Search
  • Follow NativePlanet
Share
» »శివుడు తన శిఖలో బంధించిన గంగే ‘గంగోత్రి’

శివుడు తన శిఖలో బంధించిన గంగే ‘గంగోత్రి’

శివుడు తన శిఖలో బంధించిన గంగే ‘గంగోత్రి’

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం గంగోత్రి. ఇది సముద్ర మట్టానికి సుమారు 3750 మీ. ఎత్తున, హిమాలయాల పర్వత శ్రేణులలో ఉంది. ఈ ప్రదేశం భగిరథి నది ఒడ్డున ఉన్నది. గంగానది ఉద్భవించిన పవిత్ర ప్రదేశం గంగోత్రి. ఇక్కడ గంగామాత ఆలయం ప్రసిద్ది చెందినది. గంగోత్రి హిమాలయ పర్వత పంక్తుల్లో, హిమానీ నదాలనడుమ, ధవళకాంతితో మంచుతో కప్పి ఉన్న పర్వతాలు, లెక్కకుమించిన సరస్సులు, పచ్చని చెట్ల సమూహాలతో నిండిన అతి మనోహరమైన ప్రశాంత ప్రదేశం.

దక్షిణాన ఉత్తర ప్రదేశ్, పశ్చిమాన హర్యానా, ఉత్తరాన హిమాచల్ ప్రదేశ్ హద్దులుగా ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం సందర్శకులపైనే ఆర్థికంగా ఆధారపడి ఉంటుందంటే సందర్శకుల కోలాహలాన్ని మనం ఊహించుకోవచ్చు. స్వచ్ఛమైన పారదర్శకంగా ఉన్న గంగా జలాలలో స్నానమాచరిస్తే సర్వపాపాలూ ప్రక్షాళనమై పవిత్రత కలుగుతుందని భావిస్తారు, అంతటి పవిత్ర చరిత్ర గల గంగోత్రి ప్రదేశ విశేషాలను తెలుసుకుందాం..

గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్‌, బదరీనాథ్‌ ఈ నాలుగు ప్రదేశాలను

గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్‌, బదరీనాథ్‌ ఈ నాలుగు ప్రదేశాలను

గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్‌, బదరీనాథ్‌ ఈ నాలుగు ప్రదేశాలను చార్‌ధామ్‌ అని పిలుస్తారు. యమునోత్రి, కేదారనాథ్‌, హరిద్వార్‌, రుషీకేశ్‌ నుండి వచ్చే అన్ని వాహనాలు గంగోత్రి ఆలయంఉన్న ప్రదేశం వరకు వస్తాయి.

Photo Courtesy: Arpit Rawat

బదరీనాథ్‌లో విష్ణుమూర్తి, కేదారనాథ్‌లో పరమశివుడు స్వయంభువులుగా

బదరీనాథ్‌లో విష్ణుమూర్తి, కేదారనాథ్‌లో పరమశివుడు స్వయంభువులుగా

బదరీనాథ్‌లో విష్ణుమూర్తి, కేదారనాథ్‌లో పరమశివుడు స్వయంభువులుగా వెలసినట్టు పురాణాల తెలుపుతున్నాయి. గంగోత్రి అంటే గంగానది భూమి మీదకు దిగివచ్చిన ప్రదేశం. గంగ దివి నుండి భువికి దిగివచ్చింది. గంగ ఉతరీ (దిగినది) కనుక గంగోత్రి అనే పేరు వచ్చిందని చెబుతారు.

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం, గంగా దేవత భగీరథ రాజు, అతని పూర్వీకుల పాపాలను కడిగివేయటానికి నది రూపంలో వొచ్చింది. దీనినే గంగ నది అని పిలుస్తున్నారు. గంగ యొక్క ప్రవాహవేగ ఒరవడి భూమి కొట్టుకుపోకుండా, శివుడు అతని శిఖలో గంగను బంధించాడు. గంగా నది లేదా గాంజెస్ యొక్క మూలం,గంగోత్రి నుండి 19 కి. మీ. దూరంలో ఉన్న గౌముఖ్ . గంగానది ఆవిర్భవించినప్పుడు, దీనిని 'భగీరథి' అని కూడా పిలిచేవారు.

మంచు పర్వతాలు, హిమానీనదాలు

మంచు పర్వతాలు, హిమానీనదాలు

భగిరథి నది ఎగువ పరీవాహక ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మంచు పర్వతాలు, హిమానీనదాలు, పొడవైన గట్లు, లోతైన సన్నని త్రోవలు, ఊర్ధ్వ శిఖరాలు మరియు సన్నని లోయలు ఉన్నాయి. దీని యొక్క ఎత్తు 1800 నుండి సముద్ర మట్టానికి 7083 మీటర్ల వరకు ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ ఉప ఆల్పైన్ కానిఫేర్ అడవులు, ఆల్పైన్ పొదలు మరియు ఆకుపచ్చ పచ్చిక బయళ్లను చూడవొచ్చు. ఈ అడవిని ఇండో-చైనా సరిహద్దు వరకు విస్తరించిన 'గంగోత్రి నేషనల్ పార్క్' గా ప్రకటించారు.

PC: Gauravkaintura1234

గంగోత్రి, పురాతన ఆలయాలు మరియు మతపరమైన నమ్మకాలకు ప్రసిద్ది

గంగోత్రి, పురాతన ఆలయాలు మరియు మతపరమైన నమ్మకాలకు ప్రసిద్ది

గంగోత్రి, పురాతన ఆలయాలు మరియు మతపరమైన నమ్మకాలకు ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతంలో గంగోత్రి ఆలయం ఒక ప్రధాన హిందూ మతం పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని గూర్ఖా రాజు, అమర్ సింగ్ తాప18 వ శతాబ్దం లో నిర్మించారు. భక్తులు అధిక సంఖ్యలో గంగా దేవతను ఆరాధించటానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పర్యాటకులు ఇక్కడ ఉన్న గ్యానేశ్వర్ ఆలయం మరియు ఏకాదశరుద్ర ఆలయాన్ని కూడా సందర్శించవొచ్చు. ఇక్కడ జరిగే 'ఏకాదశ రుద్రాభిషేకం పూజ' చాలా ప్రశస్తి చెందింది.

PC: Atarax42

గంగోత్రి ఆలయానికి దగ్గరలో ఉన్న 'గౌరికుండ్' మరియు 'సూర్య కుండ్'

గంగోత్రి ఆలయానికి దగ్గరలో ఉన్న 'గౌరికుండ్' మరియు 'సూర్య కుండ్'

భగీరథి శిల మరియు గంగోత్రిలో మునిగినట్లు ఉన్న శివలింగం వివిధ మత విలువలకు సంబంధం కలిగి ఉన్నాయి. ఈ సహజ శివలింగం శీతాకాలంలో నీటి మట్టం తగ్గి ఉండటం వలన, ఈ కాలంలో మాత్రమే కనిపిస్తుంది. భగీరథి శిల, ఈ రాయి మీదే భగీరథ రాజు తపస్సు చేశారని ఒక నమ్మకం. పర్యాటకులు, గంగోత్రి ఆలయానికి దగ్గరలో ఉన్న 'గౌరికుండ్' మరియు 'సూర్య కుండ్' కూడా సందర్శించ వొచ్చు.

Photo Courtesy: Guptaele

గంగోత్రిలో ట్రెక్కింగ్ అనుభూతిని

గంగోత్రిలో ట్రెక్కింగ్ అనుభూతిని

గంగోత్రిలో ట్రెక్కింగ్ అనుభూతిని పూర్తిగా పొందవొచ్చు. ఈ పట్టణం నుండి చిన్న ట్రెక్ ద్వారా 'పాండవ గుఫా' చేరుకోవొచ్చు. మహాభారత వీరులు మరియు రాజులు అయిన పాండవులు ధ్యాన ప్రదేశం ఈ గుహ (హిందీలో 'గుఫా') అని ఒక నమ్మకం.

PC: A. J. T. Johnsingh

శేష్నాగ్

శేష్నాగ్

సముద్ర మట్టానికి 3000 మీ. ఎత్తున ఉన్న 'దయార బుగ్యాల్' ను పర్యాటకులు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవొచ్చు. ఇది చాలా ఎత్తులో ఉన్న అందమైన గడ్డి మైదానం, ఇక్కడ నుండి పర్యాటకులు హిమాలయాల అద్భుతమైన సౌందర్యాన్ని ఆస్వాదించవొచ్చు. దీనిని చేరుకోవాలంటే, రెండు గ్రామాలు, 'బర్సు' మరియు 'రైతల్' నుండి ట్రెక్కింగ్ దారులనుండి చేరుకోవొచ్చు. ఈ ట్రెక్కింగ్ దారులగుండా వెళ్ళేప్పుడు 'శేష్నాగ్ ఆలయాన్ని' సందర్శించవొచ్చు.ఇక్కడ పర్యాటకులు శీతాకాలంలోనార్డిక్ మరియు ఆల్పైన్ స్కైయింగ్ కూడా అనుభూతి చెందవొచ్చు.

గౌముఖ్ -తపోవన్

గౌముఖ్ -తపోవన్

ఆలి, ముండలి, కుష్ కళ్యాణ్, కేదర్ కాంత, టెహ్రీ గార్వాల్లోని, బెడ్ని బుగ్యల్ మరియు చిప్లకోట్ లోయ దగ్గరలో ఉన్న స్కైయింగ్ కు అనువైన స్థలాలు. గంగోత్రి పట్టణంలో, గంగోత్రి-గౌముఖ్ -తపోవన్ ట్రెక్కింగ్ స్థావర కాంప్ ఉన్నది. 'కేదార్తల్' ను కూడా ట్రెక్కింగ్ మార్గానికి అనుసంధించారు. గంగోత్రికి చుట్టుపక్కల ప్రాచుర్యంలో ఉన్న గాంజెస్ హిమనదం, మనేరి, కేదార్ తల, నందనవన్, తపోవన్ విశ్వనాధ్ ఆలయం, దోడి తల్, తెహ్రి, కుటేటి దేవి ఆలయం, నచికేత తల్, గంజ్ఞాని మొదలయిన వాటిని కూడా పర్యాటకులు సందర్శించవొచ్చు.

PC: Shubhang99

గంగోత్రికి ఎలా వెళ్ళాలి??

గంగోత్రికి ఎలా వెళ్ళాలి??

విమానాశ్రయం
గంగోత్రికి సుమారుగా 280 కి. మీ. దూరంలో, డెహ్రాడూన్ లోని జాలి గ్రాంట్ ఏర్‌పోర్ట్ ఉన్నది. దీనికి సమీపం లో గల మరొక అంతర్జాతీయ విమానాశ్రయంఇందిరా గాంధీ ఏర్‌పోర్ట్. ఇక్కడ నుండి ప్రతీరోజు విమాన సర్వీసుల సదుపాయం ఉన్నది.
రైలు మార్గం
గంగోత్రికి సుమారుగా 250 కి. మీ. దూరంలో రిశికేష్ రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలకు ప్రయాణించవచ్చు.
రోడ్డు మార్గం
గంగోత్రికి సమీప ప్రదేశాల నుంచి నిరంతరం బస్సు సదుపాయం ఉన్నది. గవర్నమెంట్ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సుల సదుపాయం కలదు.

PC: Harisharma.atc

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X