Search
  • Follow NativePlanet
Share
» »పరమశివుడు భస్మాసురుడి నుంచి తప్పించుకొని తలదాచుకున్న ప్రదేశం ఇదే

పరమశివుడు భస్మాసురుడి నుంచి తప్పించుకొని తలదాచుకున్న ప్రదేశం ఇదే

కర్నాటకలో ఉన్న యాగా గుహల గురించి కథనం.

హిందూ పురాణాల గురించి కాని, ఆ పరమేశ్వరుడి గురించి తెలిసిన వారికి భస్మాసుర ఘట్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే చాలా మందికి ఆ భస్మాసురుడి నుంచి తప్పించుకొని పరుగెత్తుకెళ్లిన పరమేశ్వరుడు ఎక్కడ దాక్కొన్నాడన్న విషయం మాత్రం తెలియదు. అలా పరిగెత్తిన పరమేశ్వరుడు కర్నాటకలోని ఓ పర్వత శిఖరం పై దాక్కొన్నాడు. ప్రస్తుతం అది ఓ ధార్మిక క్షేత్రంగా మారింది. అంతేకుండా చుట్టు పక్కల ఉన్న ప్రకృతి అందాలను పర్యావరణ ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఇది ట్రెక్కింగ్ కు కూడా అనువైన ప్రాంతం. అందువల్లే వీకెండ్ లో ఒక్క కర్నాటక నుంచే కాకుండా వివిధ దేశంలోని వివిధ నగరాల నుంచి కూడా ఎక్కువ మంది ఇక్కడకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడకు ఎలా వెళ్లాలన్న విషయంతో పాటు ఆ పురాణ కథనం మీ కోసం..

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

యానా కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న కుంతా అడవుల్లోని ఒక కుగ్రామం. ఇది కర్నాటకలోని ప్రసిద్ధ పట్టణాలైన సిర్సి నుంచి 40 కిలోమీటర్లు, కుంటా నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

సహ్యాద్రి అడవుల్లో ఈ యానా ఒక భాగం ఈ గ్రామానికి సమీపంలో రెండు ఎతైన శిఖరాలు ఉన్నాయి. ఇవి క్రస్ట్ లైమ్ స్టోన్ (ఒక రకమైన సున్నపురాయి) తో ఏర్పడినవి.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

ఈ రెండు పర్వత శిఖరాలను భైరవేశ్వర శిఖరం అని మోహిని శిఖరమని అంటారు. ఈ శిఖరాలు నల్లగా స్పటికాకరపు నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. దూరం నుంచి చూసే వారకి ఒక రకమైన భయం కలుగుతుంది.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

ఈ రెండు శిఖరాల్లో భైరవేశ్వర శిఖరం ఎత్తు ఎక్కువ. భైరవేశ్వర శిఖరం 120 మీటర్లు అంటే 390 అడుగుల ఎత్తు ఉండగా మోహిని శిఖరం 90 మీటర్ల ఎత్తు అంటే 300 అడుగుల ఎత్తు ఉంటుంది.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

భైరవేశ్వర శిఖరం దిగువన ప్రవేశ ద్వారం వద్ద స్వయభువు అయిన శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఈ శివలింగం పై భాగం నుంచి నీరు నిరంతరం కిందికి పడుతూ ఉంటుంది. ఆ నీరు ఎక్కడ నుంచి వస్తోందో తెలియదు.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

ఈ నీరు సన్నటి ధారగా మొదలవుతుంది. దీనిని స్థానికులు చండిహోల్ అని అంటారు. ఈ చండిహోల్ కొంత దూరం ప్రయాణం చేసి ఉప్పిన పట్టణ వద్ద అఘనాషిని అనే చిన్న నదిలో కలుస్తుంది.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

స్థానికులు ఈ చండిహోల్ నీటి ఉద్భవించే ప్రాంతాన్ని గంగోద్భవ ప్రదేశంగా భావించి పూజిస్తారు. ఆ గంగాధరుడి జఠాజూటంలోని గంగాదేవే ఇక్కడ జన్మిస్తోందని ఇక్కడి వారి నమ్మకం.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

ఇక ఇదే గుహ 3 మీటర్లు అంటే దాదాపు 9.8 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ గుహలోపల కంచుతో చేయబడిన దుర్గామాత ప్రతి రూపమైన చంద్రిక విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

ఇక ఈ గుహలకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న విభూతి జలపాతం కూడా ప్రర్యాటకులను కనువిందు చేస్తుంది. ఇక చుట్టూ ఉన్న పచ్చటి పరిసర ప్రాంతాలు కూడా మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

హిందూపురాణాల్లో ప్రధానంగా వినిపించే భస్మాస్ముర ఘట్టంతో ఈ ప్రాంతానికి అవినావభావ సంబంధం ఉంది. భస్మాసురుడు శివుడి గురించి తపస్సు చేసి ఆయన్ను మెప్పిస్తాడు.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

తాను ఎవరి తల పై చేయి పెడితే వారి భస్మం అయిపోవాలనే వరాన్ని పొందుతాడు. ఆ వరం పనిచేస్తోందో లేదో తెలుసుకోవడానికి వీలుగా పరమేశ్వరుడి నెత్తిమీదనే చేయి పెట్టాలని పోతాడు.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

దీంతో భయపడిన పరమేశ్వరుడు ఈ యానం ప్రాంతానికి పరుగెత్తుకొని వచ్చి ఈ భైరవేశ్వర శిఖరంలో దాక్కొన్నాడు. సమస్య పరిష్కారం కోసం విష్ణవు మోహిని రూపంలో వచ్చి ఓ న`త్య భంగిమ ద్వారా ఆ భస్మాసురుడిని అంతమొందిస్తాడు.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

ఆ భైరవ శిఖరం ఈశ్వరుడికి ప్రతీక అయితే, ఈ మోహినీ శిఖరం ఆ విష్ణువుకు ప్రతీకగా చెబుతారు. ఈ యానం కేవలం ఆధ్యాత్మికమే కాకుండా సహజ అందాలకు కూడా నిలయం.

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

శివుడు దాక్కొన శిఖరం... అందాలకు నెలవు

P.C: You Tube

ఎంతో మంది ట్రెక్కర్స్ ఇక్కడికి వీకెండ్ లో వస్తూ ఉంటారు. కుముత నుంచి ఇక్కడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోకర్ణ నుంచి 52 కిలోమీటర్లు. హుబ్లీ నుంచి 142 కిలోమీటర్ల దూరంలో యాన ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X