Search
  • Follow NativePlanet
Share
» »పర్యావరణ పరి రక్షణ ...రిసార్ట్ లు !

పర్యావరణ పరి రక్షణ ...రిసార్ట్ లు !

ఇటీవలి కాలంలో పర్యావరణ పరి రక్షణకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందుకు గాను అనేక రిసార్ట్ లు కూడా కృషి చేస్తున్నాయి. మన పర్యాట కంలో పర్యావరణం పట్ల కూడా మనం శ్రద్ధ పెట్టాలి. అందుకు గాను ప్రతి వారూ విలువలతో కూడిన జీవన శైలి ఒక భాగంగా ఆచరించాలి. టూరిజంలో పర్యావరణం స్నేహం అనేది కేరళ రాష్ట్రంలో అధికంగా గమనించవచ్చు. కేరళ లోనే కాక ఇతర రాష్ట్రాలలో సైతం అనేక హోటళ్ళు పర్యావరణ స్నేహ పూరిత చర్యలు చేపడుతున్నాయి. విలాసవంతమైన గుడార వసతులు, హోం స్టే లు, పచ్చటి గ్రామాల అభివృద్ధి, ప్రకృతి మిలిత రిసార్ట్ లు మొదలైనవి నేడు పెరిగి పోతున్నాయి. ప్రకృతి సహజ రిసార్ట్ లు కేరళ రాష్ట్రంలో పర్యాటకులకు ఎన్నో వసతులు కల్పించి ఆకర్షిస్తున్నాయి. ఈ రిసార్ట్ లు అత్యతంత సుందరమైన ప్రదేశాలలో నిర్మిస్తున్నారు. ఇతర రిసార్ట్ లలో లేని సౌకర్యాలు వీటిలో ఎన్నో కల్పిస్తున్నారు. ఈ సౌకర్యాలు, అడ్వెంచర్ గానే కాక, పర్యాటకులకు విశ్రాంతి నిచ్చేవిగా కూడా వుంటాయి. కేరళలోని కొన్ని పర్యావరణ పూర్తిత రిసార్ట్ లు పరిశీలిస్తే....

కోకోనట్ లగాన్, కుమరకోమ్

కేరళ లోని కుమరకోమ్ లో కల ఈ రిసార్ట్ ప్రత్యేకత ఏమంటే ఈ రిసార్ట్ కు వెళ్ళాలంటే, బోటు లో మాత్రమే వెళ్ళాలి. ఏ రకమైన ఇంజిన్ లు ఉండవు. ఈ రిసార్ట్ యాజమాన్యం పర్యావరణ పరి రక్షణలో మొదటి భాగంగా ఈ చర్య చేపట్టింది. రిసార్ట్ లో ఇంకనూ అనేక వినూత్న అంశాలు కలవు. సన్ సెట్ విహారాలు, బ్యాక్ వాటర్ విహారాలు, ఆయుర్వేదిక్ స్పా వంటివి కూడా కలవు. వ్యర్ధ పదార్ధాలను ఇంధనంగా మార్చటం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఏ రకమైన కెమికల్స్ ఉండక పోవటం ఈ రిసార్ట్ ను పర్యావరణ స్నేహిత రిసార్ట్ గా చేసింది.

వైల్డ్ ఎలిఫెంట్ రిసార్ట్ , మున్నార్
మున్నార్ లోని వైల్డ్ ఎలిఫెంట్ ఎకో ఫ్రెండ్ లీ రిసార్ట్ సుందరమైన పరిసరాలలో అందమైన వాటర్ ఫాల్స్, మౌంటెన్ లు, విశాలమైన టీ గార్డెన్ ల మధ్య కలదు. అద్భుతమైన ప్రదేశంలో కల ఈ రిసార్ట్ లో కాటేజ్ లు, రూమ్ లు అన్నీ సహజ ప్రదేశాలలో, చెట్ల పైన, ఆకుల మధ్య, వెదురు బద్దలతో చేయబడి వుంటాయి. వైల్డ్ ఎలిఫెంట్ రిసార్ట్ మీకు వినూత్న జీపులలో సఫారి నిర్వహిస్తుంది. ఈ సఫారిలో మీరు అప్పటికి కనీ వినీ ఎరుగని ఆకర్షనలైన మున్నార్ చుట్టుపక్కల కల రాతి ప్రాంతాలు, గుహలు, నదులు, పెద్ద వాటర్ ఫాల్స్ వంటివి చూపుతారు.

బాణాసుర హిల్ రిసార్ట్, వయనాడ్
అందమైన ఈ హిల్ రిసార్ట్ ఇండియా లోని బెస్ట్ ఎకో ఫ్రెండ్ లీ రిసార్ట్ లలో ఒకటిగా లెక్కించబడింది. ఇది వయనాడ్ కొండ ప్రాంతాలలో కలదు. ఈ రిసార్ట్ విశ్రాంతి కంటే కూడా తమ పర్యాటక అనుభవాలను పెంపొందించుకునేందుకు ఆసక్తి కల పర్యాటకులకు ఆదర్శవంతమైన పర్యటనను అందిస్తుంది. కావలసినంత లక్సరీ మరియు సౌకర్యాలు మీకు అందుబాటులో వుంటాయి. ఈ నేచర్ ఫ్రెండ్ లీ రిసార్ట్ లో ప్లాస్టిక్ బాగుల వాడకాన్ని పూర్తిగా నిషేదించారు.

పర్యావరణ పరి రక్షణ ...రిసార్ట్ లు !

ఫ్రాగ్రంట్ నేచర్ కొల్లం
ఫ్రాగ్రంట్ నేచర్ ఒక నాలుగు నక్షత్రాల లక్సరీ రిసార్ట్. ప్రకృతి ఒడిలో సేద దీరెందుకు ఒక అద్భుత రిసార్ట్. ప్రకృతి ప్రియులకు, విశ్రాంతి కోరే వారికి ఫ్రాగ్రంట్ నేచర్ ఒక స్వర్గంలా వుంటుంది. ఎన్నో సుందర దృశ్యాలు ఇక్కడ కలవు. ఈ రిసార్ట్ పూర్తిగా ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా నిర్మించబడింది. ఎప్పటికపుడు పరిసరాలను ప్రకృతితో సమ్మేళనం చేసుందుకు అవసరమైన చర్యలు యాజమాన్యం చేపుడుతోంది.

నేచర్ జోన్ రిసార్ట్
మున్నార్ లోని నేచర్ జోన్ రిసార్ట్ ప్రకృతి మరియు వన జీవుల ఖచ్చితమైన సమ్మేళనం. మున్నార్ లోని ప్రసిద్ధ ఎకో ఫ్రెండ్ లీ వసతులలో ఇది ఒకటి. కన్నన్ దేవన్ ప్రాంతంలో కల ఈ సుందరమైన రిసార్ట్ ప్రకృతి ఒడిలో విశ్రాంతి పొందాలంటే, ఆదర్శవంతమైనది. టూరిస్ట్ లకు ఇక్కడ ట్రెక్కింగ్ మరియు నేచర్ వాక్ లు కూడా వీరు ఏర్పాటు చేస్తారు. చెట్ల క్రింద ఓపెన్ ఎయిర్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. రీ సైకిల్ వేస్ట్ ఉపయోగం, ప్లాస్టిక్ నిషేధం వంటివి ఇక్కడ ప్రత్యేకతలు. ఈ యాజమాన్యం చేపట్టే ఎకో ఫ్రిండ్ లీ చర్యలు ఈ రిసార్ట్ ను కేరళలోని ఒక ప్రసిద్ధ రిసార్ట్ గా చేసాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X