Search
  • Follow NativePlanet
Share
» »వినాయక చవితి సందర్భంగా కర్నాటకలో ఈ వినాయక దేవాలయాల్లో ఒకటైనా చూశారా?

వినాయక చవితి సందర్భంగా కర్నాటకలో ఈ వినాయక దేవాలయాల్లో ఒకటైనా చూశారా?

కర్నాటకలో ఉన్న ప్రముఖ వినాయక దేవాలయాలకు సంబంధించిన కథనం.

వినాయక చవితికి రంగం సిద్ధమయ్యింది. ప్రతి గ్రామం, నగరంలోని వినాయక దేవాలయాలు రంగురంగుల తోరణాలతో, కళ్లుమిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఇందుకు కర్నాటక మినహాయింపు కాదు. కర్నాటకలో అనేక పురాణ, ప్రాచీన దేవాలయాలతో పాటు ఇటీవల కాలంలో నిర్మించిన వినాయక దేవాలయాలు కూడా వినాయక చవితికి ముస్తాబయ్యాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో ఉన్న ప్రముఖ వినాయక దేవాలయాల గురించి క్లుప్తంగా మీ కోసం...

కురుడుమలె

కురుడుమలె

P.C: You Tube

కోలారుజిల్లా ముళబాగిలు పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలోని కురుడమలె వినాయకుడి ఆలయానికి ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ స్వామివారిని దర్శించి ఏ కోర్కె కోరినా వెంటనే నెరవేరుతుందని చెబుతారు. త్రిమూర్తులు కూడా ఈ వినాయకుడిని పూజించారని స్థలపురాణం చెబుతుంది.

ఇడగుంజి

ఇడగుంజి

P.C: You Tube

ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర సమీపంలోని ఇడగుంజిలోని వినాయకుడు అత్యంత శక్తివంతమైన దేవుడిగా భక్తుల భావిస్తారు. పురాణ ప్రసిద్ధి చెందిన ఈ విగ్రహానికి నాలుగో శతాబ్దంలో దేవాలయం నిర్మించారు. శరావతి నది అరేబియా సముద్రంలో కలిసేచోట ఈ ఆలయం ఉంది.

60 అడుగుల గణపతి

60 అడుగుల గణపతి

P.C: You Tube
బెంగళూరునగర శివారులో రింగ్ రోడ్డు వెంబడి వస్తే బాబుసాపాళ్య వద్ద బారీ వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. దాదాపు 60 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దిగువనే ఆలయం ఉంది. రిండు రోడ్డు ప్రయాణికులు తప్పకుండా ఈ ఆలయం సందర్శించికాని ముందుకు వెళ్లరు. అదే విధంగా పాత విమానాశ్రయం రోడ్డులోని శివ మందిరంలో 32 అడుగుల వినాయకుడి విగ్రహం ఉంది. శివుడిని దర్శించుకునే ముందు ఈ వినాయకుడిని దర్శించుకోవడం రివాజు.

పంచముఖి వినాయకుడు

పంచముఖి వినాయకుడు

P.C: You Tube

గోపురమే పంచముఖ వినాయకుడి రూపంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. బెంగళూరు నగరంలోని నైస్ రోడ్డులో ఈ దేవాలయాన్ని నిర్మించారు. బంగారు వర్ణంలోని 30 అడుగుల ఎత్తున్న పంచముఖి వినాయకుడి విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. ఆలయ పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి.

దొడ్డ గణపతి దేవాలయం

దొడ్డ గణపతి దేవాలయం

P.C: You Tube

బెంగళూరులో ఉన్న అతిపురాతన దేవాలయాల్లో దొడ్డ గణేష దేవాలయం కూడా ఒకటి. నగరంలోని బసవనగుడి ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ 8 అడుగుల ఎత్తు 12 అడుగుల వెడల్పు కలిగిన సుందరమైన గణేష విగ్రహాన్ని మనం చూడవచ్చు. స్వయంభువు అయిన ఈ గణపతి దేవాలయంలో మూలవిరాట్టుకు వినాయకచవితి రోజు చేసే వెన్న అలంకరణ చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X