Search
  • Follow NativePlanet
Share
» »కార్లా బౌద్ధ గుహాలు చూస్తే మతి పోవాల్సిందే..ఆహా..ఎంతటి శిల్ప సౌందర్యం..

కార్లా బౌద్ధ గుహాలు చూస్తే మతి పోవాల్సిందే..ఆహా..ఎంతటి శిల్ప సౌందర్యం..

ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ క్షేత్రాలలో కార్లా గుహలు ఒకటి. లోనావాలా లో కల కార్లా గుహలు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ గల ప్రదేశం. బౌద్ధ సన్యాసులచే రాతిలో నిర్మించబడిన ఈ గుహలు బౌద్ధ మత ఆదర్శాలను, స్తూపాలను, శాసన

భారతదేశంలో మొట్ట మొదటగా శిల్పకళలను ప్రారంభించింది బౌద్ధులే. బౌద్దులు భారతదేశ వాస్తు, శిల్పకళ, చిత్రలేఖనాలకు విశేషమైన క్రుషి చేశారు. వీరి శిల్పకళ తర్వాత కాలంలో హిందూ శిల్పాలకు మార్గదర్శకమైంది. బౌద్ధ శిల్పకళకు ముందు హిందువులకు దేవాలయాలు లేవు. యజ్ఞాలు మాత్రమే చేసేవారు. యజ్ఞాల కోసం యజ్ఞశాలలు, స్తంభాలు మాత్రమే నిర్మించారు. సింధూ నాగరికతలోనూ దేవతల బొమ్మలున్నాయిగానీ దేవాలయాలు లేవు. విహారాలు, స్తూపాలు, చైత్యాలను మొదటగా బౌద్ధులే నిర్మించారు. ఆ కాలంలో బుద్ధుడిని అసాధారణ వ్యక్తిగా భావించారు. బుద్ధుడి నిర్యాణం తర్వాత ఆయన అస్థికలపై 8 స్థూపాలు కట్టించారు. ఈ కట్టడాలే తర్వాత బౌద్ధ శిల్పకళకు, క్రమంగా జైన హిందూ శిల్పకళకు మార్గదర్శకమయ్యాయి.

భారత దేశంలో గౌతమ బుద్ధిని ఆనవాళ్లకు కొదువలేదు. అమరావతి, భట్టిప్రోలు, నాగార్జున కొండ, ఘంటసాల ఇలా చెప్పుకుంటూ పోతే సిద్ధార్థుని అడుజాడలు ఎన్నో చోట్ల మనకు దర్శనమిస్తాయి. అలాంటి ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ క్షేత్రాలలో కార్లా గుహలు ఒకటి. లోనావాలా లో కల కార్లా గుహలు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ గల ప్రదేశం. బౌద్ధ సన్యాసులచే రాతిలో నిర్మించబడిన ఈ గుహలు బౌద్ధ మత ఆదర్శాలను, స్తూపాలను, శాసనాలను ప్రదర్శిస్తాయి. ఇక్కడ 37 స్తంభాలు కల చైత్య హాలు ఒక అద్భుత నిర్మాణం. మరి ఈ అద్భుత నిర్మాణంలో దాగున్న ప్రక్రుతి సౌందర్యం గురించి తెలుసుకుందాం..

 అతి సుందరమైన గుహ కార్లా బౌద్ధ గుహలు

అతి సుందరమైన గుహ కార్లా బౌద్ధ గుహలు

పశ్చిమ కనుమల్లో తొలచిన గుహలలో అతి సుందరమైన గుహ కార్లా బౌద్ధ గుహలు. పశ్చిమ భారతదేశంలో పచ్చని లోయలతో చుట్టుముట్టుబడిన హిల్ స్టేషన్ కార్లా గుహలు. ఇవి పురాతన బౌద్ధ పుణ్యక్షేత్రాలు రాయిలో చెక్కబడినటువంటి అందమైన అద్భుతమైనటువంటి గుహ. భారీ స్గంభాలు మరియు క్లిష్టమైన శిల్ప లావణ్యం ముగ్ధమనోహరలను చేస్తుంది.

ఈ గుహ లోనావాలా

ఈ గుహ లోనావాలా

ఈ గుహ లోనావాలా భారతదేశంలోని మహారాష్ట్రలోని పూనే జిల్లాలో ఉన్న ఒక పట్టణం. ఆధునిక పూణేకు నగరానికి పశ్చిమంగా 64కిలోమీటర్ల దూరంలో మరియు ముంబై నగరానికి సుమారు 96కి.మీ దూరంలో ఉంది.

చైతన్యవంతమైన గుహ మాత్రమే కాదు

చైతన్యవంతమైన గుహ మాత్రమే కాదు

ఇది ఇక చైతన్యవంతమైన గుహ మాత్రమే కాదు, దేవాలయాలు, చర్చిల వలె ఇది ఒక ఆరాధన స్థలం. ఈ గుహ నిర్మాణం క్రీ.పూ 50సంవత్సరాలకు పూర్వకాలం నాటిది. ఆ కాలంలో ఆంధ్రశాతకర్ణి రాజులు పరిపాలించిన ప్రదేశం.

గుహ నిర్మాణం చాలా అద్భుతంగా

గుహ నిర్మాణం చాలా అద్భుతంగా

గుహ నిర్మాణం చాలా అద్భుతంగా ఆంధ్రశైలిని కలిగి ఉన్నాయి. కొండలను తొలిచి గుహాలయాలను నిర్మించారు. వీటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బుద్దుని యొక్క జీవితం మీద చెక్కబడిన జఠిలమైన నిర్మాణాలు ఇక్కడ అత్యంత సాధారణ కట్టడాలు.

ఆ కొండల్లో బౌద్ధ బిక్షువులు నివాసం ఉండటానికి వీలుగా

ఆ కొండల్లో బౌద్ధ బిక్షువులు నివాసం ఉండటానికి వీలుగా

ఈ ప్రాంతంలో క్రీ.శ. 2, 3 శతాబ్దాల్లో బౌద్ధమతం వ్యాప్తి చెందిందనీ, బౌద్ధ బిక్షువులు అక్కడ నివాసముండేవారనీ చెబుతారు. ఆ కొండల్లో బౌద్ధ బిక్షువులు నివాసం ఉండటానికి వీలుగా గుహలను తొలిచారు. వారి వస్తువులు పెట్టుకునేందుకు అల్మరాలూ పడుకునేందుకు ఎత్తైన వేదికలూ ఉన్నాయి. నీటిని నిల్వ చేసే కుండీలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.

ఏనుగుపై ఊరేగుతున్

ఏనుగుపై ఊరేగుతున్

సభాప్రాంగణంలోని రాజూ, రాణి శిల్పాలు, ఏనుగుపై ఊరేగుతున్న రాజుగారి శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతోంది.

ప్రాంగణం ముందు నాలుగు సింహాలతో బౌద్ధ స్తూపం

ప్రాంగణం ముందు నాలుగు సింహాలతో బౌద్ధ స్తూపం

ప్రాంగణం ముందు నాలుగు సింహాలతో బౌద్ధ స్తూపం ఉంది. దానిపై అశోక చక్రం చెక్కి ఉంది. ఇది సారనాథ్‌ బౌద్ధస్తూపాన్ని పోలి ఉంది. ఇంకా స్తంభాల మీద వామన గుంటలను పోలిన గుంటలు ఉన్నాయి. వాటిలో ఆటలు ఆడుకునేవారని చెబుతున్నారు.

సభాప్రాంగణం లోపల అజంతాలో

సభాప్రాంగణం లోపల అజంతాలో

సభాప్రాంగణం లోపల అజంతాలో మాదిరిగా వేసిన కుడ్యచిత్రాలు ఇప్పటికీ ఎంతో అందంగా ఉన్నాయి. గదులు చిన్నవైనప్పటికీ గాలీ వెలుతురూ వస్తూ వేసవిలో సైతం చల్లగా ఉంటాచి. దీనికి దగ్గర్లోనే లోనావాలాలోని ప్రకృతి అందాలు మరికొన్ని ఉన్నాయి ఇవి కూడా చుట్టి రావచ్చు.

రాజ్ మంచి పాయింట్:

రాజ్ మంచి పాయింట్:

రాజ్ మంచిలో అందమైన శివాజీ కోట మరియు చుట్టు ప్రక్కల ఉన్న ఇతర లోయలను చూడవచ్చు.

Image source: Ravinder Singh

లోనావాల సరస్సు:

లోనావాల సరస్సు:

లోనావాల వాసులకు లోనావాల సరస్సు ఒక పిక్నిక్ స్పాట్. ప్రకృతి అందాలను ఆస్వాధించడానికి ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. దీనినే మాన్సూన్ లేక్ అని కూడా పిలుస్తారు.

Image source: solarisgirl

భాజా గుహలు:

భాజా గుహలు:

వీటిని బౌద్ధ సన్యాసులు నిర్మించారు. భాజా గుహలు మొత్తం 18 గుహలున్నాయి. మొదటి గుహ మాస్టర్ గుహ అయితే మిగిలిన 10 బౌద్ద విహారాలు.

Image source: Ramnath Bhat

లోహ ఘర్ ఫోర్ట్ :

లోహ ఘర్ ఫోర్ట్ :

లోహ ఘర్ కోట. దీన్ని ఇనుప కోట అని కూడా పిలుస్తారు. ఈ కోటను చత్రపతి శివాజీ నిర్మించాడు. శిథిలావస్థలో ఉన్న ఈ కోటను చారికత్ర శిల్పకళను చూడటానికి పర్యాటకు సందర్శిస్తుంటారు.

Image source: Vivek Joshi

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి లోనావాలాకు నేరుగా రైలు సౌకర్యం ఉంది.
ముంబయికి గానీ, పుణెకి గానీ విమానంలో చేరుకుంటే అక్కడి నుంచి లోనావాలాకు రైలు, బస్సు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X