Search
  • Follow NativePlanet
Share
» »శిఖ‌రాగ్రాన దాగిన దేవ్‌ఘ‌డ్ కోట ప్ర‌యాణ‌పు అనుభ‌వాలు!

శిఖ‌రాగ్రాన దాగిన దేవ్‌ఘ‌డ్ కోట ప్ర‌యాణ‌పు అనుభ‌వాలు!

శిఖ‌రాగ్రాన దాగిన దేవ్‌ఘ‌డ్ కోట ప్ర‌యాణ‌పు అనుభ‌వాలు!

వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవ్‌ఘ‌డ్ రాజ కోట ఎప్పటికీ సందర్శనీయ ప్రదేశమే! అలాంటి కోట చారిత్రక విశేషాలను తెలుసుకునేందుకు, అలనాటి నిర్మాణ శైలి కనులారా వీక్షించేందుకు కొంత సాహస ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మా బృందానికి ఆ ప్రయాణం పంచిన మరుపురాని అనుభవాలు మీకోసం..

రాజస్థాన్‌లోని సికార్ పట్టణం నుంచి సుమారు 13 కిలోమీటర్లు ప్రయాణం చేశాం. దేవ్‌ఘ‌డ్‌లోని పర్వతాల మధ్యన ఉన్న ఓ పురాతన కోటకు మేం చేరుకోవాల్సి ఉంది. అక్కడికి దగ్గరలో చుట్టూ ఎన్నో పాతబడిపోయిన ఆల‌యాలు ఉన్నాయి. ఈ కోట సుమారు 225 సంవత్సరాల నాటిది. సికార్ నుంచి మేం బైక్‌ల‌పై దేవ్‌ఘ‌డ్‌కు చేరకున్నాం. ఆ కోటకు దగ్గరల్లోనే ఓ చిన్న కుగ్రామం మీదుగా మా ప్రయాణం కొనసా గించాం. పర్వతాల దగ్గరగా ఓ ప్రాచీన ఆల‌యం క‌నిపించింది.

ఆ మందిరం బయట వరండాలో గ్రామ పెద్దలు కొందరు కార్డ్స్ ఆడుతూ కనిపించారు. మేం వాళ్లదగ్గరే మా బైక్‌ల‌ను ఆపాం. కోట దగ్గరికి చేరుకునేందుకు వాళ్లని దారి అడిగాం. వారిలో ఓ పెద్దాయన ప్రాంతీయ తమ భాషలో మాకు దారిచెప్పారు. అదే సమయంలో మరికొందరు వృద్ధులు "కోట లోపలికి వెళ్లి ఏం చేస్తారు? మాతో పాటు కార్డ్స్ ఆడుదురు రండి!" అంటూ పిలిచారు. అంతలోనే అదే గ్రూపులో ఉన్న ఓ పెద్దాయన 'గుడి వెనకాల నుంచి కోటకు దారి ఉంటుంది. ఆ దారిలో వెళితే కోటలోపలికి చేరుకోవచ్చు. చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది' అని చెప్పారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లి, వారు చెప్పిన చోట మా బైక్‌ల‌ను పార్కింగ్ చేశాం.

జాగ్రత్తగా నడవాలి!

జాగ్రత్తగా నడవాలి!

పూర్తిగా రాళ్లతో నిండిన పెద్ద కొండ అది. పైకి వెళ్లేందుకు రాళ్లపై అడుగులు వేస్తూ కాలినడక మొదలుపెట్టాం. చేతులతో అక్కడి ముళ్లపొదలను తొలగిస్తూ ప్రయాణం సాగించాం. కొద్దిదూరం వెళ్లగానే రాళ్లతో కూడిన ఫుట్‌పాత్‌ ఒకటి కనబడింది. అదే కోట అని అర్థమైంది. కోట చాలా పాతబడిపోవడం వలన

ఎక్కువశాతం రాళ్లన్నీ కిందపడ్డాయి. దారెంటుందో కనిపించలేదు. అయితే కోట పూర్తిగా శిథిలమైంది కానీ, దాని చరిత్ర కాదుకదా అనుకుంటూ ముందుకు సాగాం. అక్కడికి చేరేందుకు మేం వేసే ప్రతి అడుగూ చాలా థ్రిల్గా ఫీలయ్యాం. చిన్న చిన్న రాళ్ల‌ను దాట‌కుంటూ కాళ్లు కింద‌ పెట్టి వెళ్లడం చాలాకష్టమనే చెప్పుకోవాలి. కొద్దిదూరం వెళ్లగానే సగం సగం దారి కనిపించింది. దారిమధ్యలో కొన్నిచోట్ల రాళ్లు పగిలి ఉన్నాయి. మరికొన్నిచోట్ల‌యితే కేవలం సగం కంకర మాత్రమే ఉంది.

మేం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కాలు జారితే, అంతా ఒకేసారి కింద ఉన్న గుడి దగ్గరకు దొర్లుకుంటూ పోవాల్సిందే! ఈ ఆలోచన రాగానే ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యాం. చాలా జాగ్రత్తగా ధైర్యంతో ఒక్కో అడుగు ముందుకువేశాం. ఆ పెద్దాయన జాగ్రత్త అని ఎందుకు చెప్పాడో అప్పుడు అర్థమైంది. అలా గంట నడకతో కోటగోడల దగ్గరికి చేరుకున్నాం.

వన్నెతగ్గని వైభవం!

వన్నెతగ్గని వైభవం!

కోటలోపలికి ప్రవేశించడానికి ఇనుముతో నిర్మించిన ఒక ద్వారం కనిపించింది. లోపల విశాలంగా, అన్నివైపులా ముళ్లపొదలు నిండిన ఓ పెద్ద దాబాలా ఉంది. కుడివైపున ఒక హైస్టీల్లా కనిపించింది. అక్కడి నుంచి లోపలికి వెళ్లడానికి మెట్లదారి ఉంది. ఆ దారిలో మెట్లు ఎక్కుతూ పైకి చేరకున్నాం. అసలైన కోట ప్రవేశద్వారం కనిపించింది. అయితే, అక్కడంతా చీకటిగా ఉంది. దానిలోపలకి వెళ్లగానే ముందుకు వెళ్లే దారి కనిపించింది. ఆ రోజేందుకో ఆకాశం నల్లని మేఘాలతో నిండి, అంతా ఓ మాయజాలంలా కనిపించింది. అంతటి చక్కని వాతావరణంలో పక్షుల కిలకిలారావాలు వినిపిస్తాయేమో అని చూశాం. మా ఆశ నెర‌వేరింది. కోట‌లోప‌లి ప‌చ్చికబ‌యిళ్ల‌పై గుంపులుగా విహ‌రిస్తూ మా అల‌స‌ట‌ను దూరం చేశాయి అక్క‌డి ప‌క్షులు. అయితే, పూర్తిగా శిథిలావ‌స్థ‌లో ఉన్న‌ ప్రధాన ద్వారం దాటాక, కోట బయటే నిలబడి లోపలికి వెళ్లాలా? వద్దా? అన్న సందిగ్ధం మొదలైంది. కొద్దిసేపు బయటే నిలబడి లోపలికి వెళ్లాం.

లోపలికి వెళ్లగానే కోట ముఖ్యభాగాలకు చేరుకునే దారి కనిపించింది. అంత కళాతకృమైక ద్వారం కూడా శిథిలావస్థలోకి చేరుకుంది. కోటలో అడుగడుగునా గదులు విభజించి ఉన్నాయి. ఒక గదిపై నుంచి నిలబడి చూడగానే కింద రాతితో నిర్మించిన ఓ పెద్ద నీటితొట్టె (స్విమ్మింగ్‌పూల్‌) కనిపించింది. కోట మొత్తానికి ఈ ఒక్క నీటితొట్టే ఉంది. దానికి సమీపంలో కొన్ని గదులు ఉన్నాయి. అవి కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి.

నీలిరంగు మహల్

నీలిరంగు మహల్

పైన స్క్వేర్స్‌లో ఎదురుగా కళాత్మకంగా ముస్తాబు చేసిన హాలు ఒకటి ఉంది. ఆ హాల్ అంతా నీలం రంగులో ఉంది. ఇది కోట సందర్శనకు వచ్చేవారిని ఇట్టే ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. దీనిలోపల చాలా గదులున్నాయి. అప్పటికే సమయం మించిపోయింది. మేం తిరుగు ప్ర‌యాణం అవ్వాల్సిన స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. కోట మొత్తం మళ్లీ ఒకసారి తిరిగి చూశాం. ఆ గోడలదగ్గరే కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాం. చారిత్ర‌క ప్ర‌దేశంలో మ‌నం వ‌సే ప్ర‌తి అడుగులోనూ జీవితంలో మ‌ర్చిపోలేని క్ష‌ణాల‌ను చేరువ చేస్తుంది. శిథిలావ‌స్థ‌లో ఉందని మేం ముందే వెనుదిరిగితే గొప్ప చారిత్ర‌క నిర్మాణాన్ని మిస్స‌య్యేవాళ్లం.

మళ్లీ సికార్ నగరానికి తిరుగు ప్రయాణమయ్యాం. విరిగిన రాళ్లపై నడవడం చాలా కష్టమనే చెప్పాలి. చాలా నెమ్మదిగా రాళ్లపై కాళ్లు పెడుతూ కిందకి దిగాం. తర్వాత దేవ్‌ఘ‌డ్ దగ్గర్లో ఉన్న ప్రసిద్ధ తీర్ధయాత్ర, పర్యటన స్థలం అయిన 'హర్ష్ పర్వతం' వెళ్లాం. అక్కడికి వెళ్లడానికి వాహ‌నాలు కూడా అందుబాటులో ఉంటాయి. మేం చాలాసార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించాం. ఈసారి అక్క‌డికి దగ్గర‌లోనే ఉన్నాను. కాబట్టి మళ్లీ ఒకసారి ఆ ప్రాంతాన్ని చూచి వచ్చాం. ఈ దేవ్‌ఘ‌డ్ యాత్రకు మీరు సిద్ధమవుతున్నారా? అయితే, కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

- సికార్‌నుంచి దేవ్‌ఘ‌డ్‌కు వాహన సదుపాయం ఉండదు. మన వాహనాలను మనమే తెచ్చుకోవాలి. కోట లోపలికి వెళ్లేందుకు వాహనాలు ఉండవు.

- ఈ కోట‌ సందర్శన స్నేహితులతో కలిసి వెళితే బాగా ఎంజాయ్ చేయవచ్చు.

- ఈ యాత్రలో వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు. కోటపైకి వెళ్లేటప్పుడు నీటి అవసరం చాలా ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకూ ఎక్కువ నీటిని తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించండి!
మ‌రి హ్యాపీ జర్నీ!

Read more about: sikar harsh mountain
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X