Search
  • Follow NativePlanet
Share
» »గండికోట - భారతదేశంలో దాగున్న రహస్య లోయ !

గండికోట - భారతదేశంలో దాగున్న రహస్య లోయ !

By Staff

ఆ ఊరిలో తల లేని మొండెం అర్ధరాత్రి తిరుగుతుంది !ఆ ఊరిలో తల లేని మొండెం అర్ధరాత్రి తిరుగుతుంది !

చుట్టూ ఎత్తైన గోడలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడ్డ దుర్భేద్యమైన కొండలు, దట్టమైన అడవులు, లోతైన లోయలు, కోటలు, అందులో అంతః పురాలు, దేవాలయాలు, మసీదులు, పూల తోటలు .. ఇవన్నీ గండికోట యొక్క వర్ణన లో భాగమే.

గండికోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే 'గండి కొండలు' అని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతున్నది.

ఇది కూడా చదవండి : పుష్పగిరి - అద్భుత కళాఖండాల పుణ్య క్షేత్రం !

గండికోట ఎక్కడి నుండి ఎంత దూరం ?

కడప నుండి 52 మైళ్ళ దూరంలో, జమ్మలమడుగు నుండి 15 కిలోమీటర్ల దూరంలో, తాడిపత్రి నుండి 80 కిలోమీటర్ల దూరంలో, ఎర్రగుంట్ల నుండి 46 కిలోమీటర్ల దూరంలో, మైదుకూరు నుండి 57 కిలోమీటర్ల దూరంలో మరియు ప్రొద్దుటూరు నుండి 36 కిలోమీటర్ల దూరంలో గండికోట కలదు.

గండికోట లోయ

గండికోట లోయ

గండికోట ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. ఎర్రటి గ్రానైట్ శిలలు, లోయలో నదీ ప్రవాహం, పక్షుల సవ్వడులు లోయ యొక్క అదనపు ఆకర్షణలు.

చిత్ర కృప : Suhas Dutta

గండికోట కోట

గండికోట కోట

వృత్తాకారంలో ఉండే గండికోట కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది.

చిత్ర కృప : enni.schroeder

కోట గోడలు

కోట గోడలు

కొండ రాతి పై పునాదులు లేకుండా కోట గోడలు నిర్మించారు. ఈ గోడలు చత్తురస్త్ర, దీర్ఘ చతురస్త్ర ఆకారంలో 10 నుండి 15 మీటర్ల ఎత్తు మేర ఉంటాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది.

చిత్ర కృప : Madhusudana Reddy

రంగనాథ ఆలయం

రంగనాథ ఆలయం

రంగనాథాలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ. 15 శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు.

చిత్ర కృప : rkashyap

మాధవరాయ ఆలయం

మాధవరాయ ఆలయం

మాధవరాయ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ.16 శతాబ్దానికి చెందిన అక్కడి శాశనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్పకళా లక్షణాలు, ఆలయ నిర్మాణశైలిని, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని క్రీ.శ. 16 వ శతాబ్దం తొలినాళ్లలో నిర్మించినట్లు చెప్పవచ్చు.

చిత్ర కృప : KRISHNA SRIVATSA NIMMARAJU

కత్తులకోనేరు

కత్తులకోనేరు

గండికోట లో కత్తుల కోనేరును పర్యాటకులు తప్పక వీక్షించాలి. పూర్వం యుద్ధం ముగిసిన తరువాత కత్తులను ఈ కోనేరులోనే కడిగేవారట. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇప్పటికీ నీరు ఎరుపు రంగులోనే ఉండటం విశేషం.

చిత్ర కృప : Madhusudana Reddy

కోట లోని ఇతర ఆకర్షణలు

కోట లోని ఇతర ఆకర్షణలు

కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.

చిత్ర కృప : enni.schroeder

జామా మసీదు

జామా మసీదు

మీర్ జుమ్లా గండికోట లో జామా మసీదును సుందరంగా నిర్మించాడు. ప్రాచీన శైవక్షేత్రం అయిన కన్య తీర్థం, ఆరవ శతాబ్దం నాటి దానవులపాడు, గురప్పనికోన, అగస్తీశ్వర కోన, పీర్ గైబుసాకొండ చూడదగినవి. గండికోట లో వసతికై హరిత రిసార్ట్ కలదు.

చిత్ర కృప : Mukul Prakash

గండికోట ఎలా చేరుకోవాలి ?

గండికోట ఎలా చేరుకోవాలి ?

రైలు మార్గం : గండికోటకు 15 కిలోమీటర్ల దూరంలో జమ్మల మడుగు రైల్వే స్టేషన్ కలదు.

రోడ్డు మార్గం : హైదరాబాద్ నుండి సొంత వాహనం మీద వచ్చేవారు ఎన్ హెచ్ 7 మీదుగా కర్నూల్ చేరుకొని, అక్కడి నుండి బనగానపల్లె -->కోవెలకుంట్ల --> జమ్మలమడుగు -->గండికోట చేరుకోవచ్చు.

చిత్ర కృప : Vishwas M.G

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X