Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతిలోని గోవిందరాజస్వామి వారిని దర్శిస్తే తప్పక సంతానం కలుగుతుంది..

తిరుపతిలోని గోవిందరాజస్వామి వారిని దర్శిస్తే తప్పక సంతానం కలుగుతుంది..

తిరుపతికి గోవిందరాజపట్నం అని మరొక పేరు కూడా ఉంది. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం ఉండడంతో ఈ పేరు మీదుగా గోవిందరాజపట్నం అనే పేరు వచ్చింది. గోవిందరాజస్వామి వారు శ్రీవారి సోదరునిగా చెబుతారు. స్వామి వారి వ

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఒక ప్రసిద్ది చెందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. భారతదేశంలోనే పవిత్ర యాత్రా స్థలాల్లో ఒకటిగా అలరారుతోంది. అయితే మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు కేవలం ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకుంటే సరిపోదు, తిరుపతిలో కూడా ఎన్నో ప్రసిద్ద ఆలయాలున్నాయి. తిరుపతిలో మహిమాన్విత ప్రదేశంలో దర్శించాల్సిన ప్రదేశాలెన్నాయ ఉన్నాయి. కలియుగ దైవం చుట్టూ అద్భుతమైన ఎన్నో మరెన్నో దర్శనీయ ప్రదేశాలున్నాయి. ప్రకృతితో మమేకమయ్యి విశ్వమంతా నిండి ఉన్న ఆ మహారూపానికి దగ్గరగా మనలని తీసుకు వెళ్ళిన అనుభూతినిచ్చే ప్రదేశాలున్నాయి. అలాంటి వాటిలో శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం ఒకటి.

ఇది తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోనే కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజ స్వామి. ఈయనని శ్రీవెంకటేశ్వరునికి అన్న అని పిలుస్తారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్ఛిన ధనాన్ని కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నిర్వహణలో ఉంది.

తిరుపతికి గోవిందరాజపట్నం అని మరొక పేరు కూడా ఉంది

తిరుపతికి గోవిందరాజపట్నం అని మరొక పేరు కూడా ఉంది

తిరుపతికి గోవిందరాజపట్నం అని మరొక పేరు కూడా ఉంది. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం ఉండడంతో ఈ పేరు మీదుగా గోవిందరాజపట్నం అనే పేరు వచ్చింది. గోవిందరాజస్వామి వారు శ్రీవారి సోదరునిగా చెబుతారు. స్వామి వారి వివాహానికి కుబేరుడు ధన సహాయం చేసినట్టు స్థల పురాణం చెబుతోంది.

P.C: You Tube

శయనస్థితిలో గోవిందుడు

శయనస్థితిలో గోవిందుడు

కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచే పనిని గోవిందరాజస్వామి వారు చేపట్టారు. ఎంతు సేపు కొలిచినా పని పూర్తికక అలసిపోయి ఆ కొలమానికను తల కింద పెట్టుకుని శయనించినట్లు కథనాలున్నాయి.

P.C: You Tube

మరో కథనం ప్రకారం

మరో కథనం ప్రకారం

మరో కథనం ప్రకారం ఈ గోవిందరాజ స్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. ఈ దేవాలయం గోడలపైన వందల కొద్దీ శాసనాలున్నాయి.. అసలు ఇది శ్రీపార్థసారధి స్వామి ఆలయం. క్రిమికాంతకుడనే చోళరాజు, తన రాజ్యంలో వైష్ణవ మతం ఉండకూడదని భావించి, చిదంబరపురంలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. వైష్ణవ మతాచార్యులు రామానుజులు, రాజును వేడుకుని అక్కడి శ్రీకృష్ణ, రుక్మిణి, సత్యభామల వారపు ఉత్సవ విగ్రహాలను తిరుపతికి తీసుకునివచ్చారు.

P.C: You Tube

 ఈయనే శివుడైన తిరుమల వాసిని వైష్ణవుడుగా (వెంకటేశ్వరుడుగా

ఈయనే శివుడైన తిరుమల వాసిని వైష్ణవుడుగా (వెంకటేశ్వరుడుగా

పార్థసారధి స్వామి గర్భాలయం పక్కన మరో సన్నిధి ఏర్పా టు చేసి, అందులో గార(సున్నం)మట్టితో శయనమూర్తిగా గోవిందరాజస్వామి విగ్రహాన్ని రూపొందించి, ప్రతిష్టించారు. స్వామి ముందు, తాను తెచ్చిన ఉత్సవవిగ్రహాలను ప్రతిష్టించి, ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులు ఏర్పాటు చేశారు. ఆలయంలో పూజా విధులు ఏర్పాటు చేశారు. ఈయన తిరుపతి, తిరుమలకు మూడు సార్లు వచ్చారట. ఈయనే శివుడైన తిరుమల వాసిని వైష్ణవుడుగా (వెంకటేశ్వరుడుగా) రూపుమార్చినారట! ఆచార్య రామానుజులు, శ్రీగోవింద రాజస్వామిని ప్రతిష్టించినదానికి గుర్తుగా ఈ పట్టణాన్ని గోవిందరాజపట్టణం అనేవాళ్లు. ఆ తర్వాత తిరుపతిగా పేరుబడింది.

P.C: You Tube

నిత్యం సుప్రభాతం, తోమాలసేవ, సహస్రనామార్చన,

నిత్యం సుప్రభాతం, తోమాలసేవ, సహస్రనామార్చన,

తిరుమలలో స్వామి వారికి జరిగినట్టే గోవిందరాజస్వామికి కూడా నిత్యం సుప్రభాతం, తోమాలసేవ, సహస్రనామార్చన, నైవేద్యం, ఏకాంత సేవలు జరుగుతాయి. అలాగే వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఏటా వైశాఖ మాసంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గోవిందరాజ స్వామి ఆలయం ప్రాంగణంలోనే గోదాదేవి, పార్థసారధి కల్యాణ వెంకటేశ్వరస్వామి, లక్ష్మీ దేవి ఇలా చాలా ఆలయాలను దర్శించుకోవచ్చు.

P.C: You Tube

ఆలయనిర్మాణం:

ఆలయనిర్మాణం:

ఆలయానికి రెండు గోపురాలున్నాయి. బయటి ఆలయ గాలి గోపురం బాగా పెద్దది. లోపలి వైపు గోపురం ఇంకా పురాతనమైనది. రామాయణ, భాగవత గాథల శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. గోవిందరాజస్వామి విగ్రహం శేషశాయి ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తరదిక్కుకు పాదాలు, దక్షిణదిశలో తల పెట్టుకుని, శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై, నాభికమలంలో బ్రహ్మతో, తలపై కిరీటం, దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి.

P.C: You Tube

ఇక్కడి విగ్రహం మట్టితో చేసినందువల్ల అభిషేకం జరుగదు

ఇక్కడి విగ్రహం మట్టితో చేసినందువల్ల అభిషేకం జరుగదు

ఇక్కడి విగ్రహం మట్టితో చేసినందువల్ల అభిషేకం జరుగదు. అయితే తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలాగానే గోవిందరాస్వామి ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్దతులే పాటిస్తారు. ప్రధాన ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి. వీటి పై రామాయణ, మహాభారత గాధలను అందమైన శిల్పాల రూపంలో చెక్కారు.

P.C: You Tube

మూల విరాట్టు గోవిందరాజస్వామితో పాటు అండాళ్ అమ్మవారు,

మూల విరాట్టు గోవిందరాజస్వామితో పాటు అండాళ్ అమ్మవారు,

మూల విరాట్టు గోవిందరాజస్వామితో పాటు అండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామానుజ తిరుమంగై ఆళ్వారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మి, శ్రీ మనవాళ మహాముని సన్నిధులున్నాయి. ఉత్తర దిశ ఆలయంలో అనంత శయనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజ స్వామి కొలువైయున్నాడు. ఆలయం దక్షిణ భాగాన రుక్మిణీ సత్యభామా సహితుడైన పార్ధ సారధి మందిరం ఉంది.

P.C: You Tube

లీలలు:

లీలలు:

సంతానం లేని ఒక కాశీ రాజు కుటుంబసమేతంగా శ్రీనివాసుని సేవించి సంతాన భిక్షను కోరేందుకు తిరుమల వచ్చారట. స్వామిని కాశీరాజు దంపతులు దర్శించుకుని భక్తితో సేవించారట. స్వామి అనుగ్రించేందుకు, రాణి కలలో ప్రత్యక్షమై నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను. నీ ముక్కుకు ఉన్న నీనాసామణిని నాకు ఇవ్వు అన్నాడు. దానికి ఆమె స్వామివారితో నేను భర్త ఆజ్ఞకు లోబడి ఉండేదాన్ని.

P.C: You Tube

స్వామివారు అలా ఐతే- నేను నా అన్న గోవిందరాజుకు అధీనుడను

స్వామివారు అలా ఐతే- నేను నా అన్న గోవిందరాజుకు అధీనుడను

నా భర్త అనుమతిస్తే అలాగే ఇస్తాను అందట. అందుకు స్వామివారు అలా ఐతే- నేను నా అన్న గోవిందరాజుకు అధీనుడను - అతడు నీకు సంతానమివ్వమని నాకు అనుమతిస్తే అప్పుడే నీకు సంతానాన్ని ఇస్తాను. అంతేకాని మరే విధంగానూ కుదరదు అన్నాడని ప్రతీతి. ఈ కారణంగానే గోవిందరాజస్వామిని తిరుమలలో కొలువైన వేంకటేశ్వరునికి అన్నగా భక్తులు సంభావిస్తూంటారు.

P.C: You Tube

తిరుమల శ్రీనివాసుడు, తిరుపతి గోవిందరాజులు రెండూ విష్ణు స్వరూపాలే

తిరుమల శ్రీనివాసుడు, తిరుపతి గోవిందరాజులు రెండూ విష్ణు స్వరూపాలే

తిరుమల శ్రీనివాసుడు, తిరుపతి గోవిందరాజులు రెండూ విష్ణు స్వరూపాలే ఐనా భక్తులు గోవిందరాజస్వామిని శ్రీనివాసుని అన్నగా భావిస్తూంటారు. తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళిన కొందరు భక్తులు తిరుపతిలోని గోవిందరాజస్వామి దర్శనం చేసుకునే కొండ ఎక్కేవారు.

P.C: You Tube

ఎలా వెళ్ళాలి:

ఎలా వెళ్ళాలి:


రోడ్డు ద్వారా తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

రైలు మార్గం ద్వారా:

దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

వాయు మార్గం ద్వారా:
తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

P.C: You Tube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X