Search
  • Follow NativePlanet
Share
» »పరుశరాముడు, యక్షుడి తగువు తీర్చడానికే శివుడు పురుషాంగ రూపంలో వెలిశాడా?

పరుశరాముడు, యక్షుడి తగువు తీర్చడానికే శివుడు పురుషాంగ రూపంలో వెలిశాడా?

గుడిమల్లం క్షేత్రానికి సంబంధించిన కథనం.

దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన భారత దేశంలో కొన్ని ఆలయాలు ఎవరు నిర్మించారు? ఎప్పుడు నిర్మించారన్న విషయానికి సంబంధించిన వివరాల్లో స్పష్టత కూడా ఉండదు. ఇక ఆ ఆలయాల్లోని మూలవిరాట్టు రూపం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అటు వంటి రూపాన్ని మనం భారత దేశంలోనే కాదు హిందూ ధర్మాన్ని ఆచరించే మరే ఇతర దేశంలో కూడా చూడలేము. ఇటువంటి కోవకు చెందినదే ఆంధ్రప్రదేశ్ లోని గుడిమల్లం లో ఉన్న శివాలం. ఇక్కడ శివలింగం పురుషాంగాన్ని పోలి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఆ కథ ఏమిటి? ఈ పుణ్యక్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి? తదితర వివరాలన్నీ మీ కోసం....

అతీత శక్తులున్న ఈ విభిన్న శివలింగాలను దర్శనం చేసుకొన్నారాఅతీత శక్తులున్న ఈ విభిన్న శివలింగాలను దర్శనం చేసుకొన్నారా

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube

గుడిమల్లం చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలంలోని ఓ గ్రామం. చారిత్రాత్మకంగా ప్రాముఖ్యం చెందినది. ఇక్కడ దాదాపు 2600 కాలం నాటి శివలింగం ఉంది.

నాలుగు నెలలు మాత్రమే భూమి పై కనిపించే విచిత్ర దేవాలయంలో స్వర్గానికి మెట్లునాలుగు నెలలు మాత్రమే భూమి పై కనిపించే విచిత్ర దేవాలయంలో స్వర్గానికి మెట్లు

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
బహుష ఈ భూ మండలం పై ఇదే మొదటి శివలింగం అని చాలా మంది చెబుతారు. అంతేకాకుండా ఇక్కడ శివలింగం మానవ పురుషాంగం రూపంలో ఉంటుంది.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
గుడిమల్లం శివాలయంలోని శివుడు పరుశురామేశ్వరుడుగా పూజలందుకొంటున్నాడు. ఇక్కడ శివలింగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
ఈ ఆలయంలో గర్భాలయ అంతరాలయము ముఖ మండపం కన్నా లోతుగా ఉంటుంది. ఇక్కడి గర్భగుడిలోని శివలింగం లింగం రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగానివలే ఉంటాడు.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
ఇందుకు గల పురాణ కథనం ఆసక్తి కరంగా ఉంటుంది. తండ్రి మాట ప్రకారం పరశురాముడు తన తల్లి శిరఛ్చేదనం చేస్తాడు. ఆ మాత`హత్యా పాతకం నుంచి బయటపడటానికి గాను ఒక శివలింగం వెతికి దానికి పూజలు చేయాల్సిందిగా బుుషులు చెబుతారు.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
చాలా చోట్ల వెదికిన పరశురాముడికి ప్రస్తుతం గుడిమల్లం ఉన్న చోట ఓ శివలింగం కనిపిస్తుంది. దీంతో అక్కడ ఒక చెరువును తవ్వుతాడు. అక్కడ ప్రతి రోజూ ఓ దైవిక పుష్పం పూస్తూ ఉంటుంది.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
ఆ చెరువు నీటితో, ఆ పువ్వుతో రోజూ ఆ శివలింగాన్ని పూజిస్తూ ఉంటాడు. ఆ పువ్వును అడవి జంతువుల నుండి కాపాడుట కోసం చిత్రసేనుడనే యక్షుడిని పరశురాముడు కాపలాగా ఉంచుతాడు.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
అతను బ్రహ్మ భక్తుడు. ఒకమారు పరుశురాముడు లేని సమయంలో చిత్రసేనుడు ఆ పుష్పంతో శివుడికి పూజలు చేస్తాడు. తిరిగి వచ్చిన పరుశరాముడుకి కోపం వస్తుంది.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
అటు పై చిత్రసేనుడితో యుద్ధానికి తలపడుతాడు. ఆ యుద్ధం దాదాపు 14 ఏళ్లపాటు కొనసాగుతుంది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద పల్లం ఏర్పడుతుంది.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
అందువల్లే ఈ ప్రాంతానికి గుడిపల్లం అనే పేరు వచ్చిందని కాల క్రమంలో అది గుడిమల్లం గా పారిపోయిందని చెబుతారు. ఆ యుద్ధం ఎంతకీ ముగిసిపోయేసరికి చివరికి పరమశివుడు వారిరువురికి ప్రత్యక్షమై శాంతపరుస్తాడు.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
అందువల్లే ఈ ప్రాంతానికి గుడిపల్లం అనే పేరు వచ్చిందని కాల క్రమంలో అది గుడిమల్లం గా పారిపోయిందని చెబుతారు. ఆ యుద్ధం ఎంతకీ ముగిసిపోయేసరికి చివరికి పరమశివుడు వారిరువురికి ప్రత్యక్షమై శాంతపరుస్తాడు.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
వారి భక్తికి మెచ్చి వారిరువురి రూపంలో ఇక్కడ శివలింగంగా వెలుస్తానని చెబుతాడు. అందువల్లే ఇక్కడ శివలింగం లో విష్ణు రూపమైన పరశరాముడిని గుర్తుకు చేస్తూ ఒక చేతిలో వేటాడిన జంతువు, రెండవ చేతిలో ఒక కల్లుకుండ, మరో రూపమైన చిత్రసేనుడి మొహం అంటే బ్రహ్మ ముఖంతో శివుడు ఇక్కడ వెలిశాడని చెబుతారు.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
ఇక్కడ శివలింగం ముదురు కాఫీ రంగులో ఉంటుంది. ఈ లింగం సుమారు ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు ఉంటుంది. లింగం పై ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగం నుంచి బయటకు పొడుచుకొని వచ్చినట్లు చెక్కబడిన శివుడు ఒక పురుషుని భుజాల పై నిలబడిన రూపంలో కనిపిస్తాడు.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
ఇక్కడ శివలింగం ముదురు కాఫీ రంగులో ఉంటుంది. ఈ లింగం సుమారు ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు ఉంటుంది. లింగం పై ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగం నుంచి బయటకు పొడుచుకొని వచ్చినట్లు చెక్కబడిన శివుడు ఒక పురుషుని భుజాల పై నిలబడిన రూపంలో కనిపిస్తాడు.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
ఇక కుడిచేతిలో ఒక జంతువును తలకిందులుగా పట్టుకొని ఉండగా, ఎడమ చేతిలో చిన్న గిన్నెను పట్టుకొన్న స్థితిలో కనిపిస్తాడు. ఎడమ భుజానికి గండ్ర గొడ్డలి తగిలించుకొని కనిపిస్తాడు.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
ఇక్కడ స్వామివారికి యగ్నోపవీతం లేకపోవడం విశేషం. లింగపు అగ్రభాగము, కింది పొడవైన స్తంభ భాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా శివలింగం ఒక పురుషాంగమును పోలి ఉంటుంది.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
ఈ ఆలయానికి సంబంధించిన మరో కథ ప్రచారంలో ఉంది. ఆలయం గర్భగుడి ప్రతి అరవై ఏళ్లకు ఒకసారి వరదలు వచ్చి లోపలి భాగం మొత్తం నీటితో మునిగి పోతుంది.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
ఈ వరద నీరు శివలింగం పై భాగానికి తాకి అటు పై ఒక్కసారిగా కిందికి ప్రవహిస్తుంది. అటు పై ఈ భూగర్భ ట్యాంక్ ఎండిపోతుంది. గర్భగుడిలో చిన్న తొట్టిని నేటికి చూడవచ్చు.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
అదే విధంగా ఉత్తరాయణం, దక్షిణాయనంలో రెండు సాలర్లు ఈ రాతి గోడల పై చెక్కిన కిటికీల గుండా సూర్య కిరణాలు నేరుగా శివలింగాన్ని తాకుతాయి.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
ఈ ఆలయానికి దక్షిణ దిశలో వల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉపాలయం కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్న శాసనాలను అనుసరించి ఈ దేవాలయ అభివ`ద్ధి కోసం చోళులు, పల్లవులు తదితర రాజులు ఎన్నో బహుమతులు ఇచ్చారని తెలుస్తోంది.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
గర్భగుడి గజ ప`ష్టాకారంలో ఉంటుంది. అయితే ఈ ఆలయం ఎవరు కట్టించారో, ఈ శివలింగాన్ని ఎవరు ప్రతిష్టించారో మనకు ఈ శాసనాల్లో ఎక్కడా కనిపించదు.

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube
తిరుపతి నుంచి రేణిగుంట, తిరుచానూర్ మీదుగా గుడిమల్లంకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో దాదాపు 42 నిమిషాలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X