» »అరుదైన లోయల అభయారణ్యం - చంబల్

అరుదైన లోయల అభయారణ్యం - చంబల్

Written By: Venkatakarunasri

చంబల్ నది అభయారణ్యం కొండకొనలను ఢీ కొని, ఇసుక తీరాల వెంబడి ఒక చదునైన మార్గాన్ని ఏర్పరుచుకుంది. ఈ నది ఘరియల్ (మొసలి), గంగా డాల్ఫీన్, అరుదైన పక్షులతో విస్తరించి ఉంది. చంబల్ అభయారణ్యం ఢిల్లీ నుండి 5 గంటల ప్రయాణ దూరంలో, ఆగ్రా నుండి 80 కి. మీ. దూరంలో ఉన్నది. దారి మధ్యలో తాజ్ మహల్ ను చూసుకొని వన్య ప్రియులు ఈ అభయారణ్యాన్ని సందర్శించవచ్చు.

చంబల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభయారణ్యం. అయినప్పటికీ రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు చేరువలో ఉంటుంది. 1979 వ సంవత్సరంలో స్థాపించబడ్డ ఈ అభయారణ్యాన్ని, జాతీయ చంబల్ ఘరియల్ వన్య ప్రాణుల అభయారణ్యం అని పిలుస్తారు. ఈ అభయారణ్యం గుండా చంబల్ నది ప్రవహిస్తుంది.

బతేశ్వర ఆలయాలు

బతేశ్వర ఆలయాలు

చంబల్ అభయారణ్యానికి దగ్గర్లో ఉన్న యమునా నది పై గల బతేశ్వర ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ ప్రాంగణంలో శివుని విగ్రహం కలిగిన 100 కంటే ఎక్కువ ఆలయాలు ఉన్నాయి. లోయలు, యమునా నది పరిసరాలు, పక్షులు వీక్షించవచ్చు.

చిత్ర కృప : Aashish & Suhasini

చంబల్ సఫారీ

చంబల్ సఫారీ

చంబల్ యాత్ర మిమ్మల్ని చంబల్ అభయారణ్యం గుండా తీసుకువెళుతుంది. ఈ అభయారణ్యంలో అంతరించిపోతున్న మొసళ్లను చూడవచ్చు. ఈ నది రంతిదేవ రాజు త్యాగంతో వందల ఆవుల రక్తం నుండి పుట్టిందని పురాణాల కధనం. ఇందుకు ప్రజలు ఈ నీటిని సరీసృపాలకు, పక్షులకు వదిలివేశారు.

చిత్ర కృప : Ganesh Jayaraman

ఒంటె పై సఫారీ

ఒంటె పై సఫారీ

ఒంటె పై యాత్ర వన్యప్రాణుల అన్వేషణకు, చంబల్ అభయారణ్యం లోని లోయలను గుర్తించడానికి ఖచ్చితమైన మార్గం. మార్గ మధ్యలో మీరు ఇండియన్ స్కిమ్మెర్, రుడ్డే షెల్ డక్, దువ్వు బాతు, రంగు రంగుల కింగ్ఫిషర్ వంటి అనేక పక్షులను కూడా ఇక్కడ చూడవచ్చు.

చిత్ర కృప : Mike

జీపు సఫారీ

జీపు సఫారీ

చంబల్ అభయారణ్యం చూసేందుకు మరొక ఎంపిక జీపు సఫారి. జీప్ సఫారీ లోయలలో అటూ-ఇటూ తిప్పుతూ, నది ఒడ్డు, అరణ్యప్రాంతాలలోని పొదలు, వెనకబడిన గ్రామాలు, ఆతర్ కోట మొదలైన వాటి గుండా వెళుతుంది. ఇక్కడ నివసి౦చే పక్షులనే కాకుండా మీరు పాలే ఆర్కెటిక్ ప్రాంతంలో ఎత్తైన హిమాలయాల నుండి సైబీరియా నుండి వచ్చే ఎత్తైన వలస పక్షులను కూడా చూడవచ్చు.

తెప్పలలో నదిలో వెళ్ళటం

తెప్పలలో నదిలో వెళ్ళటం

చంబల్ అభయారణ్యాన్ని పడవలలో చక్కగా చూసిరావచ్చు. చంబల్ నదిపై నది యాత్ర ఆ ప్రాంతంలోని వన్యప్రాణులను వీక్షించడానికి సరైన అవకాశం. లోయల గుండా వెళ్తుంటే కొండలలోకి దారి తీస్తుంది. ఈ దారి పొడవునా తీరం వెంట ఎండలో పొర్లాడే సరీసృపాలను కూడా చూడవచ్చు లేదా జతలుగా నదిలో పడి లేచే డాల్ఫిన్లను కూడా చూడవచ్చు.

గ్రామ యాత్ర

గ్రామ యాత్ర

ఇప్పుడే చెప్పానుగా ..! సఫారీ పక్కనే ఉండే గ్రామాల గుండా వెళుతుందని. గ్రామాల గుండా నడిచి వెళుతున్నపుడు మీరు కుండలు తయారుచేసే కుమ్మరులను, ఖుల్లర్లు, అనేక సంప్రదాయ వస్తువులు తయారుచేసే వాళ్ళను చూడవచ్చు. అవసరమైతే షాపింగ్ చేయవచ్చు.

చంబల్ అభయారణ్యానికి ఎలా చేరుకోవాలి ?

చంబల్ అభయారణ్యానికి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

చంబల్ అభయారణ్యానికి సమీపంలో 90 కి. మీ. దూరంలో ఆగ్రా అభయారణ్యం కలదు. క్యాబ్ లేదా ట్యాక్సీ లను అద్దెకు తీసుకొని రెండుగంటల్లో చంబల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

చంబల్ అభయారణ్యానికి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ ఆగ్రా రైల్వే స్టేషన్. ఢిల్లీ నుండి ప్రతి రోజూ ఈ స్టేషన్ కు రైళ్లు నడుస్తాయి.

బస్సు మార్గం

ఆగ్రా, హస్తినాపూర్ ల నుండి చంబల్ కు ప్రతి రోజూ ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

Please Wait while comments are loading...