Search
  • Follow NativePlanet
Share
» »అద్భుత పర్యాటక ఆకర్షణ వయనాడ్ !

అద్భుత పర్యాటక ఆకర్షణ వయనాడ్ !

కేరళ రాష్ట్రంలో వయనాడ్ ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం. ఇక్కడకు మన దేశంలోని పర్యాటకులు మాత్రమే కాక విదేశీయులు కూడా అధిక సంఖ్య లో వస్తారు. కేరళ లోని మున్నార్ , అల్లెప్పి ల తర్వాతి స్థానం వయనాడ్ ఆక్రమిస్తుంది. వయనాడ్ కేరళ లోని కన్నూర్ మరియు కోజికోడ్ జిల్లాల మధ్య కలదు. ఈ ప్రదేశం కేరళలో ఉన్నప్పటికీ తమిళ్ నాడు రాష్ట్రానికి, కర్నాటక రాష్ట్రానికి సమీపంలో వుండి ఈ రాష్ట్రాల టూరిస్ట్ లకు తేలికగా అందుబాటులో వుంటుంది. బెంగుళూరు కు 265 కి. మీ. లు మైసూరు నుండి 122 కి. మీ. లు., ఊటీ నుండి 113 కి. మీ. ల దూరం మాత్రమే. కోజికోడ్ కు 90 కి. మీ. లు, కన్నూర్ కు 113 కి. మీ. లు గా కలదు. కేరళ వెళ్ళినపుడు వయనాడ్ తప్పక చూడ దగిన ప్రదేశం. ఇక్కడ మీరు చూడదగిన ఎన్నో అద్భుతాలు కలవు.

చెంబర శిఖరం

చెంబర శిఖరం

వయనాడ్ లోని అన్ని శిఖరాలలోకి ఇది ఎత్తైన శిఖరం. సముద్ర మట్టానికి 2100 మీటర్ల ఎత్తున కల ఈ శిఖరానికి ట్రెక్కింగ్ చేయవచ్చు. శిఖరంపైన కన్నుల విందు చేస్తూ ఒక గుండె ఆకారంలో కల సరస్సు వుంటుంది. ఇక్కడ నుండి వయనాడ్ లోని కలపెట్ట టవున్ కు 25 కి. మీ. ల దూరం.

మీన్ ముట్టి జలపాతాలు

మీన్ ముట్టి జలపాతాలు

మీన్ ముట్టి జలపాతాలు ఒక మంచి టూరిస్ట్ ఆకర్షణ. మీన్ ముట్టి అంటే చేపులు గుంపుగా చేరి అడ్డగింఛిన ప్రదేశం అని చెపుతారు. కొన్ని సహజ కారణాలుగా ఈ ప్రదేశం నుండి చేపలు ఈత కొట్టలేక నిలబడి పోతాయని చెపుతారు.

పూకోట్ సరస్సు

పూకోట్ సరస్సు

వయనాడ్ లో ఇది ఒక అందమైన సరస్సు. కలపెట్ట కు సుమారు 8 కి.మీ. ల దూరంలో కలదు. ఈ సరస్సులో బోటు విహారం చేయవచ్చు. ఎన్నో ప్రకృతి దృశ్యాలు చూసి ఆనందించవచ్చు. టూరిస్ట్ లకు ఇక్కడ పెడల్ బోటు లు మరియు స్పీడ్ బోటు లు కూడా కలవు.

సూచిపార జలపాతాలు

సూచిపార జలపాతాలు

ఎగిసిపడే సూచిపార జలపాతాలు వయనాడ్ లో మరొక ప్రధాన ఆకర్షణ. వీటిని సెంటి నెల్ రాక్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇవి కలపెట్ట కు 22 కి. మీ. ల దూరం.

బాణాసుర సాగర్ డాం

బాణాసుర సాగర్ డాం

బాణాసుర సాగర్ డాం వయనాడ్ లో తప్పక చూడవలసిన ఒక టూరిస్ట్ ప్రదేశం. ఈ డాం అద్భుత ప్రకృతి దృశ్యాలను చూపుతుంది. డాం వద్ద కల పార్క్ మీరు మీప్రియమైన వారితో కలసి విశ్రాంతి తీసుకొనేందుకు సౌకర్యంగా వుంటుంది.

కార పూజ డాం

కార పూజ డాం

ఇక్కడ కల కారపూజ డాం ఇండియా లో అతి పెద్ద మట్టి డాం. అందమైన ఈ మట్టి డాం కలపెట్ట కు 16 కి. మీ. ల దూరంలో కలదు. సరస్సులు, కొండలు, పక్షుల ధ్వనులు, అవి ఎగిరే దృశ్యాలు అన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా చేసాయి.

కాంత పార వాటర్ ఫాల్స్

కాంత పార వాటర్ ఫాల్స్

కాంత పార జలపాతాలు కలపెట్ట కు 12 కి. మీ. ల దూరంలో కలవు. ఇవి దట్టమైన తేయాకు తోటల మధ్య కలవు. ఇక్కడ కేమ్పింగ్, ట్రెక్కింగ్ వంటివి చేయవచ్చు. ప్రకృతి దృశ్యాలు కన్నులకు విందుగా వుంటాయి.

ఎదక్కాల్ గుహలు

ఎదక్కాల్ గుహలు

ఎదక్కాల్ గుహలు వయనాడు లో బెస్ట్ టూరిస్ట్ ఆకర్షణ. ఒక్కసారి మీ ధైర్య సాహసాలు పరీక్షించుకోవాలంటే, మీరు ఈ గుహలు తప్పక అన్వేషించాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X