Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు టు మంగళూరు ట్రైన్ జర్నీ !

బెంగళూరు టు మంగళూరు ట్రైన్ జర్నీ !

ప్రయాణం అంటే చాలు నూటికి 99 మంది పర్యాటకులు ట్రైన్ ప్రయాణం ఎంపిక చేస్తారు. దీనికి కారణం, ట్రైన్ కూర్చొనటానికి, పడుకోనటానికి సౌకర్యం. అంతేకాక, విండో సీట్ లో కూర్చొని దారి పొడవునా అనేక సుందర ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. తాజా గాలి ఆస్వాదించవచ్చు. ప్రయాణ మార్గం అంతా ఆనందించవచ్చు. మీరు ప్రయాణించే ఆ ట్రైన్ కనుక కొండల మధ్య నుండి, లేదా మైదానాలు, జలపాతాలులోతైన లోయలు, గుండా ప్రయానిస్తూంటే, జర్నీ మరింత ఆహ్లాదకరంగా కూడా వుంటుంది.

వినసొంపైన మ్యూజిక్ లాంటి ట్రైన్ పరుగు ధ్వని అందరికీ ఇష్టమైనదే. బస్సులు వెళ్ళలేని సన్నని ఇరుకైన మార్గాలలో సైతం ట్రైన్ ప్రయాణిస్తుంది. ట్రైన్ జర్నీ ఎంత చిన్నదైనా సరే ఆ ప్రయాణ అనుభవం ఎన్నటికీ మరచి పోలేము. మరి ఇంత అందమైన మార్గాలు ఇండియా లో ఎన్నో కలవు. వీటిని గ్రీన్ రూట్స్ అంటారు. వాటిలో ఒకటి బెంగుళూరు నుండి మంగళూరు వెళ్ళే మార్గం. ఈ మార్గం అతి సుందరమైన పశ్చిమ కనుమల లో వుంది.

పర్యాటకులు ఈ మార్గం లో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కల లోయలు, మైదానాలు, కొండలు మాత్రమే కాక, సుమారు 60 సొరంగాల గుండా కూడా ప్రయాణం చేస్తారు. ఈ మార్గం ట్రెక్కింగ్ కు కూడా ఆనందంగా వుంటుంది. మరి ఇంత ఆనందాన్ని అందించే, ఈ బెంగుళూరు - మంగళూరు ట్రైన్ రూట్ వివరాలు తెలుసుకుందాం.

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !
యశ్వంత్ పూర్ రైలు స్టేషన్

యశ్వంత్ పూర్ రైలు స్టేషన్

యశ్వంత పూర్ లో బయలు దేరిన ఈ ట్రైన్ కొద్ది నిమిషాలలోనేబెంగుళూరు కు ప్రధాన రైలు స్టేషన్ అయిన సిటీ రైల్వే స్టేషన్ కు వచ్చేస్తుంది. ఈ ప్రధాన స్టేషన్ అనేక రైళ్ళు, ప్లాట్ ఫారాలు తో సందడిగా వుంటుంది. సాధారణంగా బెంగుళూరు లో ఈ దిశగా వున్న వారు ఈ స్టేషన్ లోనే ఎక్కుతారు.

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

యశ్వంత పూర్ లో బయలు దేరిన ఈ ట్రైన్ కొద్ది నిమిషాలలోనేబెంగుళూరు కు ప్రధాన రైలు స్టేషన్ అయిన సిటీ రైల్వే స్టేషన్ కు వచ్చేస్తుంది. ఈ ప్రధాన స్టేషన్ అనేక రైళ్ళు, ప్లాట్ ఫారాలు తో సందడిగా వుంటుంది. సాధారణంగా బెంగుళూరు లో ఈ దిశగా వున్న వారు ఈ స్టేషన్ లోనే ఎక్కుతారు.

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

బెంగుళూరు తర్వాత రైలు మరో ప్రధాన రైలు స్టేషన్ షుగర్ ప్రరిశ్రమ కు పేరు పడ్డ మండ్య పట్టణం ద్వారా వేలుగ్తుంది. ఇక్కడ అన్తులోని పచ్చటి పొలాలు కనపడతాయి. మంద్యలో కల యోగ నరసింహ టెంపుల్ ఒక పర్యాటక ఆకర్షణ.

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

మాంద్య రైలు స్టేషన్ నుండి, కర్ణాటకలోని మరొక అత్యతంత ఆకర్షణీయ పర్యాటక ప్రదేశం మైసూరు కు వచ్చేస్తుంది. మైసూరు లో అనేక టూరిస్ట్ ఆకర్షణ ప్రదేశాలు కలవు. మైసూరు ను కర్నాటక రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు.

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

హోలీ నరసిపుర స్టేషన్ హస్సన్ జిల్లా లో కలదు. కే. ఆర్. నగర్ క్రిందకు వస్తుంది. హోల్ నరసిపూర్ లో హేమవతి నది పై ఒక పెద్ద రిజర్వాయర్ కలదు. హేమవతి నది, కావేరి నది కి ఉప నది. హోలీ నరసి పూరా కు ఈ పేరు అక్కడ కల నరసింహ స్వామి టెంపుల్ కారణంగా వచ్చింది.

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

హోలీ నరసాపుర స్టేషన్ తర్వాత, మీ ట్రైన్ హస్సన్ పట్టణానికి చేరుతుంది. హస్సన్ లో మీరు అనేక అద్భుత పర్యాటక ఆకర్షణలు చూడవచ్చు. ఆహ్లాదకర వాతావరణం ఎల్లపుడూ కలిగి వుండే హస్సన్ ను పేద వారి ఊటీ అని చెపుతారు. ఇక్కడ నుండి మీరు ఇప్పటి వరకూ ఎంతో ఉత్సాహంగా చూడాలనుకునే అందమైన సహజ ప్రకృతి దృశ్యాలను ట్రైన్ మార్గంలో చూడవచ్చు.

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పశ్చిమ కనుమల లోని మల్నాడ్ ప్రాంతంలో కల సకలేశ్ పూర్ చాలా అందమైన దృశ్యాలు కలిగి వుంటుంది. ఇక్కడ మీరు చూసే ప్రదేశ అందాలు, మీ హృదయంలో ఎప్పటికి నిలిచి పోతాయి. విశాలమైన కాఫీ తోటలు, పచ్చటి మైదానాలు మీకు మంచి రొమాంటిక్ మూడ్ కూడా తెప్పిస్తాయి.

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

సకలేశ్ పూర్ తర్వాత మీ ట్రైన్ కొన్ని సొరంగాల మధ్యనుంది ప్రయాణిస్తుంది. ట్రైన్ సొరంగం లోకి ప్రవేశించటం, మీ బోగీలు పూర్తిగా చీకటి అయిపోవటం, మరల టన్నెల్ బయటి వెలుగు లోకి రావటం వంటివి మీకే కాదు, మీ పిల్లలకు కూడా తమాషా అయిన అనుభవాన్ని కలిగిస్తాయి.

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

మీ ట్రైన్ పడమటి కనుమల సుందరమైన ప్రాంతాల ద్వారా ప్రయాణిస్తుంటే, మీరు అక్కడి ప్రకృతి దృశ్యాలకు ఆశ్చర్య పోవాల్సిందే. బాగ్ లో కల మీ కెమరా సైతం మీరు మరచి ఆనందిస్తారు. కనుక కెమరా సిద్ధం చేసి ఉంచుకోండి, మరువలేని అనుభూతుల ఫోటోలు తీయవచ్చు.

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పడమటి కనుమల మధ్య నుండి ప్రయాణించిన మీరు, తర్వాతి ప్రయాణంలో ప్రసిద్ధ హిందువుల పుణ్య క్షేత్రం కుక్కే సుబ్రమణ్య చేరతారు. సుబ్రహ్మణ్యుడు కొలువు తీరిన అతి పురాతనమైన ఈ దేవాలయం రైలు స్టేషన్ నుండి 6 కి. మీ. ల దూరంలో వుంటుంది.

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

మీరు ప్రయాణించే ట్రైన్ మార్గం పొడవునా ఎన్నో పచ్చటి పొలాలు కల చిన్న, చిన్న గ్రామాలు చూపుతుంది. బంట్వాల్, పుత్తూరు వంటి రైలు స్టేషన్ ల గుండా ప్రయాణిస్తుంది. ఈ ప్రదేశంలో మీరు తప్పక ఫోటోలు తీసి, ఎన్నటికీ మరువని ప్రయాణం చేయండి.

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

పచ్చటి బాటలో పగటి ప్రయాణం !

ఈ ట్రైన్ ప్రయాణంలో మీరు ఏ మాత్రం పగలు ప్రయాణానికి విసుగు చెందకుండా ఆనందంగా కోస్తా తీరమైన మంగలూర్ పట్టణానికి చేరిపోతారు. ఈ ప్రయాణంలో మీరు తీసే కన్నుల విందైన సుందర దృశ్యాల ఫోటోలు బోనస్.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X