Search
  • Follow NativePlanet
Share
» »ఈ సమ్మర్ లో దేశ రాజధాని చుట్టూ ఉన్న ఈ అందాలను చూడటం ఒక మధురానుభూతి

ఈ సమ్మర్ లో దేశ రాజధాని చుట్టూ ఉన్న ఈ అందాలను చూడటం ఒక మధురానుభూతి

ఈ సమ్మర్ లో దేశ రాజధాని చుట్టూ ఉన్న ఈ అందాలను చూడటం ఒక మధురానుభూతి

ఏప్రిల్‌ ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎండలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయో అనిపిస్తుంది కదా. ఎండ తీవ్రతని ఎలాను తగ్గించలేము కాబట్టి ఓ వారం రోజులు అలా చల్లటి ప్రదేశాల్లో విహరించొద్దాము. మళ్లీ దీని కోసం దేశం దాటి వెళ్లాల్సిన పనిలేదు. ఖర్చు గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనకున్న బడ్జెట్‌లోనే దేశ రాజధాని చుట్టూ ఉన్న అందాలను చూడటం జీవితో ఈ మధుర జ్ఝాపకం.

భారత దేశ పర్యటన ఒక మరచి పోలేని అనుభవనం అనుకుంటే, భారత దేశ రాజధాని ఢిల్లీ పర్యటన సందర్శకులకు మరింత అద్భుతంగా వుంటుంది. ప్రతి పర్యాటకుడు జీవితం లో మరచిపోలేని పర్యటన అనుభవాలను కలిగిస్తుంది. ఢిల్లీ నగరం దేశంలోని పెద్ద నగరాలలో ఒకటి మాత్రమే కాదు, దాని వెలుగు జిలుగులతో ఆధునికత మరియు, సాంప్ర దాయకతలకు ప్రతీకగా నిలిచి సందర్శకులకు చెరగని మధురానుభూతులను కలిగిస్తుంది.

ఢిల్లీ పేరును హిందీ లో 'దిల్లి ' అని కూడా వ్యవహరిస్తారు. అధికారికంగా, ఈ నగరం దేశానికి రాజధాని నగరం. ముంబై నగరం తర్వాత అత్యధిక జనాభా కల రెండవ నగరం గా పేరొందింది. పురాతన ఢిల్లీ మరియు కొత్త ఢిల్లీ అనే పేర్ల తో ఢిల్లీ లోని రెండు ప్రదేశాలు వాటి వాటి చరిత్ర, సంస్కృతి, ఎన్నో రకరకాల అద్భుత ప్రదేశాలతో ప్రతి సందర్శకుడిని మంత్రముగ్ధులను చేస్తాయి. అంతే కాదు, దేశ రాజధాని అయిన కారణంగా, దేశం లో జరిగే ప్రతి ఒక్క రాజకీయ కార్యకలాపానికి కేంద్ర బిందువుగా వుండి ప్రతి వారు తప్పక చూడవలసిన ప్రదేశంగా వుంటుంది.

ఆగ్రా

ఆగ్రా

అత్యద్భుతమైన తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది. ఇది ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో, ఢిల్లీ నుండి 211 కి. మీ. దూరంలో ఉన్నది. ఆగ్రాలో అత్యద్భుతమైన తాజ్ మహల్ కాకుండా, ఆగ్రా కోట మరియు ఫతేపూర్ సిక్రీ అనే రెండు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఆగ్రా చరిత్ర దాదాపు 11 వ శతాబ్దంలో ప్రారంభమయింది. దాని చరిత్ర కాలంలో, ఆగ్రా, హిందూ మరియు ముస్లిం మత పాలకుల మధ్య చేతులు మారింది మరియు అందువలన రెండు సంస్కృతుల ముద్రలు దుస్తుల నేత నేసినట్లుగా ఉంటాయి.
ఆగ్రాలో ఉన్న చారిత్రక కట్టడాలు మరియు భవనాలు నిస్సందేహంగా దాని ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. తాజ్ మహల్ కాకుండా, మీరు యమునా నది ఒడ్డున ఉన్న ఆగ్రా కోటను మరియు అక్బర్ ది గ్రేట్ సమాధి కూడా సందర్శించవొచ్చు. చిని కా రౌజా, దివాన్-ఇ-అం, మరియు దివాన్-ఇ-ఖాస్ వంటి స్మారక చిహ్నాలు మొఘల్ పాలనలో జీవితం ప్రావీణ్యతను చాటి చెప్పుతున్నాయి. ఇత్మద్-ఉద్-దౌలా సమాధి, మరియం జామని సమాధి, జస్వంత్ కి చ్చత్రి, చౌసత్ ఖంబ, మరియు తాజ్ మ్యూజియం వంటి ఆసక్తిని కలిగించే ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయి.

PC : Muhammad Mahdi Karim

ఫతేపూర్ సిక్రీ

ఫతేపూర్ సిక్రీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రా జిల్లా లోని ఒక నగరం, నగరపాలితము కూడా. ఇడి ఢిల్లీ నగరం నుండి 223కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నగరాన్ని మొగల్ చక్రవర్తి అక్బర్ 1569లో స్థాపించాడు. అక్బర్ కాలంలో 1571 నుండి 1585 వరకు మొఘలుల రాజధాని. చిత్తోర్ రాన్తంభోర్ మీద విజయం సాధించిన తరువాత అకబర్ తన రాజధానిని ఆగ్రా నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిక్రీ రిట్జ్ ప్రదేశానికి తరలించాలని అనుకున్నాడు. సుఫీ సన్యాసి సలీం చిష్టి గౌరవార్ధం సిక్రీ రిట్జ్ వద్ద నగరాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అక్బర్ చక్రవర్తి ఈ ప్రదేశంలో కోటగోడలు కలిగిన నగర నిర్మాణం చేయాలని సంకల్పించాడు. రాజభవనాలు, అంతఃపురాలు, సభాప్రాంగణాలు, మసీదు, ప్రైవేట్ క్వార్టర్లు మరియు ఇతర ఉపయోగాలకు అవసరమైన భవనాలతో కూడిన కోట నిర్మాణ కార్యక్రమాలు 15 సంవత్సరాల కాలం కొనసాగింది. అకబర్ చక్రవర్తి ఆ నగరానికి ఫతేహబాదు అని నామకరణం చేసాడు. అరాబిక్ పూర్వీకమైన పర్షియన్ భాషలో ఫతేహ్ అంటే విజయం అని అర్ధం. తరువాత అది ఫతేపూర్ సిక్రీగా పిలువబడింది. మొగలుల సంరక్షించబడుతున్న ప్రముఖ నిర్మాణాలలో ఫతేపూర్ సిక్రీ ఒకటి. ఫతేపూర్ సిక్రీ సముదాయానికి గల 54 మీ. ఎత్తుగల ప్రవేశద్వారం (బులంద్ దర్వాజా).
Photo Courtesy: Bruno Girin

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ -దీని స్థాపనలో ముఖ్యపాత్రను పోషించిన సంరక్షకుడిగా మారిన వేటగాడు జిమ్ కార్బెట్ పేరుతో వెలిసింది-భారతదేశంలోని పురాతన జాతీయ పార్క్. ఈ ఉద్యానవనం హాయిలే నేషనల్ పార్క్‌లో 1936లో స్థాపించబడింది. ఉత్తరఖాండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఉన్న ఈ ఉద్యానవనం నశించిపోతున్న భారతదేశపు బెంగాయాదృచ్ఛిక పేజీలీ పులికి ఒక సంరక్షక ప్రాంతంగా వ్యవహరించబడుతుంది, ఇది ఒక భారతీయ వన్యప్రాణుల సంరక్షణ చొరవ ప్రాజెక్ట్ టైగర్ యొక్క ప్రధాన అంశం సురక్షిత మనుగడగా చెప్పవచ్చు.[2]కార్బెట్ చాలాకాలంగా పర్యాటకులు మరియు వన్యప్రాణులను ఇష్టపడేవారికి ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా ఉంది. పర్యాటక కార్యకలాపాలు కార్బెట్ టైగర్ రిజెర్వ్‌లోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అనుమతించబడ్డాయి దీని వలన ప్రజలు దీని అత్యద్భుతమైన భూభాగం మరియు దాని వైవిధ్యమైన వన్యప్రాణులను చూడటానికి అవకాశాన్ని పొందుతారు. ఇటీవల సంవత్సరాల్లో, దీనిని సందర్శించే ప్రజల సంఖ్య నాటకీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం, ప్రతి సీజన్‌లోనూ భారతదేశం మరియు ఇతర దేశాల నుండి ఈ ఉద్యానవనాన్ని సందర్శించడానికి 70,000 కంటే ఎక్కువమంది సందర్శకులు విచ్చేస్తున్నారు.

PC : Soumyajit Nandy

లాన్స్‌డౌన్‌

లాన్స్‌డౌన్‌

ఢిల్లీ నుంచి కేవలం 260కిమీ దూరాన ఉన్న లాన్స్‌డౌన్‌ను చేరుకోవడానికి 6-7 గంటల ప్రయాణం చేయాలి. ఇక్కడ బస చేయడానికి ఖరీదైన హోటల్లు రిసార్టులు ఉండవు. మన బడ్జెట్‌లోనే ఇంటి వాతవరణాన్ని తలపించే వసతి లభిస్తుంది. ట్రెక్కింగ్‌ ఆసక్తి ఉన్న వారికి సరిగ్గ సరిపోయే ప్రదేశం లాన్సడౌన్‌. హిమాలాయాలను సందర్శించడానకి ప్రసిద్ధికెక్కిన టిపి టాప్‌ పాయింట్లకు నెలవు ఈ ప్రదేశం. ఇవే కాక భీమ్‌ పకోర, తారకేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం, భుల్ల తాల్‌ ఇక్కడి దర్శనీయ ప్రదేశాలు.
PC : Official Website

నహాన్‌

నహాన్‌

శివాలిక్‌ పర్వత శ్రేణులకు, హిమాలయాలకు మధ్య ఉన్న ప్రదేశం నహాన్‌. ఢిల్లీ నుంచి 250కి.మీ. దూరాన ఉన్న ఈ ప్రదేశాన్ని చేరడానికి 4 నుంచి 5గంటల పాటు ప్రయాణం చేయాలి. చుట్టూ పచ్చని పచ్చదనం పరుచుకున్న ప్రదేశం కావడంతో ఇక్కడికి వచ్చే వారు ఎక్కువగా హోటల్లలో కన్నా శివారు ప్రాంతాల్లోఉండటానికి ఇష్టపడతారు. మనలో నూతనోత్సహం నింపే సరైన యాత్రా ప్రదేశం ఇదే. రేణుక సరస్సు, పౌంతా సాహిబ్‌, త్రిలోక్‌పూర్‌ ఆలయం, సుకేతి శిలాజాల పార్కు ఇక్కడ చూడవలసిన ముఖ్య ప్రదేశాలు.

ముస్సోరి

ముస్సోరి

ఢిల్లీకి 285 కి.మీ. దూరాన ఉన్న ముస్సోరిని చేరుకోవడానికి ఏడు గంటల సమయం పడుతుంది. అత్యంత రద్దీగా ఉండే ముస్సోరిని చేరుకోవడానికి రోడ్డు మార్గం కన్నా శివారు ప్రాంతాల గుండా వెళ్తే ముస్సోరి అసలు సౌందర్యం కనిపిస్తుంది. భోజన ప్రియులకు స్వర్గధామం ఈ ప్రాంతం. రెస్టారెంట్లు, కేఫేలు కొకొల్లలుగా ఉంటాయి. ఇక్కడ స్థానిక హిమాలయ ప్రాంత ఆహారమే కాకుండా యూరోపియన్‌ ఆహారం కూడా లభిస్తుంది. రస్కిన్‌ బాండ్‌ ప్రముఖ పుస్తకాల దుకాణం ఇక్కడే ఉంది. Photo Courtesy: KuwarOnline

అల్వార్

అల్వార్

అల్వార్, రాజస్తాన్ లోని ఆరావళి పర్వత శ్రేణులలో ఎత్తు పల్లాల రాళ్ళు రప్పల మధ్య ఉన్నపర్వత ప్రాంతం. ఈ ప్రాంతం అల్వార్ జిల్లాకు పరిపాలనా కేంద్రం. పురాణాల ప్రకారం మత్స్య దేశంగా పిలవబడిన ఈ ప్రాంతంలో పాండవులు మారువేషాలలో తమ అరణ్యవాసం తర్వాత 13 వ సంవత్సరాన్ని అజ్ఞాత వాసంగా గడిపారని విశ్వసిస్తారు. చారిత్రికంగా ఈ ప్రాంతాన్ని మేవార్ అని కూడా అంటారు. అల్వార్ అందమైన సరస్సులు, గొప్ప భవనాలు, అద్భుతమైన దేవాలయాలు, దివ్యమైన స్మారక కట్టడాలు, కోట బురుజులకు ప్రసిద్ది చెందింది. కోటలు, భవనాలు, సరస్సులు, మ్యూజియం, ఇంకా ఎన్నో...అల్వార్ కు వచ్చే పర్యాటకులు బాల ఖిలా అనబడే అల్వార్ కోటను చూడవచ్చు. ఇది ఢిల్లీ నుండి 156కిలోమీటర్ల దూరంలో ఉంది.

Photo Courtesy: Astoriajohn

నౌకుచైతాల్‌

నౌకుచైతాల్‌

ఢిల్లీకి 320కి.మీ. దూరాన ఉన్న నౌకుచైతాల్‌ ప్రాంతాన్ని చేరుకోవడానికి సుమారు ఏడు గంటల ప్రయాణం చేయాలి. నైనితాల్‌ - భీమ్‌తాల్‌కు సమీపాన ఉండటంతో ఈ ప్రాంతానికి యాత్రికుల రద్దీ తక్కువ. జనావాసాలకు దూరంగా, ఒంటరిగా, ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం సరిగ్గా సరిపోతుంది. ఇ​క్కడ ప్రధాన ఆకర్షణ నౌకుచైతాల్‌ సరస్సు. చుట్టూ కొండలతో ఉండే ఈ సరసుకు తొమ్మిది మూలలు ఉంటాయి. అందువల్లే ఈ ప్రాంతానికి నౌకుచైతాల్‌ అనే పేరు వచ్చింది. సాహసాలు ఇష్టపడే వారికి ట్రెక్కింగ్‌తో పాటు పారాగ్లైడింగ్‌, పారాసెయిలింగ్‌ చేయడానకి కూడా అవకాశం ఉంటుంది.
PC : Kaagazkalam

కసౌలి

కసౌలి

ఢిల్లీ నుంచి సుమారు 290కి.మీ. దూరాన హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఉన్న ఈ ప్రదేశానికి చేరుకోవడానికి అయిదారు గంటల సమయం పడుతుంది. సిమ్లాకు సమీపాన ఉన్న కసౌలి చల్లని ప్రాంతమే కాక హిమాచల్‌లో ఉన్న మిగితా వేసవి విడిది ప్రాంతాల కన్నా చాలా అందమైన ప్రదేశం. నేటికి చెక్కుచెదరకుండా ఉన్న కాలనీల నిర్మాణాలు అలనాటి నిర్మాణ కౌశాలనికి నిదర్శనం. గ్రామీణ వాతావరణాన్ని, అనేక ఆలయాలను, అందమైన ప్రదేశాలను ఇక్కడ చూడవచ్చు. ప్రసిద్ధ మోహన్‌ మెయ్కిన్‌ బ్రేవరీ ఇక్కడే ఉంది.
Photo Courtesy: http://www.flickr.com/photos/sanjoy/

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X