Search
  • Follow NativePlanet
Share
» »కూర్గ్ లోని గలిబీడు శిఖరం చేరుకొనుటకు కాలినడక ప్రయాణం

కూర్గ్ లోని గలిబీడు శిఖరం చేరుకొనుటకు కాలినడక ప్రయాణం

కూర్గ్ లోని గలిబీడు చాలామంది తెలియదు. ఇది ఒకరోజు ట్రెక్కింగ్ కేంద్రం. ఇది మడికేరి నుండి 12కి.మీ. దూరంలో ఉంది, ఈ ప్రాంతం గురించి ఎక్కువమందికి తెలియదు. ఇది పశ్చిమకనుమలలోని ప్రాంతం. కాలినడకన ప్రయాణించ

బెంగుళూర్ నుండి గలిబీడు యొక్క దూరం 274.9 కిమీ ఉంది. ట్రాపిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుంటే NH75 మీదుగా 5గం.40ని పడుతుంది.

1: రూట్: బెంగుళూరు - మైసూరు - మడికేరి - గాలిబీడు
2: ప్రయాణం చేసే విధానం: మడికేరి చేరుకొనుటకు బెంగుళూరు సిటీ సెంట్రల్ నుండి కె.ఎస్. ఆర్టీసి బస్సు ద్వారా వెళ్ళవచ్చు
3: మొత్తం కాలినడక ప్రయాణంకు పట్టు సమయం : 6 గం.
4:కఠిన స్థాయి: సులభంగానే చేరుకోవచ్చు

కూర్గ్ లోని గలిబీడు శిఖరం చేరుకొనుటకు కాలినడక ప్రయాణం

PC : Brunda Nagaraj

కూర్గ్ లోని గలిబీడు చాలామంది తెలియదు. ఇది ఒక రోజు ట్రెక్కింగ్ కేంద్రం. ఇది మడికేరి నుండి 12కి.మీ. దూరంలో ఉంది, ఈ ప్రాంతం గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇది పశ్చిమకనుమలలోని ప్రాంతం. కాలినడకన ప్రయాణించేవారికి నిజంగా స్వర్గంలాగా అనిపిస్తుంది.

బెంగుళూరు నుండి గలిబీడు 274.9 కి.మీ దూరం కలిగివుంది. 5గం. 14ని.లలో NH 75 మార్గం ద్వారా చేరుకోవచ్చు. మొత్తం కాలిబాట ప్రయాణం 14కిమీ మొదటిసారి ట్రెక్కింగ్ చేసేవారికి కూడా సులభతరంగానే వుంటుంది.

కాలిబాట మార్గం పొడవునా ఎన్నో అందమైన నీటి ప్రవాహాల చుట్టూ పచ్చదనంతో కూడుకున్నటువంటి దట్టమైన అరణ్యాలలో పక్షులు కిలకిలరావాలు, గాలికి అల్లాడే ఆకుల శబ్దాలు, ఇవన్నే చూస్తుంటే నిజంగా ట్రెక్కింగ్ అనేది ఒక అద్భుతమైన అనుభవం.

కూర్గ్ లోని గలిబీడు శిఖరం చేరుకొనుటకు కాలినడక ప్రయాణం

PC : Brunda Nagaraj

గలిబీడు యొక్క చరిత్ర:

ఈ పర్వతాలు కొడగు పాలకులు వీర రాజేంద్ర మరియు లింగ రాజేంద్ర చెందినదని ఇక్కడ స్థానికులు చెప్తారు.
పురాణాలను బట్టి కొడవ భూభాగంలోకి ప్రవేశించిన శత్రువులను ట్రాక్ చేసి పసిగట్టుటకు గలిబీడు ఒక మైలురాయిగా వ్యవహరించిందని చెప్పవచ్చును. కాలిబాట నుండి తిరిగి వెళ్ళే మార్గమధ్యంలో కాళికాదేవి యొక్క ప్రాచీన దేవాలయం ఉంది.

కూర్గ్ లోని గలిబీడు శిఖరం చేరుకొనుటకు కాలినడక ప్రయాణం

PC : Brunda Nagaraj

ట్రెక్కింగ్ ట్రెయిల్
గలిబీడు ట్రెక్కింగ్ అనువైన కాలిబాట మార్గం. అయితే కొన్ని సమయాల్లో కొద్దిగా గమ్మత్తైన ట్రెక్కింగ్ అనుభూతిని పొందవచ్చు. ఈ ట్రెక్కింగ్ కాలిబాట పొడవునా దట్టమైన అడవులు, పచ్చికభూములు, నీటి ప్రవాహాలు, తారు రోడ్డు మార్గాలతో కూడుకొని వుంటాయి. శిఖరం చేరటం మొత్తం ఒక అద్భుతమైన అనుభవాన్ని మిగులుస్తుంది.

కూర్గ్ లోని గలిబీడు శిఖరం చేరుకొనుటకు కాలినడక ప్రయాణం

PC : Brunda Nagaraj

గలిబీడు ట్రెక్ సమయంలో తప్పక చేయవలసినవి

1. ప్రవాహాలు నుంచి జాలువారే నీటి రుచిని ఆస్వాదించండి మరియు కొండను ఎక్కే సమయంలో సీసాలను నీటితో నింపుకోండి.

2. మీరు కొండ పైకి ఎక్కిన తర్వాత పశ్చిమ కనుమల ఇతర శిఖరాలను వీక్షణగా చూసినట్లయితే చెప్పలేని అనుభూతి కలుగుతుంది.

3. ఆకుపచ్చ మరియు గోధుమ రంగులు మిశ్రమంగా గల రంగుల షేడ్స్ ను చూడవచ్చును.

4. మీరు కొండ అంచున ఉండి చూసి అనుభూతిని ఆస్వాదించిన మీకు అద్భుతంగా అనిపించిన ఫోటోలను క్లిక్ చేయండి.

5. కొండ నుండి తిరిగి వచ్చేటప్పుడు పురాతన ఆలయం సందర్శించి ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంతత అనుభవించండి.

6. అడవిలో ఉన్న చెట్లలో సిట్రిజన్ కలిగిన పండ్లు (నిమ్మకాయలు, దబ్బ పండ్లు) లాంటివి ఉంటే కోసుకోండి అంతేకాకుండా అడవిలో మందార పువ్వులు ఉంటే కోసి తెచ్చుకోండి.

7. ట్రెక్ నుంచి తిరిగి వచ్చేమార్గంలో చంద్రముఖి నదిని సందర్శించండి అంతేకాకుండా ఆ నదిలో ఒక నిర్దిష్టపద్ధతిలో లేని చాలా పొడవైన చేపలు గమనించండి.

8. చంద్రముఖి నదిపై గల వంతెన కూడా ఈ ట్రెక్ సమయంలో సందర్శించవచ్చు.

కూర్గ్ లోని గలిబీడు శిఖరం చేరుకొనుటకు కాలినడక ప్రయాణం

PC : Brunda Nagaraj

వెంట తీసుకువెళ్ళవలసిన వస్తువులు

1. ఒక్కొక్కసారి మార్గమధ్యంలో నీటి ప్రవాహాలు వుండవు. అందుకని త్రాగుటకు నీరు మీవెంట తీసుకువెళ్తే మంచిది.
2.మడికేరి తర్వాత అంగళ్లు ఏమీ ఉండవు. అందుకని మార్గమధ్యంలో తినుటకు ఆహారం, మరియు ఇతర స్నాక్స్ మీ వెంట తీసుకువెళ్ళడం ఉత్తమం.
3.వాతావరణం ఏ సమయంలో నైనా మారవచ్చు. అందువల్ల టార్చ్ లైట్లు, విండ్ జాకెట్స్, మరియు రైన్ జాకెట్స్ మీ వెంట తీసుకువెళ్ళడం మంచిది.

కూర్గ్ లోని గలిబీడు శిఖరం చేరుకొనుటకు కాలినడక ప్రయాణం

PC : Brunda Nagaraj

గుర్తించుకోదగిన విషయాలు: 1. ఇది ఒక అద్భుతమైన ట్రెక్. మీరు వర్షాకాలంలో కూడా ట్రెక్ చేయాలనుకుంటే లీచ్ పురుగులు కాటు నుండి జాగ్రత్తగా ఉండాలి.
2:మీరు వేసవి కాలంలో ట్రెక్ చేయాలనుకుంటే మీ వెంట సన్ స్క్రీన్ లోషన్స్ తీసుకువెళ్తే మంచిది.
3.మీ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ అద్భుతమైన ట్రెక్ ని ప్లాన్ చేసుకోండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X