Search
  • Follow NativePlanet
Share
» »'భూ'మాత సేవ .. చెప్పతరమా ??

'భూ'మాత సేవ .. చెప్పతరమా ??

By Mohammad

మన మీదకు ప్రకృతి విపత్తులు ఎలా ఎగిసిపడతాయో ఊహించడం చాలా .. చాలా కష్టం. అవి ఏ రూపంలో నైనా మనమీదకు రాకెట్ లా దూసుకురావచ్చు. తుఫాన్, సునామీ, భూకంపాలు, ప్రస్తుతమైతే తీవ్రమైన ఉష్ణోగ్రత .... ఇలా ఏదేని రూపంలో ఆ ఉపద్రవం భూమి పై ఉన్న జీవరాశి మీద పెను ముప్పు ను కలిగించవచ్చు. దీనికంతటికీ ప్రధాన కారణం వాతావరణ మార్పులే అని కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంటారు పర్యావరణవేత్తలు.

'భూ'మాత సేవ .. చెప్పతరమా ??

పుడమితల్లి కి పచ్చదనం

చిత్ర కృప : Wolfgang Staudt

నేడు ధరిత్రీ దినోత్సవం (ఏప్రియల్ 22). ఇది మొదలై నేటితో 46 ఏళ్లు నిండాయి. 1970 వ సంవత్సరంలో కొత్తగా మొదలైన ఈ వేడుక ... నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు (భారతదేశం తో సహా) జరుపుకుంటున్నారు. ఆరోజున మొక్కలను నాటడం, పర్యావరణం మీద స్పీచ్ లు ఇవ్వడం ప్రతి ఏటా జరిగే తంతే (పర్యావరణ వేత్తల మినహా).

నేడు భూతాపం పెరిగిపోవటానికి ప్రధాన కారణం మానవుడే. పర్యావరణ వేత్త లు గొంతుచించుకొని అవి చేయండి బాబూ ... ఇవి చేయండి బాబూ ...అవోద్దు బాబూ .. ఇవొద్దు బాబూ ... అని ఎంత అరుస్తున్నా ఎం లాభం ? అందుకే దానికి తగ్గ ప్రతిఫలం నేడు అనుభవిస్తున్నాం.

'భూ'మాత సేవ .. చెప్పతరమా ??

మానకూ వేసవి తప్పేలా లేదూ ... !

చిత్ర కృప : Prasanna Gururajan

ఏం చేయాలి ?

అందరూ ఒక్కొక్కరూ కనీసం ఒక్కో మొక్కనైనా / చెట్టునైనా నాటండి. ఎర్త్ డే రోజునే కాదు సెలవు దినాల్లో ఏ రోజైనా కావచ్చు. చెట్లు జీవకోటికి ఆధారాలు (ఆక్షీజన్ విడుదల చేస్తాయి కాబట్టి ..!). అవి లేకుంటే ప్రాణకోటి మనుగడ చాలా కష్టం. మనిషి ఆహారం లేకుండా, బట్ట లేకుండా, ఇల్లు లేకుండా బతకొచ్చేమో గానీ ... గాలి లేకుండా బతకలేడు.

'భూ'మాత సేవ .. చెప్పతరమా ??

చెట్టుకింద సేదతీరుతూ .. !

చిత్ర కృప : Picss Gallery

ఉపయోగాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ...

01) చెట్లు జీవకోటికి నీడనిస్తాయి, ఆహారాన్ని ఇస్తాయి.

02) ఎండా, వాన, శీతోష్ణస్థితి, గాలుల ప్రభావాలను అదుపులో ఉంచుతాయి.

03) చలికాలంలో గాలులను అడ్డుకొని వెచ్చదనాన్ని, వేసవిలో సౌరశక్తి ని ఆకులు గ్రహించి చల్లదనాన్ని అందిస్తాయి.

04) వేడిని తగ్గించి, కార్బన్ డై యాక్సైడ్ స్థాయిని అదుపులో ఉంచుతూ, ప్రపంచాన్ని బెంబే లే త్తి స్తున్న గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నుండి కాపాడతాయి

కేవలం బతికున్నప్పుడే కాదు చెట్టు చచ్చినా మనకు ఉపయోగాన్నే ఇస్తుంది. ఉదాహరణకు ఫర్నీచర్ రూపంలో, వంట చెరకు రూపంలో. ఇంతే కదా అనుకొనేరు మందుల తయారీలో, పరిశ్రమల్లో కూడా చెట్లను విరివిగా ఉపయోగిస్తుంటారు. చెట్ల కలప గుజ్జుతో కాగితం తయారవటం మనకు తెలిసిందే కదా ..! క్వినైన్, ఆస్పిరిన్ వంటి ఔషధాలను చెట్ల బెరడు నుండి తయారుచేస్తారు. బెరడు లోపల లెటెక్స్ ఉంటుంది. దాన్ని రబ్బరు తయారీ లో ఉపయోగిస్తారు.

'భూ'మాత సేవ .. చెప్పతరమా ??

అందమైన ప్రకృతిని ఆస్వాదించాలంటే ..!

చిత్ర కృప : Rob

చివరగా ..

మన మనుగడకు ఆధారమైన భూమాతను కాపాడుకోవడం మన తక్షణ విధి. దీనినొక కర్తవ్యంగా భావించాలి. తెలిసో, తెలీకో మానవుడు భూమాతకి కీడు తలపెడుతుంటాడు. ఎర్త్ డే సందర్భంగా ఇప్పటి నుంచైనా భూమికి చేటు (కీడు) కలిగించే అటువంటి విధ్వంసాల నుండి కాపాడుతామని ప్రతిజ్ఞ చేయాలి. అంతే కాకుండా పర్యావరణం మీద కనీసం బేసిక్ అవగాహననైనా పెంపొందించుకొని, చైతన్యంతో ముందుకు సాగాలి.

'భూ'మాత సేవ .. చెప్పతరమా ??

పచ్చదనంతో నిండిన జలపాతం

చిత్ర కృప : Vinoth Chandar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X