Search
  • Follow NativePlanet
Share
» »ఫ్లయింగ్ రెస్టారెంట్‌లో రుచులు ఆస్వాదించాల‌ని ఎవ‌రికుండ‌దు చెప్పండి!

ఫ్లయింగ్ రెస్టారెంట్‌లో రుచులు ఆస్వాదించాల‌ని ఎవ‌రికుండ‌దు చెప్పండి!

మ‌న‌దేశంలోని కొన్ని ఆహ్లాదకరమైన ప్రదేశాలను సందర్శించడానికి, అక్క‌డ దొరికే స‌రికొత్త రుచుల‌ను ఆస్వాదించ‌డానికి ప్ర‌కృతి ప్రేమికులు అస్స‌లు వెనక్కి తగ్గరు.

ఇప్పుడు ఆహారం అందించేందుకు రోబోట్‌లు కొన్ని రెస్టారెంట్ల‌లో అందుబాటులోకి వ‌చ్చాయి.

ఫ్లయింగ్ రెస్టారెంట్‌లో రుచులు ఆస్వాదించాల‌ని ఎవ‌రికుండ‌దు చెప్పండి!

ఫ్లయింగ్ రెస్టారెంట్‌లో రుచులు ఆస్వాదించాల‌ని ఎవ‌రికుండ‌దు చెప్పండి!

అలా అవి ఆహారాన్ని వడ్డిస్తుంటే, ప్రజలు తినడానికి గుంపులుగా అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే, ఎక్క‌డ ప్ర‌త్యేక‌త క‌నిపించినా మ‌న‌వాళ్లు అస్స‌లు మిస్వ‌వ్వ‌రు. అందుక‌నే ఎప్ప‌టిక‌ప్పుడు ఇలాంటివారిని ఆక‌ర్షించేందుకు రెస్టారెంట్ వాళ్లు స‌రికొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌స్తుంటారు. ఇప్పుడు గాలిలో తేలియాడుతూ రుచికరమైన ఆహారాన్ని రుచి చూడాలనుకుంటే, మీరు ఈ వ్యాసాన్ని తప్పక చదవాలి. ఎందుకంటే ఈ వ్యాసంలో మీకు ఎగిరే హోటళ్ళ గురించి చెప్పబోతున్నాం.

మనాలిలో ఒక ఫ్లయింగ్ రెస్టారెంట్

మనాలిలో ఒక ఫ్లయింగ్ రెస్టారెంట్

ఇటీవల మనాలిలో ఒక ఫ్లయింగ్ రెస్టారెంట్ ప్రారంభించబడింది. పర్యాటకులను ఆకర్షించడానికి అక్క‌డి పర్యాటక శాఖ దీనిని ప్రారంభించింది. ఇక్కడ లంచ్, డిన్నర్ చేసేందుకు స‌మ‌యాన్ని బ‌ట్టీ ఒక్కో ర‌క‌మైన ప్యాకేజీలు ఉన్నాయి. దీనిలో ప్రారంభం ప్యాకేజీ ధ‌ర‌ సుమారు రూ .3999 నుండి ప్రారంభమవుతుంది. సుమారు 160 అడుగుల ఎత్తులో 360 డిగ్రీలు తిరుగుతూ రుచికరమైన ఆహారాన్ని రుచి చూడవచ్చు. చుట్టూ ఉన్న ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తూ.. వేడి వేడి రుచుల‌ను ఆర‌గిస్తూ ఉంటే ఆ అనుభ‌వాన్ని మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్ట‌మే. స్వ‌చ్ఛ‌మైనగాలి పీలుస్తూ కుటుంబ‌స‌మేతంగా ఇక్క‌డ ఎంజాయ్ చేయ‌డానికి సంద‌ర్శ‌కులు బాగా ఆస‌క్తిక‌న‌ప‌రుస్తున్నార‌ట‌. అయితే, ఎత్తును చూసి భ‌య‌ప‌డేవారు మాత్రం ఈ రెస్టారెంట్ జోలికి వెళ్ల‌క‌పోవ‌డమే బెట‌ర్‌. ఇక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కుల ర‌క్ష‌ణ విష‌యంలో ప్ర‌త్యేక‌మైన ఏర్పాటు చేశార‌ట ప‌ర్యాట‌క శాఖ అధికారులు. మ‌రెందుకు ఆల‌స్యం.. మీరు రాబోయే రోజుల్లో మనాలిని సందర్శించాలని యోచిస్తున్నట్లయితే, తప్ప‌కుండా ఫ్లయింగ్ రెస్టారెంట్‌లో రుచుల‌ను ఆస్వాదించ‌డం మ‌ర్చిపోవ‌ద్దు.

బిస్వా బంగ్లా రెస్టారెంట్, కోల్‌క‌తా

బిస్వా బంగ్లా రెస్టారెంట్, కోల్‌క‌తా

మీరు కోల్‌క‌తాను సందర్శించబోతున్నట్లయితే, ఇక్కడ బిశ్వ బంగ్లా రెస్టారెంట్‌కు వెళ్ల‌డం మ‌ర్చిపోవ‌ద్దు. ఎందుకంటే, గాలిలో వేలాడుతున్న రుచికరమైన ఆహారాన్ని రుచి చూసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తొంది ఈ రెస్టారెంట్‌. భూమి నుండి సుమారు 55 మీటర్ల ఎత్తులో ఈ రెస్టారెంట్ వేలాడుతూ మీకు స్వాగతం ప‌లుకుతుంది. ఈ రెస్టారెంట్‌లో సుమారు 72 మంది కలిసి కూర్చుని 360 డిగ్రీలు తిరుగుతూ అద్భుతమైన వీక్షణలను చూడవచ్చని చెబుతున్నారు. ఇక్కడ బఫెట్ సిస్టమ్ సదుపాయం కూడా ఉంద‌ని నిర్వాహ‌కులు గ‌ర్వంగా చెప్పుకొస్తున్నారు. అయితే, ఇక్క‌డికి వెళ్లాల‌నుకునేవారు రెస్టారెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగానే సీట్ రిజ‌ర్వ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫ్లయింగ్ రెస్టారెంట్, బెంగళూరు

ఫ్లయింగ్ రెస్టారెంట్, బెంగళూరు

బెంగళూరులోని ఫ్లయింగ్ రెస్టారెంట్ దేశంలో మొట్టమొదటి ఫ్లయింగ్ రెస్టారెంట్ గా పరిగణించబడుతుంది. ఈ రెస్టారెంట్ రుచికరమైన ఆహారాన్ని అందించడమే కాకుండా, సరస్సు, ఉద్యానవనం యొక్క అద్భుతమైన వీక్షణను కూడా ఆస్వాదించ‌వ‌చ్చు. ఇది భూమి నుండి సుమారు 120 అడుగుల ఎత్తులో ఉందంటే కాస్త ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది. ఈ ఫ్లయింగ్ రెస్టారెంట్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. వారాంతాల్లో ఇక్క‌డ ర‌ద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుటుంబంతో క‌లిసి వెళ్లాల‌నుకునేవారు ఇతర రోజుల్లో ప్లాన్ చేసుకుంటే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. మీరు బెంగళూరును సందర్శించాలనుకుంటే మాత్రం ఈ ఫ్ల‌యింగ్ రెస్టారెంట్‌లో అడుగుపెట్ట‌డం మ‌ర్చిపోవ‌ద్దు.

Read more about: manali kolkata
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X