Search
  • Follow NativePlanet
Share
» »గురువయూరు ధార్మిక క్షేత్రమే కాదు అటవిడుపు కేంద్రం కూడా

గురువయూరు ధార్మిక క్షేత్రమే కాదు అటవిడుపు కేంద్రం కూడా

గురువయూరు ఎలిఫెంట్ క్యాంప్ కు సంబంధించిన కథనం.

సామాన్యంగా ఏనుగు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ చాలా ఆసక్తి కనబరుస్తారు. ఎక్కడైన పర్యాటకానికి వెళ్లినప్పుడో, ఏదేని దేవస్థానం వద్దో ఏనుగు ఉంటే దానిని చూడటానికి వయసును కూడా లెక్క చేయకుండా పరుగెత్తుతాం అంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ఆ ఏనుగులకు తినడానికి అరటి పండు, టెంకాయిని మనం అందించి ఎంతో ఆనందం పొందుతాం. అటు పై ఆ ఏనుగు ద్వారా ఆశీర్వాదం పొందుతాం. ఇక చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా ఏనుగు పైకి ఎక్కి సవారి చేయాలని ఎంతో ఉత్సుకత చూపిస్తారు. ఈ నేపథ్యంలో అటు పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు ఎలిఫెంట్ క్యాంప్ ను చూడటానికి వీలయ్యే గురువయూరు పర్యాటక స్థలం గురించి తెలుసుకొందాం.

'బంగారు మైదానం' చూశారా?'బంగారు మైదానం' చూశారా?

శ్రావణ మాసంలో తెరుచుకొనే ఈ నాగలోక ద్వారం చూడాలంటే ప్రాణాల పై ఆశలు వదులుకోవాల్సిందేశ్రావణ మాసంలో తెరుచుకొనే ఈ నాగలోక ద్వారం చూడాలంటే ప్రాణాల పై ఆశలు వదులుకోవాల్సిందే

ఇంతమంది దేవుళ్లల్లో ఒక్కరు కూడా కేరళను రక్షించలేకపోయారా?ఇంతమంది దేవుళ్లల్లో ఒక్కరు కూడా కేరళను రక్షించలేకపోయారా?

గురువాయూరు, కేరళ

గురువాయూరు, కేరళ

P.C: You Tube

గురువాయూరు ఒక ధార్మిక ప్రదేశమే కాక ఒక పర్యాటక కేంద్రం కూడా. ఇక్కడ దేశంలోనే అతి విశాలమైన ఎలిఫెంట్ క్యాంప్ ఉంది. ఈ ప్రాంతం పున్నత్తూర్ రాజ వంశానికి చెందినది.

ఇక్కడికి వెళితే మీ తలరాత మారిపోవడం ఖచ్చితంఇక్కడికి వెళితే మీ తలరాత మారిపోవడం ఖచ్చితం

గురువాయూరు, కేరళ

గురువాయూరు, కేరళ

P.C: You Tube
దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎలిఫెంట్ క్యాంప్ ఉంది. ఇక్కడ 60 ఏనుగులు ఉన్నాయి. ఇది గురువాయూరు నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకొన్నారు. ఏమి జరిగిందో తెలుసాఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకొన్నారు. ఏమి జరిగిందో తెలుసా

గురువాయూరు, కేరళ

గురువాయూరు, కేరళ

P.C: You Tube
గురువయూరు దేవాలయంలో జరిగే ప్రతి ఉత్సవంలో ఇక్కడి ఎలిఫెంట్ క్యాంప్ లోని ఏనుగులే ఉత్సవ విగ్రహాన్ని తీసుకువెలుతాయి. ఇక్కడ ఏనుగుల పరుగు పందాలను కూడా నిర్వహిస్తారు.

గురువాయూరు, కేరళ

గురువాయూరు, కేరళ

P.C: You Tube
ఈ పరుగుపందెంలో గెలిచిన ఏనుగుకు విశేష బహుమతులను కూడా అందజేస్తారు. ఇక ఇదే గురువాయూర్ లోని మమ్మియూర్ మహాదేవ దేవాలయం కూడా చూడదగినది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు.

గురువాయూరు, కేరళ

గురువాయూరు, కేరళ

P.C: You Tube
ఇక్కడ అద్భుతమైన శిల్ప సంపద ఎంతో ఉంది. మామ్మియూర్ మహాదేవ దేవస్థానంలోని దేవుడిని దర్శనం చేసుకోకుంటే గురువాయూర్ పర్యటన పూర్తి కాదని చెబుతారు.

గురువాయూరు, కేరళ

గురువాయూరు, కేరళ

P.C: You Tube
అందువల్ల గురువయూరు వచ్చిన వారందరూ ఈ దేవాలయాన్ని తప్పక సందర్శిస్తారు. ఇక్కడ పరమశివుడిని ఉమా మహేశ్వరుడి రూపంలో పూజిస్తారు.

గురువాయూరు, కేరళ

గురువాయూరు, కేరళ

P.C: You Tube
గర్భగుడిలో పరమశివుడి విగ్రహంతో పాటు విష్టవు విగ్రహం కూడా ఉండటం గమనార్హం. గణపతి, కార్తికేయుడు, అయ్యప్ప, భగవతి, నాగరాజు తదితర దేవతా మూర్తులను కూడా ఇక్కడ పూజిస్తారు.

గురువాయూరు, కేరళ

గురువాయూరు, కేరళ

P.C: You Tube
గురువాయూరు తోపాటు మమ్మియూరు దేవాలయాల్లో హిందువులకు తప్ప మరెవ్వరికీ ప్రవేశం కల్పించరు. గురువయూరులో మరో ప్రధాన పర్యాకస్థం పార్థసారథి దేవాలయం.

గురువాయూరు, కేరళ

గురువాయూరు, కేరళ

P.C: You Tube
ఆ నల్లనయ్యకు మరోపేరే పార్థసారథి. కురుక్షేత్ర సమయంలో ఆ పరమాత్ముడు అర్జునుడి రథసారథిగా ఉండటం వల్ల ఆ పరమాత్రుడికి ఆ పేరు వచ్చింది.

గురువాయూరు, కేరళ

గురువాయూరు, కేరళ

P.C: You Tube
ఈ దేవాలయంలోని శిల్పాలు భారతీయ శిల్పకళకు అద్ధం పడుతాయి. అందువల్లే శిల్పకళ పై అధ్యయనం చేసేవారు ఈ దేవాలయాన్ని తప్పక సందర్శిస్తుంటారు. ముఖ్యంగా ఉత్సవాలు జరిగే సమయంలో ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X