Search
  • Follow NativePlanet
Share
» »తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే గురువాయూర్ గోపాలుడి రూపం...

తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే గురువాయూర్ గోపాలుడి రూపం...

గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని ప్రముఖ పట్టణం. దక్షిణ ద్వారకగా పిలువబడే ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో పూజింపబడుతున్నాడు. తులసి మాలలతో, ముగ్

భారత దేశంలో దక్షిణ భారత దేశానికి చాలా ప్రత్యేక ఉంది, దక్షిణ భారత దేశంలోని ఆలయ నిర్మాణాలు చూస్తే మనస్సు తన్మయత్వం చెందుతుంది. పురాతన కాలం నాటి ఆచారాలకు నిదర్శనంగా నిర్మించిన ఆలయాలు చారిత్రక ఔచిత్యానికి నిదర్శనం. అటువంటి దేవాలయాలను సందర్శించడం ఒక మంచి అనుభూతి కలిగిస్తుంది. అలా అనుభూతిని కలిగించే ఆలయాల్లో ఒకటి గురువాయురప్పన్ దేవాలయం. గురువాయురప్పన్ దేవాలయం ఇండియాలో అత్యంత ప్రసిద్ది చెందినది మాత్రమే కాదు, అత్యంత ధనిక దేవాలయంల్లో కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. మరి ఈ ఆలయ చరిత్ర ఏంటో, విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గురువాయురప్పన్ ఆలయం చాలా పురాతనమైనది

గురువాయురప్పన్ ఆలయం చాలా పురాతనమైనది

గురువాయురప్పన్ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయం గురించి పురాణాలల్లో కూడా పేర్కొన్నారు. కలియుగం మొదట్లో ఇక్కడ బృహస్పతి శ్రీకృష్ణుని విగ్రహాన్ని కనుగొన్నాడు. గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని ప్రముఖ పట్టణం. ప్రముఖ పర్యాటక ప్రదేశం మరియు ఆధ్యాత్మిక నగరం కూడా...దక్షిణ ద్వారకగా పిలువబడే ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో పూజింపబడుతున్నాడు. ఇక్కడ ఉన్న గురువాయూరప్పన్ దేవాలయమే ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణ. ఈ ప్రదేశాన్ని విష్ణుమూర్తి రెండవ అవతారమైన శ్రీ కృష్ణుని నివాసగంగా భావిస్తారు. మన ఇండియాలోనే ఈ దేవాలయం నాల్గవ అతి పెద్ద ధనిక దేవాలయం.

P.C: You Tube

ఈ దేవాలయంలో తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో

ఈ దేవాలయంలో తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో

ఈ దేవాలయంలో తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే గురువాయూర్ గోపాలుడి రూపం మరే ఆలయంలోనూ మనం కాంచలేము. ఇక్కడ ప్రతీ రోజూ గంభీరమైన గజరాజాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఘీంకరిస్తాయి. ఆ తరువాతే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే, ప్రతీ సాయంత్రం గుడి నిండా దీపాలు వెలిగిస్తారు! అప్పుడు శ్రీకృష్ణుడి శోభను చూడటానికి రెండు కళ్లు సరిపోవు!

గురువాయూరప్పన్ ఆలయం దేశంలోనే ప్రసిద్ది చెందినది.

గురువాయూరప్పన్ ఆలయం దేశంలోనే ప్రసిద్ది చెందినది.

గురువాయూరప్పన్ ఆలయం దేశంలోనే ప్రసిద్ది చెందినది. ఇక్కడకి వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని కలియుగ వైకుంఠంగా భావిస్తుంటారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం బాల గోపాల కృష్ణుడి శిశువు. ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన పూజా విధానాన్ని ఇప్పటికీ ఆచరించే ఈ ఆలయంలో నంబూదిరి వంశపారంపర్యంగా పూజాదికాలు జరగుతుంటాయి.P.C: You Tube

గురువాయూరప్పన్ ఆలయంలో ఉన్న ప్రధాన విగ్రహానికి

గురువాయూరప్పన్ ఆలయంలో ఉన్న ప్రధాన విగ్రహానికి

గురువాయూరప్పన్ ఆలయంలో ఉన్న ప్రధాన విగ్రహానికి నాలుగు చేతులలో శంఖం, సుదర్శన చక్రం, కౌముదకి మరియు పద్మం ఉంటాయి. దేవాలయం వివిధ రకాల కూడ్య చిత్రాలతో కృష్ణుని లీలలను చూపుతూ అందంగా అలంకరించబడి ఉంటుంది. భక్తులు గురువాయురప్పని కన్నన్‌, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌... అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు.

P.C: You Tube

రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు

రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు

రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితోచేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం లేకపోయినప్పటికీ వేదపద్ధతిలో పూజలు నిర్వహించడంవల్లే వైష్ణవులకు గురువాయూర్‌ పరమపవిత్ర ప్రదేశంగా మారింది

మమ్మియూర్ మహాదేవ ఆలయాన్ని

మమ్మియూర్ మహాదేవ ఆలయాన్ని

మమ్మియూర్ మహాదేవ ఆలయాన్ని చూడకపోతే గురువాయూర్ పర్యటన పూర్తి కాదని చెబుతారు ఇక్కడి భక్తులు. అంతే కాక గురువాయూర్ లో నారాయణీయమ్ గ్రంథ పారాయణ చేస్తే సకల రోగాలు సమసిపోతాయని భక్తుల విశ్వాసం.

PC-Kish

మమ్మియూర్ మహదేవ ఆలయం

మమ్మియూర్ మహదేవ ఆలయం

మమ్మియూర్ మహదేవ ఆలయం గురువాయూరప్పన్ ఆలయానికి సమీపంలో ఉంది. పేరులో సూచించినట్లుగానే ఇది మహదేవుని ఆలయం. ఈ గుడి అందమైన కుడ్య చిత్రాలచేత నిర్మింపబడినది. విష్ణుమూర్తిని మోహినీ అవతారంలో చూపించిన చిత్రాన్ని కూడా చూడవచ్చు.

PC-Vinayaraj

ఈ ఆలయం లోపలి భాగంలో

ఈ ఆలయం లోపలి భాగంలో

ఈ ఆలయం లోపలి భాగంలో పార్వతి దేవి విగ్రహం కూడా ఉంది. గణపతి, సుబ్రమణ్య, అయ్యప్ప, విష్ణువులను కూడా ఈ దేవాలయంలో సందర్శించవచ్చు. ఇక ఈ ఆలయంలో గురువాయర్ విగ్రహం ఇక్కడ ప్రతిష్టించబడం వెనుక ఉన్న పురాణ కథనం ప్రకారం. ఇక్కడి గర్భగుడిలోని విగ్రహం ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదని చెబుతారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా చూపుతారు.P.C: You Tube

ఈ విగ్రహాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ పూజించార

ఈ విగ్రహాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ పూజించార

ఈ విగ్రహాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ పూజించారని చెబుతారు. ఈ విగ్రహం అత్యంత అరుదైన పాతాళ శిలతో తయారయ్యిందని చెబుతారు. ఇటువంటి శిలతో తయారైన విగ్రహం ఇదొక్కటే. ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడని ఆయన దానిని సంతానం కోసం పరితపిస్తున్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ చెబుతారు. ఆయన దానిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తాడు.

అటు పై ఆతడి నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ చెబుతాడు.అటు పై వసుదేవుడి నుంచి శ్రీ కృష్ణుడు అందుకొని ద్వారకలో ప్రతిష్టించాడనీ చెబుతారు.

P.C: You Tube

ఆలయ చరిత్ర చూస్తే..

ఆలయ చరిత్ర చూస్తే..

స్వామి వారి విగ్రహాన్ని పాతాళం జనశిలతో నిర్మించినట్లు పూర్వీకులు చెబుతుంటారు. కృష్ణావతారం సమాప్తి అయ్యే కాలంలో శ్రీకృష్ణుడు తన సహచరుడైన ఉద్ధవునికి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఇచ్చి లోక కళ్యాణం కోసం ఈ విగ్రహాన్ని ఎక్కడైనా స్థాపించమని ఆజ్ఝాపించాడు. జల ప్రళయం అనంతరం ఆ విగ్రహాన్ని వాయువుకాపాడి, దేవగురువు బృహస్పతికి అప్పగించారు. దేవ గురువైన బృహస్పతికి వాయువు సహాయంతో ఏర్పడిన ఈ ప్రాంతాన్ని గురువాయూర్‌ (గురువు+వాయువు+ఊరు)గా, స్వామిని గురువాయురప్పగా కొలుస్తుంటారు. విష్ణువు అవతారమైన ఈ బాల గోపాలుడికి అర్చకులు శంఖాభిషేకం, అర్చనలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు.

P.C: You Tube

గువాయూర్ ఆలయంలో ప్రతి ఏడాది ఆఖరున 41రోజుల పాటు

గువాయూర్ ఆలయంలో ప్రతి ఏడాది ఆఖరున 41రోజుల పాటు

గువాయూర్ ఆలయంలో ప్రతి ఏడాది ఆఖరున 41రోజుల పాటు మండల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. రాత్రి సేవలో భాగంగా ఏనుగు అంబారీపై కృష్ణ విగ్రహాన్ని ఆలయం చుట్టూ ఊరేగించి తిప్పే ఉత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకునే భక్తులు తమ కోర్కెలను సాధనకోసం తులాభారం, అన్నదానం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.
గురువాయూరప్పన్ ఆలయం కర్నాటక సంగీతం మరియు అనేక సంప్రదాయ నృత్య శిక్షణలను నేర్పుతుంది. వీటిని నేర్చుకోవడానికి కేరళ రాష్ట్రం నలుమూల నుండి విద్యార్థులు వస్తుంటారు.

P.C: You Tube

గురువాయూరప్పన్ దేవాలయానికి రోజూ వేల సంఖ్యలో భక్తులు

గురువాయూరప్పన్ దేవాలయానికి రోజూ వేల సంఖ్యలో భక్తులు

గురువాయూరప్పన్ దేవాలయానికి రోజూ వేల సంఖ్యలో భక్తులు సందర్శనార్థం వస్తుంటారు. దేవస్థానం వారు భక్తులకు రోజుకు రెండు సార్లు ఉచిత భోజనం పెడతారు. ఈ ఆలయంలో వివాహాలు అట్టహాసంగా జరుగతాయి. అదే విధంగా గురువాయూరప్ప సమక్షంలో పెళ్లి చేసుకొంటే జీవితం ఆనందమయంగా ఉంటుందని చెబుతారు. అందుకే సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడుతారు. అందువల్లే కేరళలో మరే గుడిలో జరగని పెళ్లిళ్లు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపళ్లు, బెల్లం, కొబ్బరికాయలు తదితరాలను స్వామివారికి భక్తులు నివేదిస్తారు.

గజరాజుల ప్రస్తావన లేని గురువాయూరును ఊహించలేము.

గజరాజుల ప్రస్తావన లేని గురువాయూరును ఊహించలేము.

గజరాజుల ప్రస్తావన లేని గురువాయూరును ఊహించలేము. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవన్ ల గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. పద్మనాభన్ ఎంతో సాధు లక్షణాలతో ఉండేది.
ఈ పద్మనాభన్ జీవించి ఉన్నంతవరకూ స్వామిసేవలోనే గడిపింది. క్రీస్తుశకం 1931లో అది చనిపోయే సమయంలో స్వామి నుదుట ఉన్న గంధం బొట్టు రాలిపోయిందట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్ కోటలో దేవస్థానానికి చెందిన ఏనుగుల శాల ఉంది. ఇందులో సుమారు 60 ఏనుగులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు.

P.C: You Tube

ఆలయ సందర్శన సమయం :

ఆలయ సందర్శన సమయం :

ఇక్కడ ఆలయాన్ని ఉదయం 3గంటలకు తెరుస్తారు, తిరిగి మధ్యాహ్నం 1.30 ముసివేస్తారు. మళ్ళీ తిరిగి సాయంత్రం 4.30కి తెరుస్తారు.

P.C: You Tube

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గం
గురువాయూర్ పట్టణానికి కేరళలోని అన్ని ప్రదేశాల నుండి ప్రభుత్వ బస్ లు కలవు. ఇండియాలోని ఇతర నగరాల నుండి అంటే కొచ్చిన్, కాలికట్, పాల్ఘాట్, త్రివేండ్రం, చెన్నై, బెంగుళూర్, కోయంబత్తూర్, సేలం ల నుండి నేరు బస్ లు కూడా ఉన్నాయి.

విమాన మార్గం

కొచ్చిన్ లో కల నెడుంబస్సెరీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువాయూర్ కు 87 కి.మీ.ల దూరం లో ఉన్న సమీప విమానాశ్రయం. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ పవిత్ర పట్టణానికి సుమారు 100 కి.మీ.ల దూరంలో ఉన్న మరొక ఏర్‌పోర్ట్. టాక్సీలు, బస్ లు విమానాశ్రయం నుండి గురువాయూర్ కు తేలికా లభ్యమవుతాయి.

రైలు మార్గం
గురువాయూర్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడి నుండి ఇరుగు పొరుగు పట్టణాలకు, నగరాలకు రైళ్ళు వెళుతుంటాయి. సమీప రైలు జంక్షన్ త్రిస్సూర్. ఇది 27 కి.మీ.ల దూరం. ఇక్కడి నుండి దేశంలోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు.

PC- arunpnair

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X