Search
  • Follow NativePlanet
Share
» »గోవా .... నీ అందం ఆదరహో !!

గోవా .... నీ అందం ఆదరహో !!

గోవా... కేవలం టూరిజం మీదే బతికే రాష్ట్రం ఇది. భారతదేశంలో ఆంతర్భాగమైన ఈ రాష్ట్రం మహారాష్ఠ , కర్నాటక , అరేబియా సముద్రాలు సరిహద్దులుగా కలిగి ఉంది.

By Venkatakarunasri

గోవా... కేవలం టూరిజం మీదే బతికే రాష్ట్రం ఇది. భారతదేశంలో ఆంతర్భాగమైన ఈ రాష్ట్రం మహారాష్ఠ , కర్నాటక , అరేబియా సముద్రాలు సరిహద్దులుగా కలిగి ఉంది. పడమటి తీరంలో గోవా ఎంతో కాలంగా ఒక ఆకర్షణీయ విహార స్ధలంగా పేరుగాంచింది. అక్కడ లభించే చవకైన ఆల్కహాల్ నుండి మొదలుకొని అందమైన బీచ్ వరకు అన్ని ఆకర్షణీయమే. ఈ రాష్ట్రం ప్రపంచంలోని వివిధ దేశాలనుండి పర్యాటకులను ఆకర్షిస్తోంది. బీచ్ ప్రదేశాలు కల బ్యాంకాక్ , ఇబిజ వంటి పట్టణాలతో పోలిస్తే, గోవా అధిక పర్యాటకులను ఆకర్షిస్తుంది. కొంకణ తీరాన కొలువై ఉన్న గోవా... వైశాల్యం రీత్యా దేశంలో రెండవ అతిచిన్న రాష్ట్రం. అయితే... పర్యాటకంగా అభివృద్ధి చెందిన విహారకేంద్రాల్లో గోవాయే భారత టూరిజం క్యాపిటల్‌ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోవా రాజధాని పనాజీ.

భోజనం

భోజనం

వరి అన్నం , చేపల కూర ఇక్కడి ప్రధాన ఆహారం. కొబ్బరి, మసాలా దినుసులు, జీడిమామిడి, మిర్చి వంటి ద్రవ్యాలు వాడి తయారు చేసే రుచికరమైన వంటకాలు సందర్శికులను ఎంతగానో సంతృష్టపరుస్తాయి. జీడిమామిడి, కొబ్బరి కల్లు నుండి తయారు చేసిన 'ఫెన్నీ' అనే డ్రింక్‌ ఇక్కడి ప్రత్యేకత. సీ ఫుడ్‌ ఇష్టపడే వారికి గోవాను వదిలి రాబుద్ధి కాదు. అవకాశం వచ్చినప్పుడే కదా ఉపయోగించుకోవాలి. ఈ టూర్‌ లో వున్నప్పుడే బోలెడన్ని రకాల వంటకాలు రుచి చూడొచ్చు.

Photo Courtesy: goanfishcurryrice3

మిరామర్ బీచ్

మిరామర్ బీచ్

నైట్‌ రివర్‌ క్రూయిజ్‌ షిప్‌ మీద మండోవి నదిలో వెన్నెల విహారం, షిప్‌ డెక్‌ మీద డాన్సులూ, గానా భజానా... పెద్దలూ, పిల్లలూ, జంటలూ అందరూ కలిసి ఆహ్లాదంగా గడపొచ్చు. గోవా రాజధాని పనాజి నుండి మిరామర్ బీచ్ సుమారు 3 కి.మీ.ల దూరం మాత్రమే. మిరామర్ బీచ్ లో ఇసుక బంగారు వన్నె కలిగి ఉంటుంది. తాటి చెట్లు వరుసగా నిలబడి సుందరంగా కనపడతాయి. దీనికిగల రెండు కిలోమీటర్ల తీరం చక్కని నడకకు సరిపోతుంది. ఈ ప్రాంతం సిల్వర్ శాండ్ ప్రాంతంగా ప్రసిద్ధి కెక్కింది. చంద్రుడి వెన్నెల పడిందంటే చాలు ఇసుక మెరిసిపోతూ ఉంటుంది.

Photo Courtesy: Amit Ingle

కలన్‌ గుటే బీచ్‌

కలన్‌ గుటే బీచ్‌

గోవాలో చాలా ఫేమస్‌ అయినది కలన్‌గుటే బీచ్‌ . దీన్ని క్వీన్‌ ఆఫ్‌ బీచ్స్‌ అంటారు. ఇది చాలా రద్దీగా వుంటుంది. పారాసైలింగ్‌ లాంటి వాటర్‌ స్పోర్ట్‌‌ స ఇంట్రెస్ట్‌ ఉంటే ఇక్కడ చక్కని కాలక్షేపం. కాలన్ గూటే లో డ్రైఫ్రూట్లు అధికంగా లభిస్తాయి. నోరూరించే జీడిపప్పు వేపుడు, ప్లెయిన్, సాల్ట్ రుచులలో దొరుకుతుంది. ఇక్కడి హోటల్ సౌజా లోబో ప్రత్యేకమైంది. దీనిలోని పీత ఎండ్రకాయలతో చేసిన వంటకాలు అమోఘ రుచి కలిగి నోరు ఊరేలా ఉంటాయి. మీరు నడిచే వారైతే సమీపంలోని బ్రిట్టోస్ లో తినండి. ఇది బాగా బీచ్ లో ఉంటుంది. నడకలో సుమారు 20 నిమిషాల సమయం పడుతుంది.

Photo Courtesy: goa tourism

క్లబ్ క్యూబనా

క్లబ్ క్యూబనా

ఆసియాలో క్లబ్ క్యూబనా ఒకటే రాత్రంతా తెరచి ఉండే ప్రదేశంగాను అంటే, రాత్రంతా ఆనందించినప్పటికి ఏ పోలీస్ జోక్యం లేదా ఏ దుండగుల దాడి ఉండవని చెపుతారు. ఇక్కడ జరిగే పార్టీలలో అపుడపుడు మీరు ఒక హాలీవుడ్ లేదా బాలీవుడ్ సెలిబ్రిటీలను కూడా చూసి ఆనందించవచ్చు. ఆకర్షణీయమైన డేన్స్ ఫ్లోర్ కూడా కలదు. ఈ ప్రదేశాన్ని అధిక సంఖ్యాకులు ఇష్ట పడతారు. ఆహారాలు తక్కువ ఇస్తారన్న పేరున్నప్పటికి, మీరు చక్కటి బీర్, వైన్ వంటి పానీయాలు తాగుతూ ఆనందించేయవచ్చు. దీని ప్రవేశ రుసుము షుమారు రూ.1200 గా ఉంటుంది. అయితే, ఇక్కడ లభించే ఆహారాలు, డ్రింకులకు ఆ మాత్రం రుసుము సమంజసమైనదిగానే భావిస్తారు. మీరు గోవా వచ్చినపుడు తప్పక ఈ ప్రదేశం చూసి ఆనందించాలి.

Photo Courtesy: fotofeewa

మాండ్రేమ్ బీచ్

మాండ్రేమ్ బీచ్

మాండ్రేమ్బీచ్ లో ప్రయివసీ అధికంగా ఉంటుంది. కనుక కొత్తగా పెళ్ళి అయిన జంటలు, హానీమూన్ కు వచ్చినవారు బాగా ఆనందిస్తారు. ఒక పక్కగా, వేరుగా కొద్దిపాటి గుడిసెలు, హోటళ్ళతో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రశాంతంగా ఆనందించాలంటే, చదివేందుకు ఒక పుస్తకం లేదా మరింత ఆనందానికి పక్కలో భార్య ఉండి తీరాలి. బీచ్ లో కాజురినా చెట్లు అధికంగా కనపడతాయి. ఇక్కడి హోటళ్ళలో ఎండ్ ఆఫ్ ది వరల్డ్ సూచించదగినది. ఇది ఒక చిన్న హోటల్ అయినప్పటికి సీఫుడ్డ్ ఎంతో రుచిగా ఉంటుంది. రాత్రి వేళ బీచ్ చేరుకుంటే, ఇసుకలో వాలి ఆకాశంలోని నక్షత్రాలను లెక్కిస్తూ కూడా ఆనందించవచ్చు.

Photo Courtesy: goa tourism

కండోలిం బీచ్

కండోలిం బీచ్

కండోలిం బీచ్ మధ్యస్తంగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికి ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ కల పరిశుభ్రత, నీటి ఆటలు మొదలైనవి మరచిపోలేని అనుభవాలు కలిగిస్తాయి. తీరంనుండి కొద్దిగా బయటకు వెళితే, అందుబాటులో ఉండే రెస్టరెంట్లు, హోటళ్లు కలవు. గోవా వెళ్ళినపుడు బసకు ఈ ప్రదేశం అనువైనది. కండోలిం బీచ్ లో గత 12 సంవత్సరాలుగా రివర్ ప్రిన్సెస్ అనే ఓడ ఒకటి నిలిచి ఉంది. బీచ్ లో అడుగు పెడితే చాలు అందమైన ఇసుక తిన్నెలు కంటికి ఇంపుగా కనపడతాయి.

Photo Courtesy: FaizanAhmad21

సింకెరిమ్ బీచ్

సింకెరిమ్ బీచ్

సింకెరిమ్ బిజీ ప్రాంతమే. కాని ప్రశాంతత కలిగి ఉంటుంది. గోవాలోని పార్టీలు, బీచ్ ల మధ్య విసుగెత్తిన పర్యాటకులు ఈ బీచ్ లో రిలాక్స్ అవచ్చు. సింకేరిం బీచ్ రాజధాని పనాజికు మరియు ప్రసిద్ధ కండోలిం బీచ్ కు 13 కి.మీ.ల దూరంలో మాత్రమే కలదు. కనుక ఇక్కడకు చేరటం తేలిక. బీచ్ ప్రశాంతంగా ఉండి కొన్ని నీటి క్రీడలను కూడా అందిస్తుంది. ఈ ప్రాంతంలో మీరు ఒక పిక్ నిక్ స్పాట్ కొరకు చూస్తూ ఉంటే, సుమారు 2 కి.మీ.ల దూరంలో అర్వలం జలపాతాలున్నాయి. ఈ జలపాతాలు సుమారు 50 మీటర్ల ఎత్తునుండి పడతాయి. ఎంతో శుభ్రమైన కొండల నీరు ప్రవహిస్తుంది. ఈ జలపాతాలు రుద్రేశ్వర్ దేవాలయానికి సన్నిహితంగా ఉంటాయి. అక్కడనుండి సమీపంలోని అరవలం గుహలు కూడా చూడవచ్చు.

Photo Courtesy: goa tourism

ఉటోర్డా బీచ్

ఉటోర్డా బీచ్

ప్రశాంతమైన నడక, సన్ బాత్ లేదా మధ్యాహ్నం వేళ స్ధానిక ఆహారాలు, ఆల్కహాలు తాగి, ప్రశాంతమైన నిద్ర వంటివి ఆచరించాలనుకునేవారికి ఉటోర్డా బీచ్ తగినది. ఇక్కడ కూడా పూరి పాకలుంటాయి. బీచ్ పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉండి తీరం వెంబడి కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఉంటాయి. బంగారు రంగు ఇసుకతో బీచ్ నిండి ఉంటుంది. ఇక్కడ రోజంతా లైఫ్ గార్డులుండటంచే సురక్షితంగా ఈత కొట్టవచ్చు. జీబాబ్ షాక్ మార్టిన్ కార్నర్ గా చెప్పబడే ఒక రెస్టరెంటు మీరు తప్పక ఆనందించాలి.

Photo Courtesy: goa tourism

కోల్వా బీచ్

కోల్వా బీచ్

ప్రసిద్ధి చెందిన కోల్వా బీచ్ దక్షిణ గోవా జిల్లాలో కలదు. నార్త్ గోవాలోని బీచ్ ల వలే కాకుండా కోల్వా బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. తెల్లటి ఇసుక తిన్నెలు. సుమారు 24 కిలోమీటర్ల తీరం ఉంటుంది. ప్రపంచంలోని అతి పొడవైన బీచ్ లలో కోల్వా బీచ్ ఒకటి. దక్షిణ గోవా కూడా పార్టీలకు నైట్ కల్చర్ కు పేరు పడిందే. అయితే ఇక్కడి హోటళ్ళు, రెస్టరెంట్లు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. కోల్వా ఇక్కడే కల కొన్ని ప్రధాన హోటళ్ళకు సమీపంలో ఉంటుంది.

Photo Courtesy: Portugal

బాగా బీచ్

బాగా బీచ్

బాగా తప్పక చూడవలసిన ప్రదేశం. బాగా బీచ్ ఎంతో గ్రాండ్ గా ఉండటమే కాక మీకు అమితమైన ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఈ బీచ్ లో పారాసెయిలింగ్, వాటర్ బైక్ రైడ్, బనానా రైడ్, బోటింగ్ వంటివి ఉంటాయి. బీచ్ ప్రవేశంలోనే బ్రిట్టోస్ కేఫ్ ఉంటుంది. దీనిలో కావలసినంత ఆల్కహాల్ మరియు కాక్ టెయిల్స్ మరియు వాటితోపాటు సీఫుడ్స్ దొరుకుతాయి. దీనిలో గోవా ఫిష్ కర్రీ రైస్ తప్పక తినాలి. సాయంత్రం అయిందంటే చాలు, సముద్రపు అలలు సుమారుగా బ్రిట్టోస్ ముందు భాగం వరకు వచ్చేస్తాయి. వాటిని చూస్తూ రుచికరమైన డిన్నర్ ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. బాగా బీచ్ లో రాత్రి కచేరీలు సర్వ సాధారణం. ఇక్కడి గుడిసెలు చాలావరకు సాయంత్రం అయిందంటే చాలు కచేరీ ఏర్పాట్లు చేస్తాయి. వివిధ రకాల రుచులతో హుక్కాలు కూడా ఏర్పాటు చేస్తారు. గోవాలోని వివిధ ప్రదేశాలనుండి బాగా బీచ్ కు వచ్చేస్తారు.

Photo Courtesy: ddasedEn

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

వాయు మార్గం

దబోలిమ్ ఎయిర్‌పోర్టు మాత్రమే గోవాలో ఉన్న ఎయిర్‌పోర్టు . ఈ ఏర్ పోర్టు నుండి రాజధాని పనాజి కి 59 కి .మీ .దూరం ఉంటుంది. ఇక్కడికి బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ, చెన్నై, ముంబై, కొచ్చి తదితర ప్రాంతాల నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

రైలు మార్గం

గోవాలో రెండు రైల్వే మార్గాలున్నాయి. ఒకటి స్వాతంత్య్రానికి పూర్వం నిర్మించిన వాస్కోడిగామా - హుబ్లీ మార్గం. రెండోది 20 వ శతాబ్దంలో నిర్మించిన కొంకణ్‌ రైల్వే మార్గం. హైదరాబాద్‌ నుండి కాచిగూడ టు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉంటుంది. ఇది వాస్కోడిగామా స్టేషన్‌కు తరువాతి రోజు మధ్యాహ్నం చేరుకుంటుంది. విజయవాడనుండైతే అమరావతి ఎక్స్‌ప్రెస్‌ (హౌరా-వాస్కోడిగామా) ప్రతి సోమ, మంగళ, గురు, శని వారాల్లో ఉంటుంది.

రోడ్డు మార్గం

హైదరాబాద్‌ నుండి గోవాకి ఎపి టూరిజం వారి ఐదురోజుల టూర్‌ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఎసి, నాన్‌ ఎసి, హైటెక్‌ కోచ్‌... ఇలా చాలా రకాలున్నాయి. ప్రైవేటు ఆపరేటర్లు నడిపే బస్సులు గోవాలో ప్రధానమైన రవాణా సౌకర్యం. ప్రభుత్వ రంగంలో ఉన్న కదంబ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషను ముఖ్యమైన రూట్లలోను, కొన్ని గ్రామీణ ప్రాంతాలలోను బస్సులు నడుపుతుంది. కాని ఎక్కువ మంది ప్రయాణాలకు తమ స్వంత వాహనాలనే వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాల వినియోగం ఎక్కువ. ప్రైవేట్ వాహనాలు టాక్సీలు, ఆటో రిక్షాలు ప్రజల ప్రయాణాలకు అద్దెకు దొరికే వాహనాలు. మోటారు సైకిలు టాక్సీ అనేది గోవాకు ప్రత్యేకమైన అద్దె టాక్సీ - ఇవి పసుపు, నలుపు రంగుల్లో ఉండే మోటారు సైకిళ్ళు. వీటిని నడిపేవారిని "పైలట్లు" అంటారు. ప్రయాణీకుడు వెనుక సీటులో కూర్చుంటాడు. ఇవ్వాల్సిన కిరాయి ముందుగానే బేరమాడుకుంటారు. ఇక్కడ సైకిళ్ల లాగే టూ వీలర్స్‌ కూడా అద్దెకిస్తారు. వీటికి అద్దె రోజుకు 400 పైనే వుంటుంది.

Photo Courtesy: Suhas Desale

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X