Search
  • Follow NativePlanet
Share
» » ఇండియాలో నాలుగు తేయాకు తోటల రాష్ట్రాలు!

ఇండియాలో నాలుగు తేయాకు తోటల రాష్ట్రాలు!

'చాయ్' అనే పదం ఇండియా లో చాలా వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైనదే! చాలా మంది భారతీయులు రోజులో అనేక సార్లు ఈ 'చాయ్' తాగుతూ వుంటారు. ప్రపంచంలోని అత్యధిక తేయాకు ఉత్పత్తి దారులలో ఇండియా ఒకటిగా అనేక తేయాకు తోటలు కలిగి ఎంతో గర్వ పడుతోంది. ఈ తేయాకు తోటలు ఇండియా లోని వివిధ రాష్ట్రాలలో విస్తరించి వున్నాయి. ఇండియా కు వచ్చే విదేశీ టూరిస్ట్ లు సైతం మన దేశంలోని తేయాకు తోటలలో విహరించి తప్పక వెళతారు.

సందర్శకులు, ఈ టీ తోటలను సందర్శించిన వెంటనే, మొదటి సారిగా వారు అనుభవించేది తాజా గాలి మరియు కాలుష్య రహిత వాతావరణం. అప్పటి వరకూ ఎంతో బిజిగా వున్న నగరాలతో విసిగి వేసారిన వారు పచ్చటి పరిసరాలలో విహరించి ఆనందిస్తారు. మరి ఇన్ని ఆనందాలు పంచె తేయాకు తోటలు ఎక్కడ ఎక్కడ వున్నాయనిది పరిశీలిద్దాం.

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్
ఇండియా లోని హిల్ స్టేషన్ లలో డార్జిలింగ్ హిల్ స్టేషన్ అధికంగా సందర్సిన్చబడుతుంది. వెస్ట్ బెంగాల్ లో కల ఈ తేయాకు పట్టణం ఇండియా లో ఉత్పత్తి అయ్యే తేయాకులో 25 శాతం వరకూ ఉత్పత్తి చేస్తుంది. అద్భుతమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం కల డార్జిలింగ్ పట్టణం ఇండియాలో ఉత్తమ తేయాకు పంటలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పట్టణం తప్పక సందర్శించ దగినది. అందులోనూ ఇక్కడ కల హ్యాపీ వాలీ టీ ఎస్టేట్ అసలు మిస్ కాకండి. డార్జిలింగ్ సందర్శనకు మార్చ్ నుండి నవంబర్ వరకూ అనుకూల వాతావరణం కలిగి వుంటుంది.

నీలగిరి కొండలు, తమిళనాడు
తమిళనాడు లోని నీలగిరి కొండలు తేయాకు పంటలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ సుమారు వంద సంవత్సరాలనుండి అద్భుత సువాసనలు కల తేయాకు తోటలు సాగు చేస్తున్నారు. వివిధ రకాల తేయాకు ఇక్కడ పండుతుంది. ఇక్కడ తేయాకు తోటల సంఘం కూడా ఏర్పడి తేయాకు పంటను అభివృద్ధి చేస్తోంది. సందర్శకులు నీలగిరి లో అందమైన, మంచి సువాసనలు కల ఎన్నో టీ ఎస్టేట్ లను చూడవచ్చు.

మీరు తాగే టీ చెప్పే కధ !

మున్నార్, కేరళ
కేరళ లోని మున్నార్ ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్ మాత్రమే కాక, అనేక టీ గార్డెన్ లు, కూడా కలిగి వుంది. చక్కని వాతావరణం, సుందరమైన పరిసరాలు మున్నార్ ను ఒక సెలవుల విశ్రాంతి ప్రదేశంగా తీర్చి దిద్దాయి. మున్నార్ పర్యాటకులు ఇక్కడ కల తేయాకు తోటలు తప్పక సందర్శించి తీరాలి.

జోర్హాట్, అస్సాం
జోర్హాట్ పట్టణం ఇండియాలోని అస్సాం రాష్ట్రంలో కలదు. ఇక్కడ పండే తేయాకు పంటలు దాని రంగు, ఘాటైన సువాసనలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ఈ తోటలు జోర్హాట్ లో అత్యంత సుందర దృశ్యాల నడుమ కన్నుల విందు చేస్తూ వుంటాయి.

మన దేశంలో అస్సాం రాష్ట్రం అతి పెద్ద తేయాకు ఉత్పత్తి రాష్ట్రంగా పేరు పడింది. చైనా దక్షిణ ప్రాంతం మరియు అస్సాం లు మాత్రమే తస్మ స్వంత భూమి తేయాకు కలిగి వున్నాయి. అస్సాం లోని జోర్హాట్ లో ప్రతి సంవత్సరం ఒక' టీ ఫెస్టివల్ ' నిర్వహిస్తారు. దీనికి వేలాది పర్యాటకులు వచ్చి ఆనందిస్తారు. ఇండియా లో వివిధ రాష్ట్రాలలో విస్తరించిన ఇంత ప్రసిద్ధ తేయాకు తోటల సందర్శనకు అవి అందించే ఆనందాల అనుభవాలకు సిద్ధమవుదామా మరి.

.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X