India
Search
  • Follow NativePlanet
Share
» »రాజసం ఉట్టిపడే గ్వాలియర్ కోట ఒక్కసారైనా చూసితీరాల్సిందే..

రాజసం ఉట్టిపడే గ్వాలియర్ కోట ఒక్కసారైనా చూసితీరాల్సిందే..

వింధ్యా, సాత్పూరా పర్వత శ్రేణుల మధ్య నర్మదా, తపతి నదులు సమాంతరంగా ప్రవహిస్తూ వుంటాయి. ఇక్కడి వైవిధ్య భరితమైన వృక్ష, జంతు జాతులు, ప్రాకృతిక అందం మధ్యప్రదేశ్ పర్యాటకానికి తలమానికంగా నిలుస్తాయి. వివిధ రాజుల పాలన వల్ల విభిన్న కళా, నిర్మాణ శైలులు ఏర్పడ్డాయి. ఖజురహోలోని అద్భుతమైన శృంగార శిల్పాలు, రాజసం ఉట్టిపడే గ్వాలియర్ కోట, ఉజ్జయినిలోని దేవాలయాలు, ఒర్చా లోని చిత్రకూట్ లేదా చట్ట్రిస్ అన్నీ అద్భుత నిర్మాణాలకు ప్రత్యేకతలే. ఖజురహో, సంచి, భీమ్ బెట్కాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాలుగా ప్రకటించింది.

గ్వాలియర్ లో చరిత్ర మరియు ఆధునికత రెండూ కలగలసిన మేళవింపుగా ఉంటాయి. చారిత్రాత్మక స్మారకాలు, కోటలు, మ్యూజియంలు ఉండటమే కాక, పారిశ్రామిక నగరంగా కూడా పేరుపొందినది. గ్వాలియర్ పట్టణం ఆగ్రాకు దక్షిణంగా సుమారు 122కి.మీల దూరంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పర్యాటక రాజధాని. ఎన్నో ప్రసిద్ద ఆలయాలు, పురాతన ప్రదేశాలు, సుందర దృశ్యాలు కలిగిన గత వైభవాలను గుర్తు చేస్తూ మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నాల్గవ అతి పెద్ద పట్టణంగా ఉంది. హింద్ యొక్క కోటల నెక్లస్ లో గ్వాలియర్ ను ఒక ముత్యంగా అభివర్ణిస్తారు. ఈ ప్రదేశం గ్వాలియర్ కోటకు ప్రసిద్ది. మరి ఈ కోట విశేషాలేంటి, ఇతర ఆకర్షణలు, పత్యేకతలేంటో ఒకసారి తెలుసుకుందాం..

గ్వాలియర్ చారిత్రాత్మక స్మారకాలు

గ్వాలియర్ చారిత్రాత్మక స్మారకాలు

గ్వాలియర్ చారిత్రాత్మక స్మారకాలు, కోటలు, కోటలు, మ్యూజియంలు ఉండటయే కాక, పారిశ్రామిక పరంగా కూడా బాగా ప్రసిద్ది చెందినది. గ్వాలియర్ లోనే మొదటగా 1857లో మరాఠా తెగకు చెందిన రాణి ఝాన్సి దేవి బ్రిటిష్ వారిపై విప్లవం తెచ్చి పోరాటం చేసింది.

చిత్రకృప : Abhishek Dwivedi

గ్వాలియర్ కోటను

గ్వాలియర్ కోటను

గ్వాలియర్ కోటను ఎప్పుడు నిర్మించారో ఆధారాలు మాత్రం లేవు, కానీ, ఆరో శతాబ్ధం నాటికి ఇది ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ కోటను చూసి హిందూస్తాన్ కోటల హారంలో ఇది మణిపూస వంటిది అని బాబర్ వ్యాఖ్యానించాడు. ఇండియా లోనే అతి పెద్ద చారిత్రక స్మారకం అయిన గ్వాలియర్ ఫోర్ట్ నగరం మధ్య లో ఒక కొండపై ఉంది. నగరం మొత్తం ఈ కోట నుండి చక్కగా చూడవచ్చు. దీని మార్గంలో రాళ్ళతో చెక్కబడిన జైన తీర్థంకరుల విగ్రహాలుంటాయి.

చిత్రకృప : Politvs

ఐదు అంతస్తులతో నిర్మితమైన ఈ కోటలో మూడు భూగర్భంలోనూ రెండు నేలమీద

ఐదు అంతస్తులతో నిర్మితమైన ఈ కోటలో మూడు భూగర్భంలోనూ రెండు నేలమీద

ఐదు అంతస్తులతో నిర్మితమైన ఈ కోటలో మూడు భూగర్భంలోనూ రెండు నేలమీద ఉన్నాయి. భూగర్భ అంతస్తులోకి గాలీ వెలుతురూ దారాళంగా వచ్చేలా నిర్మించారు. కోట నిర్మాణంలో చైనీయుల శిల్ప తీరు కనపడుతుంది. కోట స్తంభాలపై కల డ్రాగన్లు ఆనాటి చైనా...భారత సంబంధాలను సూచిస్తాయి. గ్వాలియర్ కోటను 'జిబ్రాల్టార్ అఫ్ ఇండియా' అని కూడా అంటారు. ఈ కోట వద్దే రాణి ఝాన్సి, తాంతియా తోపే లు బ్రిటిష్ వారితో భయంకర యుద్ధాలు చేసారు.

అప్పట్లోనే ఐదు అంతస్తుల మధ్య పరస్పర సమాచార

అప్పట్లోనే ఐదు అంతస్తుల మధ్య పరస్పర సమాచార

అప్పట్లోనే ఐదు అంతస్తుల మధ్య పరస్పర సమాచార మార్పిడికోసం ఇంటర్‌కమ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయటం విశేషం. గోడల్లో కనిపించకుండా ఏర్పాటుచేసిన గొట్టాల ద్వారా సంభాషించుకునేవారట. 11వ శతాబ్దం నుంచి ఇది పలువురి దురాక్రమణలకు గురయింది. 1568లో అక్బరు ఈ కోటను స్వాధీనం చేసుకుని రాజకీయ శత్రువులను ఉరితీసే ప్రదేశంగా ఉపయోగించబడింది.

Photo Courtesy: Nataraja

తరవాత ఈ కోట గోహాద్‌ రాణాలూ

తరవాత ఈ కోట గోహాద్‌ రాణాలూ

తరవాత ఈ కోట గోహాద్‌ రాణాలూ మరాఠాలూ బ్రిటిషర్ల చేతులుమారి చివరకు సింధియాలకు దక్కింది. ఇందులో మాన్‌సింగ్‌ నిర్మించిన మన్‌ మందిర్‌ నిర్మాణశైలి చూడ్డానికి ఎంతో బాగుంది. కోటలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా సంగీతమహల్‌ వస్తుంది. దీనిపక్కనే నృత్యమందిర్‌ ఉంది. అందులో గోడలకు అద్దాలు తాపడం చేసి ఉండేవి. దీపాల వెలుగులో ఆ అద్దాలతోబాటు కళాకారుల దుస్తుల పైన కుట్టిన అద్దాలమీదా ఆ దీపకాంతి ప్రతిబింబించి మందిరమంతా వెలుగులతో నిండిపోయేదట. ఇందులోనే ఓ పక్కన గ్రంథాలయం ఉంది. భూగర్భంలో జలక్రీడలకోసం నీటికొలను ఉంది.

Photo Courtesy: Jolle

హాథి పూల్ అనేది గ్వాలియర్ కోటకు ప్రధాన ప్రవేశ

హాథి పూల్ అనేది గ్వాలియర్ కోటకు ప్రధాన ప్రవేశ

హాథి పూల్ అనేది గ్వాలియర్ కోటకు ప్రధాన ప్రవేశ ద్వారం. కోట యొక్క ఆరు ప్రవేశ ద్వారాలు దాటి దీనికి చేరాలి. దీనిని దాటితే రాజు మాన్ సింగ్ నిర్మించిన సుందరమైన మాన్ మందిర్ చేరవచ్చు. నిర్మాణం గుండ్రంగా ఉండి ఆకర్షణీయంగా వుంటుంది.

చిత్రకృప : Gyanendrasinghchauha...

జైవిలాస్ ప్యాలెస్

జైవిలాస్ ప్యాలెస్

గ్వాలియర్ కోటలో సింధియాల జై విలాస్‌ ప్యాలెస్‌ చూడదగ్గది. 1874 సంవత్సరంలోనే దీన్ని నిర్మించటానికి కోటి రూపాయల ఖర్చు అయందంటారు. దీని విలువ ఇప్పుడు పదివేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇపుడు దీనిలో కొంత భాగం మ్యూజియం చేసారు. ఈ భవనం అద్భుతమైన శిల్ప కల కలిగి వుంటుంది. దీనిలో అనేక కళా కృతులు, సిందియ పాలనా కు చెందిన పత్రాలు, ఔరంగజేబ్, షా జహాన్ ల ఆయుధాలు ఇక్కడ ఉంచారు. ఇక్కడ కల బెల్జియం చాన్దిలియర్లు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ ప్రధానంగా చూడదగ్గది అతిపెద్ద భోజనాల బల్ల. దీనిమీద ఓ చిన్న వెండి రైలు తిరుగుతూ అతిథులకి కావలసిన బ్రాందీ, విస్కీ... వంటి పానీయాలూ సిగరెట్లూ సిగార్లూ అందజేస్తూ ఉంటుంది. తమకు కావలసినవి ఉన్న పెట్టె తమ ముందుకు వచ్చినప్పుడు ఎవరికి వారు తీసుకుంటారట.

చిత్రకృప : Gyanendrasinghchauha

రెండోది దర్బార్‌ హాలు.

రెండోది దర్బార్‌ హాలు.

రెండోది దర్బార్‌ హాలు. ఇందులో 250 బల్బులు ఉన్న రెండు షాండియర్లు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇవి అతిపెద్ద క్రిస్టల్‌ షాండ్లియర్లు. దర్బార్‌ హాల్లో పరిచిన తివాచీ ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందింది. గోడలకీ కప్పుకీ వేసిన పూలూ లతల డిజైన్ల తాపడానికీ దాదాపు రెండు క్వింటాళ్ల బంగారం వినియోగించబడిందంటారు. ఇంకా ఈ భవనంలో అప్పట్లో రాజకుటుంబీకుల జీవనవిధానాన్ని తెలియజేసే వస్తువులతో కూడిన ప్రదర్శనశాల ఉంది.

Photo Courtesy: Yann

తాన్ సేన్ సమాధి

తాన్ సేన్ సమాధి

తాన్ సేన్ సమాధి ఇది తాన్ సేన్ సమాధి. ఇక్కడే అతని గురువు సమాధి కూడా కలదు. హిందూస్తాని సంగీత విద్వాంసుడు తాన్ సేన్ అక్బర్ ఆస్థానంలో గాయకుడు. తాన్ సేన్ మేఘ మల్హార్ రాగం పాడితే వర్షం పడేదని చెపుతారు. సమాధి మొగల శిల్ప శైలి లో వుంటుంది. ప్రతి సంవత్సరం నవంబర్ , డిసెంబర్ లలో ఇక్కడ ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.

చిత్రకృప : Varun Shiv Kapur

అందమైన తోట ఫూల్

అందమైన తోట ఫూల్

ఫూల్ బాగ్ గ్వాలియర్ రైలు స్టేషన్ సమీపం లో కల అందమైన తోట ఫూల్ బాగ్. దీనిని ఆనాటి పాలకుడు మాధవ రావ్ షిండే నిర్మించగా, 1922 లో ప్రిన్సు అఫ్ వేల్స్ తన ఇండియా పర్యటనలో ఆవిష్కరించారు. గ్వాలియర్ జూ , గురుద్వారా టెంపుల్, మసీదు లు కూడా ఫూల్ బాగ్ ఆవరణలో కలవు.

చిత్రకృప : Varun Shiv Kapur

దేవో ఖో

దేవో ఖో

మధ్య ప్రదేశ్ లో ప్రేరణ కలిగించే అంశం.వింధ్య, సాత్పురా పర్వతాలు, పచ్చటి అడవులు చాలా జీవజాతులకు ఆలవాలం. వన్య ప్రాణి అభయారణ్యాలు, వన్యప్రాణి జాతీయ పార్కులు కూడా మధ్య ప్రదేశ్ పర్యాటకంలోని ప్రధాన ఆకర్షణలు. దేవో ఖో ప్రదేశం సహజమైన ప్రకృతి దృశ్యాల సమూహం. ఇక్కడ అనేక జంతువులు, పక్షులు నివసిస్తాయి. కనుక జంతు , పక్షి ప్రియులు దర్శించవచ్చు. ఇక్కడ ఒక ప్రసిద్ధ శివాలయం కూడా ఒక కొండపై కలదు.

చిత్రకృప : Arpit chhonker

గుజారి మహల్

గుజారి మహల్

గ్వాలియర్ లో ఇది ఒక ప్రసిద్ధ పురావస్తు మ్యూజియం. ఈ భవనాన్ని రాజా మాన్ సింగ్ తన భార్య మ్రిగానాయని జ్ఞాపకార్ధం నిర్మించాడు. 1922 లో దీనిని పురావస్తు శాఖ ఒక మ్యూజియం గా మార్చి అనేక పురావస్తు కలాక్రుతులను ప్రదర్శనలో పెట్టింది.
చిత్రకృప : Gyanendrasinghchauha...

సన్ ట్యాంక్

సన్ ట్యాంక్

సూరజ్ సేన్ సూరజ్ సేన్ అనే రాజు భయంకరమైన రోగమైన కుష్ఠురోగం వల్ల అతను బాధపడుతుండెను. ఒకసారి ఈ కోట సమీపంలోని "సన్ ట్యాంక్" లోని నీటిని త్రాగెను. ఆ నీటిని త్రాగిన అనంతరం సూరజ్ సేన్ సంపూర్ణంగా స్వస్థత పొందాడు.

PC:Varun Shiv Kapur

గ్వాలియర్ ఎలా చేరుకోవాలి ?

గ్వాలియర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : గ్వాలియర్ లో ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడికి తరచూ ఢిల్లీ, వారణాసి, ఇండోర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి విమానాలు వస్తుంటాయి.

రైలు మార్గం : గ్వాలియర్ లో రైల్వే జంక్షన్ కలదు. ముంబై, కోల్కతా, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ళు స్టేషన్ లో ఆగుతాయి.

రోడ్డు మార్గం : ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వంటి ప్రదేశాల నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు ప్రతిరోజూ తిరుగుతుంటాయి.

చిత్రకృప : Nikhilb239

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X