Search
  • Follow NativePlanet
Share
» »ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా కోణార్క్‌ తరువాత అంతటి ఖ్యాతిగాంచిన మరొక సూర్యదేవాలయం ఉన్నది. ఇది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి గ్రామంలో ఉన్నది.

By Venkatakarunasri

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా కోణార్క్‌ తరువాత అంతటి ఖ్యాతిగాంచిన మరొక సూర్యదేవాలయం ఉన్నది. ఇది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి గ్రామంలో ఉన్నది. శ్రీకాకుళం పట్టణం నుండి అరసవల్లి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే ఊరి బయట అన్న మాట ..!

మన దేశంలో సూర్య దేవాలయాలు చాలా అరుదు. వాటి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. భారతదేశం మొత్తం మీద ఉన్న సూర్యదేవాలయాలలో ప్రఖ్యాతి గాంచిన సూర్యదేవాలయం ఒరిస్సా రాష్ట్రంలోని కోణార్క్‌లో కలదు. భువనేశ్వర్ కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోణార్క్‌ సూర్యదేవాలయం అంతులేని శిల్ప సంపదతో తలతూగుతోంది. ఉదయం పూట ఈ దేవాలయం మీద పడే సూర్య కిరణాలు ఆలయానికి బంగారు వన్నె తెస్తాయి.

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

అరసవల్లి ఎలా చేరుకోవాలి ?

శ్రీకాకుళం చేరుకున్నారంటే అరసవల్లి చేరుకొన్నట్లే..! ఎందుకంటే అరసవల్లి గ్రామం శ్రీకాకుళం పట్టణానికి కేవలం 3 కి. మీ. దూరంలో ఉంటుంది. పల్లెటూర్లకి వెళ్లే షేర్ ఆటోలు, లోకల్ గా తిరిగే డీజిల్ ఆటోలు అరసవల్లికి కోకోల్లలు.

చిత్ర కృప : s shylendhar

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

అరసవల్లి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

విశాఖపట్టణం విమానాశ్రయం శ్రీకాకుళం పట్టణానికి సమీపాన ఉన్న ఏర్ పోర్ట్( సుమారు 115 కి. మీ). ఈ ఏర్ పోర్ట్ నుండి దేశంలోని అన్ని నగరాలకు విమాన సర్వీసులు నడుస్తుంటాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ వంటి ప్రాంతాల నుండి కూడా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. క్యాబ్ లేదా ట్యాక్సీ అద్దెకు తీసుకొని, లేకుంటే బస్ స్టాండ్ కి వెళ్ళి ప్రభుత్వ బస్సులో ఎక్కి రెండున్నర గంటలు ప్రయాణించి శ్రీకాకుళం చేరుకోవచ్చు. అక్కడి నుండి 3 కి. మీ. దూరంలో ఉన్న అరసవల్లి గ్రామానికి స్థానికంగా తిరిగే అటోల ద్వారా చేరుకోవచ్చు.

చిత్ర కృప : Krystin Spellman

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

అరసవల్లి ఎలా చేరుకోవాలి ?

రైలు మార్గం

అరసవల్లి కి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ శ్రీకాకుళం పట్టణంలోని 'శ్రీకాకుళం రోడ్' రైల్వే స్టేషన్. ఇది అరసవల్లి కి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్థానిక అటోలలో ప్రయాణించి అరసవల్లి దేవాలయానికి చేరుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ కు హైదరాబాద్, గుంతకల్, వైజాగ్, భువనేశ్వర్, చెన్నై, విజయవాడ, గుంటూరు వంటి నగరాల నుండి రైలు సౌకర్యం ఉన్నది.

చిత్ర కృప : indiarailinfo

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

అరసవల్లి ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

శ్రీకాకుళం రాష్ట్రంలోని అన్ని పట్టణాలతో, రాష్ట్రాలతో చక్కటి రోడ్డు వ్యవస్థ ని కలిగి ఉన్నది. వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ వంటి ప్రాంతాల నుండి నిత్యం శ్రీకాకుళం పట్టణానికి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి. శ్రీకాకుళం చేరుకున్న తరువాత స్థానిక ఆటోలలో ప్రయాణించి అరసవల్లి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Sumanth K. Garakarajula

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం

ఆగ్రా కు తాజ్‌మహల్, హైదరాబాద్ కు చార్మినార్ ఎలాగో శ్రీకాకుళం కు అరసవల్లి అలాగా ..! దేశంలో ప్రసిద్ధి చెందిన అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం పురాతనమైనది. పురాణాల ప్రకారం, ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి సూర్యదేవుని విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి.

చిత్ర కృప : Seshagirirao

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం ఆలయ ప్రత్యేకత

ప్రతి ఏటా మార్చి మరియు సెప్టెంబర్ - అక్టోబర్ మాసాలలో 9 - 12 వ తారీఖు వరకు, ఉదయం సుమారు 6 నుండి 6 : 30 గంటల వరకు సూర్య కిరణాలు గర్భగుడి లో ఉన్న మూలవిరాట్టూ పాదాలను తాకుతాయి. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి అశేష భక్త జనం తరలి వస్తారు.

చిత్ర కృప : Seshagirirao

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం

ఆలయం సందర్శన సందర్శించు వేళలు :

ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం 3 : 30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.

చిత్ర కృప : Palagiri

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

నందికొట్కూర్ ఎలా చేరుకోవాలి ?

నందికొట్కూర్ పట్టణం కర్నూలు నగరానికి 45 కి. మీ. దూరంలో ఉన్నది. రోడ్డు మార్గం ద్వారానే ఇక్కడికి సులభంగా చేరుకోగలము. కర్నూలు బస్ స్టాండ్ చేరుకుంటే అక్కడి నుండి నందికొట్కూర్ కు బస్సులు అనేకం తిరుగుతుంటాయి. ఆత్మకూరు, శ్రీశైలానికి వెళ్లే బస్సుల్లో ప్రయాణించినా నందికొట్కూర్ చేరుకోవచ్చు.

చిత్ర కృప : Heather Cowper

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

నందికొట్కూర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

కర్నూలు కు సమీపాన ఉన్న విమానాశ్రయం హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 200 కిలోమీటర్ల దూరంలో కలదు. దేశ, విదేశాల నుండి ఈ విమానాశ్రయానికి అనేక విమానసర్వీసులు తిరుగుతాయి. క్యాబ్ లేదా ట్యాక్సీ అద్దెకు తీసుకొని లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి కర్నూలు చేరుకోవచ్చు. అక్కడి నుండి 45 కి. మీ. దూరంలో ఉన్న నందికొట్కూర్ కు మరోమారు బస్సు ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు.

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

నందికొట్కూర్ ఎలా చేరుకోవాలి ?

రైలు మార్గం

నందికొట్కూర్ కు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ 45 కి. మీ. దూరంలో ఉన్న కర్నూలు సిటీ రైల్వే స్టేషన్. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఈ రైల్వే స్టేషన్ చక్కగా అనుసంధానించబడింది. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ వంటి అంగరాలకు సైతం రైళ్లు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Madan kumar 007

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

నందికొట్కూర్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

బెంగళూరు (రాత్రి పూట), హైదరాబాద్ (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట) వంటి నగరాల నుండి నందికొట్కూర్ కు నేరుగా బస్సులు కలవు. కర్నూలు నుండి చెప్పనవసరం లేదు పల్లె వెలుగు, డీలక్ష్, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ ఇలా అన్ని తరగతులకు చెందిన బస్సులు ప్రతి అరగంటకోసారి ఉదయం నుండి రాత్రి వరకు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Arif Mohammad

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

నందికొట్కూర్ సూర్యనారాయణ దేవాలయం

నందికొట్కూర్ పట్టణం

కర్నూలు జిల్లాకు చెందిన ఒక అసెంబ్లీ నియోజకవర్గం. మొన్నీమధ్యనే మున్సిపాలిటీ కూడా అయ్యింది. ఇక్కడ కూడా ఒక సూర్యనారాయణ దేవాలయం కలదు. సూర్యుని ప్రాత: కిరణాలు స్వామివారికి నేరుగా తాకుతాయని ప్రచారం కూడా ఉన్నది. సూర్యారాధాన చేసేవారికి మంచి ఫలితాలుంటాయని ప్రతీతి.

చిత్ర కృప : I J venkateshwerlu

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

నందికొట్కూర్ సూర్యనారాయణ దేవాలయం ఆలయ విశేషాలు

గర్భాలయంలోని మూల మూర్తి కుడి చేతిలో తెల్లని పద్మం, ఎడమ చేతిలో అభయ ముద్ర లో కనిపిస్తుంది. రధ సప్తమి నాడు ఆలయంలో కళ్యాణం ఘనంగా జరుగుతుంది. పరిసర ప్రాంతాల నుండి ప్రజలు తండోప తండా లుగా వచ్చి వేడుకల్లో పాల్గొంటారు.

చిత్ర కృప : I J venkateshwerlu

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

నందికొట్కూర్ లో సందర్శించు మరికొన్ని ఆలయాలు

నందికొట్కూర్ లో సందర్శించు మరికొన్ని ఆలయాలు : వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం, శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం, ఆంజనేయస్వామి దేవాలయం, చౌడేశ్వరి దేవి ఆలయం, శివుని గుడి చూడదగ్గవి.

చిత్ర కృప : I J venkateshwerlu

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఉరవకొండ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

ఉరవకొండ కు సమీపాన బళ్ళారి విమానాశ్రయం కలదు. ఇది 50 కి. మీ. దూరంలో గంటలో చేరుకొనే విధంగా ఉంటుంది. క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి ఉరవకొండ చేరుకోవచ్చు.

చిత్ర కృప : Amit Rawat

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఉరవకొండ ఎలా చేరుకోవాలి ?

రైలు మార్గం

ఉరవకొండ కు సమీపాన గుంతకల్ రైల్వే జంక్షన్ కలదు. అలాగే 50 కిలోమీటర్ల దూరంలో బళ్ళారి రైల్వే జంక్షన్ కూడా కలదు. గుంతకల్ స్టేషన్ ఉరవకొండ నుండి 36 కి. మీ. దూరంలో ఉంటుంది.

చిత్ర కృప : Amit Patel

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఉరవకొండ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

అనంతపూర్ నుండి ఉరవకొండ కు ప్రతి గంటకు ఒక ప్రభుత్వ బస్సు బయలుదేరుతుంది. ఉరవకొండ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రయాణ సమయం ఒక గంట పడుతుంది. అలాగే బళ్ళారి, గుత్తి నుండి కూడా బస్సులు ఉరవకొండకు బయలుదేరుతుంటాయి.

చిత్ర కృప : Andreas Metz

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఉరవకొండ సూర్యనారాయణ ఆలయం

అనంతపూర్ జిల్లా ఉరవకొండ కు ఏడు కిలోమీటర్ల దూరంలో బూదగవి గ్రామంలో ప్రాచీన ఆలయాలు పోలికలతో ఉండే సూర్యనారాయణ ఆలయం కలదు. ఈ ఆలయం జిల్లాలో ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది. ఈ దేవాలయం క్రీ.శ. 13 వ శతాబ్ధానికి చెందినదిగా అందరూ భావిస్తారు.

చిత్ర కృప : Raayalaseema

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఉరవకొండ సూర్యనారాయణ ఆలయం

ఆలయ ప్రత్యేకత

ఆలయంలోని సూర్య విగ్రహం దక్షిణం వైపు ముఖం చేసి ఉంటుంది. ఆలయం లోని మరో ప్రత్యేకత ఆంజనేయ స్వామి నమస్కార భంగిమ. సూర్య కిరణాలు నేరుగా పడవు కాంతి మాత్రం గర్భగుడి లోని స్వామి పై పడుతుంది. ఇదే ఆలయంలో మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఉన్నది.

చిత్ర కృప : Raayalaseema

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఏపీ లోని ప్రసిద్ధ సూర్యదేవాలయాలు !

ఉరవకొండ సూర్యనారాయణ ఆలయం

ఉరవకొండ లో సందర్శించవలసిన ఆలయాలు

శివాలయం, సుబ్రమణ్య స్వామి ఆలయం, పెన్నా అహోబిలం లోని సె లక్ష్మి నరసింహ స్వామి ఆలయం చూడదగ్గవి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X