Search
  • Follow NativePlanet
Share
» »సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సెలవులు వస్తే, ఏదైనా కొత్త ప్రదేశాలకి వెళ్లాలనుకుంటారు పర్యాటకులు. అలాంటి వారికి ఉపయోగపడేదే ఈ వ్యాసం.

By Venkatakarunasri

సెలవులు వస్తే, ఏదైనా కొత్త ప్రదేశాలకి వెళ్లాలనుకుంటారు పర్యాటకులు. అలాంటి వారికి ఉపయోగపడేదే ఈ వ్యాసం. ముఖ్యంగా మన దక్షిణ భారత దేశంలో కొన్ని ప్రదేశాలు బాహ్య ప్రపంచానికి తెలియవు లేదా అంతగా గుర్తింపుకు నోచుకోలేదు. వాటిలో కొన్ని మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉన్నాయి. అక్కడి వాతావరణం కాలుష్యరహితంగా ఉంటూ, ప్రకృతితో మమేకమై ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఇక్కడ చెప్పబడుతున్న ప్రదేశాలకు పర్యాటకులు కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను వెంట తీసుకొనిపోవచ్చు. బస, భోజనం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. అవి అక్కడే గాని లేదా సమీప పట్టణాల్లో గాని లభిస్తాయి. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే, ఈ ప్రదేశాలకు అన్ని రకాల మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. వాటిని కూడా అందిస్తున్నాం. మరి ఒక్కో ప్రదేశాన్ని ఎలా చేరుకోవాలో, అక్కడ ఏమి చూడవచ్చొ ఒకసారి గమనిస్తే ...

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

అతిరాప్పిల్లి జలపాతం

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

అతిరాప్పిల్లి కి సమీపాన ఉన్న విమానాశ్రయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 55 కి.మీ. దూరంలో కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్, ట్యాక్సీ అద్దెకు తీసుకొని అతిరాప్పిల్లి చేరుకోవచ్చు.

రైలు మార్గం

అతిరాప్పిల్లి కి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ లు త్రిస్సూర్(78 కి.మీ), కొచ్చి (66 కి. మీ), చలకుడి (31 కి. మీ). ఈ రైల్వే స్టేషన్ ల నుండి ప్రభుత్వ బస్సులో లేదా ప్రవేట్ బస్సులో ప్రయాణించి అతిరాప్పిల్లి చేరుకోవచ్చు.

బస్సు మార్గం

అతిరాప్పిల్లి కి బెంగళూరు, కొచ్చి, త్రిస్సూర్, చలకుడి పట్టణాల నుండి ప్రవేట్ మరియు ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

అతిరాప్పిల్లి జలపాతం

ఏమి చూడాలి ?

అతిరాప్పిల్లి జలపాతం కేరళలో ప్రసిద్ధి చెందిన జలపాతం. ఈ జలపాతం చుట్టుప్రక్కల మరో రెండు జలపాతాలు కూడా ఉన్నాయి. వాటిలో వలచల్ జలపాతం ఒకటి కాగా, మరోటి చర్ప జలపాతం. చర్ప ఫాల్స్ అతిరాప్పిల్లి నుండి త్రిస్సూర్ వెళ్లే మార్గంలో కలదు. స్యాంక్చురీ లు, తోటలు, ఉద్యాన వనాలు, బర్డ్ వాచింగ్ ఇక్కడి అదనపు ఆకర్షణలు.

చిత్ర కృప : Bimal K C

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

మరావంతే ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

మరావంతే సమీప విమానాశ్రయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 110 కి. మీ. దూరంలో కలదు. క్యాబ్ లేదా ట్యాక్సీ ల ను అద్దెకు తీసుకొని మరావంతే చేరుకోవచ్చు.

రైలు మార్గం

మరావంతే సమీప రైల్వే స్టేషన్ కుందా రైల్వే స్టేషన్. ఇది సుమారు 18 కి. మీ. దూరంలో కలదు. అలాగే మంగళూరు రైల్వే స్టేషన్ కూడా 110 కి. మీ. దూరంలో ఉన్నది. రైల్వే స్టేషన్ నుండి ట్యాక్సీ లేదా బస్సుల్లో ప్రయాణించి మరావంతే చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం ద్వారా మరావంతే చేరుకోవటానికి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను సమీప పట్టణాల నుండి నడిపిస్తుంది. గోవా, గోకర్ణం, బెంగళూరు నగరాల నుండి కూడా మరావంతే కు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : mayank kanyal

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

మరావంతే

ఏమి చూడాలి ?

మరావంతే కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి కి 50 కి. మీ. దూరంలో, బెంగళూరు కి 450 కి. మీ. దూరంలో ఉన్న చిన్న పట్టణం. కుందాపూర్, మరావంతే బీచ్, ఆనె గుడ్డే వినాయక ఆలయం, కోడి బీచ్, ఒట్టినానే లు చూడదగ్గవి. ఇండియాలో ప్రసిద్ధి చెందిన బీచ్ రోడ్లు !

చిత్ర కృప : Riju K

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

ధనుష్కోడి

ఎలా చేరుకోవాలి ?

ధనుష్కోడి కి 16 కి. మీ. దూరంలో ఉన్న రామేశ్వరం ప్రధాన రవాణా కూడలి. రామేశ్వరం చేరుకుంటే ధనుష్కోడి కి సులభంగా చేరుకోవచ్చు. కనుక ముందు మనం రామేశ్వరం చేరుకొనే మార్గాలు తెలుసుకుందాం ..!

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

వాయు మార్గం

మధురై దేశీయ విమానాశ్రయం రామేశ్వరానికి సమీపాన ఉన్న విమానాశ్రయం. ఇది 170 కి. మీ. దూరంలో కలదు. ట్యాక్సీ లేదా క్యాబ్ లు అద్దెకు తీసుకొని రామేశ్వరం చేరుకోవచ్చు. అక్కడి నుండి రోడ్డు మార్గాన ధనుష్కోడి వెళ్ళవచ్చు.

రైలు మార్గం

రామేశ్వరంలో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుండి దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. చెన్నై, మధురై, కొచ్చి, బెంగళూరు, తిరుపతి వంటి నగరాలకు బాగా అనుసంధానించబడి ఉన్నది. క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సులో ప్రయాణించి ధనుష్కోడి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

మధురై, కన్యాకుమారి, చెన్నై, ట్రిచి వంటి నగరాల నుండి రామేశ్వరానికి ప్రభుత్వ బస్సుల తో పాటుగా , ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : sathish jayagopal

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

ధనుష్కోడి

ఏమి చూడాలి ?

ధనుష్కోడి రామేశ్వరం ద్వీపంలోని ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతం భారతదేశ చివరి ప్రాంతంలో కలదు. ఈ గ్రామం నుండి 3 కి. మీ ముందుకెళితే శ్రీలంకలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ రాముని బ్రిడ్జ్ ప్రధాన ఆకర్షణ. ఇప్పుడైతే లేదుకానీ బ్రిడ్జ్ ఆనవాళ్ళు మాత్రం కనిపిస్తాయి. బీచ్ కూడా చూడదగినది.

చిత్ర కృప : Mike Prince

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

కుడ్లే బీచ్

కుడ్లే బీచ్ గోకర్ణం లో ఉన్నది. ముందుగా గోకర్ణం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ..!

వాయు మార్గం

గోవా లోని డబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయం 140 కి. మీ. దూరంలో ఉండి గోకర్ణం పట్టణానికి సమీపంలో ఉన్నది. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ ల మీదుగా గోకర్ణం చేరుకోవచ్చు.

రైలు మార్గం

గోకర్ణం పట్టణానికి 20 కి. మీ. దూరంలో ఉన్న అంకోలా రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుండి స్థానిక బస్సులో లేదా ట్యాక్సీ లో ప్రయాణించి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

గోకర్ణం పట్టణానికి మార్గోవా, బెంగళూరు, మంగళూరు పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. పర్యాటకులు ప్రతి రోజు నడిపే టూరిస్ట్ బస్ ల ద్వారా కూడా గోకర్ణం చేరుకోవచ్చు.

చిత్ర కృప : Harshith JV

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

కుడ్లే బీచ్

కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన బీచ్ లుఏమి చూడాలి ?

గోకర్ణం పట్టణం నుండి కుడ్లే బీచ్ 2 కి. మీ. దూరంలో ఉంటుంది. ఈ బీచ్ కు గోకర్ణం నుండి రిక్షా లో చేరుకోవచ్చు. బీచ్ లోని తెల్లని ఇసుక, అందమైన తాటి చెట్ల వరుస, హోటళ్లు, గుడిసెలు మరియు స్థానిక రుచికర ఆహారాలు ఇక్కడి ఆకర్షణలు.

చిత్ర కృప : Sitabja Basu

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

హళేబీడ్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

హళేబీడ్ కు 170 కి. మీ. దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ మీదుగా హళేబీడ్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

హళేబీడ్ కు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ హసన్ రైల్వే స్టేషన్. ఇది 27 కి. మీ. దూరంలో ఉన్నది. మంగళూరు, బెంగళూరు మరియు మైసూర్ వంటి ప్రధాన నగరాల నుండి ఈ రైల్వే స్టేషన్ కు రైళ్లు తిరుగుతుంటాయి. ట్యాక్సీ లేదా బస్సుల్లో ప్రయాణించి హళేబీడ్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

బెంగళూరు, మంగళూరు, మైసూర్ మరియు సమీప పట్టణమైన హసన్ నుండి కూడా కర్నాటక రాష్ట్ర రోదు రవాణా సంస్థ వారి బస్సులు నడుస్తుంటాయి. కావున, పర్యాటకులు వాటిలో ఎక్కి హళేబీడ్ చేరుకోవచ్చు.

చిత్ర కృప : Praveen Raj

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

హళేబీడ్

ఏమి చూడాలి ?

హళేబీడు

ఒకప్పుడు హొయసుల రాజుల రాచరిక హంగులతో నిండిన ప్రాచీన నగరం అని చెప్పవచ్చు. సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా శిల్పాలను అందంగా చెక్కారు. హొయలేశ్వర దేవాలయం, కేదారేశ్వర దేవాలయం, శాంతలేశ్వర దేవాలయం, బెలవడి ఇక్కడ చూడదగ్గవి.

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

పొన్ముడి హిల్స్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

పొన్ముడి కి సమీపంలో 65 కి. మీ. దూరంలో ఉన్న విమానాశ్రయం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడి నుండి ట్యాక్సీ ల ద్వారా పొన్ముడి చేరుకోవచ్చు.

రైలు మార్గం

తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ పొన్ముడి కి సమీపంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి పొన్ముడి కి ట్యాక్సీ లో చేరుకోవచ్చు. బస్సు / రోడ్డు మార్గం తిరువనంతపురం కు పొన్ముడి కి రెగ్యులర్ గా ప్రభుత్వ , ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : vishwaant

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

పొన్ముడి హిల్స్

ఏమి చూడాలి ?

పొన్ముడి అంటే మలయాళంలో బంగారు శిఖరం అని అర్థం. ఇది సముద్ర మట్టానికి 1100 మీ. ఎత్తున పడమటి కనుమల్లో విస్తరించి ఉన్నది. గోల్డెన్ వాలీ, పెప్పర వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ, జూ ఇక్కడ చూడదగ్గవి. ట్రెక్కింగ్ ద్వారా పొన్ముడి శిఖరాన్ని అధిరోహించుట ఒక సాహస క్రీడ.

చిత్ర కృప : thejasp

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సెయింట్ మేరీ ద్వీపాలు

సెయింట్ మేరీ ద్వీపాలు మాల్పే బీచ్ పట్టణంలో ఉన్నాయి. కనుక పర్యాటకులు మాల్పే చేరుకుంటే మేరీ ద్వీపాలను సులభంగా చేరుకోవచ్చు.

వాయు మార్గం

50 కి. మీ. దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయం మాల్పే కు సమీపాన ఉన్న విమానాశ్రయం. ఇక్కడి నుండి క్యాబ్, ట్యాక్సీ ల ద్వారా మాల్పే చేరుకోవచ్చు.

రైలు మార్గం

మాల్పే లో రైల్వే స్టేషన్ లేదు కానీ ఇక్కడికి 4 కి. మీ. దూరంలో ఉన్న ఉడిపిలో రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ నుండి ట్యాక్సీ, బస్సుల్లో ప్రయాణించి మాల్పే చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

ఉడిపి కేవలం 4 కి. మీ. దూరంలో ఉన్నది కాబట్టి మాల్పే కు నిత్యం రాష్ట్ర బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Shyam k

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సౌత్ ఇండియా 15 రహస్య ప్రదేశాలు !

సెయింట్ మేరీ ద్వీపాలు

ఏమి చూడాలి ?

మాల్పే ద్వీపంలో ఉన్న సెయింట్ మేరీ ద్వీపాన్ని కోకనట్ ద్వీపంలో అని అంటారు. ఈ ద్వీపంలో నాలుగు ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాలలో లావా వెదజల్లబడిన కొండ చరియలు ప్రత్యేక ఆకర్షణ. వీటితో పాటు బీచ్ అందాలూ ఆస్వాదించవలసినదే ...!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X