Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ కాళీమాత చేతిలో తక్కెడ ఉండేది ఎందుకో తలుసా? ఈ శ్రావణ మాసంలో దర్శనం చేసుకొంటే

ఇక్కడ కాళీమాత చేతిలో తక్కెడ ఉండేది ఎందుకో తలుసా? ఈ శ్రావణ మాసంలో దర్శనం చేసుకొంటే

గోకర్ణ పుణ్యక్షేత్రానికి సంబంధించి

కర్నాటకలోని ఉత్తరకర్నాటక జిల్లాలో ఉన్న గోకర్ణ గ్రామం అటు ప్రసిద్ధ శైవ క్షేత్రంగానే కాకుండా ప్రకతి ఆరాధకులకు స్వర్గధామంగా కూడా పేరుగాంచింది. ఈ క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు ఎంతగా వీస్తాయో సముద్ర తీర అందాలు కూడా అంతగానే అలరిస్తాయి.

అందువల్లే ఈ గోకర్ణ అంతర్జతీయ పర్యాటకులను సైతం ఆకర్షిస్తోంది. ఇక ఇక్కడ ఉన్న కోటలు అలనాటి యుద్ధ తంత్రానికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రస్తుతం బీచ్ లతో పాటు ఈ కోటలు కూడా పర్యాటక ప్రియులను ముఖ్యంగా ట్రెక్కర్స్ ను ఆకర్షిస్తున్నాయి.

ఇక ఈ గోకర్ణ శైవ క్షేత్రం అనేక రహస్యాలకు నిలయం కూడా. శివుడికి ఇష్టమైన శ్రావణ మాసంలో ఈ గోకర్ణ క్షేత్రాన్ని సందర్శిస్తే కైలాసాన్ని దర్శించుకొన్నంత పుణ్యం వస్తుందని నమ్ముతారు. ఇందుకు సంబంధించిన ఆధ్యాత్మిక కథనాలతో పాటు ఇక్కడ చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన అందమైన ఫొటోలు మీ కోసం...

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

రావణాసురుడు శివుడి గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం ఆ ఆత్మలింగం భూమి పై పెట్టకూడదు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇందుకు విరుద్దంగా ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అవుతుంది. రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్టింపచేస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని దేవతలు భావిస్తారు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

దీంతో వారంతా విష్ణువును వేడుకొనగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుకోవడానికి సంసిద్ధుడవుతాడు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ విషయం తెలుసుకొన్న నారదుడు వినాయకుడి వద్దకు వెళ్లి రావణుడి నుంచి ఆ ఆత్మలింగాన్ని తీసుకుని భూమి పై పెట్టాలని సూచిస్తాడు. వినాయకుడు గోపాలుడి వేశం ధరించి రావణుడు వచ్చే మార్గంలో వేచి చూస్తాడు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

దీంతో రావణాసురుడు ఆ గోపాలుడి వేశంలో ఉన్న వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇచ్చి తాను తిరిగి వచ్చేవరకూ ఆ విగ్రహాన్ని భూమి పై పెట్టవద్దని సూచిస్తాడు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

అయితే వినాయకుడు తాను లింగం బరువును మోయలేకపోతే మూడు సార్లు పిలుస్తానని అంతలోపు మీరు రాకుంటే ఈ శివలింగాన్ని భూమి పై పెడుతానని చెబుతాడు. ఇందుకు రావణుడు అంగీకరిస్తాడు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

దీంతో వినాయకుడు శివలింగాన్ని తన చేతుల్లోకి తీసుకొంటాడు. రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి అలా వెళ్లగానే గణపతి శివలింగాన్ని మోయలేక పోతున్నట్లు చెప్పి మూడు సార్లు పిలుస్తాడు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

దీంతో రావణాసురుడు పరుగుపరుగున అక్కడికి వస్తాడు. అయితే అప్పటికే వినాయకుడు ఆ శివలింగాన్ని భూమి పై పెడుతాడు. దీంతో ఆగ్రహంతో రావణాసురుడు గణపతి నెత్తిమీద మొత్తుతాడు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

దీంతో గణపతి నెత్తిమీద గుంట పడుతుంది. అటు పై వెంటనే విష్ణువు తన మాయని తొలగించిన వెంటనే సూరన్యుడు ఆకాశంలో మళ్లి కనిపిస్తాడు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ విషయాన్ని గ్రహించిన రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించడానికి ప్రయత్నిస్తాడు. ఆత్మలింగం పై నున్న కవచం విచ్ఛిన్నం చేసి విసిరివేస్తాడు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇది గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగం పై నున్న మూత తొలగించి విసిరేస్తే అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

లింగం పై నున్న వస్త్రాన్ని విసిరేస్తే అది కందుక పర్వతం పై నున్న మురుడేశ్వరలో పడుతుంది. అయినా ఎంత ప్రయత్నించినా ఆత్మలింగం మాత్రం తిరిగి రాదు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

దీంతో రావణుడు నిరాసతో లంకకు వెనుతిరుగుతాడు. ఆత్మలింగం ఉన్న చోటే మహాబలేశ్వర లింగంగా పేర్కొంటారు. ఇక మహాబలేశ్వర ఆలయానికి కూత వేటు దూరంలో గణపతి ఆలయం ఉంటుంది.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

రావణాసురుడు వినాయకుడి తల పై మొత్తాడు అన్న దానికి గుర్తుగా గణపతి మాడు మీద ఒక గుంటను మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇక్కడ గణపతిని మనం చేతితో తాకి అభిషేకం కూడా చేయవచ్చు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇక మహాబలేశ్వరుడి ఆలయానికి దగ్గర్లోనే భద్రకాళీ దేవాలయం కూడా ఉంది. ఇక్కడ భద్రకాళిని అన్నపూర్ణమ్మగా భావిస్తారు. ఆవిడ చేతిలో తక్కెడ ఉంటుంది.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

అయితే ఆ తక్కెడ ఇరువైపులా సమానంగా కాకుండా ఒక వైపునకు ఒరిగి ఉంటుంది. కాశీలో పవిత్రమైన నదుల్లో ఒకటైన గంగానది మాత్రమే ఉంది.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇక గోకర్ణలో మాత్రం పవిత్రమైన కోటి తీర్థాలు ఉన్నాయని చెప్పడానికి భద్రకాళి అమ్మవారి చేతిలోని తక్కెడ ఒక వైపునకు ఒరిగిపోయి ఉందని చెబుతారు. ఈ కోటి తీర్థంలో పిత`తర్పణలు సమర్పిస్తారు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇక గోకర్ణలో కుడ్లు బీచ్, ఓం బీచ్, అర్థచంద్రాకార బీచ్, ప్యారడైజ్ బీచ్ వంటి అంత్యంత అందమైన బీచ్ లు ఎన్నో ఉన్నాయి. అందువల్లే ఇక్కడకు విదేశీయులు సైతం ఎక్కువగా వస్తుంటారు.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

గోకర్ణకు దగ్గరగా మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. గోకర్ణ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకర్ణ స్టేషన్ లో మంగళూరు-ముంబై మీదుగా వెళ్లే రైళ్లన్నీ ఆగుతాయి. ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి. 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంటాలో ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఆగుతాయి.

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం

P.C: You Tube

కార్వార్ నుంచి గోకర్ణకు నిత్యం బస్సు సర్వీసులు ఉంటాయి. అదేవిధంగా హుబ్లీ, హంపి నుంచి కూడా గోకర్ణకు తరుచూ బస్సులు నడుస్తుంటాయి. బెంగళూరు, మైసూరు నుంచి కూడా గోకర్ణకు నేరుగా బస్సు సర్వీసులు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X