Search
  • Follow NativePlanet
Share
» »హలేబీడు సృజించిన శిల్పాలు...సృష్టికే అందాలు..

హలేబీడు సృజించిన శిల్పాలు...సృష్టికే అందాలు..

ఇది మైసూర్ కి 149కి.మీ దూరంలో మరియు హాస్సన్ జిల్లాకి 31కి.మీ దూరంలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హలెబీడు అంటే పురాతన నగరం .కన్నడ భాషలో 'హళె' అంటే పాత అని అర్థం. బీడు అంటే పట్టణం. హళేబీడు అంటే పాత పట్టణం

ఇది మైసూర్ కి 149కి.మీ దూరంలో మరియు హాస్సన్ జిల్లాకి 31కి.మీ దూరంలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హలెబీడు అంటే పురాతన నగరం .కన్నడ భాషలో 'హళె' అంటే పాత అని అర్థం. బీడు అంటే పట్టణం. హళేబీడు అంటే పాత పట్టణం.

హోయసల రాజులకు రాజధానిగా వుండేది. దీనిని అప్పటిలో 'ద్వారసముద్రం' అని పిలిచేవారు. హళేబీడు, బేలూరు, శ్రావణబెళగొళను కర్ణాటక పర్యాటక శాఖవారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హళేబీడును, బేలూరును, హోయసలుల జంట పట్టణాలుగా పిలుస్తారు. హళేబీడు మరియు బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్‌కు అతి సమీప చిన్న పట్టణాలు. హాలేబీడు అనగా శిథిలనగరం లేదా పాత నివాసం.

దీనికి పూర్వం దొరసముద్ర, ద్వారసముద్ర అని పేర్లు

దీనికి పూర్వం దొరసముద్ర, ద్వారసముద్ర అని పేర్లు

దీనికి పూర్వం దొరసముద్ర, ద్వారసముద్ర అని పేర్లు ఉండేవి. అనగా సముద్రానికి ద్వారం వంటిదని. ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం చవి చూసింది. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి. వీటిని మనం ఇప్పటికీ చూడవచ్చు. అందుకే దీనికి హలెబీడు (శిథిల నగరమని, పాత నివాసమని) అనే పేరు స్థిరపడిపోయింది.

చరిత్ర

చరిత్ర

ఈ హాలేబీడు 12 - 13 శతాబ్ది మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించాడని అంటారు. ఈ నిర్మాణంలో తన మంత్రి కేతనమల్ల తోడ్పడినాడని, ఇతనితో పాటూ కేసరశెట్టి అను శివభక్తుడు కూడా తోడ్పడినట్టు తెలుస్తుంది. ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో పూర్తైంది.

ఢిల్లీ సుల్తాన్ ల కాలంలో

ఢిల్లీ సుల్తాన్ ల కాలంలో

ఢిల్లీ సుల్తాన్ ల కాలంలో మాలిక్ కాఫర్ దాడుల వల్ల అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి. అందుకే దీనికి హలెబీడు (శిథిల నగరమని, పాత నివాసమని)అనే పేరు స్థిరపడిపోయింది.

ఇక్కడ కలహొయసలేశ్వర మరియు శాంతాలేశ్వర ఆలయాలు

ఇక్కడ కలహొయసలేశ్వర మరియు శాంతాలేశ్వర ఆలయాలు

ఇక్కడ కలహొయసలేశ్వర మరియు శాంతాలేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందినవి. హోయసల రాజులు జైన మతస్తులు ఐనప్పటికీ, శివుడి కి గల టెంపుల్స్ కూడా ఇక్కడ అనేకం చూడవచ్చు.

ద్వికూటాలయం.

ద్వికూటాలయం.

ద్వికూటాలయం. ఇందులో రాజా హోయసల పేరు మీదుగా ఒకటి, రాణి శాంతలదేవి పేరు మీదుగా మరొకటి మొత్తం, రెండు శివలింగాలను ప్రతిస్ఠించారు. వీటికి హోయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు.

ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెందు పెద్ద నందులు

ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెందు పెద్ద నందులు

ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెందు పెద్ద నందులు ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి.ఈ నందులు రకరకాల అలంకరణలతో అందంగా చెక్కబడినవి. ఇవి దేశంలోనే అతి పెద్ద నంది విగ్రహాల్లో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.

శిల్పాలు, కళాకృతులు, హోయసల శిల్ప శైలికి నిలువుటద్దాలు.

శిల్పాలు, కళాకృతులు, హోయసల శిల్ప శైలికి నిలువుటద్దాలు.

గర్భగుడి ముఖ ద్వారం, నంది, బృంగీ విగ్రహాలు, ఆలయంలోపలి పైకప్పుపై, వెలుపలి ఆలయగోడలపై హిందూ పురాణ గాథలను తెలియజేసే శిల్పాలు, జంతువులు, పక్షులు, నర్తకిల శిల్పాలు బహు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇక్కడి శిల్పాలు, కళాకృతులు, హోయసల శిల్ప శైలికి నిలువుటద్దాలు.

ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బురాతిని/బలపపు రాయిని

ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బురాతిని/బలపపు రాయిని

ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బురాతిని/బలపపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. రెందు ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, మరోటి దక్షిణం వైపునూ. ఉత్తరం ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలక విగ్రహం ఆకర్షణియంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది.

 బాహుబలి విగ్రహం నమున

బాహుబలి విగ్రహం నమున

హలెబీడు దేవాలయ ప్రాంగణంలో శ్రావణ బెలగోళ లోని బాహుబలి విగ్రహం నమున చెక్కి ఉంచారు. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం దగ్గరలోనే ఓ పెద్ద సరస్సు ఉన్నాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

 బేలూర్ దేవాలయంలో విష్ణువు అవతారాలు చెక్క బడి

బేలూర్ దేవాలయంలో విష్ణువు అవతారాలు చెక్క బడి

బేలూర్ దేవాలయంలో విష్ణువు అవతారాలు చెక్క బడి ఉంటే ఇక్కడ నంది పై ఆసీనుడై యున్న శివ పార్వతులను మనం ఇక్కడ చూడ వచ్చును.

బేలూరు

బేలూరు

బేలూరు కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఒక పట్టణం. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన చెన్నకేశావాలయం ఉంది. హొయసల శైలి శిల్పకళకు ఈ దేవాలయం ఒక నిలువుటద్దం. బేలూరును పూర్వం వేలా పురీ అనే వారు. క్రమంగా వేలూరుగా చివరికి బేలూరుగా మారింది. ఈ పట్టణం యాగాచి నది ఒడ్డున ఉంది.

ఒకనాడు హొయసలుల రాజధాని. ఆ తర్వాత ఇక్కడ నుండి హళేబీడుకు రాజధానిని మార్చారు. ఈ హళేబీడు బేలూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు పట్టణాలు హాసన్ జిల్లాలోనే ఉన్నాయి. వీటిని జంట పట్టణాలుగా పిలుస్తారు. ఇవి కర్ణాటక రాష్ట్రంలో ప్రధాన పర్యాటక ప్రాంతాలు. హొయసల రాజులు ఈ రెండు ప్రాంతాలలోనూ అద్భుత శిల్పకళతో కూడిన ఆలయాలను నిర్మించారు.

చెన్నకేశవాలయం

చెన్నకేశవాలయం

బేలూరులో వైష్ణవాలయాన్ని చెన్నకేశవాలయం పేరుతో పిలుస్తారు. దీనిని హొయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు. క్రీ.శ. 1117లో పశ్చిమ చాళక్యులపై విజయ సూచికగా ఈ ఆలయాన్ని నిర్మిచినట్లు తెలుస్తుంది. చోళులపై తాలకాడ్ యుద్దవిజయంగా నిర్మిచినట్లు మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. వైష్ణవ మత ప్రాశస్త్య ప్రచారానికై జగద్గురు రామానుజాచార్యుల ప్రబోధానుసారం నిర్మించాడని మరో వాదన కూడా ఉంది.

ఈ ఆలయం లోని స్థంభాన్ని నరసింహస్వామి స్థంభం

ఈ ఆలయం లోని స్థంభాన్ని నరసింహస్వామి స్థంభం

ఈ ఆలయం లోని స్థంభాన్ని నరసింహస్వామి స్థంభం అంటారు. గతంలో ఈ ఆలయంలోని ఈ స్థంభం తనంతట తానే తిరుగేదని అయితే అది అలాగే తిరుగుతూ ఉంటే కొన్ని ఏళ్లకు దేవాలయం కూలిపోతుందని పురావస్తు శాఖ లెక్కలు గట్టింది. దీంతో ఆ స్థంభం తిరగ కుండా వారు ఆపేశారని సమాచారం. పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను ఈ స్థంభం పై మనం చూడవచ్చును. వీటితో పాటు నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి.

కేదారేశ్వర దేవాలయం -

కేదారేశ్వర దేవాలయం -

కృష్ణ శిలాతో నిర్మించిన కేదారేశ్వరశివలింగం, శాంతాళేశ్వర దేవాలయం, బసాది హళ్ళి, బెలవడి మొదలగునవి చూడవచ్చు. ఇక్కడికి సమీపంలో చూడవలసిన మరొక ప్రదేశం బేలూరు. బేలూరు లో చెన్నకేశవ ఆలయం, దర్పణ సుందరి, కప్పే చెన్నిగరాయ, వీరనారాయణ టెంపుల్, గ్రావిటీ పిల్లర్, బిగ్ ట్యాంక్ మొదలగునవి చూడవచ్చు.

బేలూర్ హళేబీడు చేరుకోవడం ఎలా

బేలూర్ హళేబీడు చేరుకోవడం ఎలా

రోడ్డు మార్గం
బేలూర్ హళేబీడు లకు మీరు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. హస్సన్ నుండి బస్సు ద్వారా గాని లేకుంటే మీకు సొంత వాహనం ఉంటే మీరే సొంతంగా డ్రైవ్ చేసుకొని రావచ్చు. హస్సన్ రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుంచి, వివిధ నగరాలనుంచి బెంగళూరు, మైసూరు నుంచి కూడా బస్సులు వస్తుంటాయి.
రైలు మార్గం
హస్సన్ రైల్వే స్టేషన్ కు బెంగళూరు, మైసూరు, మంగళూరు ప్రాంతాలనుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.
వాయు మార్గం
దేనికి చేరువలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సుమారుగా 223 కి. మీ .దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం కి దేశంలోని ప్రధాన నగరాలనుంచే కాక, వివిధ దేశాల నుంచి కూడా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
Photo Courtesy: Surajram Kumaravel

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X