Search
  • Follow NativePlanet
Share
» »గరుడ ఆలయం - ఆసక్తికర కధనాలు !

గరుడ ఆలయం - ఆసక్తికర కధనాలు !

By Mohammad

గరుత్మంతుడు హిందూ పురాణాల్లో పేర్కొనబడిన ఒక గరుడ పక్షి మరియు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. శ్రీ మహా విష్ణువు ఎక్కడికి వెళ్లాలన్నా గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు. ఇతను వినయశీలి మరియు బలశాలి కూడా.

గరుత్మంతునికి ఆలయాలు బహు అరుదు. అటువంటి ఆలయాలలో ఒకటి కర్ణాటక రాష్ట్రంలో కలదు. కోలార్ జిల్లాలోని కొలదేవి గ్రామంలో గరుడ ఆలయం తప్పక చూడదగినది.

గరుత్మంతుని లోహపు విగ్రహం

గరుత్మంతుని లోహపు విగ్రహం

చిత్ర కృప : Opponent

పురాణాల్లో గరుడ ఆలయం గురించి ప్రస్తావన

ద్వాపర యుగ కాలంలో, ఒకనాడు అర్జునుడు వేటకై అడవిలోకి వెళతాడు. అతను వదిలిన బాణాలు నిప్పును వెదజల్లుతూ అడవి అంతా బుగ్గిపాలు చేస్తుంది. అందులోని వృక్షాలు, పక్షులు, సర్పాలు అన్ని కూడా నేలరాలిపోతాయి. చనిపోయిన సర్పాల కారణంగా అతనికి శాపం తగులుతుంది.

ఇది కూడా చదవండి : కోలార్ - పర్యాటక ప్రదేశాలు !

శాపం నుండి విముక్తి ని పొందేందుకు అర్జునుడు ఎంతో మంది మునులను అడుగుతాడు. అప్పుడు వారు సర్పదోష నివారణకై గరుత్మంతుడిని పూజించమని చెబుతారు. అప్పుడు అర్జునుడు గరుత్మంతునికి ఒక ఆలయాన్ని కట్టించి పూజలు చేసాడని, ఆ ఆలయం ఇప్పుడున్న కోలాదేవి గ్రామంలో ఉన్న గరుడ ఆలయం అని స్థానికులు చెబుతారు.

రావణుడు జటాయువును చంపుతున్న దృశ్యం

రావణుడు జటాయువును చంపుతున్న దృశ్యం

చిత్ర కృప : Praveenp

ఈ ఆలయానికి సంబంధించి మరో కధనం కూడా పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇది రామాయణ కాలం నాటిది. రావణుడు సీతాదేవిని ఎత్తుకొని పుష్పకవిమానంలో తీసుకొని వెళ్ళేటప్పుడు, గరుత్మంతుడు (జటాయు) అతనిని అడ్డగిస్తాడు. రావణుడు అతనిని సంహరిస్తాడు. జటాయు ఇక్కడే పడిపోవటంతో, ఈ గ్రామానికి కొలదేవ్ అనే పేరొచ్చింది. గరుత్మంతుని వీరోచిత పోరాటానికి, అతని ధైర్య సాహసాలకి మెచ్చిన శ్రీమహావిష్ణువు అతనిని బతికించి ఇక్కడే పూజలు అందుకోమని ఆశీర్వదిస్తాడు.

temple

గరుడ ఆలయంలో చూడవలసిన మరో స్థలం ఆంజనేయస్వామి మందిరం. గరుత్మంతుడు బలశాలి అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అన్నాడు. భుజం మీద ఒక పక్క శ్రీ మహావిష్ణువును, మరో పక్క లక్ష్మీ దేవిని మోస్తాడు కాబట్టి. కనుక, తరచూ ఇక్కడికి వచ్చే భక్తులు శ్రీ మహావిష్ణువును మరియు గరుడ ఆలయాన్ని దర్శిస్తుంటారు.

గరుడ స్వామి ఆలయం దేశంలో ఉన్న అరుదైన ఆలయాలలో ఒకటి మరియు కర్ణాటక రాష్ట్రంలో తప్పక చూడవలసినది గా ప్రసిద్ధి చెందినది.

సాధారణంగా విష్ణు దేవాలయాలలో మూలవిరాట్టు కు అభిముఖంగా గరుత్మంతుని విగ్రహం ఉంటుంది. శ్రీ వైష్ణవ చిహ్నాలలో ఊర్ధ్వపుండ్రాలకు ఇరువైపులా శంఖ చక్రాలు, వాటి ప్రక్కల గరుత్మంతుడు, హనుమంతుని విగ్రహాలు లేదా బొమ్మలు ఉంటాయి.

కోలార్ లోని కొలదేవి గ్రామానికి ఎలా చేరుకోవాలి ?

బెంగళూరు నుండి కోలార్ 75 KM ల దూరంలో ఉన్నది. ముళబగిలు నుండి కొలదేవి గ్రామం 15 KM ల దూరం లో కలదు.

రోడ్డు మార్గం ద్వారా : బెంగళూరు నుండి కొలాదేవి గ్రామానికి చేరుకొనేవారు, NH 4 గుండా ప్రయాణించి కోలార్ చేరుకోవాలి. అక్కడి నుండి ఎడమపక్క తీసుకొని ముడియనురు క్రాస్ చేరుకుంటే కొలదేవి గ్రామానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా : బెంగళూరు నుండి కోలార్ కు ప్రతిరోజూ రైళ్లు నడుస్తుంటాయి.

  • క్లిక్ : కోలార్ ఎలా చేరుకోవాలి ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X