Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన 4 హిల్ స్టేషన్లు !

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన 4 హిల్ స్టేషన్లు !

By Mohammad

ప్రస్తుత ట్రెండ్ లో పర్యాటకులు ఎక్కువగా వెళ్లేది మరియు ఇష్టపడేది హిల్ స్టేషన్ లు. ఈ హిల్ స్టేషన్ లు మనసుకి ప్రశాంతతను చేకూర్చి, హాయిని కలిగిస్తాయి. పర్వత ప్రాంతాలకి (హిల్ స్టేషన్లకి) మీరు కుటుంబ సభ్యులతో గాని, స్నేహితులతో గాని లేదా మీకిష్టమైన వారితో గాని వెళ్ళవచ్చు.

హిల్ స్టేషన్ లు చాలా వరకు హనీమూన్ స్పాట్ లుగా కూడా ఖ్యాతి గడించాయి. కొత్తగా పెళ్లైనవారు సైతం తమ తొలి రాత్రుల్ని హిల్ స్టేషన్ లలో గడపాలని ప్లాన్ వేసుకుంటారు (బహుశా ...! ఏకాంతం అనేది వారికి ఇక్కడే దొరుకుతుంది అనే భావన కాబోలు).

స్నేహితుల బృందాలకి సైతం హిల్ స్టేషన్ లు ఆదరహో ..! అనిపిస్తాయి. 5 లేదా 10 మంది కలిసి ఒక బృందంగా ఏర్పడి ట్రెక్కింగ్ లు, నీటి క్రీడలు, బోటింగ్, రోప్ వే, పారాగ్లైడింగ్ తదితర సాహస క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇలా పాల్గొంటున్న సమయంలో వారు ఎంతో హుషారుగా, చురుకుగా ఉంటారు. సమయమనేది వారికి అస్సలు కనపడదు.

ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ లోని ట్రెక్కింగ్ ప్రదేశాలు !

మన దేశంలో హిల్ స్టేషన్ లకు పెట్టింది పేరు. మన పక్క రాష్ట్రం కర్నాటక, కేరళ మరియు ఉత్తర భారతదేశంలో, తూర్పు భారతావని లో ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి దిక్కున హిల్ స్టేషన్ లు, అక్కడక్కడ కొన్ని డేంజర్ హిల్ స్టేషన్ లు కూడా తారసపడతాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే, ఇక్కడ కూడా దేశంలో ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్ లు ఉన్నాయి. అవి సంవత్సరం పొడవునా పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి. ఆంధ్ర ప్రదేశ్ లో చెప్పుకోదగ్గ హిల్ స్టేషన్ లు నాలుగు. అవి వరుసగా హార్స్లీ హిల్ స్టేషన్, అనంతగిరి హిల్ స్టేషన్, అరకు లోయ మరియు నగరి హిల్స్. వీటితో పాటు నల్లమల కొండలు, పాపి కొండలు కూడా హిల్ స్టేషన్ లలో భాగమే అయినప్పటికీ, వాటిని కాస్త పక్కకు పెడతారు. పైన పేర్కొన్న నాలుగు హిల్ హిల్ స్టేషన్ లలో అయితే వసతి, రోడ్డు రవాణా అందుబాటులో ఉన్నాయి కనుక పర్యాటకులు అక్కడికి వెళ్ళటానికి ఆసక్తిని కనబరుస్తారు.

విశాఖ పట్టణం

విశాఖ పట్టణం

ముందు మనం ఆంధ్ర ప్రదేశ్ తూర్పు భాగం నుండి మొదలుపెడదాం. విశాఖ పట్టణం(వైజాగ్) జిల్లాలో రెండు హిల్ స్టేషన్ లు ఉన్నాయి. అవి అరకు లోయ మరియు అనంతగిరి హిల్ స్టేషన్ లు.

చిత్ర కృప : The Park Hotels

అరకు లోయ, విశాఖ పట్టణం

అరకు లోయ, విశాఖ పట్టణం

చల్లని వాతావరణం, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాతాలు .. ఎలా ఎన్నో ప్రకృతి ప్రసాదించిన అందాలతో అరకు లోయ ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తున్నది. అరకు లోయ, వైజాగ్ కి 116 కి. మీ. దూరంలో మరియు సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉన్నది.

చిత్ర కృప : Random Explorer

అరకు వెళ్లే దారి

అరకు వెళ్లే దారి

అరకు లోయ వెళ్ళాలంటే వైజాగ్ నుండి రోడ్డు, రైలు మార్గం రెండూ ఉన్నాయి. వైజాగ్ నుండి ప్రతి రోజు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు కిరండోల్ ప్యాసింజర్ రైలు బయలుదేరుతుంది. కొండలు, గుహలు, లోయల గుండా సాగే రైలు ప్రయాణంలో దేశంలోనే ఎత్తులో ఉన్న సిలిమిగూడ అనే స్టేషన్ ను చూడవచ్చు. రైలు సుమారుగా 58 సొరంగాలు మరియు 84 వంతెనలు మీదుగా వెళుతుంది.

చిత్ర కృప : Anindya Roy

అరకు లోయ, విశాఖ పట్టణం

అరకు లోయ, విశాఖ పట్టణం

అరకు లోయ కి వచ్చే చాలా మంది పర్యాటకులు అందాలన్నీ చూడటానికి రైలు మార్గాన్ని, తిరుగు ప్రయాణంలో బస్సు మార్గాన్ని ఎంచుకుంటారు. ఇరువైపులా దట్టంగా అడవులతో ఉండే అరకు - వైజాగ్ ఘాట్ రోడ్ ప్రయాణం ఆసక్తి కరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

చిత్ర కృప : Sasanka Sekhar Banerjee

అరకులోయలో బస

అరకులోయలో బస

అరకు లో బస చేయటానికి అన్ని తరగతుల వారికి అనువైన వసతి ఉన్నది. రూ. 400 నుండి రూ. 2500 వరకు ఏసీ, నాన్ - ఏసీ గదులు అద్దెకు దొరుకుతాయి. ఇక్కడ బస చేయడానికి APTDC హరిత హోటల్స్ నడుపుతోంది. శాఖాహార భోజనం కోరుకోనే వారికి ఇక్కడ హరిత హోటల్ ఒక్కటే ఉన్నది. అరకులో కాఫీ రుచి చూడటం మరిచిపోవద్దు ..!

చిత్ర కృప : Third Eye

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

బొర్రా గుహలు

అరకు నుండి వైజాగ్ వచ్చే తిరుగుప్రయాణంలో 36 కి.మీ. దూరంలో ఉన్న బొర్రా గుహలు ప్రముఖంగా చూడవలసినవి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ గుహలు, భారతదేశం లోనే అత్యంత లోతైన గుహలుగా ప్రసిద్ధికెక్కాయి. సున్నపు రాయిపై నీరు ప్రవహించడం వల్ల ఏర్పడ్డ ఎన్నో వింతైన కళారూపాలు ఇక్కడ గమనించవచ్చు.

చిత్ర కృప : BinoyV

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

గిరిజన మ్యూజియం

అరకులో తప్పక చూడవలసినది గిరిజన మ్యూజియం. ఇక్కడ నివసించే 19 రకాల తెగలకు చెందిన గిరిజనుల సంస్కృతీ సాంప్రదాయాలు, జీవన శైలి గురించిన విషయాలను కళ్ళకు కట్టినట్టుగా ఈ మ్యూజియంలో పొందుపరిచారు. గిరిజనులు ఉపయోగించే వంటింటి వస్తువులు, వ్యవసాయానికి, వేటకి ఉపయోగించే పనిమూట్లు ఇక్కడ ప్రదర్శనకై ఉంచుతారు.

చిత్ర కృప : Harsha Yadav

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

చాప రాయి

అరకు నుండి తిరుగు ప్రయాణంలో సుమారు 15 కి.మీ. దూరంలో చాపరాయి ఉంది. చుట్టూ పచ్చటి అటవీ ప్రాంతం, మధ్యలో విశాలంగా పరచుకున్న రాతి పై జాలువారుతున్న జలపాతం, ప్రకృతి ప్రియులను కట్టిపడేస్తుంది. అరకులో ఇది బెస్ట్ పిక్నిక్ స్పాట్. ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి.

చిత్ర కృప : SHIBA 007

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

కటికి జలపాతాలు

బొర్రా గుహలు నుండి సుమారు 7 కి.మీ. దూరంలో కటికి జలపాతాలు ఉన్నాయి. గోస్తాని నది నీటితో ఏర్పడిన ఈ జలపాతాలు 100 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతుంటాయి. జలపాతాల కింద ఉన్న కొలనులో స్నానం చెయ్యడం ఓ అద్భుతమైన అనుభూతి.

చిత్ర కృప : Gautam Das

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

పద్మాపురం గార్డెన్

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికుల కోసం 26 ఎకరాలలో కూరగాయలు పండించడానికి పద్మాపురం గార్డెన్ ఏర్పాటు చేసారు. తరవాత దానిని పట్టుపురుగుల పెంపకానికి వాడుతున్నారు. పద్మాపురం గార్డెన్స్ లో వివిధ రకాల, వివిధ సైజుల గులాబీలు చూడవచ్చు. అలాగే ఎన్నో రకాల పుష్ప జాతులు చూడవచ్చు. ఇక్కడ వెదురుతో తయారు చేసిన ట్రీ హౌసస్ ఉన్నాయి. కావాలంటే రాత్రి బస చేసేవాళ్ళు అద్దెకు తీసుకోవచ్చు.

చిత్ర కృప : Navya

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

అరకు జలపాతాలు

అరకు నుండి సుమారు 8 కి.మీ. దూరంలో అరకు జలపాతాలు ఉన్నాయి. 60 అడుగులు ఎత్తు నుండి పడుతున్న ఈ జలపాతాలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ జలపాతాలని చూడడానికి కొండ పైకి ఎక్కవలసి ఉంటుంది. వీటిని చూడాలంటే అరకు-పాడేరు రోడ్డులో 2 కి.మీ. వెళ్ళాక కుడివైపు తిరిగి సుమారు 6 కి.మీ. వెళ్ళవలసి ఉంటుంది.

చిత్ర కృప : Junkie Dude

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

మత్స్య గుండం

అరకు నుండి సుమారు 35 కి.మీ. దూరంలో మత్స్య గుండం అనే కొలను ఉంది. అక్కడ నీటి ప్రవాహం ఒక పెద్ద గుండం లోకి వెళ్లి , అక్కడ నుండి 100 గజాల కింద బయటకు వస్తుంది. ఈ మత్స్యగుండం లో ఎన్నో రకాల చేపలు ఉండుట ఓ ప్రత్యేకత. ఆ గుండంలోకి మెట్ల ద్వార దిగి చేపలకు ఆహరం పెట్టొచ్చు. నది ఒడ్డున శివాలయం కూడా ఉన్నది.

చిత్ర కృప : indiyah

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

టైడ పార్క్

అరకు నుండి సుమారు 40 కి.మీ. దూరంలో ఉన్న గిరిజన గ్రామం పేరు టైడ. ఈ ప్రాంతాన్ని జంగల్ బెల్స్ అని కూడా అంటారు. ఇక్కడ కొండలను ఎక్కడం, ట్రెక్కింగ్, పక్షులను చూడటం వంటి ఆసక్తికరమైన కార్యకలాపాలను చేయవచ్చు. ఈ గ్రామంలో రిశార్ట్‌లు, కొయ్య గుడిసెలు, చెట్లపై ఇండ్లు వంటివి ఉంటాయి. మీకిష్టమైతే ఇక్కడ బస చేయవచ్చు.

చిత్ర కృప : SHIBA 007

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

ధింసా మరియు మయూరి నృత్యం

గిరిజన సంప్రదాయ నృత్యాలు ధింసా, మయూరి. వీరి నృత్య ప్రదర్శనలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఆసక్తి గల పర్యాటకులు వీరితో పాటు కలిసి డ్యాన్స్ చేయవచ్చు.

చిత్ర కృప : Shankar Adisesh Photography

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

వలిసె పూల అందాలు


శీతాకాలంలో మాత్రమే వికసించే వలిసె పూల అందాలను చూడటానికి పర్యాటకులు ఆసక్తిని కనబరుస్తారు. ఎటు చూసిన పచ్చదనం కనిపించే అరకులో ప్రత్యేకంగా పుష్పించేఈ పూలను పోటోలు తీయటానికి పర్యాటకులు ఎగబడుతుంటారు.

చిత్ర కృప : dvineel

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

అరకు - వైజాగ్ తిరుగుప్రయాణంలో చూడవలసినవి

పుణ్యగిరి ఆలయం, అరకు

చుట్టూ ఎత్తైన కొండలు ... వాటి మధ్యలో జలపాతాల హోరు ... కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం వీటన్నింటి నడుమకొండమీద వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి అదేనండి పుణ్యగిరి ఆలయం. ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. విశాఖపట్నం-అరకు మధ్యలో నెలవై ఉన్న ఈ పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది.

చిత్ర కృప : manokar n

అనంతగిరి, వైజాగ్

అనంతగిరి, వైజాగ్

ఉక్కు నగరంగా పేరు గాంచిన విశాఖ కు 40 కి. మీ. దూరంలో, అరకు లోయకు 17 కిలోమీటర్ల దూరంలో, అక్కడి తిరుమల హిల్స్‌ పై భాగం లోని తూర్పు కనుమల్లో అనంతగిరి పర్యాటకుల మనసును దోచుకుంటోంది. తిరుమల గిరికి వెళ్లేందుకు ఘాట్‌ రోడ్డులలో చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.

చిత్ర కృప : Shankar Adisesh Photography

అనంతగిరి, వైజాగ్

అనంతగిరి, వైజాగ్

అనంతగిరి వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా ఉండటమే కాకుండా ఎంతో ఆహ్లాదకరంగా ఉండటం వలన ఇక్కడికి సంవత్సరం పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇది కొత్తగా పెళ్ళైన జంటలకు స్వర్గధామామనే చెప్పాలి. అనంతగిరి కాఫీ తోటల సువాసనలు అరకు వాలీ అంతటా వ్యాపించి ఉంటాయి. ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమం తప్పక చూడాలి.

చిత్ర కృప : India VacationClub

అనంతగిరి, వైజాగ్

అనంతగిరి, వైజాగ్

అనంతగిరి లో సైట్ సీయింగ్ ప్రదేశం ఏదైనా ఉందా? అనే వారికి భవనాశి సరస్సు ఒక చక్కటి ఉదాహరణ. ముఖ్యంగా దక్షిణ బధ్రీనాథ్‌ గా పేరుగాంచిన తిరుమలగిరి ప్రాంతంలో భవనాశి సరస్సును అత్యంత పవిత్రమైన తీర్థంగా సేవిస్తుంటారు ఇక్కడికి వచ్చే పర్యాటకులు.

చిత్ర కృప : sasa

అనంతగిరి, వైజాగ్

అనంతగిరి, వైజాగ్

అలాగే అనంతగిరి నుంచి ముచికుందా నది పాయలుగా చీలి వేగంగా పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ లోతుగా ఉండే లోయలలోకి వేగంగా దుమికే జలపాతాల సౌందర్యం చూసి వింతైన అనుభూతికి లోనుకాకతప్పదు.

చిత్ర కృప : RadhaKrishna Balla

అనంతగిరికి చేరుకొనే మార్గం

అనంతగిరికి చేరుకొనే మార్గం

ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లవచ్చు. అలాగే ఈ ప్రాంతానికి విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు. హైదరాబాద్‌, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి కూడా బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ బస చేసేందుకు ప్రైవేటు కాటేజీలు, హోటళ్లు, గెస్ట్ హౌస్ లు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : Grassroutes

హార్స్లీ హిల్స్, మదనపల్లె, చిత్తూరు

హార్స్లీ హిల్స్, మదనపల్లె, చిత్తూరు

హార్స్లీ హిల్స్, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె డివిజన్ కు చెందిన ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. తిరుపతికి 140 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న హార్స్లీ హిల్స్ సముద్రమట్టానికి 1314 మీ. ఎత్తున ఉన్నది.

చిత్ర కృప : Karthik Tripurari

హార్స్లీ హిల్స్, మదనపల్లె, చిత్తూరు

హార్స్లీ హిల్స్, మదనపల్లె, చిత్తూరు

ఆహ్లాదకరమైన వాతావరణం మరియు ప్రకృతి సౌందర్యం హార్స్లీ హిల్స్ ప్రత్యేకతలు. శీతాకాలం తప్పనిచ్చి మిగితా అన్ని కాలాల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి పర్యాటకులు వస్తుంటారు. కొండమీదికి వెళ్లే దారి ఎంతో అందంగా ఉంటుంది. మార్గానికి రెండువైపులా ఏపుగా పెరిగిన యూకలిప్టస్ చెట్లు కళ్ళకి ఇంపుగా కనిపిస్తాయి.

చిత్ర కృప : raman V V

హార్స్లీ హిల్స్, మదనపల్లె, చిత్తూరు

హార్స్లీ హిల్స్, మదనపల్లె, చిత్తూరు

హార్స్లీ హిల్స్ లో వ్యూ పాంట్ ప్రముఖంగా చూడాలి. ఇక్కడి నుంచి చూసే సూర్యోదయం, సూర్యాస్తమం ఎప్పటికీ మరిచిపోలేరు. అలాగే గాలి బండ లు, మల్లమ్మ ఆలయం, 150 ఏండ్ల యూకలిప్టస్ చెట్టు చూడవలసిన వాటిలో ఉన్నాయి.

చిత్ర కృప : Harish Shivaraman

నగరి హిల్స్, చిత్తూరు

నగరి హిల్స్, చిత్తూరు

తిరుపతి నుండి 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరి పట్టణంలో, కుసస్థలి నది ఒడ్డున నగరి కొండలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ గల ముఖ్య ఆకర్షణ నగరి ముక్కు. ఇది ఒక వ్యూ పాయంట్.

చిత్ర కృప : Shyam

నగరి హిల్స్, చిత్తూరు

నగరి హిల్స్, చిత్తూరు

సరిగ్గా మనిషి ముక్కు వలె ఉండే ఈ వ్యూ పాయంట్ చేరుకోవడానికి పర్యాటకులు ట్రెక్కింగ్ యాత్ర ను చేస్తారు. ఇది సముద్ర మట్టానికి 855 మీ. ఎత్తున ఉన్నది. ఈ ప్రదేశానికి గల మరొక పేరు నగరి ముర్కొండ. అలాగే పట్టణంలో కరిక మాణిక్యస్వామి ఆలయం తప్పక సందర్శించండి.

చిత్ర కృప : Shyam

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X