Search
  • Follow NativePlanet
Share
» »ఫరహాబాద్ ఫారెస్ట్ - తెలంగాణ లో అతిపెద్ద టైగర్ ఫారెస్ట్ జోన్ !

ఫరహాబాద్ ఫారెస్ట్ - తెలంగాణ లో అతిపెద్ద టైగర్ ఫారెస్ట్ జోన్ !

By Mohammad

రోజువారీ బిజీ నగర జీవితం నుండి కాసింత రిలాక్స్ కావాలనుకునేవారు విహారయాత్ర లకు ప్లాన్ చేసుకుంటారు అవునా ?ఎప్పుడూ రణగొణధ్వనుల మధ్య, కాంక్రీట్ బిల్డింగ్ ల మధ్య జీవితాన్ని గడిపేవారికి ఈ విహార యాత్రలు టానిక్ లాంటివి. మరి ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళాలి ?

ఆ ప్రాంతం ఎంతో దూరంలో లేదు ... కేవలం కొద్ది గంటల్లో అక్కడికి చేరుకోగలం. బైక్ ఉంటె ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా అల్లరిచేస్తూ పచ్చని ప్రకృతి ఒడిలో వాలిపోవచ్చు. సమయాన్ని మరిచి స్వప్న తీరంలో నిలబడవచ్చు. అవును మరీ ... ఫరహాబాద్ ఫారెస్ట్ లో అడుగుపెడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి.

తెలంగాణ లో అతిపెద్ద టైగర్ ఫారెస్ట్ జోన్ ఫరహాబాద్ ఫారెస్ట్. ఇందులో జంగల్ సఫారీ థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇక్కడి వ్యూ పాయింట్లు, సైట్ సీయింగ్ ప్రదేశాలు మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.

farahabad-1

ఫరహాబాద్ ఫారెస్ట్ బోర్డు

చిత్ర కృప : Wildwoods Adventure Club Hyderabad

ఎక్కడ వుంది ?

హైదరాబాద్ నుండి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే మార్గంలో .. నగరం నుండి 140 కి. మీ ల దూరంలో ఫరహాబాద్ ఫారెస్ట్ కనిపిస్తుంది. అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని భాగమే ఈ ఫరహాబాద్ ఫారెస్ట్ జోన్.

ఫరహాబాద్ ఫారెస్ట్ ప్రకృతి అందాలకు నిలయం. రంగురంగుల పక్షులు, పించం విప్పి నాట్యం చేసే మయూరాలు, వివిధ రకాల జంతువులు, కోయిల రాగాలు .. ఇక్కడ ఆకర్షించే అపురూప దృశ్యాలు. వీటన్నింటిని చూడాలంటే మనసు పులకరిస్తుంది. కానీ అడవిలో అటువంటి దృశ్యాలను చూడాలంటే మీ వాహనాల్లో కాకుండా జీప్ సఫారీ చేస్తే బాగుంటుంది. అప్పడే జంతువులను చాలా దగ్గర నుండి చూడవచ్చు.

farahabad-2

ఫారెస్టులో కెమెరాకు చిక్కిన పక్షి

చిత్ర కృప : Rakesh Reddy Ponnala

జీప్ సఫారీ

ఫరహాబాద్ అడవులలో జీప్ సఫారీ సూచించదగినది. పర్యాటకులు కెమెరాల కు పని చెప్పవచ్చు. తెలంగాణ అటవీ శాఖ జీప్ సఫారీ ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. జీప్ సఫారీ కి రూ. 800 చెల్లించవలసి ఉంటుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలవరకు ఈ జీప్ సఫారీ అందుబాటులో ఉంటుంది. జీప్ లో మొత్తం 8 మంది వరకు కలిసి ప్రయాణించాల్సివస్తుంది.

farahabad-3

దారిపొడవునా కనిపించే దృశ్యాలు

చిత్ర కృప : Kumar's Edit

జీప్ సఫారీ 45 నిముషాల ప్రయాణం. 9 km ప్రయాణిస్తే చాలు .. ఫరహాబాద్ సైట్ సీయింగ్ లన్నీ చూడవచ్చు. మార్గ మధ్యలో ప్రయాణిస్తున్నప్పుడు కోతులు, లేడీ లు తారసపడతాయి. అంతేకాదు నాట్యమాడే నెమళులు, నీటి కుంటల వద్ద దప్పిక తీర్చుకోవటానికి వచ్చే రకరకాల పక్షులు, అటవీ జంతువులు చూడటానికి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. మీకు ఎక్కడో అదృష్టం రాసిపెట్టి ఉంటె పులులు కూడా కనిపిస్తాయి.

జీప్ సఫారీ లో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఏడవ నిజాం నవాబు గెస్ట్ హౌస్ చూడవచ్చు. పూర్వం నిజాం నవాబు వేటకై వచ్చి ఇక్కడ బస చేసేవాడ ని చెబుతుంటారు.

farahabad-4

అడవిచాటున ఉన్న పెద్దపులి

చిత్ర కృప : Honza Soukup

ఫరహాబాద్ ఫారెస్ట్ హైలెట్ వ్యూ పాయింట్. కొండ మీద ఎక్కి అటవీ అందాలను చూడటం మరిచిపోలేని అనుభూతి. బ్రిటీష్ అధికారి రసెల్స్ తవ్వించిన మానవనిర్మిత సరస్సు ఫారెస్ట్ ఏరియాలో మరో ఆకర్షణ. ఇది 4 హెక్టార్లకు పైగా వ్యాపించి ఉన్నది.

ఇటువంటి అనుభూతుల్ని సొంతం చేసుకోవాలంటే ... మీరు ఫరహాబాద్ ఫారెస్ట్ ను సందర్శించండి మరి. తెలంగాణ టూరిజం డిపార్ట్ మెంట్ వారాంతంలో ప్రత్యేక ప్యాకేజీ లను అందిస్తున్నది.

మీరు ఫరహాబాద్ ఫారెస్ట్ కు వెళ్ళేటప్పుడు వెంట బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్ మరియు మినరల్ వాటర్ బాటిల్ తీసుకెళ్లడం ఉత్తమం.

ఫరహాబాద్ ఫారెస్ట్ ఎలా చేరుకోవాలి ?

వాయుమార్గం : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ సమీప విమానాశ్రయం

రైలు మార్గం : హైదరాబాద్ అనువైనది

రోడ్డు మార్గం : వివిధ ప్రాంతాల నుండి ఫరహాబాద్ ఫారెస్ట్

ఫరహాబాద్ ఫారెస్ట్

ఫరహాబాద్ ఫారెస్ట్ వ్యూ పాయింట్

చిత్ర కృప : Wildwoods Adventure Club Hyderabad

హైదరాబాద్ --> మైసిగండి -->కల్వకూర్తి --> మన్ననూర్ --> ఫరహాబాద్ ఫారెస్ట్ (158km)

కడప --> బద్వేల్ --> మార్కాపూర్ -->దోర్నాల -->శ్రీశైలం -->ఫరహాబాద్ ఫారెస్ట్ (311 km)

కర్నూలు --> బీచుపల్లి --> వనపర్తి --> అచ్చంపేట --> ఫరహాబాద్ ఫారెస్ట్ (191 km)

మహబూబ్ నగర్ -- > నాగర్ కర్నూల్ -> అచ్చంపేట --> మన్ననూర్ --> ఫరహాబాద్ ఫారెస్ట్ (120 km)

నంద్యాల --> ఆత్మకూర్ --> దోర్నాల --> శ్రీశైలం -->ఫరహాబాద్ ఫారెస్ట్ (207 km)

నిజామాబాద్ -->కామారెడ్డి --> హైదరాబాద్ --> కాదల్ -->మన్ననూర్ --> ఫరహాబాద్ ఫారెస్ట్ (328 km)

శ్రీశైలం --> సుండిపేట --> దోమలపెంట -->వటవర్లపల్లి --> ఫరహాబాద్ ఫారెస్ట్ (57 km)

వికారాబాద్ --> షాద్ నగర్ --> జడ్చర్ల --> అచ్చంపేట --> మన్ననూర్ --> ఫరహాబాద్ ఫారెస్ట్ (208 km)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X