Search
  • Follow NativePlanet
Share
» »ట్రెక్కింగ్ ప్రియుల కోసం: వీసాపూర్ కోట-కోట నిండా గుహలే..

ట్రెక్కింగ్ ప్రియుల కోసం: వీసాపూర్ కోట-కోట నిండా గుహలే..

ఎప్పుడూ హనీమూన్ ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, హిల్ స్టేషన్ లు, బీచ్ లు చూసి రొటీన్ గా ఫీలయ్యేవారికి కాస్త భిన్నంగా ఉండే చారిత్రక నేపధ్యం గల ప్రదేశం పూణే. ఇది మరాఠీయుల సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుంది. పూణే మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక జిల్లా. ప్రస్తతం ఒక ఐటీ కేంద్రం గా భావిస్తున్న పూణే ఒకప్పుడు చరిత్ర పుటల్లో నిలిచిన ప్రదేశమే. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ఈ జిల్లాలోనే జన్మించినాడు. శివాజీ సుల్తాన్ లను, మొఘలులను ఓడించిన గొప్ప పోరాట సమయోధుడు. పూణే పశ్చిమ కనుమల్లో, సముద్రమట్టానికి 560 మీటర్ల ఎత్తున ఉన్న నగరం.

పూణే కు వచ్చే వారు చాలా వరకు చూడటానికి ఇష్టపడేది అగా ఖాన్ ప్యాలెస్, షిండే చాత్రి, సింహగడ్ కోట (సిన్హాగడ్ కోట). వీటితో పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ రాజభవనాలు, కోటలు మరియు అనేక చారిత్రక స్మారక కట్టడాలు ఉన్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో గల సందర్శనీయ ప్రదేశాలలో వీసాపూర్ కోట ఒకటి.

వీసాపూర్ కోట

వీసాపూర్ కోట

పూణే లో వున్న వీసాపూర్ కోట 1085 అడుగుల ఎత్తులో నిర్మించారు. వీసాపూర్ గ్రామానికి దగ్గరలోని ఈ కోటని పేష్వ వంశ మొదటి రాజు బాలాజీ విశ్వనాధ్ కట్టించారు. ఈ కోట నిండా చాలా వరకు గుహలు, మందిరాలు వున్నాయి. , స్తంభాలు, ఎత్తైన గోడలు, పురాతనమైన ఇల్లు శాతవాహనుల నుంచి చాళుక్యుల దాక, మొఘలాయి రాజుల నుంచి మరాఠాల దాక, అందరూ ఈ కోటని వశపరుచుకొని పరిపాలన చేసినవారే.

PC- Bajirao

ఈ కోట మాన్‌సూన్‌లో తన ప్రాకృతిక సౌందర్యాన్ని

ఈ కోట మాన్‌సూన్‌లో తన ప్రాకృతిక సౌందర్యాన్ని

ఈ కోట మాన్‌సూన్‌లో తన ప్రాకృతిక సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడికి వెళ్లే అన్ని మార్గాల్లో విభిన్న రకాల వృక్ష సంపదను చూస్తుంటారు. ట్రెక్కింగ్ ప్రియులకు ఇది అందమైన ప్రదేశం.

PC : Amar Mainkar

ఈ కోటను సందర్శించడానికి ఉత్తమ సమయం

ఈ కోటను సందర్శించడానికి ఉత్తమ సమయం

ఈ కోట అత్యంత ఎత్తైన కొండపై ఉంది. సంవత్సరంలో ఏ సమయంలో అయినా సందర్శించవచ్చు. అయితే వర్షాకాలంలో ట్రాకర్స్ స్లిప్ అయ్యే ప్రమాదం ఉంటుంది కనకు వీసాపూర్ హిల్ స్టేషన్ ను చేరుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా వర్షాకాలంలో వీసాపూర్ కు ట్రెక్కింగ్ చేయకపోవడమే మంచిది. వీసాపూర్ ప్రక్రుతి అందాలను తిలకించాలంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు చాలా ఉత్తమమైన సమయం.

PC: Dmpendse

ఈ కోట చుట్టూ చూడవల్సిన అనేక ఆకర్షణీయమైన ప్రదేశాలున్నాయి.అవి

ఈ కోట చుట్టూ చూడవల్సిన అనేక ఆకర్షణీయమైన ప్రదేశాలున్నాయి.అవి

లోహగఢ్ :లోహఘడ్ ఫోర్ట్ లోహఘడ్ అంటే లోహపు కోట అని అర్ధం వచ్చే ఈ కోట లోనావాలా లోని సహ్యాద్రి శ్రేణుల్లో వుంది. 1050 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో వున్న ఈ కోటను ఛత్రపతి శివాజీ మహారాజు విస్తృతంగా ఉపయోగించాడు. మీకు శిల్ప కళ, చరిత్ర, పురావస్తు రంగాల్లో ఆసక్తి వుంటే, ఈ ప్రదేశాన్ని వదులుకోకండి.
Photo Courtesy: vivek Joshi

టైగర్స్ లీప్

టైగర్స్ లీప్

ఖండాలా లోని మైమరిపించే ప్రాంతం ది టైగర్స్ లీప్. ఖండాలా లోని అనేక ఆకర్షణీయ ప్రాంతాలలో ఒకటైన ఈ లోయను జాగ్రత్తగా గమనించినప్పుడు ఒక పులి లోయ మీదకు దూకుతున్నట్లుగా అనిపించడమే ఈ ప్రాంతానికి ఆ పేరు రావడానికి గల కారణం.
PC : Kothariutkarsh88

అమృతాంజన్ పాయింట్

అమృతాంజన్ పాయింట్

ఖండలఘాట్ ప్రారంభoలో మొదటి వాలులోని అంచున గల అమృతాంజన్ పాయింట్ మరొక చూదగిన ప్రదేశం. ఇక్కడ నుండి దగ్గరలోని ఉత్కంఠభరిత దృశ్యాలను చూడవచ్చు. ఈ పాయింట్ నుండి లోయలోని అందమైన దృశ్యాలు, డ్యూక్స్ నోస్ దృశ్యాలను చూడవచ్చు.
PC : Alewis2388

మౌంటెన్ ట్రెక్కింగ్

మౌంటెన్ ట్రెక్కింగ్

రాళ్ళను ఎక్కే సాహాసాన్ని చేయదలుచుకుంటే మీరు ఖండాలా లో ఈ ప్రయత్నాన్ని చేయవచ్చు. డ్యూక్స్ నోస్ పీక్, కర్ల కొండలు ఎక్కి డ్యూక్ నోస్ పై నుండి విశాలమైన గ్రామ ప్రాంతాలకు చెందిన మైమరపించే అందాలను చూడవచ్చు.
PC : Alosh Bennett

పూణే ఎలా చేరుకోవాలి ?

పూణే ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం
పూణే నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహేగావ్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఇక్కడి నుండి డిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, దుబాయి, సింగపూర్ లకు కూడా నేరుగా విమానాల్లో ఎక్కి ప్రయాణించవచ్చు.

రైలు మార్గం
పూణే లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ రైల్వే జంక్షన్ నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు నిత్యం రైలు సర్వీసులు నడుస్తుంటాయి. పూణే నుంచి ముంబై 153 కిలోమీటర్ల దూరంలో వుంది. డెక్కన్ క్వీన్, శతాబ్ది ఎక్స్ ప్రెస్, ఇంద్రాయని ఎక్స్ ప్రెస్ లాంటివి ముంబై పూణే ల మధ్య తిరిగే రైళ్ళు.

రోడ్డు మార్గం
పూణే కి మహారాష్ట్ర లోను, ఇతర రాష్ట్రాల లోను వున్న ప్రధాన నగరాల నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి. ముంబై - పూణే రహదారి ప్రయాణించడానికి చాల సౌకర్యంగా వుంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పూణే వెళ్ళే దారిలో వుండే పశ్చిమాద్రి కనుమలు వర్షాకాలం లో ఓ అందమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తాయి.
చిత్ర కృప : Jbritto

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X