Search
  • Follow NativePlanet
Share
» »"ఇక్కేరి" - అఘోరేశ్వర దేవాలయం చూడటానికి రెండు కళ్లు సరిపోవు

"ఇక్కేరి" - అఘోరేశ్వర దేవాలయం చూడటానికి రెండు కళ్లు సరిపోవు

"ఇక్కేరి" - అఘోరేశ్వర దేవాలయం చూడటానికి రెండు కళ్లు సరిపోవు.కన్నడ భాషలో ఇక్కేరి అంటే రెండు వీధులు అని అర్థం. షిమోగా జిల్లా సాగర అనే పట్టణం వద్ద ఇక్కేరి ఒక చిన్న ఊరు. షిమోగా వచ్చే పర్యాటకులు ఈ పట్టణాన్

కన్నడ భాషలో ఇక్కేరి అంటే రెండు వీధులు అని అర్థం. షిమోగా జిల్లా సాగర అనే పట్టణం వద్ద ఇక్కేరి ఒక చిన్న ఊరు. షిమోగా వచ్చే పర్యాటకులు ఈ పట్టణాన్ని తప్పక చూడాలి. ఇక్కేరి క్రీ.శ.1560 నుండి క్రీ.శ1640 వరకు కెలాడి పాలకులకు రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతంలో గ్రానైట్ చే నిర్మించబడిన అఘోరేశ్వర దేవాలయం ప్రసిద్ధి. ఈ దేవాలయ శిల్ప నైపుణ్యతలో చాళుక్యుల, ద్రవిడుల, హొయసలుల, దక్కన్ సుల్తానుల మరియు విజయనగర పాలకుల శిల్ప కళా నైపుణ్యాలు కనపడతాయి.

ఇక్కేరి అఘోరేశ్వర దేవాలయం గురించి

ఇక్కేరి అఘోరేశ్వర దేవాలయం గురించి

అఘోరేశ్వర దేవాలయ శిల్ప కళ ఈ దేవాలయ రాతి గోడలు వివిధ రకాల బొమ్మలు కలిగి ఉంటాయి. గుడులు, ఏనుగులు, పురాతన కన్నడ లిపి వంటివి వీటిలో కొన్ని.
pc : Dineshkannambadi

దేవాలయ ద్వారాలు

దేవాలయ ద్వారాలు


దేవాలయానికి పడమటి, తూర్పు మరియు ఉత్తర భాగాలలో చక్కటి మార్గాలుంటాయి. ఉత్తర ద్వారం వద్ద రెండు ఏనుగులుంటాయి. ఈ దేవాలయాన్ని దర్శించే పర్యాటకులు భైరవ, మహిషాసురమర్దిని, సుబ్రమణ్య మరియు గణేష బొమ్మలను కూడా చూడవచ్చు. pc :Dineshkannambadi

భారత దేశ పురావస్తు శాఖ

భారత దేశ పురావస్తు శాఖ

ప్రస్తుతం ఈ అఘోరేశ్వర దేవాలయ నిర్వహాణా భాధ్యత భారత దేశ పురావస్తు శాఖ వారిపై ఉంది. ఇక్కేరి సాగర తాలూకాకి దక్షిణాన సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కన్నడ పదం ఇక్కేరి అర్థం "రెండు" వీధులు. pc :Shashidhara halady

దేవాలయం యొక్క నిర్మాణం

దేవాలయం యొక్క నిర్మాణం

దేవాలయం యొక్క నిర్మాణం పచ్చని ప్రదేశం మధ్యలో కొత్త రకమైన రూపురేఖలతో కనపడుతుంది. దేవాలయం లోపల ఆశ్చర్యం కలిగించే శిల్ప శైలి కనపడుతుంది. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పవచ్చును. కేవలం పాదాలు మాత్రమే మిగిలి వున్న శిల్పం గుడికి దూరంగా అదే ప్రహరి మద్యలో ఒక మండపం మీద వున్నది దాని చుట్టు మరి కొన్ని ద్వంసమైన కళారూపాలు వున్నాయి. pc : B B Susheel Kumar

కేలడీ నాయకులు

కేలడీ నాయకులు

కేలడీ నాయకులుగా పిలువబడుతున్న చౌడప్ప నాయక, సదాశివ నాయక, చిక్కశంకర నాయక ( చిన్న శంకర ), దొడ్డ శంకర నాయక ( పెద్ద శంకర ), శివప్ప నాయక, అక్కవ, కెలడి చెన్నమ్మ అనే ఏడుగురు రాజులు. pc :Dineshkannambadi

విజయనగర రాజులు

విజయనగర రాజులు

కెలడీ రాజ్యంలొ బంగారు విరివిగా దొరుకుతుంది. విజయనగర రాజులకు సామంతులుగా కెలడీని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించేవారు. వీరి పాలన దాదాపుగా 250 సంవత్సరాల పైన సాగింది. pc :Suvarnini Konale

బంగారు నాణేలు

బంగారు నాణేలు

బంగారు నాణేలు వీరి పాలనలో బంగారు నాణేలు అర్థ చంద్రాకారంలో మరియు పూర్తి చంద్రాకారంలో చలామణిలో వుండేవట. pc :Dineshkannambadi

రాజధాని

రాజధాని

రాజధాని వీరి హయాంలోనే 15 వ శతాబ్దంలో ఈ ఇక్కేరిని రాజధానిగా చేసుకొన్నాక ఈ అఘోరేశ్వర దేవాలయం నిర్మించారు. pc :Dineshkannambadi

శైలి

శైలి

ఇది పూర్తిగా నాలుగు రకాల శైలితో నిర్మించారు. ద్రవిడ శైలి, హోయసల శైలి, చాళుక్య శైలితో పాటు గుడి పైన వుండే గోడలు "ఇస్లామిక్" శైలితో వుంటాయి. అదే ఇక్కడి ప్రాముఖ్యత. pc :Dineshkannambadi

ముఖ ద్వారం

ముఖ ద్వారం

మరొక విషయం భారతదేశంలో దేవాలయాలన్నీనూ తూర్పు దిక్కుకు ముఖ ద్వారం వుండేలా నిర్మిస్తారు. కాని ఈ ఇక్కేరి దేవాలయం మాత్రం ఉత్తర దిక్కకు ముఖ ద్వారం వుంటుంది. pc :Dineshkannambadi

అఘోరేశ్వర దేవాలయ శిల్ప కళా

అఘోరేశ్వర దేవాలయ శిల్ప కళా

అఘోరేశ్వర దేవాలయ శిల్ప కళా అఘోరేశ్వరుడి విగ్రహం 32 చేతులలొ 32 ఆయుధాలు ధరించి వుంటుంది. pc :B B Susheel Kumar

ఏడు పీఠాల నిర్మాణం

ఏడు పీఠాల నిర్మాణం

ఇక్కడ ఈశ్వర పార్వతీల విగ్రహాలతో వుండే పీఠం పాద, జగతి,పట్టి, పద్మ,కళా, పట్టి,వేదకి అనే ఏడు పీఠాలతో నిర్మించారు. pc :B B Susheel Kumar

దేవతా మూర్తుల శిల్పాలు

దేవతా మూర్తుల శిల్పాలు

ఏడవ పీఠం మీద 32 మందిని స్త్రీ దేవతా మూర్తుల శిల్పాలను మొలిచారట. వాటిని "శక్తి పీఠం" గా పిలువబడుతున్నారు. pc : Dineshkannambadi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X