Search
  • Follow NativePlanet
Share
» »విజయవాడ వెళ్ళారా ... హాయ్ లాండ్ చూసారా ?

విజయవాడ వెళ్ళారా ... హాయ్ లాండ్ చూసారా ?

By Mohammad

అగ్రిగోల్డ్ వారి సౌజన్యంతో విజయవాడ మరియు గుంటూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో, మంగళగిరి మండలంలోని చినకాకిని గ్రామ పరిధిలో సువిశాల 40 ఎకరాల స్థలంలో హాయ్ లాండ్ ఏర్పాటు చేశారు. ఇదొక థీమ్ పార్క్. జ్ఞానంతో పాటు వినోదాన్ని, ఉల్లాసాన్ని అందించాలన్న ముఖ్య లక్ష్యంతో ఈ బుద్ధిజం పార్క్ ఏర్పాటు చేయటం జరిగింది.

ఎప్పుడు ఏర్పడింది ?

2010, అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య హాయ్ లాండ్ ను ప్రారంభించారు. ఇందులో వివిధ దేశాల పేర్లతో జోన్లు ఉన్నాయి. వాటికి చైనా, కాంబోడియా, థాయ్ లాండ్, టిబెట్‌, బర్మా, ఇండోనేసియా, జపాన్‌ జోన్లుగా పేర్లు పెట్టారు. ఇక్కడి నిర్మాణాలన్నీ ఆయా దేశాల సంస్కృతి - సాంప్రదాయాలను తెలిపే విధంగా ఉంటాయి.

haailand -1

చిత్ర కృప : Harshan Bhaskaran

వినోదాలు

పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా నీటి క్రీడలు ఉన్నాయి. వేవ్‌పూల్‌, లేజీరివర్‌, రెయిన్‌ డ్యాన్స్‌ వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. రైల్‌ఛేజ్‌, గోస్ట్‌ హంటర్‌, మ్యాజిక్‌ డ్యాన్సర్‌, బఫింగ్‌కార్స్‌, ఫ్లైయింగ్‌ ఎలిఫెంట్‌, ప్రైవేట్‌షిప్‌, క్రేజీజంప్‌ స్వింగ్‌ ఏరియంట్‌, ఫ్యామిలీ ట్రైన్‌, గోకార్టింగ్‌, వీడియోగేమ్స్‌ వినోదాన్ని ఇస్తాయి.

haailand -2

చిత్ర కృప : Silver Blue

వీటన్నిటి మధ్యలో తినటానికి ఫుడ్‌కోర్టు ఉంటుంది. ఇక్కడ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ వంటలతో పాటు పశ్చాత్య దేశాల వంటకాలను వడ్డిస్తారు. హాయ్ లాండ్ లో షాపింగ్‌ మాల్స్‌ ఉన్నాయి. బార్, కాఫీ షాప్ లు మరియు కేఫ్ షాప్ లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

రిసార్ట్ లు

హాయ్ లాండ్ లో పర్యాటకుల కోసం అధునాతన రిసార్ట్ లు ఉన్నాయి. గదులన్నీ క్లాసిక్ లుక్ తలపిస్తాయి. రాయల్, బిజినెస్ మరియు డీలక్స్ గదులుగా వీటిని విభజించారు. ఒక్కోదానికి ఒక్కో రేటు ఉంటుంది. మీ బడ్జెట్ ను బట్టి గదులను ఎంచుకోవచ్చు.

haailand -3

చిత్ర కృప : Harshan Bhaskaran

ఆరోగ్య కేంద్రాలు

హాయ్ లాండ్ లో ఆయుర్ సుఖ్ ఆరోగ్య గ్రామం కలదు. ఇందులో పంచకోశ, పంచకర్మ, త్రికాయ చికిత్సలతో పాటు, యోగా, ఫిజియోథెరపీ శిబిరాలు అందుబాటులో ఉన్నాయి. 20 లగ్జరీ కాటేజీలు చికిత్సలు పొందే వారికోసం సిద్ధం చేశారు.

haailand -4

చిత్ర కృప : Durgarao Vuddanti

సందర్శన వేళలు

హాయ్ లాండ్ ను బుధవారం నుంచి సోమవారం వరకూ ఉదయం 9.30 నుండి రాత్రి 9: 30 వరకు తెరిచి ఉంచుతారు. మంగళవారం సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తారు.

టిక్కెట్ల ధరలు

హాయ్ లాండ్ లో ప్రవేశ టికెట్ మూడు విధాలుగా ఉంటుంది. రాయల్‌ఫన్‌ ప్యాకేజీ టిక్కెట్‌ రూ.750, మెగా ఫన్‌ ప్యాకేజీ రూ.450, ఫన్ మెజెస్టిక్ ప్యాకేజి రూ. 850 గా ఉంటుంది. ప్యాకేజీలో లేని గేమ్స్‌కు ప్రత్యేకంగా టిక్కెట్లు తీసుకోవాలి.

haailand -5

చిత్ర కృప : Harshan Bhaskaran

హాయ్ లాండ్ ఎలా వెళ్ళాలి ?

వాయు మార్గం : విజయవాడ లోని గన్నవరం ఎయిర్ పోర్ట్ 35 KM ల దూరంలో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కనెక్ట్ చేయబడినది. క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి హాయ్ లాండ్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : మంగళగిరి రైల్వే స్టేషన్ 5 KM ల దూరంలో కలదు. గుంటూరు, విజయవాడ నుండి వచ్చే పాసింజర్ రైళ్లు మంగళగిరి వద్ద ఆగుతాయి. ఆటోలో ఎక్కి హాయ్ లాండ్ చేరుకోవచ్చు.

బస్సు మార్గం : విజయవాడ సిటీ నుండి 47 H సిటీ సర్వీసు హాయ్ లాండ్ వరకూ నడుపుతున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే బస్సు చినకాకిని వద్ద ఆగుతుంది. అక్కడి నుంచి ఒకటిన్నర కోలోమీటర్ దూరంలో హాయ్‌ల్యాండ్‌ పార్కు ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X