» »సాహస క్రీడల అభిమానులు మెచ్చే మధుగిరి కోటకు వెళ్లి చూసొద్దామా !

సాహస క్రీడల అభిమానులు మెచ్చే మధుగిరి కోటకు వెళ్లి చూసొద్దామా !

By: Venkata Karunasri Nalluru

"రాజులు పోయినా, రాజ్యాలు పోయినా..." వారికి గుర్తుగా ఉన్న కోటలు మాత్రం మిగిలే ఉంది. మధుగిరి అంటే తేనె కొండ అని అర్ధం. ఇక్కడి అనుభవం తేనె అంత మధురంగా వుంటుంది. ఇక్కడ కల ఏక రాయి ఆసియ లో పెద్దది, ప్రపంచంలో రెండవ పెద్దదిగా చెపుతారు. ఇక్కడ ఒక బ్లాక్ బాక్ సంక్చురి కలదు. కొండ కింద కల మధుగిరి కోట మిమ్మల్ని గత చరిత్రలోకి తీసుకు వెళుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు పట్టణానికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో మధుగిరి కోట వున్నది. ఈ మధుగిరి కోట, సుమారు మూడున్నర వేల అడుగుల ఎత్తైన ఏకశిలా పర్వతాన్ని కలుపుకొని ఈ కోట నిర్మించబడింది. మొదట్లో దీన్ని మధు అని పిలిచేవారు. కాలానుగుణంగా మద్గరి.....మద్దగిరి అనే పేర్లు వచ్చాయి. మైసూరు రాజులు ఈ ప్రాంతాన్ని తమ రాజ్యంలో కలుపుకున్న తరువాత దీనికి "ప్రసన్న గిరి" అని పేరు పెట్టారు.

మధుగిరి కర్ణాటక తుంకూర్ జిల్లా లో ఉన్న ఒక పట్టణం. మధుగిరి కొండ పైకి ఎక్కడానికి అనేక పాయింట్లు వద్ద ఏటవాలుగా వుంది. కనుక వర్షాకాలం సమయంలో కొండ ఎక్కడం మంచిది కాదు. కొండ పైన ఒక ఆలయం ఉంది.

మధుగిరి గురించి తెలుసుకోవలసిన విషయాలు

1. చరిత్ర

1. చరిత్ర

హైదర్ అలీ మైసూర్ సంస్థానాధీశుడైన తరువాత దీనికి "పతేబాద్" అని పేరు మార్చాడు. అక్కడ లభించిన శాసనాలను బట్టి దీనికి కృష్ణ గిరి... మాధవ గిరి అని పేర్లున్నట్లు తెలుస్తున్నది. ఆంగ్లేయుల కాలంలో దీన్ని "మద్దగిరి" అని పిలిచేవారు. ఆంగ్లేయులు ఆ పేరును సరిగా పలకలేనందున 1927 వ సంవత్సరంలో అక్కడ ఆంగ్లేయుల అధికారిగా పనిచేసిన మాస్తి వెంకటేష్ అనే సుప్రసిద్ద కన్నడ కవి దీనికి "మధుగిరి" అని పేరు పెట్టాడు. ఈ పర్వతం ఆసియాలోనే అతి పెద్ద ఏకశిలా పర్వతమని స్థానికులంటారు. కొండ పైన విశాల ప్రదేశం తియ్యటి నీటి కొలనులు, ఉన్నాయి. పైకి ఎక్కడానికి మెట్లదారి ఉంది. ఈ కోటను టిప్పు సుల్తాన్ కాలంలో మరింత భద్రంగా తీర్చి దిద్దాడు. కోట గోడలు, బురుజులు ఇప్పటికి చెక్కుచెదరలేదు. కోట వెలుపల ఆనాడు అత్యంత సుందరంగా నిర్మించిన రెండు పుష్కరణిలు ఈనాటికి చెక్కు చెదర కుండా ఉన్నాయి. కొండ దిగువనుండి కోట లోపలికి ప్రవేశించి కొండ పైకి వెళ్లాలంటే 15 కోట ద్వారాల నుండి వెళ్ళాల్సి వుంటుంది. ఈ కోట వైశాల్యం సుమారు 232 ఎకరాలుంటుంది. కోట లోపల కొన్ని ఆలయాలలోను, శిథిల మందిరాలలోను నిధుల కోసం ఇటీవల దుండగులు కొందరు రహస్యంగా త్రవ్వకాలు సాగించారు. ఆ కారణంగా కొన్ని కట్టడాలు శిథిలమైనాయని స్థానికులు చెప్తున్నారు.
PC: Saurabh Sharan

2. ప్రాముఖ్యత

2. ప్రాముఖ్యత

జయమంగలి కృష్ణ జింక రిజర్వ్ మైదానం: ఆసియాలోనే రెండవ అతిపెద్ద ఏకశిల మధుగిరిలో వుంది. జయమంగలి కృష్ణ జింక రిజర్వ్ మైదానంను హళ్లీ కృష్ణ జింక అభయారణ్యం అని పిలుస్తారు. మధుగిరి నుండి 25 కిలోమీటర్ల దూరంలో కొడిగెనహళ్లి దగ్గరలో ఉంది. రిజర్వ్ లోపల రాత్రిపూట శిబిరాలకు కోసం ముందుగా అనుమతి తీసుకోవాలి.
PC: Saurabh Sharan

3. చెన్నరాయన దుర్గ

3. చెన్నరాయన దుర్గ

చెన్నరాయన దుర్గ తుంకూర్ ద్వారా మధుగిరి మార్గంలో కొరటగెరె నుండి 10 కిమీ దూరంలో వుంది. తొమ్మిది దుర్గ కోటలలో ఇది ఒకటి. కోట లోపల ఒక చిన్న ఆలయం మరియు పాత నిర్మాణాలు వున్నాయి. సిద్దర మెట్ట ఔషధ మూలికలకు ప్రసిద్ధి చెందింది. కొండ పైన వున్న అరణ్యాలలో ఔషధ విలువలు కలిగిన వృక్షాలు వున్నాయి.
PC: Saurabh Sharan

4. మధుగిరి ఫోర్ట్

4. మధుగిరి ఫోర్ట్

మధుగిరి ఫోర్ట్ విజయనగర్ రాజవంశం వారు నిర్మించినది. జైన దేవాలయాలు కూడా ఈ ప్రదేశంలో కనిపిస్తాయి. మధుగిరి ఫారెస్ట్ ను తిమ్మలపుర ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ఫారెస్ట్ మగ కోళ్ళు, ఎలుగుబంట్లకు పేరుగాంచింది.
PC: Saurabh Sharan

5. మధుగిరి పట్టణంలో గల దేవాలయాలు

5. మధుగిరి పట్టణంలో గల దేవాలయాలు

పట్టణంలో వెంకటరమణ మరియు మల్లేశ్వర దేవాలయాలు పక్కపక్కనే వున్నాయి. ఇక్కడ దేవాలయాలు ద్రావిడ శైలిలో నిర్మించబడ్డాయి. గర్భ గృహాలయం హొయసల కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది. శ్రీ హరిహరస్వామి దేవాలయం తూర్పుముఖంగా వుంది. క్రీ.శ. 979 శాలివాహన శకంలో నిర్మించారు. వీరశైవ గుర్రమ్మన మఠం వద్ద శివలింగస్వామి అనే గురువు యొక్క సమాధి ఉంది. మఠానికి సమీపంలో కొన్ని గుహలు వున్నాయి. అంతరాలదా బాగిలు, దిడ్డిబాగిలు మరియు మైసూర్ గేట్ వంటి అనేక ద్వారాలు కలిగిన కొండ దారి.
PC: Saurabh Sharan

6. దేవరాయన దుర్గ:

6. దేవరాయన దుర్గ:

దేవరాయనదుర్గలో ప్రధాన ఆకర్షణ యోగనరసింహ దేవాలయం. ఇక్కడ దగ్గరలో వున్న కొండలుదేవరయన్ దుర్గ కొండలు.
PC: Dineshkannambadi

7. నంది కొండలు:

7. నంది కొండలు:

నంది హిల్స్ బెంగుళూరు వారికి ఒక ప్రముఖ హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 478మీ ఎత్తులో వుంది. కొండలు మార్గంలో పొద్దుతిరుగుడు తోటలు మరియు వైన్ యార్డులు ఉన్నాయి.

శివగంగే : శివగంగే మార్గంలో దేవాలయాల వరుస పొడవైన శృంగాకారకారంలో వున్నాయి.

స్కందగిరి: స్కందగిరి కర్నాటకలో చిక్ బల్లాపూర్ పట్టణం సమీపంలో పర్వతంపై ఉంది. స్కందగిరి రాత్రి ట్రెక్కింగ్ ప్రసిద్ధి చెందింది.
PC: Saurabh Sharan

8. మధుగిరి చూచుటకు మంచి సమయం

8. మధుగిరి చూచుటకు మంచి సమయం

మధుగిరి కొండ ట్రెక్ కు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి నెలలు.
PC: Saurabh Sharan

9. చేరుకోవడానికి ఎలా

9. చేరుకోవడానికి ఎలా

మధుగిరి బెంగుళూర్ నుండి 100 కి.మీ దూరంలో వుంది.

రూట్ 1: బెంగుళూర్ - నెలమంగళ - డబ్బసపేటే - కొరతగెరే - మధుగిరి

మధుగిరి కోటకు కెంపెగౌడ బస్ స్టాండ్ నుండి ప్రత్యక్షంగా కె.ఎస్.ఆర్.టి.సి బస్సులు మరియు కె.ఆర్ మార్కెట్ బస్ స్టేషన్ నుంచి ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ట్రెక్ ప్రారంభ స్థానం మదిగిరి ప్రభుత్వ కార్యాలయ భవనాల మధ్య ఉంది. మధుగిరి మెట్ట ట్రెక్కింగ్ కు మీ వెంట నీటిని తీసుకుని వెళ్ళడం ఉత్తమం.
PC:Google maps

10. ఆహారం మరియు వసతులు

10. ఆహారం మరియు వసతులు

మధుగిరి పట్టణం వద్ద పండ్లు, పానీయాలు, స్నాక్స్ అమ్మకం దుకాణాలు అందుబాటులో ఉన్నాయి.
PC: Saurabh Sharan

Please Wait while comments are loading...