Search
  • Follow NativePlanet
Share
» » కొయంబత్తూర్ కు దగ్గరగా ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ చూశారా?

కొయంబత్తూర్ కు దగ్గరగా ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ చూశారా?

కొయంబత్తూర్ చుట్టూ చూడదగిన పర్యాటక ప్రాంతాల గురించి.

By Kishore

వేసవి సెలవులు అయిపోతున్నాయి. కొన్ని పాఠశాలల్లో అప్పుడే తరగతులు మొదలయ్యాయి. మరికొన్ని చోట్ల వచ్చేవారం బడి తలుపులు తీస్తున్నారు. అంటే మీకు మరో వీకెండ్ మాత్రమే సమయం ఉంది. అందువల్ల ఈ వీకెండ్ లో సరైన ప్రణాళిక వేసుకొంటే మీరు ఒక చక్కటి పర్యాటక ప్రాంతాన్ని సందర్శించవచ్చు. బెంగళూరు కు దగ్గరా ఉన్న కొయంబత్తూర్ రుకు వెళితే అక్కడకి దగ్గరగా ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. శుక్రవారం రాత్రి బెంగళూరులో బయలు దేరినా శనివారం తెల్లవారుజాముకే మీరు కొయంబత్తూరుకు చేరుకొంటారు. మీకు శని, ఆదివారం రాత్రి వరకూ అంటే దాదాపు రెండు రోజుల సమయం ఉంటుంది. ఈ 48 గంటల్లో కొయంబత్తూరుకు దగ్గర్లో ఉన్న అనేక ప్రాంతాలను మీరు చూడవచ్చు. కొయంబత్తూరుకు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలను మీకు ఇస్తున్నా వీటిలో మీకు అందుబాటులో ఉన్న సమయం, మీ ప్రణాళికను అనుసరించి ఏ ఏ ప్రాంతాలను చూడవచ్చే మీరే నిర్ణయం తీసుకొండి.

ఊటి

ఊటి

P.C: You Tube

కొయంబత్తూర్ నుంచి ఎంత దూరం....52 కిలోమీటర్లు

తమిళనాడులోనే కాక భారత దేశంలో ప్రముఖ హిల్ స్టేషన్లలో ఊటి అగ్రస్థానంలో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. హిల్ స్టేషన్స్ కు రాణిగా ఊటికి పేరుంది. ఊటి దగ్గర బొటానికల్ గార్డెన్ నుంచి పైకరా, హిడన్ వ్యాలీ, వ్యాక్స్ మ్యూజియం వంటి ఎన్నో ప్రాంతాలను ఇక్కడ మనం చూడవచ్చు. హనీమూన్ జంటలకు ఊటి స్వర్గధామం అని అంటారు.

కన్నూర్

కన్నూర్

P.C: You Tube

కొయంబత్తూర్ నుంచి ఎంత దూరం....41 కిలోమీటర్లు

తమిళనాడులో మరో హిల్ స్టేషన్ కన్నూర్. ప్రక`తి ప్రేమికులు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. చుట్టూ పచ్చదనం పరుచుకొన్న పర్వత శిఖరాలను చూస్తూ ఉంటే సమయం ఇట్టే గడిచిపోతుంది. వేసవిలో కూడా ఈ ప్రాంతం కొంత చల్లగా ఉంటుంది. అందువల్ల చాలా మందికి ఇది సమ్మర్ డెస్టినేషన్ కూడా. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి కూడా అనేక ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి.

మలపుంజ, కేరళ

మలపుంజ, కేరళ

P.C: You Tube

కొయంబత్తూర్ నుంచి ఎంత దూరం...34 కిలోమీటర్లు

మలపుంజ జలాశయాన్ని చూడటానికి దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ బ్యాక్ వాటర్ లో బోటింగ్ కు అవకాశం ఉంటుంది. పెద్దల కంటే చిన్నపిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు.
మలపుంజ ఫారెస్ట్ కూడా చూడటానికి బాగుంటుంది. కొయంబత్తూరుకు కేవలం 34 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ పర్యాటక కేంద్రం ఉండటం వల్ల ఎక్కవ మంది పర్యటకులు ఇక్కడకు వస్తుంటారు.

మదుమలై

మదుమలై

P.C: You Tube

కొయంబత్తూర్ నుంచి ఎంత దూరం....77 కిలోమీటర్లు

జంతు ప్రేమికులు మీరైతే మీకు మధుమలై ఖచ్చితంగా నచ్చుతుంది. టైగర్, ఏనుగుల రిజర్వ్ ఫారెస్ట మదుమలై. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకూ విడతల వారిగా ఎలిఫెంట్ సఫారీ అందుబాటులో ఉంటుంది. కెమరాకు ప్రత్యేర రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడకు ప్రభుత్వ వాహనాలను తప్ప ప్రైవేటు వాహనాలను అనుమతించరు.

కొడైకెనాల్

కొడైకెనాల్

P.C: You Tube

కొయంబత్తూర్ నుంచి ఎంత దూరం...104 కిలోమీటర్లు

ప్రక`తి సంపదకు కొడైకెనాల్ నిలయం. హనీమూన్ జంటలకు మొదట గుర్తుకు వచ్చేది కొడైకెనాల్. చుట్టూ ఉన్న పచ్చటి పర్వత శిఖరాలను చూస్తూ సమయాన్ని ఇట్టే మరిచిపోవచ్చు. కేవలం పెళ్లైన జంటలకు కాకుండా ప్రేమికులు కూడా ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X