అమ్మవారి ఆలయాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అందులో ఈ దుద్దెడ స్వయంభూ లింగేశ్వరాలయం కూడా ఒకటి.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ఇక ఈ క్షేత్రంలోని అమ్మవారిని భవానీ పేరుతో పిలుస్తారు. చతుర్భుజాలతో ఏక శిలతో చెక్కబడిన సోమ సూత్రం పై అమ్మవారు కొంత భయంకరంగా కనిపిస్తారు.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ముఖ్యంగా అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉంటారు. దక్షిణ దిక్కు యమస్థానం. క్షుద్ర శక్తుల నిలయం. ఆ దిక్కును చూస్తున్న అమ్మవారు దుష్ట శక్తుల ప్రభావం నుంచి తమను కాపాడుతుందని స్థానికుల నమ్మకం.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
అంతే కాకుండా ఇక్కడ అమ్మవారిని పూజించడం వల్ల అతీత శక్తులు పొందుతారని కూడా చెబుతారు.అందువల్లే ఇక్కడ క్షుద్రపూజలు జరపడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నాగసాదువులు కనిపిస్తుంటారు.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ఈ ఆలయంలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉన్నాడు. ఆ ఆలయానికి ముందు మాతృకల విగ్రహాలు వున్నాయి. వందల సంవత్సరాల క్రితం నాటి ఈ విగ్రహాలు ఇప్పటికీ అలాగే ఉండటం విశేషం.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ప్రతి రోజూ తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య ఒక యోగి ఈ వీరభద్రస్వామి ఆలయం నుంచి సర్ప రూపంలో వచ్చి లింగరూపంలో ఉన్న స్వామిని సేవించి వెలుతూ ఉంటారు.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
యోగులు, బుుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చి స్వామిని సేవిస్తారనడానికి నిదర్శనంగా రాత్రి సమయంలో ఓంకారనాదాలు వినిపిస్తాయని పూజారులతో పాటు భక్తులు కూడా చెబుతారు.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
అలాగే రాత్రి సమయంలో స్త్రీ ఆలయంలో తిరుగుతున్నట్లు మువ్వల శబ్దం విన్నామని కొందరు చెబుతారు. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విశేష లింగం అక్షయ జలనిధీశం.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ఈ లింగం పానువట్టం నుంచి తియ్యడానికి వస్తుంది. లింగం కింద ఉన్న చిన్న గుంటలో నీరు ఎప్పుడూ ఉబికి వస్తుంది. ఆ ప్రాంతంలోని రైతులు ఈ నీటిని తమ పంట పొలాల పై చల్లితే చీడ పట్టకులండా ఉంటుందని నమ్ముతారు.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ఆలయ ఆవరణంలో ఉన్న సంతాన నాగేంద్రుడిని పూజిస్తే సంతానలేమితో బాధపడుతున్న వారికి వెంటనే సంతానం కలుగుతుందని నమ్ముతారు. నాగుల పంచమి, నాగుల చవితి రోజుల్లో భక్తుల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ఇక ఈ ఆలయానికి ముందు కోనేరు ఉంటుంది. ఇందులో మూడు స్వరంగ మార్గాలు ఉన్నాయని చెబుతారు. ఇందులో ఒక మార్గం ద్వారా గుడిలోకి వెళ్లవచ్చునని మరో మార్గం ద్వారా కాశీకి చేరుకోవచ్చని చెబుతారు.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ఇంక మార్గం ఎక్కడికి వెలుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. శ్రావణ మాసం, శరన్నవరాత్రులు, మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ కన్నుల పండువగా జరుగుతాయి. పుష్య బహుళ దశమి నుంచి ద్వాదశి వరకూ జాతర జరుగుతుంది.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
ఇందులో పుష్య బహుళ దశమి రోజున శకటోత్సవం జరుగుతుంది. ఎద్దుల బళ్లను రకరకాలుగా అలంకరించి మేళ తాళాలతో ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయిస్తారు. ఇది ఇక్కడ ఆనవాయితీ.

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు

P.C: You Tube
హైదరాబాద్ సిద్ధిపేట మార్గంలో హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో దుద్దెడ ఉంటుంది. సిద్ధి పేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ప్రభుత్వ ప్రైవేటు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X