Search
  • Follow NativePlanet
Share
» »ఆ సమయంలో తిరుపతి వెంకన్న విగ్రహంలో శక్తి ఉండదు, ఆ శక్తి ఎక్కడికి పోతుందో తెలుసా?

ఆ సమయంలో తిరుపతి వెంకన్న విగ్రహంలో శక్తి ఉండదు, ఆ శక్తి ఎక్కడికి పోతుందో తెలుసా?

తిరుపతిలో జరిగే బాలాలయ మహా సంప్రోక్షణ గురించి కథనం.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ముఖ్యంగా తిరుపతిలోని వేంకటేశ్వరుడిని సేవించేవారు బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? ఆ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా? లేదా? ఒక వేళ ఇస్తే ఏ ఏ సమయంలో ఆ దర్శన భాగ్యం కల్పిస్తారన్న విషయం పై చర్చించుకొంటున్నారు.

అంతేకాకుండా మిగిలిన రోజులతో పోలిస్తే వారాంతాల్లో అంటే వీకెండ్ సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అయితే ఆ మహా సంప్రోక్షణ కూడా అదే సమయంలో జరుగుతుండటం వల్ల తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలా వద్దా అన్న విషయం పై పర్యాటకులు కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వీటన్నింటికీ సమాధానమే ఈ కథనం.

పన్నెండేళ్లకు ఒకసారి

పన్నెండేళ్లకు ఒకసారి

P.C: You Tube

నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్లే తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి దీనిని నిర్వహిస్తారు.

 విగ్రహ ప్రతిష్టాపన

విగ్రహ ప్రతిష్టాపన

P.C: You Tube

ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్టాపన. తర్వాత శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ పనులు. సజీవంగా ఉండే ఓ దేవతా మూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగేలా విగ్రహంలో ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు.

అలా మలినమయ్యే అవకాశం ఉంది

అలా మలినమయ్యే అవకాశం ఉంది

P.C: You Tube

ఇక తిరుమలలో శ్రీవారికి ప్రతి రోజూ అనేక ఉపచారాలు, నివేదనలు జరుగుతాయి. ఈ సమయంలో పాత్రలు లేదా కొన్ని పదార్థాలు కింద పడినప్పుడు ఎంతో కొంత మాలిన్యాలు గర్భాలయంలోకి చేరుతాయి. వీటి వల్ల కొన్ని సార్లు గర్భాలయంలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.

అపచారంగా భావించి

అపచారంగా భావించి

P.C: You Tube

ఇది అపచారంగా భావించి పన్నెండేళ్లకోసారి గర్భాలయంలో అర్చకులే వాటికి మరమత్తులు చేస్తారు. ఈ క్రమంలో మొదట శ్రీవారి మూలవిరట్ పాదాలకు పద్మపీఠం మధ్యలో ఉన్న భాగాన్ని లేపంతో నిపటమే అష్టబంధన కార్యక్రమం.

8 రకాల వస్తువలతో

8 రకాల వస్తువలతో

P.C: You Tube

ఈ కార్యక్రమంలో భాగంగా 8 రకాల వస్తువలతో తయారుచేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదల కింద మూలవిరాట్ సమీపంలో ఉంచుతారు. ఇందులో నల్లసరిగళం, కరక్కాయ, ఎర్రపత్తి, వెన్న, కండచెక్కర, లక్క, చెకుముకిరాయి, బెళ్లం ఉంటాయి.

ఆయా ప్రదేశాల్లో ఉంచుతారు.

ఆయా ప్రదేశాల్లో ఉంచుతారు.

P.C: You Tube

ఈ వస్తువుల మిశ్రమాన్ని మూలవిరాట్ తో పాటు ఆధార్ పీఠం, పాదపీఠం మధ్యలో సన్నపాటి ప్రదేశంలో, మూలవిరాట్ పై భాగంలో గోడకు ఉన్న రంధ్రాల్లో ఈ చూర్ణాన్ని అద్దుతారు. కాల క్రమంలో ఈ మిశ్రమం కరిగిపోవడం, రంగు మారడం వల్ల మూలవిరాట్ లో శక్తి తగ్గితోతుంది.

శక్తిని పెంపొందించడానికే

శక్తిని పెంపొందించడానికే

P.C: You Tube

తిరిగి ఆ శక్తిని పెంపొందించేందుకే అష్టబంధన బాలాయన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మహాసంప్రోక్షణ శ్రీవారి ఆలయంలో 1958లో ప్రారంభమయ్యింది. చివరిగా 2006లో జరిగింది. మళ్లీ ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రారంభమవుతోంది.

 క్లుప్తంగా చెప్పాలంటే

క్లుప్తంగా చెప్పాలంటే

P.C: You Tube

క్లుప్తంగా చెప్పాలంటే ఆలయంలో మరమ్మత్తు పనులను నిర్వహించడానికి నిర్దేశించిన కార్యక్రమమే మహా సంప్రోక్షణ. అయితే శ్రీవారి ఆలయంలోకి అర్చకులు, జీయ్యంగార్లు మినహా మరెవ్వరినీ అనుమతించరు.

అష్టబంధన కార్యక్రమం

అష్టబంధన కార్యక్రమం

P.C: You Tube

దీంతో అక్కడ జరిగే మరమ్మతులను వారే నిర్వహించాలి. ఇతర ఆలయాల్లో మాదిరి ఆలయం లోపలికి ఇంజనీరింగ్ అధికారులను అనుమతించరు. మహా సంప్రోక్షణంలో మూలవిరాట్ పాదాలు, పద్మపీఠం మధ్యన అష్టబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

మూడు విభాలుగా.

మూడు విభాలుగా.

P.C: You Tube

ఈ బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీవారి మూలవిరాట్ లో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేస్తారు. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న పాత కళ్యాణ మంటపంలో ప్రత్యేకంగా 24 యాగశాలలను ఏర్పాటు చేస్తారు.

అక్కడ కుంభాన్ని ఉంచుతారు.

అక్కడ కుంభాన్ని ఉంచుతారు.

P.C: You Tube

అక్కడ స్వామివారి శక్తిని ఆవాహన చేసిన కుంభాన్ని ఉంచుతారు. మూలవిరాట్ కు నిత్యం నిర్వహించే పూజా కైంకర్యాలను ఈ కుంభానికి నిర్వహిస్తారు. ఆఖరి రోజున మహా సంప్రోక్షణతో స్వామివారి శక్తిని తిరిగి మూలవిరాట్ లోకి పంపింస్తారు.

నూతనంగా నిర్మించినట్లే

నూతనంగా నిర్మించినట్లే

P.C: You Tube

ఈ కార్యక్రమంలో మూలవిరాట్ లోకి తిరిగి మూలవిరాట్ ని నూతనంగా నిర్మించినట్లేనని చెబుతారు.అష్టబంధన బాలాయన మహాసంప్రోక్షణం ఆగస్టు 11 నుంచి 15వ తేది వరకూ జరగనుంది. ఇందులో ఆగస్టు 11వ తేది శనివారం రోజు మొత్తంలో 9 గంటల సమయాన్ని మాత్రం దర్శనానికి కేటాయించనున్నారు.

ఆయా రోజుల్లో

ఆయా రోజుల్లో

P.C: You Tube

12వ తేది ఆదివారం 4 గంటల సమయం, 13వ తేది సోమవారం 5 గంటల సమయం, 14వ తేది మంగళవారం 5 గంటల సమయం, 15వ తేది బుధశారం 6 గంటల సమయంలో మాత్రమే భక్తులకు శ్రీవారిని దర్శించే అవకాశం కల్పించనున్నారు.

మొత్తం 29 రోజుల్లో

మొత్తం 29 రోజుల్లో

P.C: You Tube

మొత్తంగా ఆగస్టు 11 నుంచి 15వ తేది వరకూ అంటే ఐదు రోజుల్లో మొత్తం 29 గంటల సమయం మాత్రమే శ్రీవారిని దర్శించడానికి అనుమతి ఉంటుంది. ఈ సమయంలో 15వేల మంది దర్శించుకోవచ్చు. కాబట్టి మీరు ఆ రోజుల్లో తిరుపతి ప్రయాణాన్ని పెట్టుకొని ఉంటే మాత్రం పునరాలోచించుకోండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X