Search
  • Follow NativePlanet
Share
» »అందాల హరివిల్లుల పుట్టినిల్లు బ్రహ్మగిరిని చూశారా?

అందాల హరివిల్లుల పుట్టినిల్లు బ్రహ్మగిరిని చూశారా?

ట్రెక్కింగ్ కు అనుకూల మైన బ్రహ్మగిరి కొండల గురించి కథనం.

By Karthik Pavan

ఒకప్పుడు హిల్‌స్టేషన్స్‌ అంటే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది ఊటి, కొడైకనాల్‌. కానీ.. అర్బనైజేషన్‌ పెరిగిపోవడంతో అక్కడ కూడా పెద్దపెద్ద సిటీలు వచ్చేశాయి. దీంతో హిల్‌స్టేషన్స్‌ వాటి అసలైన రూపును కోల్పోయాయి. కానీ.. అదే కర్నాటకలో మనకు తెలియని ఎన్నో ప్రాంతాలు ఇప్పటికీ ఆ ప్రకృతి సోయగాలతో అలరారుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక అద్భుతమైన ప్రాంతం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం.

ఆకాశాన్ని తాకుతున్నట్టుండే కొండలు. చుట్టూ పచ్చదనానికి నేలను అరువిచ్చిన అడవులు. నలువెచ్చని సూర్యకిరణాలతోపాటు తాకే చల్లని గాలులు. అదో భూలోక స్వర్గం. నాలుగు మాటల్లో ఇదీ బ్రహ్మగిరి కొండలంటే..పశ్చిమ కనుమల్లో ఉన్న మరో సుందర ప్రాంతమే ఈ బ్రహ్మగిరి కొండలు. ఇంతకీ ఇక్కడకు ఎలా వెళ్లాలి? ఏ సమయంలో వెళ్లాలి? చుట్టుపక్కల చూడదగ్గ ప్రాంతాలేమిటి? తెలుసుకోవాలనుందా? ఇంకెందుకు ఆలస్యం.. చదివండి..!

ఏ సీజన్‌లో వెళ్లాలి?

ఏ సీజన్‌లో వెళ్లాలి?

P.C: You Tube

సముద్రమట్టానికి 1600మీటర్ల ఎత్తులో ఉత్తర కర్నాటకలో బ్రహ్మగిరి కొండలు ఉన్నాయి. ఏడాదిపొడవునా ఇక్కడ వాతావరణం అద్భుతంగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా అక్కడికి ట్రిప్‌ వేయచ్చు. అయితే, ట్రెక్కింగ్‌ చేయాలనుకునేవారికి, ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి మాత్రం అక్టోబర్‌ నుంచి మే చివరి వారం వరకు మంచి సమయం.

 బ్రహ్మగిరి కొండల గురించి..

బ్రహ్మగిరి కొండల గురించి..

P.C: You Tube

కర్నాటకలోని కొడగు జిల్లా నుంచి కేరళలోని వాయనాడ్‌ జిల్లా వరకూ విస్తరించిన కనుమలను బ్రహ్మగిరి కొండలుగా పిలుస్తారు. ఉత్తర కనుమల్లో భాగంగా ఉన్న ఈ పర్వతాలు విభిన్నమైన వన్యప్రాణులకు, దట్టమైన అడవులకు నెలవు.

చుట్టుపక్కల చూడదగ్గ ప్రాంతాలు

చుట్టుపక్కల చూడదగ్గ ప్రాంతాలు

P.C: You Tube

పచ్చని అడవులు, చెట్లు, వన్యప్రాణులతో భూలోక స్వర్గంగా పిలవబడుతున్న బ్రహ్మగిరి కొండలు ట్రెక్కింగ్‌కు ఎంతో అనువైన ప్రాంతం. ముఖ్యంగా వైల్డ్‌లైఫ్‌, నేచర్‌ లవర్స్‌ ఖచ్చితంగా చూసితీరాల్సిన ప్రదేశం.
శ్రీమహావిష్ణువు నిర్మించాడని చెప్పే అత్యంత పురాతనమైన తిరునెల్లి దేవాలయం వాటిలో ఒకటి. ఇక ఇరుప్పు వాటర్‌ఫాల్స్‌, పక్షిపాతాళం ట్రెక్కింగ్‌ సైట్‌, కాదంబ జైన్‌ టెంపుల్‌, బ్రహ్మగిరి వైల్డ్‌లైఫ్‌ శాంక్చురిని కూడా చూడదగిన ప్రదేశాలు

అక్కడికి ఎందుకు వెళ్లాలి?

అక్కడికి ఎందుకు వెళ్లాలి?

P.C: You Tube

వర్షాకాంలో ఖచ్చితంగా చూడాల్సిన ప్రాంతాల్లో బ్రహ్మగిరి కొండలు మొట్టమొదటి వరుసలో ఉంటాయి. రణగొణ ధ్వనులకు దూరంగా.. జనజీవనానికి అందనంత దూరంలో ప్రకృతితో మమేకమవడం కంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. ఓ పక్క నేచర్‌ లవర్స్‌కు కావాల్సినంత బ్యూటీ..డివోషనల్‌ టూరిస్టులకు దేవాలయాల అదనపు ఆకర్షణ. ఫోటోగ్రఫీ, క్యాంపింగ్‌., బర్డ్‌-- వైల్డ్‌లైఫ్‌ లవర్స్‌కు శాంక్చురి. కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

P.C: You Tube

బ్రహ్మగిరికి అతి దగ్గర ఎయిర్‌పోర్ట్‌ మైసూర్‌.120కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ్నుంచి క్యాబ్‌ తీసుకుని బ్రహ్మగిరి చేరుకోవచ్చు. రైలులో వెళ్లాలన్నా మైసూర్‌ రైల్వేస్టేషన్‌లో దిగాల్సిందే. రోడ్డుమార్గంలో బ్రహ్మగిరి వెళ్లడం ఉత్తమమైన పని. దారిపొడవునా ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం.. ఖచ్చితంగా మధురానుభూతులను మిగులుస్తుంది. అందుకే.. చాలామంది మైసూర్‌ నుంచి నేరుగా కారులో వెళ్లడానికే ఇష్టపడతారు. అదే విధంగా ట్రెక్కింగ్‌ చేయాలనుకునేవారు ముందుగా శ్రీమంగళ గ్రామంలోని రేంజ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ దగ్గర పర్మిషన్‌ తీసుకోవాలి. అందుకోసం ఒకరికి 275రూపాయల వరకు తీసుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X