Search
  • Follow NativePlanet
Share
» »దుర్శేత్ - అందమైన ట్రెక్కింగ్ విహారం !!

దుర్శేత్ - అందమైన ట్రెక్కింగ్ విహారం !!

అద్భుత ప్రకృతి సౌందర్యంకల దుర్శేత్ ట్రెక్కర్లకు, వైల్డ్ లైఫ్ సఫారీలకు ఎంతో ప్రియమైన ప్రదేశం. ఇక్కడ గల పాలి గణపతి దేవాలయం మరియు మహాడ్ గణపతి దేవాలయాలు రెండూ తప్పక చూడదగిన ప్రదేశాలు.

By Mohammad

దుర్శేత్ (దుర్షీత్) అంబానది ఒడ్డునకల ఒక ప్రశాంత గ్రామం. ఈ ప్రదేశం పాలి మరియు మహాడ్ లలోని అష్టవినాయక దేవాలయాల మధ్య కలదు. నగర జీవన రణగొణ ధ్వనులతో విసుగెత్తిన వారికి ఈ ప్రదేశం చక్కటి వారాంతపు విశ్రాంతికి సరైన ఎంపికగా ఉంటుంది. ముంబై మరియు పూనే నగరాలకు ఈ ప్రదేశం సమీపంగా ఉండటంతో ఎల్లపుడూ పర్యాటకులను అధిక సంఖ్యలో పొందుతూంటుంది.

జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకొనే యాత్ర : అష్టవినాయక !!జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకొనే యాత్ర : అష్టవినాయక !!

దుర్శేత్ - ఒక పచ్చని గ్రామంగంభీరంగా నిలబడే సహ్యాద్రి కొండల శ్రేణులలో కల దుర్షీత్ ప్రదేశం పచ్చని చెట్లతో అనేక పక్షులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వివిధ రకాల పక్షులు ఇక్కడి చెట్లపై గూళ్ళు కట్టి నివాసం ఉంటాయి. ఈ పక్షుల కూతలు వినసొంపుగా ఉంటాయి. ఇక్కడి గాలి ఏ మాత్రం కలుషితం లేక ఎంతో తాజాగా ఉంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనమే. చల్లటి తాజా గాలులు, కంటికింపైన పచ్చటి ప్రదేశాలు పర్యాటకులకు మరువలేని అనుభూతులు కలిగిస్తాయి. ఈ ప్రదేశ అందాలను పూర్తిగా ఆస్వాదించాలంటే వర్షాకాలం ఎంతో అనుకూలమైనది.

జలపాతం ఎక్కుతున్న యాత్రికుడు

జలపాతం ఎక్కుతున్న సాహసికుడు

చిత్రకృప : Aditya Patawari

దుర్శేత్ లో చూడదగిన ప్రదేశాలు ఏవి?

అద్భుత ప్రకృతి సౌందర్యంకల దుర్శేత్ ట్రెక్కర్లకు, వైల్డ్ లైఫ్ సఫారీలకు ఎంతో ప్రియమైన ప్రదేశం. ఇక్కడ గల పాలి గణపతి దేవాలయం మరియు మహాడ్ గణపతి దేవాలయాలు రెండూ తప్పక చూడదగిన మతపర ప్రదేశాలు. మీ భక్తి విశ్వాసాలను మరింత అధికం చేస్తాయి.

పన్హాలా హిల్ స్టేషన్ - అద్భుతం, ప్రశాంతం !!పన్హాలా హిల్ స్టేషన్ - అద్భుతం, ప్రశాంతం !!

జంగిల్ సఫారి

దుర్శేత్ అనేక వృక్షాలకు, జంతువులకు నిలయం. ఈ ప్రాంతం సహ్యాద్రి కొండల శ్రేణిలో కలదు. ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం వలే ఉంటుంది. పర్యాటకులకు ఇక్కడి సహజ అందాలు అచ్చెరువు కలిగిస్తాయి. మంత్ర ముగ్ధులైపోతారు. వన్య జంతువులు సహజంగా ఈ ప్రదేశంలో తిరుగాడుతూంటాయి. చెట్ల ఆకుల తాజా వాసనలు, గల గల శబ్దాలు మిమ్మల్ని ఆనంద పరుస్తాయి. మరచిపోలేని అనుభూతులు కలిగిస్తాయి.

బల్లాలేశ్వర్ అష్టవినాయక

బల్లాలేశ్వర్ అష్టవినాయక

చిత్రకృప : Borayin Maitreya Larios

బల్లాలేశ్వర్ అష్టవినాయక

బల్లాలేశ్వర్ దేవాలయం ఎనిమిది పవిత్ర అష్టవినాయక దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయాల సముదాయంలో రెండు సరస్సులుంటాయి. ఈ దేవాలయం తూర్పు దిశగా ఉండి గ్రానైట్ రాతితో నిర్మించబడింది. గణపతి విగ్రహం ఒక సింహాసనంపై కూర్చొని తూర్పు దిశ చూస్తూంటుంది. విగ్రహం కళ్ళు మరియు నాభి ప్రదేశం వజ్రాలతో పొదగబడి ఉంటుంది. రిధ్ధి మరియు బుద్ధి అనే గణపతి భార్యలు (వెండితో చేయబడిన విగ్రహాలు) ఇరువురూ ఆయనకు వెనుక భాగంలో కనపడుతూంటారు.

వరద్ వినాయక దేవాలయం

వరద్ వినాయక దేవాలయం

చిత్రకృప : PrasadhBaapaat

వరద్ వినాయక దేవాలయం

ఇక్కడకల వరద్ వినాయక దేవాలయం అతి పెద్ద ఆకర్షణ. కాని ఒకసారి మీరు చూస్తే చాలు అందమైన 25 అడుగుల ఎత్తుకల గోపురం ఆశ్చర్యం కలిగిస్తుంది. వరద వినాయక అంటే గణపతి మరో రూపం. ఎడమవైపు విగ్రహం మార్బుల్ తో చేయబడి ఉంటుంది. మరొకటి కుంకుమరంగుతో అద్దబడి ఉంటుంది. దేవాలయ ఉత్తర భాగం లో ఉన్న నోటి ద్వారా పవిత్ర నీరు బయటకు వస్తూంటుంది. ఇక్కడే మరొక ఆకర్షణ నంద ద్వీపం. ఈ దీపం సుమారు క్రీ.శ.1892 నుండి వెలుగుతూనే ఉంది.

దుర్శేత్ వాతావరణం

దుర్శేత్ వాతావరణం

చిత్రకృప : Aditya Patawari

ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం

దుర్శేత్ కు రోడ్డు ప్రయాణం చేయాలనుకునేవారికి మహారాష్ట్ర లోని వివిధ ప్రదేశాలనుండి ఇతర రాష్ట్రాలనుండి వివిధ మార్గాలలో బస్ లు నడుస్తాయి. ముంబై నుండి బస్ లో చేరాలనుకుంటే ఛార్జి సుమారుగా రూ. 250 వరకు ఉంటుంది.

రైలు ప్రయాణం

దుర్శేత్ పట్టణం కొంకణ్ రైల్వే లైనుపై కలదు. ముంబై నగర విక్టోరియా టర్మినస్ స్టేషన్ సమీప రైలు స్టేషన్. విక్టోరియా టర్మినస్ నుండి భారతదేశంలోని అన్ని నగరాలకు రైళ్ళు కలవు.

విమాన ప్రయాణం

దుర్శేత్ కు వాయు మార్గంలో చేరాలంటే ముంబై లోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 105 కి.మీ.ల దూరంలో ఉంటుంది. విమానాశ్రయంనుండి దుర్షీత్ కు టాక్సీలలో చేరవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X