Search
  • Follow NativePlanet
Share
» »అందాల జమ్మూ & కాశ్మీర్ పర్యటన !

అందాల జమ్మూ & కాశ్మీర్ పర్యటన !

హిమాలయాల ఒడిలో కల జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం దేశ వ్యాప్తంగా నే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా దానికి గల అందమైన దృశ్యాలకు, ఆహ్లాదకర వాతావరనానినికి పేరు గాంచినది. ఈ రాష్ట్రంలో అనేక సైట్ సీఇంగ్ ప్రదేశాలు, టూరిస్ట్ కేంద్రాలు, టెంపుల్స్ , మొనాస్టరీ లు కలవు. ఈ రాష్ట్రం ఇండియా లో విశ్రాంతి సెలవులకు తప్పక కోరదగినది. ప్రకృతి ప్రియులైనా సరే లేక సాహస క్రీడల పట్ల ఆసక్తి కలవారైనా సరే ఈ ప్రదేశాలను అమితంగా ఇష్టబడతారు.

ప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి జహంగీర్, ఈ ప్రదేశ అందాలను చూసి ముగ్ధుడై , ఈ భూమిపై స్వర్గం అనేది వుంటే అది ఇక్కడే కలదని పేర్కొన్నాడు. బ్రహ్మాండమైన పర్వత శ్రేణులు, స్వచ్చమైన నీటి ప్రవాహాలు, అనేక పుణ్య క్షేత్రాలు, మంచు చే ఘనీభవించిన సరస్సులు, అనేక తోటలు, వంటివి ఈ ప్రదేశ అందాలను మరింత పెంచి, తప్పక సందర్సిన్చాదగినవిగా చేస్తాయి.

ఇది కూడా చదవండి : అందాల కాశ్మీర్ లో సినిమా షూటింగ్ లు జరిగే ప్రదేశాలు !

ఈ ప్రదేశ అందాలు ఒకే రీతిలో వుంటాయి కనుక, ఈ ప్రదేశ సందర్శన సంవత్సరం పొడవునా చేయవచ్చు. అయితే, చలికాలంలో ఇక్కడ కల కొన్ని ప్రాంతాలు అత్యధిక హిమపాతం కారణంగా మరియు భద్రతా అంశాల కారణంగా మూసి వేయబదతాయనేది గుర్తు పెట్టుకోనవలసి వస్తుంది.

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

శ్రీనగర్ మరియు లెహ్ లకు విమాన సేవలు కలవు. ఈ ప్రదేశం లో భద్రత ఏర్పాట్లు అధికం కనుక రోడ్ ప్రయాణం సూచించ దగినది. జమ్మూ లోని రైలు స్టేషన్ దేశం లోని ఇతర ప్రధాన రైలు ప్రాంతాలకు కలుపబడి వుంది. భద్రతా కారణాల దృష్ట్యా ట్రైన్ లు పరిమితంగా ఉంటాయి. అయితే ఇక్కడకు చేరిన తర్వాత టాక్సీ లేదా కాబ్ లలో అన్ని ప్రదేశాలకు విహరించవచ్చు.

Photo courtesy :Steve Hicks

ఆల్చి

ఆల్చి

లేహ్ జిల్లాలో గల "ఆల్చి" గ్రామం సుప్రసిద్ధమైనది. ఇండస్ నది ఒడ్డున "లేహ్" జిల్లాకి 60 కి.మీ. దూరంలో గల ఈ గ్రామం హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో ఉంది. ఈ గ్రామం లో "ఆల్చి" అనే పేరుతోనే ఒక పురాతన మఠం ఉంది.ఈ మఠం లడఖ్ లో గల అనేక యాత్రా స్థలాలలో ఒకటి. లడఖ్ లో గల ఇతర మఠాలు పర్వశ్రేణుల మీద ఉంటే, ఈ "ఆల్చీ" మఠం మాత్రం పర్వత పాద ప్రాంతం లో ఉంది. ఈ మఠ చరిత్ర 11వ శతాబ్ద కాలానికి సంబంధించినది. అసమాన శిల్పకళా నైపుణ్యానికి ఈ మఠం ప్రసిద్ధి. మఠ భవన సముదాయం లో "దు-ఖాంగ్","సం-త్సెక్","మంజుశ్రీ" ఆలయాలున్నాయి.బుద్ధుడు మరియు ఇతర దేవతల కి సంబంధించిన అనేక చిత్రాలు గోడల మీద చిత్రీకరించబడి కలవు.

Photo Courtesy: Fulvio Spada

అమర్ నాథ్

అమర్ నాథ్

శ్రీనగర్ నుంచి 145 కి. మీ ల దూరంలో ఉన్న అమర్ నాథ్, భారతదేశంలో ప్రధాన తీర్థ యాత్రా ప్రదేశాలలో ఒకటి గా పరిగణించబడుతుంది.సముద్ర మట్టానికి 4175 మీటర్లో ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం శివ భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది.మంచుతో సహజంగా ఏర్పడిన దైవ రూపమైన "శివ లింగం",ఇక్కడి ముఖ్య ఆకర్షణ. ఈ తీర్థానికి పేరు రెండు హిందీ పదాల కలయిక వల్ల వచ్చింది. అమర్ అనగా అమరమైన.నాథ్ అనగా దేవుడు.

హిందూ మత పురాణాల ప్రకారం, శివుడి దేవేరి అయిన పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాలు బహిర్గతం చేయమని అభ్యర్థించింది. ప్రతిస్పందనగా, శివుడు ఎవరి చెవినా ఆ రహస్యం పడకూడదు అనే ఉద్దేశ్యం తో ఆమెను హిమాలయాల ఏకాంతంలో ఉన్న ఈ గుహలకు తీసుకు వెళ్ళి జీవిత రహస్యాలు వెల్లడించాడు. అమర్ నాథ్ యాత్రలో, ప్రయాణికులు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ గుహను తప్పక చూడాలి. ఈ గుహ లో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు "శివ లింగం" ఉంటుంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివ లింగం పెరగటం తరగటం జరుగుతుంది.

Photo Courtesy: Nitin Badhwar

అనంతనాగ్

అనంతనాగ్

అనంతనాగ్ జిల్లాను &కాశ్మీర్ పట్టణానికి వాణిజ్య రాజధాని గా చెపుతారు. ఈ పట్టణం కాశ్మీర్ కు నైరుతి భాగంలో కలదు. ఈ ప్రదేశం కాశ్మీర్ లో బాగా అభి వృద్ధి చెందిన ప్రదేశం . క్రి. పూ. 5000 సంవత్సరాల నాటికే ఈ ప్రాంతం వాణిజ్య పరంగా అభివృద్ధి చెందిన ప్రదేశం గా గుర్తించబడి పట్టణ నాగరికతలు విలసిల్లాయి. ఈ పట్టణం చుట్టూ శ్రీనగర్, కార్గిల్ ,పుల్వామా, దోడ మరియు కిష్టవార్ వంటి వివిధ నగరాలు కలవు.

Photo Courtesy: Kumar Chitrang

జమ్మూ & కాశ్మీర్

జమ్మూ & కాశ్మీర్

జమ్మూ & కాశ్మీర్ లో అవన్తిపూర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ ప్రదేశం లో రెండు పురాతన దేవాలయాలు అంటే శివ అవన్తీశ్వర మరియు అవన్తిస్వామి విష్ణు లవి కలవు. ఈ రెండు దేవాలయాలాను 9 వ శతాబ్దం లో రాజు అవంతి వర్మ నిర్మించాడు. వీటిలో ఒక దానిని లయకారుడు శివుడి కి మరి ఒకటి విష్ణువు కు నిర్మించాడు. ఈ దేవాలయ నిర్మాణం లో అనుసరించిన శిల్ప శైలి గ్రీకుల శిల్ప శైలి ని పోలి వుంటుంది.

Photo Courtesy: Varun Shiv Kapur

.బారాముల్లా

.బారాముల్లా

కాశ్మీరు లో గల 22 జిల్లాలలో బారాముల్లా ఒకటి. 4190 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ జిల్లాని 8 తాలుకాలు 16 పంచాయితీలుగా విభజించారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు యొక్క పశ్చిమ భాగం ఈ జిల్లా కి ఒక సరిహద్దు. ఈ జిల్లాకి తూర్పు దిక్కున శ్రీనగర్, లడఖ్ లున్నాయి. కుప్వార పట్టణానికి దక్షిణాన, పూంచ్ మరియు బడ్గాంకి ఉత్తర దిక్కులో బారాముల్ల ఉంది.

Photo Courtesy: Aehsaan

దోడ

దోడ

దోడ జిల్లా జమ్మూ కాశ్మీర్ లో సముద్రమట్టానికి సుమారు 1107 మీటర్ల ఎత్తున కలదు. ఇది 1948 లో ఉధంపూర్ జిల్లా నుండి ఏర్పడి జిల్లా స్టేటస్ పొందింది. ఈ ప్రదేశానికి దీదా అనే పాత్రలు తయారు చేసే ఒక ముల్తాన్ వలసదారు పేరు పెట్టారు. ఇపుడు ముల్తాన్ ప్రదేశం పాకిస్తాన్ లో వుంది.

దోడ ప్రదేశం ఒక చక్కని పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశంలో ఆకర్షణలు అంటే అవి భాదేర్వా చింతా వాలీ, సెఒజ్ మైదానం, భై పాదరి వంటివి కొన్నిగా చెప్పవచ్చు. భాదేర్వ కైలాష్ యాత్ర వంటి హిందువుల పుణ్య క్షేత్రం. ప్రతి సంవత్సరం ఆగష్టు నెలలో ఈ యాత్ర చేస్తారు.

Photo Courtesy: Chanchal Rungta

ద్రాస్

ద్రాస్

ద్రాస్ పర్యటనలో సందర్శకులు, పట్టణం నుంచి చేరువలోనే ఉన్న సురు లోయ కి ట్రెక్కింగ్ చేయవచ్చు. సురు లోయ ట్రెక్, పర్యాటకులకు 4500 మీటర్ల ఎత్తు లో ఉన్న ఉంబాల కనుమకు ఇరువైపులా ఉన్న మెట్ట గ్రామాలు, అందమైన హరిత ప్రాంతాలు చూసే అవకాశం ఇస్తుంది. పర్యాటకులు ఇక్కడ నుండి అమర్ నాథ్ గుహకి నడక మార్గం కూడా తీసుకోవచ్చు.

జోజిల క్రింద ఉన్న మినామర్గ్ నుండి ప్రారంభించే ట్రెక్ లో భాగంగా, 3 రోజులలో 5200 మీటర్ల ఎత్తు గల కనుమ దాట వలసి ఉంటుంది. ద్రాస్ పట్టణం అనేక మెట్ట గ్రామాలకు చిన్న స్థాయి పర్వతారోహణ అవకాశం కూడా అందిస్తుంది.

Photo Courtesy: Rohan

గుల్మార్గ్

గుల్మార్గ్

ఒకప్పుడు గుల్మార్గ్ ప్రదేశం రాజులు, మహారాజులకు వేసవి విడిది ప్రదేశంగా వుండేది. అయితే, సుమారుగా 1985 ల నుండి కాశ్మీర్ ప్రాంతంలోని ఈ భూభాగం ఒక పర్యాటక ఆకర్షణగా రూపు దిద్దుకుంటోంది. గుల్మార్గ్ అందాల సందర్శనకు కాశ్మీర్ కు వచ్చే పర్యాటకులు లేకపోలేదు. కొద్ది సంవత్సరాలు గడిచే సరికి సాహస క్రీడలు ఆచరించే వారికి ఇది ఒక ప్రధాన ప్రదేశంగా రూపు దిద్దుకొంది. పెద్దవైన పర్వత శ్రేణుల మధ్య స్కై ఇంగ్ ఒక ప్రధాన క్రీడగా మారింది. ఒక్కసారి హిమాలయాలలోని ఈ మంచు ప్రాంతాలు సందర్శిస్తే, ఇక అక్కడ నుండి దూరం అవటం అసాధ్యం. ప్రపంచం నలుమూలలనుండి, పర్యాటకులు ఈ ప్రదేశానికి వచ్చి, వారి ఆనందాలు అధికం చేసుకుంటారు.

 హేమిస్

హేమిస్

జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ హేమిస్. ఇది లెహ్ నుండి 40 కిలోమీటర్ల దూరం లో ఉంది. ప్రకృతి ఒడిలో కొద్దిసేపు గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం ఏంతో అనువైనది. హేమిస్ ఆశ్రమం లేదా గొంప గా పర్యాటకులలో ప్రాచుర్యం చెందింది. 1630 లో సత్సంగ్ రస్ప నవంగ్ గ్యాట్సో మొదటి అవతరముచే ఈ ఆశ్రమం నిర్మించబడింది. 1672 వ సంవత్సరంలో మహాయోగ తంత్ర పాఠశాల ఆధ్యాత్మిక బోధనలు ప్రచారం చేసేందుకు రాజా సెంగె నంపర్ గారిచే పునఃస్థాపించబడినది.ఈ హేమిస్ ఆశ్రమంలో ఉన్న ప్రధాన ఆకర్షణ బుద్ధుని తామ్ర విగ్రహం.

Photo Courtesy: Michael Douglas Bramwell

జమ్మూ & కాశ్మీర్

జమ్మూ & కాశ్మీర్

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హిమాలయాల ఒడిలో కల జమ్మూ & కాశ్మీర్ ప్రదేశం, సహజ అంద చందాలకు భారత దేశం లోనే కాదు ప్రపంచ వ్యాప్తం గా గుర్తించ బడింది. జమ్మూ కాశ్మీర్ ప్రధానంగా మూడు ప్రాంతాలు కలిగి వుంది. అవి, కాశ్మీర్ వాలీ, జమ్మూ, మరియు లడఖ్ లు. ఈ ప్రాంత సరిహద్దులు హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాలతో కలసి వున్నాయి. ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశం కావటం వలన ఈ ప్రాంతం సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తూనే వుంటుంది. ఈ ప్రదేశం, ప్రకృతి ప్రియులను, ఔత్సాహికులైన సాహస క్రీడాకారులను ఒకటిగానే ఆకర్షిస్తుంది.

Photo Courtesy: Sudesh Nayak

లడఖ్

లడఖ్

సింధు నదీ తీరాన ఉన్న లడఖ్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ప్రధాన నగరం లెహ్ కాకుండా, ఇక్కడికి సమీపంలో అల్చి, నుబ్రా లోయ, హేమిస్, లమయురు, జంస్కర్ లోయ, కార్గిల్, పంగోంగ్ త్సో, త్శో కర్, త్సో మొరిరి లాంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రం ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు, ఈ ప్రదేశం యొక్క కొన్ని ఆకర్షణీయమైన అంశాలు. ఈ రాష్ట్రం లోని సాధారణంగా మాట్లాడే భాషలు లడఖి, పురిగ్, టిబెటన్, హిందీ మరియు ఇంగ్లీష్ .

Photo Courtesy: T. R. Shankar Raman

లెహ్

లెహ్

సింధు నది ఒడ్డున, హిమాలయ, కరకోరం పర్వత శ్రేణుల మధ్య నెలకొని వుంది లెహ్ నగరం. ఈ నగరం అందం దేశం నలుమూలల నుంచి యాత్రికులను ఏడాది పొడవునా ఆకర్షిస్తుంది. 16, 17 శతాబ్దాల నాటి మసీదులు, బౌద్ధారామాలతో నగరంలోని ప్రధాన భాగం నిండి వుంటుంది. మధ్య యుగాల నాటి నిర్మాణ శైలిలో నిర్మించబడి నాంగ్యాల్ వంశ రాజు సేంగ్గే నాంగ్యాల్ నివసించిన ప్రాచీన తొమ్మిది అంతస్తుల ప్రాసాదం ఈ నగరంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.

నుబ్రా వాలీ

నుబ్రా వాలీ

నుబ్రా వాలీ ని ఒకప్పుడు పూవుల లోయ అని పిలిచే వారు. ఈ వాలీ సముద్రమట్టానికి పది వేల అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రాంతాన్ని లడఖ్ తోట అని కూడా అంటారు. వేసవులలో టూరిస్టులు ఈ ప్రాంతంలో అధికంగా పసుపు, పింక్ వర్ణాలు కలిగిన గులాబి పూవులను చూస్తారు ఈ ప్రాతం చరిత్ర సుమారు 7 వ శతాబ్దానికి చెందినది. దీనిపై చైనీయులు, మంగోలులు, అరబ్బులు దండెత్తారు. ఇస్లాం ఇక్కడ పుట్టేముందు బౌద్ధ మతం వ్యాప్తిలో వుండేది.

నుబ్రా వాలీ చేరాలంటే టూరిస్టులు లెహ్ నుండి ప్రపంచంలోనే ఎత్తైన ఖార్ దుంగ్ లా పాస్ గుండా ప్రయాణించాలి. ఖార్ దుంగ్ లా పాస్ సంవత్సరం పొడవునా మంచుతో కప్పు బడి వుంటుంది. ఈ కారణంగా ఈ మార్గ నిర్వహణ మన దేశపు బోర్డర్ రోడ్స్ సంస్థకు అప్పగించబడినది. నుబ్రావాలీలో పనామిక్ గ్రామం, ఇన్సా మరియు డిసకిట్ చర్చిలు ప్రధాన ఆకర్షనలు గా వుంటాయి.

Photo Courtesy: Steve Hicks

పాన్గోంగ్

పాన్గోంగ్

పాన్గోంగ్ - త్సో ని పాంగోంగ్ సరస్సు అని కూడా పిలుస్తారు. ఇది జమ్మూ మరియు కాశ్మీర్ లోని లెహ్ జిల్లాలో ఉన్నది. ఇది సముద్ర మట్టానికి 4350 మీ. ఎత్తున ఉన్నది. ఇది చైనా క్రింద ఉన్న టిబెట్ సరిహద్దుగా ఉన్న చాంగ్ తాంగ్' పీఠభూమి మీద ఉన్నది. ఈ సరస్సు యొక్క పొడవు 134 కి.మీ. పైన ఉండి, దీనిలో సగానికి పైగా టిబెట్ మీద ఉన్నది. భారతదేశం స్పష్టంగా చైనీస్ దాడులు పరిశీలించటానికి ఎక్కడ నుండి వీలవుతుందో ఇది అక్కడే ఖచ్చితమైన ప్రాంతంలో ఉంది. సరస్సు ఈ విధంగా వివాదాస్పద భూభాగం మారింది. దీని గుండా లైన్ అఫ్ యాక్చువల్ కంట్రోల్ వెళుతున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X