Search
  • Follow NativePlanet
Share
» »ఈ దేవత ముందు పెట్టిన అన్నం ఏడాదైనా చెడిపోదు...అందుకే..

ఈ దేవత ముందు పెట్టిన అన్నం ఏడాదైనా చెడిపోదు...అందుకే..

హాసనాంబ దేవాలయాానికి సంబంధించిన కథనం.

భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత. అయితే ఆ విశిష్టతలకు కారణం మాత్రం ఆ పరమాత్ముడికే తెలుసు. అందువల్లే అటువంటి విశిష్టతల పై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నా కారణాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. అటు వంటి దేవాలయాలు భారత దేశంలో వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అందులో ఒకటి కర్నాటకలో కూడా ఉంది. ఈ దేవాలయానికి ఒకటి కాదు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ దేవాలయ భక్తులో మాజీ ప్రధానుల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ దేవాలయం విశిష్టతలు ఏమిటి? అక్కడికి ఎలా వెళ్లాలి తదితర వివరాలన్నీ మీ కోసం...

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

దక్షిణ భారత దేశ రాష్ట్రమైన కర్నాటకలో హాసన్ అనే చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలోని అమ్మవారి పేరే హాసనాంబ. హాస్యం అంటే నవ్వు అని అర్థం.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

ఇక్కడ దేవత సదా నవ్వుతూ ఉంటారు కాబట్టే ఆ దేవతకు హాసనాంబ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతే కాకుండా తన భక్తులను ఎవరైనా హింసింస్తే అంతే ఉగ్రరూపంగా మారిపోతారు.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

అలా మారిపోయన అమ్మవారు భక్తులను హించిసినవారి అంతు చూస్తారని చెబుతారు. అందుకు ఉదాహరణకు హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేదని చెబుతారు.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

దీంతో కోపగించుకొన్న హాసనాంబ ఆమెను బండరాయిగా మారిపోమ్మని శపించింది. ఆ బండరాయిని మనం ఇప్పటికీ హాసనాంబ గర్భాలయంలో చూడవచ్చు.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

అంతేకాకుండా ప్రతి ఏడాది ఈ రాయి రూపంలో ఉన్న అత్త ఒక ఇంచు హాసనాంబ అమ్మవారి దగ్గరకు జరుగుతూ ఉంది.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

ఇలా ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతూ ఉందన్న విషయం పై మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటికీ సమాధానం చెప్పలేక పోతున్నారు.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

ఎప్పుడైతే ఆ అత్త రూపంలో ఉన్న రాయి హాసనాంబ అమ్మవారి వద్దకు చేరుతుందో అప్పుడు కలియుగాంతం అవుతుందని నమ్ముతారు. ఇక ఈ దేవాలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

అందులోనూ ఏడు రోజులు మాత్రమే దేవాలయంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతి ఉంటుంది.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

ఈ సమయంలో కేవలం కర్నాటక నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

ఏడు రోజుల తర్వాత ఈ దేవాలయాన్నిమూసివేస్తారు. ఆ సమయంలో నెయ్యితో వెలిగించిన దీపాన్ని హాసనాంబ విగ్రహం ముందు ఉంచుతారు.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

అంతే కాకుండా కొన్ని పూలతో పాటు రెండు భస్తాల అన్నాన్ని కూడా అమ్మవారి ముందు పెట్టి ఆలయ గర్భగుడి ద్వారాలను మూసివేస్తారు.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

మరలా ఏడాది తర్వాత ఆలయ ద్వారాలను తెరిచినప్పుడు ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అదే విధంగా పువ్వులు వాడిపోయి ఉండవు.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

ఇక ముఖ్యంగా దేవత ముందు పెట్టిన రెండు బస్తాల అన్న కూడా వేడిగా ఉండటమే కాకుండా తినడానికి అనుకూలంగా ఉంటుంది.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

దీనిని భక్తులు ప్రసాదంగా తింటారని చెబుతారు. సాధారణంగా దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలపులను తీస్తారు. దీపావళి రోజున ఆయాలన్ని మూసివేస్తారు.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కనిపించడం లేదు.

 హాసనాంబ దేవాలయం

హాసనాంబ దేవాలయం

P.C: You Tube

ఈ ఆలయంలోపల మనకు తొమ్మిది తలలతో ఉన్న రావణుడు కనిపిస్తాడు. అదే విధంగా సిద్ధేశ్వరస్వామి మనకు లింగ రూపంలో కాకుండా మనిషి రూపంలో కనిపిస్తాడు. ఇవి రెండు చాలా అరుదైన విషయాలు.బెంగళూరు నుంచి 184 కిలోమీటర్ల దూరంలో ఉన్న హసనాంబ దేవాలయం చేరుకోవడానికి నిత్యం బెంగళూరు నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X