Search
  • Follow NativePlanet
Share
» »అహ్మ‌దాబాద్‌లో ఓల్డ్ సిటీ హెరిటేజ్ వాక్‌కు మీరూ వెళ్లండి

అహ్మ‌దాబాద్‌లో ఓల్డ్ సిటీ హెరిటేజ్ వాక్‌కు మీరూ వెళ్లండి

అహ్మ‌దాబాద్‌లో ఓల్డ్ సిటీ హెరిటేజ్ వాక్‌కు మీరూ వెళ్లండి

గుజరాత్‌లో అతిపెద్ద నగరం అహ్మదాబాద్. దీనిలో ఎన్నో ముఖ్యమైన నిర్మాణాలు, ఆర్ట్స్ సెంటర్‌, ఆహ్ల‌ద‌భ‌రిత‌మైన‌ కేఫ్‌లు, అద్భుతమైన నైట్ మార్కెట్‌లకు ప్రసిద్ధి చెందింది. మొఘల్, మరాఠా మరియు ఢిల్లీ సుల్తానేట్ పాలనతో పాటు భారతదేశ స్వాతంత్య్ర‌ పోరాటాన్ని మనకు గుర్తుచేసే చారిత్ర‌క నేపథ్యం క‌లిగింది. సబర్మతి ఆశ్రమాన్ని ఇక్క‌డి ప‌ర్యాట‌క ప్ర‌దేశాల జాబితాలో చేర్చాల్సిందే. లాల్‌భాయ్ దల్పత్‌భాయ్ మ్యూజియంలో భారతీయ స్మారక చిహ్నాలు, ప్రకృతి దృశ్యాలు, పత్రాలు, స్కెచ్‌లు మరియు నాణేలు క‌నువిందు చేస్తాయి. జామా మసీదు నగరంలోని పురాతన మసీదుగా చెప్పబడుతుంది. ఇక్కడ షాపింగ్‌ను ఎప్పుడూ ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

అహ్మదాబాద్ ఆహ్లాద‌భ‌రిత‌మైన‌ వాతావరణం క‌లిగిన సబర్మతి నది తీర‌పు అందాల‌ను మాట‌ల్లో వ‌ర్ణించ‌డం క‌ష్టం. ఈ న‌గ‌ర‌పు అందాన్ని మరియు వారసత్వ సంస్కృతిని హెరిటేజ్ వాక్ చేయడం ద్వారా అన్వేషించవచ్చు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప‌రిధిలో అహ్మదాబాద్ హెరిటేజ్ వాక్ ద్వారా ఇక్క‌డి చారిత్ర‌క నేప‌థ్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఇది నిర్వహించబ‌డుతోంది. ఈ వాక్‌ ఉదయం 8 గంటలకు కలపూర్ స్వామినారాయణ దేవాలయం నుండి ప్రారంభమై ప‌ది నుండి 10:30 మ‌ధ్య‌ జుమ్మా (జామా) మసీదు వద్ద ముగుస్తుంది.

ahmedabad-1669448620.jpg -Properties

అలా దాదాపు రెండు గంటల 30 నిమిషాల్లో మొత్తం 20 గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. అంతేకాదు, రాత్రి సమయంలో అధికార యంత్రాంగం మరో హెరిటేజ్ వాక్ నిర్వ‌హిస్తోంది. ఇది సిడి సయ్యద్ మసీదు నుండి రాత్రి 8:45 గంటలకు ప్రారంభమై మానెక్ చౌక్ వద్ద రాత్రి ప‌ది గంటలకు ముగుస్తుంది. యునెస్కో-జాబితాలో ఉన్న ఓల్డ్ సిటీ విశేషాల‌ను తెలుసుకునేందుకు హెరిటేజ్ వాక్‌ ఉత్త‌మ మార్గం.

దాదాపు 22 సంద‌ర్శ‌నా స్థలాలు..

హెరిటేజ్ వాక్‌లో ఉన్న ప్రదేశాలు సంద‌ర్శ‌కుల మ‌న‌సుదోచేలా ఉంటాయి. అహ్మదాబాద్ వారసత్వంతో పెనవేసుకుని ఉన్నాయి. ఈ నడకలో టెంపుల్ & మసీదులతో సహా దాదాపు 22 సంద‌ర్శ‌నా స్థలాలను ద‌గ్గ‌ర‌గా చూసే అవ‌కాశం దొరుకుతుంది. అహ్మదాబాద్ యొక్క అద్భుతమైన వీక్షణను రాత్రిపూట‌ ఆస్వాదించడానికి, హౌస్ ఆఫ్ ఎంజీ నిర్వహించే ఒక గంట రాత్రి పర్యటనను బుక్ చేసుకోవ‌డం మంచిది. ఇది సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది.

ahmedabad-21-1669448610.jpg -Properties

అలాగే, నగరం యొక్క చారిత్రాత్మక పరిసరాల చుట్టూ తిరుగుతూ, ఓల్డ్ సిటీపై దృష్టి సారించేందుకు రెండు గంటల బ్రేక్‌ఫాస్ట్ హెరిటేజ్ వాక్, హౌస్ ఆఫ్ ఎంజీ అక్టోబరు నుండి మార్చి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ హెరిటేజ్ వాక్‌కి వెళ్లినప్పుడు డ్రెస్‌ కోడ్‌ను త‌ప్ప‌నిస‌రిగా అనుసరించాలి. పై దుస్తులు భుజాలు, ఛాతీ, నాభి మరియు పై చేతులను కప్పి ఉంచే దుస్తులను ధ‌రించాలి. అలాగే, దిగువ దుస్తులు తప్పనిసరిగా మోకాళ్ల వరకు ఉండే చూసుకోవాలి.

టికెట్ ధర - హెరిటేజ్ వాక్‌ను అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది కాబట్టి, ఈ మొత్తం గైడెడ్ టూర్‌కు ఫీజులు చాలా నామమాత్రంగా ఉంటాయి. సుమారుగా టిక్కెట్ ధ‌ర‌ భారతీయ పౌరులకు ఒక‌రికి రూ. 200 ఉంటుంది. అలాగే, విదేశీయులకు పన్నుల‌తో క‌లుపుకొని ఒక‌రికి రూ.300 వ‌ర‌కూ ఉంటుంది. రాత్రి స‌మ‌యంలో హెరిటేజ్ వాక్‌, సిడి సయ్యద్ మసీదు తొమ్మిది గంట‌ల‌కు ప్రారంభమవుతుంది. మానెక్ చౌక్ ద‌గ్గ‌ర సుమారు ప‌ది గంట‌ల‌కు ముగుస్తుంది. దీని టిక్కెట్ ధ‌ర‌ భారతీయులకు 150 రూపాయిలు మరియు విదేశీయులకు 200 రూపాయిల వ‌ర‌కూ ఉంటుంది.

Read more about: gujarat ahmedabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X